పొంగిపొర్లుతున్న కాగ్నా నది
Published Wed, Aug 31 2016 6:41 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
రంగారెడ్డి : ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కాగ్నానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే తాండూరు సమీపంలో నది పై ఉన్న ఓ వంతెన నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో తాండూరు-మహబూబ్‌నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దెముల్ మండలంలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. నగరానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయి.
Advertisement
Advertisement