అలుగు పారుతున్న ధరూర్ పెద్ద చెరువు
జోరుగా వర్షాలు
Published Fri, Sep 16 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
మహబూబ్‌నగర్ వ్యవసాయం : నైరుతి రుతుపవనాలు ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 16.1మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధరూర్ మండలంలో 51మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు జిల్లాలోని 37 మండలాల్లో అత్యధిక, 16 మండలాల్లో మోస్తరు, మరో 7మండల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్ సగటు వర్షపాతం 446.8మి.మీ కాగా, ఇప్పటివరకు 417.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కొడంగల్ మండలంలో 48.4మి.మీ, వనపర్తి మండలంలో 42.8మి.మీ, గద్వాల మండలంలో 41మి.మీ, కల్వకుర్తి మండలంలో 38.6మి.మీ, కోస్గి మండలంలో 34.2మి.మీ, షాద్‌నగర్‌లో 31.2మి.మీ, వెల్దండ 30.6మి.మీ వర్షపాతం నమోదైంది.
జొన్నపంటకు నష్టమే..
నాలుగు రోజులుగా కురుస్తున్న మబ్బులతో కూడిన ముసురు వర్షాలతో జిల్లాలో 30వేల హెక్టార్లలో సాగుచేసిన జొన్నపంటకు నష్టం వాటì ల్లే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో 7,300హెక్టార్లలో ఇప్పటికే కరువుతో జొన్న ఎండిపోగా, మిగిలిన పంటకు అధిక వర్షాలు నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే జొన్నపంట ధాన్యం గింజలు నల్లగా మారుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు వర్షాలు ఇలాగే కురిస్తే జొన్న చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లే దు. పత్తి, మొక్కజొన్న, ఆముదం, ఉల్లి పంటల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement