Railway bridge construction
-
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్‌లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. -
బ్రిడ్జి కింద నలిగిన బతుకులు
కోల్‌కతా/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఘోరం జరిగింది. ఐజ్వాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 100 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనుల్లో ఉన్న కారి్మకుల్లో కనీసం 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంకా కనీసం ఐదుగురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అత్యధికులు పశి్చమ బెంగాల్‌కు చెందిన వారే. ప్రమాద ప్రాంతం సైరంగ్ ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురింగ్ నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పైకి చేర్చే క్రమంలో గాంట్రీ కుప్పకూలడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయ, తరలింపు తదితర చర్యల్లో మిజోరం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు రైల్వే శాఖ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress. Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7 — Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023 ఇది కూడా చదవండి: Live Updates: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్–3 -
నత్తనడకన ఆర్వోబీ పనులు
ఆర్మూర్/మాక్లూర్: మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి శివారులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతుండటంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో నిర్వహించిన పార్లమెంట్ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి వెళుతుండగా మా ర్గమధ్యలో ఆర్వోబీ పనులను మంగళవారం ఆయ న పరిశీలించారు. ఎన్‌హెచ్ డిప్యూటీ ఈఈ శంక ర్కు ఫోన్ చేసి వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధుల తో చేపడుతున్న ఆర్వోబీ పనులకు, రూ.14 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేసినా పనులు నెమ్మదిగా సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచని పక్షంలో కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని హెచ్చరించారు. డిప్యూటీ ఈఈ శంకర్ సమాధానానికి సంతృప్తి చెందని ఎంపీ అర్వింద్ ఈఈ కాంతయ్యకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులను వివరించారు. వారం రోజుల్లో పనులు వేగంగా జరిగేలా చూస్తానని ఈఈ హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్మాణంపై బీఆర్ఎస్ నాయకులు దేశ్ కీ నేతా కేసీఆర్, జీవనన్న అంటూ రాసిన పెయింటింగ్‌లపై అ భ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులకు దేశ్ కీ నేతా అని కాకుండా దేశ్ కా నేతా అని రాయాలని సలహా ఇచ్చారు. బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. -
అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే
కౌరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వేస్ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చయ్యాయి. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తికానుందని ఉత్తర రైల్వే జీఎం అశుతోష్ గంగల్ చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఆర్చ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొందిన రైల్వేస్ తాజా నిర్మాణంతో భారత్‌ను అత్యున్నతంగా నిలిపిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక అద్భుతమన్నారు. A moment of pride for 🇮🇳! The arch of Chenab bridge, connecting Kashmir to Kanyakumari has been completed. With an arch span of 467m, it is the world’s highest railway bridge. PM @NarendraModi ji’s vision to connect India has inspired the Railway family to scale new heights pic.twitter.com/GEDEBIb9nE — Piyush Goyal (@PiyushGoyal) April 5, 2021 వంతెన ప్రత్యేకతలు ►పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ►2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి. ►2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్ టన్నులు. ►28660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ►266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ►నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీల్ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. -
2022 ఆగస్ట్‌కు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. చెనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన ఆగష్టు 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. రియాసి జిల్లాలోని కౌరి గ్రామంలో కత్రా-బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన చెనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది పారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన పొడవు 1.3 కిలోమీటర్లు. రిక్టర్ స్కేల్లో 7 కంటే ఎక్కువ కొలిచే భూకంపాన్ని తట్టుకోగలదు. ఇది కత్రా నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణ సమయాన్ని 5-6 గంటలు తగ్గిస్తుంది. (ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన!) ఈ విషయంపై డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆర్ఆర్ మాలిక్ మాట్లాడుతూ.. ‘వంతెన నిర్మాణం పూర్తికి మాకు 2022 వరకు గడువు ఉంది. ఇది నిర్మించడం అంత తేలికైన పని కాదు. చాలా కష్టతరమైనది. అయితే వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందిన జియాసి జిల్లాలో అతి పెద్ద రైల్వే వంతెన ప్రాజెక్టు రావడంతో పర్యాటక రంగంలో మార్పు రాబోతుంది’ అన్నారు. ఈ వంతెనపై హెలిప్యాడ్ ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఛాపర్ ద్వారా రావొచ్చని తెలిపారు. ఇది స్థానిక ఉపాధిని, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుస్తుందన్నారు.(తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం) కాగా ఈ రైల్వే వంతెన ప్రాజెక్టును కొంకణ్ రైల్వే నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం 2004 లో ప్రారంభమైంది. నిర్మాణంలో ఉన్న వంతెన 266 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదు. దాని కాల పరిమితి 120 సంవత్సరాలు ఉంటుంది. ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్– క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కశ్మీర్ రైల్వే ప్రాజెక్టులోని ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా విభాగంలో భాగమైన కత్రా, బనిహాల్ మధ్య ఉన్న ఈ వంతెన కీలకమైన లింక్. -
ఈ వంతెన భూకంపాలనూ తట్టుకుంటుంది!
కౌరి(జమ్మూకశ్మీర్): అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్–రేసి–అనంత్‌నాగ్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు. -
డీఐజీ విచారణలో పియూస్ మనూస్
వేలూరు: సేలంకు చెందిన సాంఘిక సేవా కార్యకర్త పియూస్ మనూస్. ఇతను సేలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల సేలం ముళ్లువాడి గేట్ వద్ద రైల్వేబ్రిడ్జి నిర్మాణ పనులను అడ్డుకొని నిలిపి వేసిన పియూస్ మనూస్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా బ్రిడ్జి నిర్మించాలని పోరాటాలు చేశారు. బ్రిడ్జి నిర్మాణం కోసం స్థలం పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు కాబట్టి భూమిని మొత్తంగా స్వాధీనం చేసుకున్న అనంతరమే పనులను ప్రారంభించాలని కోరారు. దీంతో సేలం టౌన్ పోలీసులు పియూస్ మనూస్‌లతో పాటు పోరాటంలో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేసి సేలం జైల్లో ఉంచారు. అనంతరం బెయిల్‌పై పియూస్ మనూస్‌ను విడుదల చేశారు. ప్రతిరోజూ సేలం కోర్టులో హాజరై సంతకాలు చేయాలని న్యాయమూర్తి నిబంధన విధించడంతో బెయిల్‌పై బయటకు వచ్చిన పియూస్ మనూస్ జైల్లో తనను జై లు సూపరింటెండెంట్ సెంథి ల్ కుమార్ అధ్యక్షతన 30 మంది పోలీసులు వెదురు కర్రలతో తనను కొట్టారని పుకార్లు సృష్టించాడు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, జైళ్ల శాఖ ఏడీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పొందిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. వేలూరు రీజనల్ జైళ్ల శాఖ డీఐజీ ముహ్మద్ అనీఫ్ సేలంకు వెళ్లి పియూస్ మనూస్‌తో పాటు జైలు అధికారుల వద్ద విచారణ జరిపారు. మరోసారి విచారణ కోసం పియూస్ మనూస్‌తో పాటు భార్య మోనికా శుక్రవారం ఉదయం వేలూరులోని డీఐజీ కార్యాలయానికి వచ్చారు. పియూస్ మనూస్ వద్ద డీఐజీ ముహ్మద్ అనీఫ్ రెండు గంటల పాటు విచారణ జరిపారు. -
ఆర్ఓబీ పనులు జరిగేనా..?
సీతానగరం, న్యూస్‌లైన్ : సీతానగరం మండల కేంద్రంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. పాల కుల నిర్లక్ష్యం... అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పను ల్లో పురోగతి లేదు. దీనికితోడు నిధుల లేమి వల్ల పను లు అర్ధాంతరంగా నిలిచిపోయూరుు. దీంతో ఈ మార్గం లో రాకపోకలు చేస్తున్న ప్రయూణికులు నిత్యం నరకయూతన అనుభవిస్తున్నారు. మండల కేంద్రంలోని రాష్ట్రీ ్టయ్ర రహదారి మీదుగా చెన్నై, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ తదితర ప్రాం తాలకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు చేస్తుంటారుు. అరుుతే రహదారి పరిధిలో రైల్వేగేటు ఉం డడం.. రైళ్ల రద్దీ కూడా పెరగడంతో రైల్వేగేటు వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తువి. ఈ నేపథ్యంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రా జీవ్పల్లెబాటలో భాగంగా ఇక్కడకు వచ్చారు. ఆయనకు అప్పటిఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు, ఎం పీ బొత్స ఝాన్సీలక్ష్మి ఆర్ఓబీ నిర్మాణంపై విన్నవించా రు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2008లో ఆర్ఓబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారుు.రైల్వేలైన్‌లో 402/ 6 కిలోమీటర్ల వద్ద రోడ్లు భవనాల శాఖ పరిధిలో...చిలకపాలెం-రామభద్రపురం మీదుగా రాయగడ రోడ్డు 92/8 కిలోమీటర్ల (సీతానగరం) వద్ద రూ. 15.50 కోట్లతో ఆర్ఓబీ నిర్మా ణా నికి సన్నాహాలు చేశారు. 2009లో అప్పటి ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2010-11 ఆర్థిక సంవత్సరానికి పనులు పూర్తి చేయూలని అప్పట్లోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైల్వేట్రాక్‌ల పరిధిలో రైల్వే అధికారులు ఏడాదిలోనే పనులు పూర్తి చేశారు. కా నీ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు ఐదేళ్లు కావస్తున్నా.. పూర్తి కావడం లేదు. దీనికితోడు కాంట్రాక్టర్ నిధులు చాలవని పనుల ను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో వందలాది ప్రయూణికులు నిత్యం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా రు. పనులను త్వరగా పూర్తి చేయూలని స్థానికులు కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పలుమార్లు విన్నవించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పనులు పూర్తి చేయూలని స్థాని కులు కోరుతున్నారు.