ఆర్‌ఓబీ పనులు జరిగేనా..?
Published Mon, Jan 20 2014 3:08 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
సీతానగరం, న్యూస్‌లైన్ : సీతానగరం మండల కేంద్రంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. పాల కుల నిర్లక్ష్యం... అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పను ల్లో పురోగతి లేదు. దీనికితోడు నిధుల లేమి వల్ల పను లు అర్ధాంతరంగా నిలిచిపోయూరుు. దీంతో ఈ మార్గం లో రాకపోకలు చేస్తున్న ప్రయూణికులు నిత్యం నరకయూతన అనుభవిస్తున్నారు. మండల కేంద్రంలోని రాష్ట్రీ ్టయ్ర రహదారి మీదుగా చెన్నై, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ తదితర ప్రాం తాలకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు చేస్తుంటారుు.
అరుుతే రహదారి పరిధిలో రైల్వేగేటు ఉం డడం.. రైళ్ల రద్దీ కూడా పెరగడంతో రైల్వేగేటు వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తువి. ఈ నేపథ్యంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రా జీవ్‌పల్లెబాటలో భాగంగా ఇక్కడకు వచ్చారు. ఆయనకు అప్పటిఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు, ఎం పీ బొత్స ఝాన్సీలక్ష్మి ఆర్‌ఓబీ నిర్మాణంపై విన్నవించా రు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2008లో ఆర్‌ఓబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారుు.రైల్వేలైన్‌లో 402/ 6 కిలోమీటర్ల వద్ద రోడ్లు భవనాల శాఖ పరిధిలో...చిలకపాలెం-రామభద్రపురం మీదుగా రాయగడ రోడ్డు 92/8 కిలోమీటర్ల (సీతానగరం) వద్ద రూ. 15.50 కోట్లతో ఆర్‌ఓబీ నిర్మా ణా నికి సన్నాహాలు చేశారు. 2009లో అప్పటి ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
2010-11 ఆర్థిక సంవత్సరానికి పనులు పూర్తి చేయూలని అప్పట్లోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైల్వేట్రాక్‌ల పరిధిలో రైల్వే అధికారులు ఏడాదిలోనే పనులు పూర్తి చేశారు. కా నీ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు ఐదేళ్లు కావస్తున్నా.. పూర్తి కావడం లేదు. దీనికితోడు కాంట్రాక్టర్ నిధులు చాలవని పనుల ను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో వందలాది ప్రయూణికులు నిత్యం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా రు. పనులను త్వరగా పూర్తి చేయూలని స్థానికులు కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పలుమార్లు విన్నవించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పనులు పూర్తి చేయూలని స్థాని కులు కోరుతున్నారు.
Advertisement
Advertisement