Sitanagaram
-
ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. -
హత్యల మిస్టరీ వీడింది.. తాగి తందనాలాడుతుంటే తిడుతోందని..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం, సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితులను అరెస్టు చేశామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగీ తెలిపారు. మినీ వ్యాన్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురిని, వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులున్నారని వివరించారు. తన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వేలిముద్రే పట్టించింది పిఠాపురానికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ ఒగ్గు నాగేంద్ర (32) ఈ నెల 26న తాడేపల్లిగూడెం వెళ్లి కమలా ఫలాల లోడు వేసుకుని తిరిగి వెళుతున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నన్నయ యూనివర్సిటీ సమీపానికి వచ్చేసరికి ఆ వ్యాన్‌ను రాజమహేంద్రవరం శంభూనగర్కు చెందిన మద్ది వెంకట సాయి (వెంకట్), కడియం మండలం వేమగిరికి చెందిన తూము ముత్యాలు, ఓ బాల నేరస్తుడు కలిసి ఆపారు. నాగేంద్రను బెదిరించి డబ్బులు, సెల్‌ఫోన్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో ముద్దాయిలు చాకులతో అతడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచి పరారయ్యారు. జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడు. ఈ కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్ క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఓ నిందితుడి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ముద్దాయిలను ఆదివారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నాగేంద్రను హత్య చేసిన తరువాత నిందితులు విశాఖకు పారిపోయారు. తిరిగి వస్తూ కత్తిపూడిలో ఓ స్కూటర్ దొంగిలించారు. వారి నుంచి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటర్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్లో మద్ది వెంకట సాయిపై చోరీ కేసులతో పాటు సస్పెక్ట్ షీటు కూడా ఉంది. అలాగే తూము ముత్యాలుపై ఒక కేసు, బాల నేరస్తుడిపై రెండు కేసులు ఉన్నాయి. ఈ కేసును చాకచక్యంగా విచారించి, నిందితులను అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుభాష్, క్లూస్ టీం ఎస్సై ప్రవీణ్, ఎస్సైలు ఎండీ జుబేర్, సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు రమణ, ఎం.ప్రసాద్, కానిస్టేబుళ్లు బి.విజయకుమార్, కె.పవన్‌కుమార్, సూరిబాబు, ఆర్వీ రమణ, ఎన్.రాంబాబులను ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. చదవండి: (ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య) తాగి తందనాలాడుతుంటే తిడుతోందని.. సీతానగరం మండలం వంగలపూడిలో ఈ నెల 24న జరిగిన కోదేళ్ల నాగమ్మ అలియాస్ చింతాలమ్మ (72) హత్య కేసు మిస్టరీని కూడా పోలీసులు ఛేదించారు. నాగమ్మ మృతదేహంపై గాయాలుండటంతో ఆమె బంధువు కొండయ్య ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో విచారించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇచ్చిన ముఖ్య సమాచారం ఆధారంగా వంగలపూడికే చెందిన యువకుడు ఇండుగుమిల్లి నవీన్‌ను, ఓ బాల నేరస్తుడిని వీఆర్వో ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించారు. ప్రతి రోజూ మద్యం తాగి ఊళ్లో బలాదూర్‌గా తిరుగుతున్న వీరిని నాగమ్మ తరచూ అసభ్య పదజాలంతో తిట్టేది. ఈ నెల 24న పుట్టిన రోజు సందర్భంగా మద్యం తాగి వస్తున్న వారిద్దరినీ చూసిన నాగమ్మ తీవ్రమైన పదజాలంతో దూషించింది. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలని నిందితులిద్దరూ నిర్ణయించుకున్నారు. వెంటనే నాగమ్మ ఇంట్లోకి వెళ్లి చెంబుతో ఆమె ముఖంపై కొట్టారు. ఆమె ఇంట్లోనే ఉన్న గునపంతో ఆమె ఛాతి మీద బాది హతమార్చారు. నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. వృద్ధురాలి హత్యకు వారు ఉపయోగించిన చెంబు, గునపం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో ప్రతిభ చూపిన కోరుకొండ ఇన్స్పెక్టర్ పీఈ పవన్‌కుమార్‌రెడ్డి, సీతానగరం ఎస్సై కె.శుభశేఖర్, కానిస్టేబుళ్లు పి.రాము, ఎస్.ప్రసాద్, సీహెచ్ గోవిందు, బి.వెంకటేష్‌లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విలేకర్ల సమావేశంలో శాంతిభద్రతల ఏఎస్పీ లతామాధురి, నార్త్‌జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. చదవండి: (భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!) -
రూ.2,300 లాక్కుని హత్య!
తాడేపల్లిరూరల్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సీతానగరం అత్యాచారం కేసులో నిందితులు హత్యచేసిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన యడ్లపల్లి ఆనంద్‌కుమార్ అని పోలీసులు సోమవారం గుర్తించారు. హత్యచేసినట్లు నిందితులు వెల్లడించడంతో ఉలిక్కిపడ్డ పోలీసులు.. మిస్సింగ్ కేసుల ఆధారంగా పరిశీలించి హతుడు ఆనంద్‌కుమార్ అని నిర్ధారించారు. అత్యాచారం కేసులో కృష్ణ, షేక్ హబీబ్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో నిందితుడు వెంకటరెడ్డి అలియాస్ ప్రసన్నరెడ్డి పరారీలో ఉన్నాడు. ఆనంద్‌కుమార్ వద్ద ఉన్న రూ.2,300 లాక్కుని హత్యచేసినట్లు తెలిసింది. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలో ఒకటి ఆనంద్కుమార్దిగా గుర్తించారు. ఈ మేరకు సోమవారం చింతలపూడిలో ఉన్న ఆనంద్‌కుమార్ భార్య మృదులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆనంద్‌కుమార్ రైలులో వేరుశనగకాయలు, శనగలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జూన్ 19న తాడేపల్లి రైల్వేస్టేషన్లో ట్రాక్ వెంబడి నడుస్తూ కృష్ణానది రైల్వేబ్రిడ్జి వద్దకు వెళ్లేవరకు భార్య మృదులతో ఫోన్లో మాట్లాడాడు. గూడ్స్ రైలు వెళుతోందని, సరిగా వినిపించడంలేదని, పావుగంటలో ఫోన్ చేస్తానని భర్త చెప్పినట్లు మృదుల తెలిపింది. తరువాత ఆమె ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. మూడురోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్ చేయకపోవడంతో ఆమె జూన్ 22న తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 23న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శనగకాయలు అమ్మిన డబ్బు లాక్కుని.. విశ్వసనీయ సమాచారం మేరకు.. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి విజయవాడ వెళ్లే రైలు మార్గంలో కృష్ణానది రైల్వే బ్రిడ్జిపై కృష్ణ, ప్రసన్నరెడ్డి, షేక్ హబీబ్ రాగితీగలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బ్రిడ్జిపై నడిచి వెళుతున్న ఆనంద్‌కుమార్‌ను ప్రసన్నరెడ్డి ఆపి ఎవర్రా నువ్వు అంటూ ప్రశ్నించారు. శనగకాయలు అమ్ముకుంటానని, పేరు ఆనంద్ అని, ఇంటికి వెళుతున్నాని చెప్పాడు. ఇంతలో కృష్ణ వచ్చి అతడి దగ్గర ఉన్న రూ.2,300 లాక్కుని వెళ్లిపొమ్మన్నాడు. బ్రిడ్జి చివర పోలీసులు ఉంటారని, వాడిని పంపిస్తే ఎలా అంటూ ప్రసన్నరెడ్డి.. ఆనంద్‌పై దాడిచేశాడు. వెంటనే ముగ్గురు కలసి అతడిని ఒక ఐరన్ రాడ్‌కు రాగితీగలతో కట్టి ప్రాణాలతో ఉండగానే కృష్ణానదిలోకి తోసేశారు. ఆనంద్ పిల్లర్ మీద పడ్డాడు. అరగంట తరువాత నిందితులు పిల్లర్ మీద నుంచి ఆనంద్‌ను నదిలోకి పడేశారు. ఈ సంఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సీతానగరం అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
-
పోలీసుల అదుపులో ‘సీతానగరం’ కేసు నిందితుడు!
సాక్షి, అమరావతి బ్యూరో: సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుడిని గుంటూరు అర్బన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడు షేర్ కృష్ణానా? వెంకటరెడ్డా? అనేది తెలియాల్సి ఉంది. ఒంగోలులో తిష్టవేసిన పోలీసులు 30 రోజుల పాటు వివిధ వేషధారణలతో యాచకుల దగ్గర్నుంచి.. హిజ్రాలను, సమోసాలు అమ్ముకునే వారిని, రైల్వే ట్రాక్‌ల పక్కన చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ ఎట్టకేలకు ఒంగోలు ఫ్లై ఓవర్ కింద సేదదీరుతున్న నిందితుడిని పట్టుకున్నారు. రెండో నిందితుడు కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం రావడంతో గుంటూరు అర్బన్ నుంచి వెళ్లిన పలు బృందాలు ఒంగోలు రైల్వే ట్రాక్‌లు, ఇతర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాయి. ఇద్దరు నిందితులూ కేటరింగ్ పనులు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో ఆ కోణంలో ఒంగోలు, చీరాల, బాపట్ల, అద్దంకి ప్రాంతాలతో పాటు, చెన్నై రైల్వే మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి అన్వేషిస్తున్నట్టు తెలిసింది. -
కన్నకూతురిపైనే తండ్రి లైంగిక దాడి
సాక్షి, సీతానగరం : సభ్యసమాజం తలవంచుకునే సంఘటన ఇది. తరిగిపోతున్న మానవ విలువలకు పరాకాష్ట ఇది. కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీతానగరం ఎస్ ఐ వి.లోవరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పైల మైనరుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరికీ వివాహాలు కావడంతో అదే గ్రామంలో వారు వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. అయితే పెద్ద కుమార్తెపై ఎప్పటినుంచో కోరిక కలిగి న ఆ ప్రబుద్ధుడు భార్య ఆరోగ్యం బాగులేందున పెద్దకుమార్తెను తీసుకురమ్మని చిన్నకుమార్తెను పంపించాడు. తండ్రి కబురుతో శుక్రవారం కన్నవారింటికి వచ్చిన పెద్ద కుమార్తెపై ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆమె అదే రోజు సాయంత్రం గ్రామ వలంటీర్, సచివాలయ పోలీసుకు సమాచారం అందివ్వగా వారి ఫిర్యాదు మేరకు బొబ్బిలి రూరల్ సీఐ బి.ఎం.డి.ప్రసారా వు, సీతానగరం ఎస్ఐ వి.లోవరాజు హుటాహుటిన గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. మహిళా పోలీసుల ద్వారా బాధితరాలిని అన్ని కోణాల్లో విచారణ జరిపి, కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
‘విదేశీ అతిథి’కి పునర్జన్మ!
సాక్షి, సీతానగరం(విజయనగరం) : వేల మైళ్లు దాటుకుని జిల్లాకు వచ్చిన విదేశీ అతిథి (పక్షి) అనుకోని చిక్కుల్లో ‘పడింది’. ఓ గ్రామస్తుడు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. దశాబ్దాలుగా సైబీరియా నుంచి సీతానగరం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాలకు కొన్ని పక్షులు వచ్చివెళ్తుంటాయి. మండలంలోని లచ్చయ్యపేట గ్రామానికి చెందిన సీతయ్యతో పాటు మరికొంత మంది రోజు మాదిరిగానే చేపలు పట్టేందుకు చెరువులోకి దిగారు. అంతలో ఓ పక్షి నీటిలో గిలాగిలా కొట్టుకుంటూ వారికి కనిపిం చింది. వెంటనే స్పందించిన సీతయ్య ఆ పక్షిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. భారీ సైజులో ఉన్న ఆ పక్షిని చూసేందుకు పలువురు పోటీపడ్డారు. ఈ విధంగా వర్షాకాల విడిదికి వచ్చిన విదేశీ అతిథి (పక్షి)కి జిల్లావాసి పునర్జన్మ ప్రసాదించాడు. -
ఆ సినిమా నేను చేస్తా: బాలయ్య
సాక్షి, అమరావతి: తన తండ్రి ఎన్టీ రామారావు తీయలేకపోయిన సినిమాలను తాను పూర్తి చేస్తానని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. గురువారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రామానుజచార్య సినిమా త్వరలో తాను చేస్తానని ప్రకటించారు. రామానుజచార్యులు.. ఆధ్యాత్మిక గురువే కాక గొప్ప సంఘసంస్కర్త అని, వేల సంవత్సరాల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన వ్యక్తి అని ప్రశంసించారు. రామానుజచార్యులపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. విజయకీలాద్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆయనను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. -
ఈ సారైనా అమ్మ దర్శనం కలిగేనా ?
సీతానగరం ఘాట్‌కు తెప్పోత్సవం వచ్చి ఐదేళ్లు తాడేపల్లి : దసరా పండగ రోజు సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ నదిలో హంసతూలికా తల్పంపై భక్తులకు దర్శనమివ్వడం ఏటా ఆనవాయితీ. ఈ సంవత్సరమైనా దేవాదాయశాఖ అధికారులు అమ్మవారి హంసవాహన ఉత్సవాన్ని విజయవాడ దుర్గఘాట్ నుంచి సీతానగరం కృష్ణవేణి ఘాట్ వరకూ తీసుకొస్తారా? లేదా అనే అంశంపై ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఐదేళ్ల క్రితం దసరా పండుగ సమయంలో కృష్ణమ్మకు వరదలు రావడంతో అమ్మవారి హంస వాహన దర్శనం నదిలో కొద్దిదూరం నిర్వహించి వెంటనే వెనక్కి తిప్పి దుర్గఘాట్‌కి తరలించారు. ఆ దివ్య మంగళదృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు అశేషంగా బ్యారేజ్ వద్దకు చేరుకునేవారు. ఐదేళ్లుగా అమ్మవారి హంసవాహనం మొక్కుబడిగా కొద్ది దూరం నదిలోకి తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్తుతున్నారు. ఈసారైనా అమ్మవారి దివ్య దర్శనం కలిగించాలని భక్తులు కోరుతున్నారు. -
కల్వర్టులతో కలవరం
శిథిలమైన బీటీరోడ్లు, కల్వర్టులు ప్రమాదమని తెలిసినా తప్పని ప్రయాణాలు మరమ్మతులపై అధికారుల ఉదాశీనత సీతానగరం: కల్వర్టులు, రోడ్లు శిథిలమైపోయాయి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మండలంలో నిరంతరం ప్రజలు తిరుగాడే బీటీ రోడ్లు, కల్వర్టులు, రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంతో శిథిలావస్థకు చేరాయి. అంటిపేట వద్ద కల్వర్టు మే నెలలో శిథిలం కావడంతో ఎప్పుడెలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. మండలానికి ఎగువనున్న గ్రామాల్లో వర్షాలు కురిస్తే వచ్చే వరద నీరు, వీఆర్ఎస్ కాలువ అదనపు నీరు అంటిపేట కల్వర్డునుంచే ప్రవహించాల్సి ఉంది. అయినా కల్వర్టు కూలడంతో నీరు నిరంతరం రోడ్డుపై పారడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రైతులు అంటున్నారు. బూర్జ అఖరం చెరువు నిండిన అనంతరం శివాలయం మీదుగా సువర్ణముఖి నదిలోకి మళ్లించాల్సి ఉంది. కల్వర్డు ఏడాది క్రితం శిథిలం కావడంతో రాత్రిపూట వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కేఎస్ పురం–పూను బుచ్చింపేట గ్రామాల మధ్య కల్వర్టులు రెండూ ఒకే పర్యాయం కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సీతానగరంలో దొంగల బీభత్సం
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో శుక్రవారం ఆర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. సీతానగరం చిన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వీరభద్రరావు అనే వ్యక్తి ఇంట్లోకి శనివారం తెల్లవారుజామున దొంగలు చొరబడి ఇంట్లోని వారిపై దాడి చేసి బంగారు నగలను దోచుకుపోయారు. బాధితుల కథనం మేరకు... వీరభద్రరావు, ఆయన కుమార్తె ఇంట్లో నిద్రపోతుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తట్టారు. వీరభద్రరావు తలుపు తీయగా ఇద్దరు దుండగులు ముఖంపై దాడి చేసి గాయపరిచారు. లోపలికి ప్రవేశించి ఆయన కుమార్తెను కట్టేసి మెడలోని బంగారు గొలుసులు, చెవి దిద్దులు దోచుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. -
ఆ స్థలం ఎంపీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు!
నిత్యం ఆకలి కేకలతో పోరాటం చేసే జీవితాలు.. పని దొరికితే చాలు పండగ చేసుకునే బతుకులు..కాస్తంత ఖాళీ స్థలం కనిపిస్తే తలదాచుకోవడానికి గూడు ఏర్పాటు చేసుకున్నారు..రాజధాని ప్రకటన రావడంతో భూముల ధరలు రెక్కలు తొడిగాయి.. బడుగుల నివాసముంటున్న స్థలంపై పెద్దల కన్ను పడింది..ఎలాగైనా పేదల గూడు కూల్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు..ఈ తతంగమంతా ఓ ఎంపీకి సదరు స్థలాన్ని కట్టబెట్టటేందుకేనని విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలను రోడ్డు పాలు చేసే ఈ ప్రయత్నాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. సీతానగరంలో మత్స్యకారుల నివాస స్థలాలను ఖాళీ చేయించేందుకు ముమ్మర ప్రయత్నాలు ఈ స్థలం ఓ ఎంపీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు ? తాడేపల్లి రూరల్ : పట్టణంలోని సీతానగరంలో పాఠశాల ఏర్పాటు చేస్తామంటూ 1983లో రామకృష్ణ సమితి వారు అతి తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి ఆరెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే చేశాం... చేస్తున్నాం.. అన్న చందాన ఓ ప్రభుత్వ పాఠశాల నిర్మించారు. అది అంచెలంచెలుగా ఎదుగుతూ 1500 మంది విద్యార్థులకు బోధనశాలగా మారింది. ఈ క్రమంలో పాఠశాలను మేము నడపలేకపోతున్నామంటూ సమితి వారు రామకృష్ణ మిషన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి విద్యార్థుల దగ్గర వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అప్పటిలోనే రామకృష్ణ మిషన్‌కు సమితి వారు ఆరెకరాల స్థలాన్ని అమ్మేశారు. ఈ స్థలం పక్కనే ఉన్న 90 సెంట్ల భూమిలో మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడా స్థలం తమదని సమితి వారు మత్స్యకారులను ఖాళీ చేరుుంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులూ వత్తాసు పలుకున్నారు. ఈ స్థలాన్ని రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీకి కట్టబెట్టేందుకే వారు హడావుడి చేస్తున్నారని సమాచారం. సదరు ఎంపీ సారు రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు మత్స్యకారుల స్థలాన్ని ఖాళీ చేరుుస్తున్న తెలిసింది. అందులో భాగంగానే వారి నివాసాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ తెలుగుదేశం నాయకుడు చెబుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి ఏమిటి ? మత్స్యకారులకు ఎక్కడైనా నివాస గృహాలు ఇస్తారా? లేక వారిని రోడ్డుకీడుస్తారా? అనే విషయం ఇంత వరకు తేల్చ లేదు. ప్రతి రోజూ అధికారుల హడావుడి చూసి మత్స్యకారులు తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయపెడుతున్నారు 50 ఏళ్ల నుంచి కృష్ణమ్మ తల్లిని నమ్ముకుని ఇక్కడే నివసిస్తున్నాం. కాయకష్టం చేసుకుంటూ రేకుల షెడ్డు నిర్మించుకున్నాం. ఈ స్థలం తమదంటూ ఎవరెవరో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. - నడికుదిటి పార్వతి ఎక్కడికెళ్లాలి ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నాం. ఇప్పుడొచ్చి తమను ఖాళీ చేయమంటే ఎక్కడికెళ్లాలి. రామకృష్ణ సమితి వారు ప్రజలకు ప్రతి ఏడాది ఏదో సేవ చేస్తుంటారని తెలిసింది. దానిలో భాగంగానే మా కుటుంబాలకు ఈ స్థలం కేటాయించాలని ప్రాధేయపడుతున్నాం. - గాడి భారతి -
వర్షంలోనూ సడలని సంకల్పం
సీతానగరం, బొబ్బిలి: ఎన్సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్నదాతల సంకల్పం జోరు వానలోనూ సడలలేదు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ శనివారం ఉదయం కర్మాగారం ముందు మహాధర్నా చేపట్టారు. ఇంతలో బొబ్బిలి డీఎస్పీ బీవీ.రమణమూర్తి యాజమాన్యంతో మాట్లాడించడంతో సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదీ సంగతి.. గత రెండు సీజన్లకు సంబంధించి ఎన్సీఎస్ యాజమాన్యం 18 కోట్ల రూపాయల మేర బకాయి ఉండడంతో అన్నదాతలు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో అప్పులు చేయలేక చెరకు బకాయిల కోసం పోరాటం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు పెద్దసంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు వర్షంలో తడిసి ముద్దవుతున్నా, మరో వైపు అధిక సంఖ్యలో పోలీసులు మోహరించినా వెనుకంజ వేయలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మహాధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సమస్యపై యాజమాన్యానికి వినతి ఇవ్వాలని వారు సూచించారు. దీంతో ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ రైతులనుద్దేశించి మాట్లాడుతూ శుక్రవారం బొబ్బిలిలో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశంలో కోటి రూపాయలు చె ల్లిస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ధర్నాకు వచ్చినవారికి ఆ సొమ్ము చెల్లిస్తే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యేలోగా పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్థ కౌశిల్, బొబ్బిలి డీఎస్పీ బీవీ.రమణమూర్తి వచ్చి మొత్తం పరిస్థితిని రైతులకు వివరించారు. యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎండీ నాగేశ్వరరావు, డైరక్టరు శ్రీనివాసులను తీసుకువచ్చారు. మహాధర్నాకు వచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చెల్లింపులు చేస్తామని, జూలై 15 నాటికి బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. భారీ బందోబస్తు ఏర్పాటు మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియోగించారు. ఎన్సీఎస్ సుగర్స్ ఎండీ నాగేశ్వరరావు, డెరైక్టర్లకు భారీ భద్రత కల్పించారు. పోలీసులు వలయంగా ఏర్పడి నలుగురు రైతు ప్రతినిధులనే లోపలకు పంపి చర్చలు జరిపించారు. పాతబొబ్బిలి జంక్షను వద్ద కూడా భారీగా పోలీసులను ఉంచారు. -
అనుకున్నట్టే అయ్యింది...
సీతానగరం, బొబ్బిలి: అంతా ఊహించినట్టే ఎన్సీఎస్ యాజమాన్యంపై చెరుకు రైతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫ్యాక్టరీ ఎం.డి., డెరెక్టర్, ప్రజాప్రతినిధులను చుట్టుముట్టి తమ బకాయిల మాటేంటని నిలదీశారు. గత ఏడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరుకుకు సంబంధించిన బకాయిలు చెల్లించేవరకూ క్రషింగ్ మాటను ఎత్తవద్దని రైతులు కరాఖండీగా చెప్పడంతో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఏడాది తరువాత మళ్లీ మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా, మా జీవితాలతో ఆటలాడింది చాలదా అం టూ రైతులు దుమ్మెత్తి పోశారు. దీంతో ఆ ప్రాంగణంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రషింగ్ మొదలు పెట్టే ముందు ఆనవాయితీ ప్రకారం రైతులతో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే సమావేశాన్ని శనివారం సాయంత్రం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం ఆవరణలో నిర్వహించారు. ఎప్పటిలాగే ఎం.డి. చాంబర్లో నిర్వహించడానికి ఎం.డి. నాగేశ్వరరావు, డెరైక్టరు శ్రీనివాస్‌లు ఏర్పాట్లు చేశారు. కేవలం 50 మంది రైతులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే సమావేశానికి రమ్మని సమాచారం అందించారు. అయితే సమావేశం పెడుతున్నారన్న సమాచారం తెలుసుకొని రైతులు వందల సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. నాలుగు గోడల మధ్య సమావేశం సరికాదని, ఆరుబయట పెట్టాలంటూ డిమాండ్ చేయడం కార్యాలయం ఫోర్ట్కో వద్దకు మార్చారు. రైతులు, ప్రజాప్రతినిధులు, యాజమాన్యం వచ్చి కూర్చున్నా పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు రాలేదు. ఆయన కోసం కొంత సేపు వేచి చూశారు. ఎమ్మెల్యే చిరంజీవులు వచ్చాక ఎం.డి. నాగేశ్వరరావు ప్రసంగం మొదలు పెట్టారు. జాతీయ వ్యాప్తంగా సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పడంతో రైతులు ఒకే సారి అడ్డుతగిలారు. ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, బకాయిలు చెల్లించమని అడుగుతుంటే ఎక్కడ సంగతులో ఎందుకు చెబుతున్నారంటూ ఒకే సారి రైతులంతా అందోళనకు దిగారు. బకాయిలు చెల్లింపులు, ఈ ఏడాది మద్దతు ధర గురించి చెప్పకుండా మాట్లాడుతుండడంతో వేదిక వద్దకు వెళ్లి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏపీ చెరుకు రైతు సంఘ నాయకులు రెడ్డి శ్రీరాంమూర్తి, లక్ష్ముంనాయుడు, గేదెల సత్యనారాయణ, సీడీసీ డెరైక్టరు బేతనపల్లి శ్రీరాంమూర్తి, ఆదర్శ రైతు ముప్పాల మురళీకృష్ణ తదితరులు ఎం.డీ, డెరైక్టరు, ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. బకాయిలు చెల్లింపులు ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ పట్టుబట్టారు. ఇంకా పది కోట్ల రూపాయల బకాయి ఉందని, ఈ నెలాఖరునాటికి కొంత, డిసెంబరు పదో తేదీనాటికి పూర్తిగా చెల్లింపులు చేస్తామని ఎం.డీ ప్రకటించారు. దీంతో మరింత ఆవేదనకు గురైన రైతులు తీవ్ర పదజాలంతో యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మీ ఫ్యాక్టరీకి చెరుకును తోలుతున్నామంటే మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదని కొందరు రైతులు, మీరు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల మా ఇళ్లలో శుభ కార్యాలు జరగడం లేదని మరికొందరు యాజమాన్యం, ప్రజాప్రతినిధులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రైతులు, యాజమాన్యం ప్రతినిధుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ ఆధ్వర్యంలో సీఐలు చంద్రశేఖర్, కాంతారావులు, ఎస్ఐలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని అందోళన చేస్తున్న వారిని అదుపు చేశారు. దీంతో ఈ సమావేశానికి పోలీసులను ఎందుకు పిలిచారని, మీకు రక్షణగా ఉండడానికా, మమ్మల్ని బయటకు పంపడానికా అంటూ మరో సారి విరుచుకుపడ్డారు. ఈలోగా ఎమ్మెల్యే చిరంజీవులు కలగజేసుకొని యాజమాన్యం వ్యవహార శైలి ఏమీ బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బకాయిలు చెల్లించాకే క్రషింగ్ చేయాలని సూచిస్తూ అక్కడ నుంచి వె ళ్లిపోయారు. ఆ తరువాత ఎం.డీ, డెరైక్టరు, సీఈఓలు కూడా అక్కడ నుంచి ఛాంబర్‌లోనికి వెళ్లిపోయారు. దీంతో రైతులు తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ కార్యాలయం ముందు నినాదాలు చేసి కొంత సేపు బైఠాయించారు. ఈ సమావేశానికి మాజీ ప్రభుత్వ విప్ శంబంగి వెంకటచినప్పలనాయుడు, మాజీ మంత్రి డాక్టరు పెద్దింటి జగన్మోహనరావు, మాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, సీడీసీ అసిస్టెంటుకేన్ కమిషనర్ ముత్యాలు తదితరులు హాజరయ్యారు. -
ఇంకానా..ఇకపై సాగదు
‘మాఫియా’ అంటే.. చట్టబద్ధమైన యంత్రాంగాల్ని ‘ఇసుక రేణువంత’ ఖాతరు చేయని నేరవ్యవస్థ. అలాంటి వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు సీతానగరం మండలంలోని ఏటిపట్టు (గోదావరి తీర) గ్రామాలు కొన్ని నెలలుగా విలవిల్లాడిపోతున్నాయి. అందుకు కారణమైన ఇసుక మాఫియాకు చట్టసభల ప్రతినిధులు, అధికారులే అండగా నిలవడంతో.. జనం గోడు ‘గోదావరి వరదహోరులో చిన్న పరిగె ఘోష’ మాదిరి ఎవరికీ పట్టలేదు. చివరికి.. వారి సహనానికి గండి పడింది. ఆగ్రహం వెల్లువెత్తి, ఇసుక రవాణాను ముంచెత్తింది. సీతానగరం (రాజానగరం) :సీతానగరం మండలంలోని ఏటిపట్టు గ్రామాల నుంచి ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు తిరగబడ్డారు. సింగవరం వద్ద గోదావరిలో తవ్విన ఇసుకను తరలిస్తున్న లారీల్ని గురువారం ఉదయం నుం చి అడ్డుకున్నారు. దీనితో పురుషోత్తపట్నం, పాపికొండలు, పోశమ్మ గండి వెళ్లే యాత్రికులు, ప్రయాణికులు, రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి వచ్చే బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు బారులు తీరి నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మిగిలిన వాహనాలను విడిచిపెట్టిన ఆందోళనకారులు.. రాత్రయినా ఇసుక లోడుతో ఉన్న వాహనాలను కదలనివ్వలేదు. మండలంలో కొందరు రైతులకు వారి లంక భూముల్లో మేట వేసిన ఇసుకను రవాణా చేసుకునేందుకు గనుల శాఖ అనుమతులు ఇచ్చింది. వాటిని అడ్డుపెట్టుకుని.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో ఇసుక మాఫియా నాలుగు నెలలుగా ఇసుకను అక్రమంగా తవ్వి, అమ్ముకుంటూ నిత్యం కోట్లు గడిస్తోంది. ఈ మొత్తం నుంచి అనేకులకు వాటాలందిస్తోంది. నిత్యం సామర్థ్యానికి మించి ఇసుకను నింపుకొని, వెళుతున్న వెయ్యికి పైగా వాహనాలతో రాజమండ్రి-సీతానగరం ప్రధాన రహదారి, పురుషోత్తపట్నం, పోశమ్మగండి ఆలయాలకు వెళ్లే రోడ్లు ఛిద్రమయ్యాయి. ప్రయాణం ప్రయాసభరితంగా మారడమే కాక ఇసుక వాహనాల మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డెక్కాలన్నా, పిల్లలను ఆటోల్లో స్కూళ్లకు పంపాలన్నా హడలిపోవాల్సి వస్తోంది. దీనిపై గతంలో ఆందోళనలు, ఫిర్యాదులు చేసినా.. మాఫియాకు అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారుల అండ ఉండడంతో ఏటిపట్టు గ్రామాల వారి మొర ఎవరికీ పట్టలేదు. పిడికిలి బిగించిన అయిదు ఊళ్లు.. ఈ నేపథ్యంలో ‘రోజూ భయపడి బతికే కన్నా.. తిరగబడితే మేలు’ అనుకున్న సింగవరం గ్రామస్తులు మూడు రోజుల క్రితం ఇసుక లారీల్ని ఆపి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయినా ఇసుక మాఫియా ఖాతరు చేయకపోవడంతో గురువారం ఉదయం నుంచి ఆ ఊరి వద్ద ఆ గ్రామస్తులతో పాటు రామచంద్రాపురం, పురుషోత్తపట్నం, వంగలపూడి, సీతానగరం ప్రజలు ఇసుక లారీల్ని అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన మానాలని కోరినా తహశీల్దారు వచ్చి తమ సమస్యలకు సమాధానం చెప్పేవరకు విరమించబోమని నినదించారు. ఇసుక వాహనాలతో పాటు మిగిలిన వాహనాల్నీ నిలిపివేయడంపై ఇరుగుపొరుగు గ్రామాల వారి మధ్య గొడవ జరిగింది. సీతానగరం ఎస్సై పవన్‌కుమార్ చేసిన ప్రయత్నం విఫలం కాగా.. చివరకు వారే ఒక నిర్ణయానికి వచ్చి ఇసుకలారీలు మినహా మిగిలిన వాటిని వదిలేశారు. కాగా సబ్ కలెక్టర్ విజయరామరాజు సింగవరం వచ్చి ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆందోళనకారులు ఆయనకు ఇసుక అక్రమ రవాణాతో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించి, ప్రశాంతంగా జీవించేలా చూడాలని కోరారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్ సంబంధిత ఫైళ్లను తనకు పంపాలని తహశీల్దారును ఆదేశించారు. కాగా అయిదు గ్రామాల వారి ఆందోళనతో ఇసుక అక్రమ రవాణా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇసుక మాఫియా ప్రతినిధులు ముగ్గళ్ల, మునికూడలి, తొర్రేడు ప్రాంతాలకు వెళ్లి అటు నుంచి ఇసుక కోసం వచ్చే లారీలను నిలిపివేయించారు. చీకటి పడి, ఆందోళనకారులు ఇళ్లకు వెళ్లాక లారీల్ని ఇసుక తవ్వకాల వద్దకు తీసుకువెళ్లి లోడు చేయించాల న్నది వారి ఆలోచన. అయితే గురువారం రాత్రి 9 గంటల సమయంలోనూ ఆందోళనకారులు సింగవరంలోనే ఉండి లారీలను కదలనివ్వడం లేదు. దాంతో మాఫియా ప్రతినిధులు ఇసుక కోసం వచ్చిన లారీల్ని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలోకి తరలిస్తున్నారు. మాఫియా వెనుక ప్రజాప్రతినిధులు,అధికారులు.. ఇసుక మాఫియా తమ ప్రాంతంలోని లంక భూముల్లో నిత్యం వేలాది లారీల ఇసుకను అక్రమంగా తవ్వుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోందని స్థానికులు అన్నారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని, కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులే మాఫియాకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాతో కోట్లాది రూపాయల వ్యయంతో వేసిన ఏటిపట్టు రోడ్డు పూర్తిగా పాడైపోయిందని, సింగవరంలోని నాగరత్నం కాలనీవద్ద రూ.40 లక్షల వ్యయంతో వేసిన కల్వర్టు కూలిపోయిందని రామచంద్రపురానికి చెందిన రైతు సంఘం నేత కలగర బాలకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు గుర్రం ఉదయ్‌భాస్కర్, కోడేబత్తుల వెంకటదొరాజీ, మాచిన శ్రీరామకృష్ణ, కోడేబత్తుల సోమరాజు, యలమాటి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధికారులు నామమాత్రంగానైనా స్పందించలేదని విమర్శించారు. -
ఎన్సీఎస్ యూజమాన్య భూములు వేలం వేస్తాం..
సీతానగరం: లచ్చయ్యపేటలోని ఎన్సీఎస్ సుగర్స్ యూజమాన్యానికి సంబంధించిన ఆస్తులను వేలం వేసి రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి గురువారం చెప్పారు. లచ్చయ్యపేటలోని భూముల రికార్డులను అనుసరించి గురువారం సర్వే నిర్వహించి సుగర్స్‌కు చెందిన 75.11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ భూములను త్వరలో వేలం వేయనున్నట్టు చెప్పారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెరకు రైతుల బిల్లుల బకారుులు చెల్లిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంత రైతులు 2013-14 క్రషింగ్ సీజన్లో చెరకు సరఫరా చేసినా యూజమాన్యం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేసిందన్నారు. అనేకసార్లు చర్చలు జరిపి మాటిచ్చి తప్పిందని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆస్తుల విక్రయూనికి సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆమె వెంట తహశీల్దార్ బి.సత్యనారాయణ, సబ్ రిజిస్ట్రార్ పి.బుచ్చినాయుడు, సుగర్ కేన్ సహాయ కమిషనర్ ముత్యాలు ఉన్నారు. రానున్న సీజన్లో క్రషింగ్ జరుపుతాం... రానున్న సీజన్‌కు సంబంధించి క్రషింగ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సబ్ కలెక్టర్ శ్వేతామహంతి రైతులకు భరోసా ఇచ్చా రు. తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆమె గురువారం చర్చించారు. అనంతరం మాట్లాడుతూ లచ్చయ్యపేట ఎన్సీఎస్ యూజమాన్యం 1.5 లక్షల మంది రైతుల నుంచి చెరకు తీసుకుంటామని ఒప్పందం చేసుకుందన్నారు. క్రషింగ్ యూజమాన్యమే చేస్తుందని లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బిల్లులు చెల్లిస్తాం... సీతానగరం : ఎన్సీఎస్ సుగర్స్ కర్మాగారం రైతులకు చెల్లించాల్సిన బకారుులను సంస్థ భూములను విక్రరుుంచి చెల్లిస్తామని దీనిని గుర్తించి కర్మాగారం ఎదుట శుక్రవారం జరగనున్న ధర్నాలో ఎవరూ పాల్గొనవద్దని కలెక్టర్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. -
స్నేహితుణ్ణి నదిలో తోసేశారు!
-
స్నేహితుడిని కృష్ణానదిలోకి తోసేశారు
గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు....స్నేహితుడిని దారుణంగా హతమార్చిన ఘటన గురువారం స్థానికంగా కలకలం సృష్టించింది. స్నేహితుడిని ప్రకాశం బ్యారేజీ పైనుంచి తోసేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.... వారు కూడా బ్యారేజ్ పైనుంచి దూకేశారు. అయినా స్థానికులు వారిని వెంటాడి పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మృతుడితో పాటు, ఇద్దరు యువకులు విజయవాడకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు సమాచారం. నిందితులను విజయవాడ పోలీసులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మృత్యువులోనూ...ఒకరికి ఒకరై
‘నాతిచరామి’ అనే మంత్రం పఠించి వివాహబంధంతో ఒక్కటయ్యే దంపతులు..ఎంతమంది ఆ మంత్రానికి కట్టుబడి ఉంటున్నారో తెలియదు కానీ..నిరక్షరాస్యులైన ఈ దంపతులు మాత్రం అచ్చంగా కట్టుబడి ఉన్నారని చెప్పొచ్చు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరై దాంపత్య జీవనం సాగించిన ఆ దంపతులు మరణంలోనూ ఒకరిని ఒకరు వీడలేదు. విద్యుత్ అనే మృత్యువు ఒడిలో ఇద్దరూ కలిసే కన్నుమూశారు. పాడిగేదెను పెంచుకుంటూ కుటుంబ జీవనాన్ని సాగిస్తున్న వ్యవసాయ కూలీ దంపతులు పచ్చగడ్డి కోయడానికి కలిసి వెళ్లి తిరిగిరాని లోకాలకు కూడా ఒక్కటిగా చేరుకోవడంతో ఆ దంపతులు నివసిస్తున్న గ్రామమంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. చినబోగిలి (సీతానగరం): సీతానగరం మండలంలోని చినబోగిలి గ్రామానికి చెందిన జరజాపు కృష్ణ (65), జరజాపు కాంతమ్మ (58) దంపతులు పచ్చగడ్డి కోసం ఆదివారం మధ్యాహ్నం తామరఖండి రెవెన్యూ పరిధిలో గల జె.కమలాకర్ప్రసాద్ చెరుకుమడిలో కి వెళ్లారు. గ్రామం నుంచి తామరఖండి వైపు వెళ్తు న్న హెచ్‌టీ విద్యుత్ లైను సిమెంటు స్తంభం ఇటీవ ల గాలులకు వాలిపోయి ఉంది, ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి బురదమయమైన నేలలో విద్యుత్ స్తంభం పట్టుతప్పి ఆది వారం నేలకూలింది. నేలకొరిగిన స్తంభానికి అమర్చిన విద్యుత్ వైర్లు సమీపంలో పచ్చగడ్డి కోస్తున్న కృష్ణ, కాంతమ్మ దంపతులపై పడడంతో వారిద్దరికీ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని పొలం యజమాని గుర్తించి గ్రామంలోని పెద్దలకు, మృతుల కుటుంబీకులకు తెలియజేశారు. మృతుల కుటుంబీకులు జీవనోపాధికోసం ఇతర రాష్ట్రానికి వెళ్లి జీవనం గడుపుతుండడంతో వారి మనుమరాలు (కొడుకు కుమార్తె)రాగి ణితోపాటు సమీప బంధువులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. అనంత రం సీతానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఏస్సై దాసు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. జీవనోపాధి కోసం చెన్నై వెళ్లిన మృతుల పిల్లలు విద్యుత్ తీగలు తగిలి మృతిచెందిన దంపతులకు నలుగురు సంతానం. వారిలో కుమారుడు మరియదాసు, కుమార్తెలు ముగ్గురితోపాటు వారి కుటుంబ సభ్యులంతా జీవనోపాధికోసం కొంతకాలం క్రితం చెన్నై వలసవెళ్లారు. ఇటీవలే కుమారుడు మరియదాసు తన కూతురు రాగిణిని తల్లిదండ్రులకు సహాయకురాలిగా విడిచి పెట్టి, వారికి ఓ పాడి గేదెను సమకూర్చి చెన్నై వెళ్లాడు. పాడిగేదెకు పచ్చగడ్డికోసం వెళ్లి దంపతులు మృతి చెందారని కుటుంబసభ్యులకు గ్రామస్తులు సమాచారాన్ని అందజేయడంతో వారు ఆగమేఘాలమీద చెన్నై నుంచి స్వగ్రామానికి పయనమయ్యారు. విద్యుత్‌శాఖాధికారుల నిర్లక్ష్యం మండలంలోని పంట పొలాల్లో వందలాది విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఆ శాఖాధికారులు నిర్లక్ష్యధోరణి అవలంబించడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంట్రాక్టర్ విద్యుత్ లైన్లు అమర్చినప్పుడు సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి షాక్‌కు గురై మృతిచెంది నెల రోజులు గడవకముందే తాజాగా విద్యుత్ వైర్లు తగిలి దంపతులు మృతి చెందా రు. పొలాల్లో విద్యుత్‌వైర్లు వేలాడుతున్నాయని వందలాది మంది రైతులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు మడులలో చేతులకు అందేంత ఎత్తులో వైర్లు వేలాడుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని విద్యుత్ శాఖ నియమించకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోందని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటూ విద్యుత్ వినియోగదారు లు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్లైన్లను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టకపోతే మరిన్ని పెనుప్రమాదాలు సంభవించే పరిస్థితి లేకపోలేదని రైతులు వాపోతున్నారు. -
ఇంటికో ఉద్యోగమా..! వద్దు బాబు.. వద్దు!
సీతానగరం, న్యూస్‌లైన్: టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై లచ్చయ్యపేటలోని చక్కెర కర్మాగారంలో పని చేసిన ఉద్యోగులు, కార్మికు లు మండిపడుతున్నారు. బాబు తన హయూం లో అన్యాయంగా ఇక్కడి కర్మాగారంలో పని చేస్తు న్న 80 మందిని విధుల నుంచి తొలగించారు. బాబు ఇచ్చిన ఝలక్‌తో ఇప్పటివరకూ వారు తేరుకోవడం లేదు. జిల్లాను వ్యవసాయ, వాణిజ్య, ఉద్యోగపరంగా అభివృద్ధి చేయూలన్న ఉద్ధేశంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఖాయిలా పడిన బొబ్బిలి, సీతానగరం చక్కెర కర్మాగారాలను తెరిపించారు. అప్పటికే ఆయూ కర్మాగారాల్లో పని చేసిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి అన్ని రారుుతీలు కల్పిం చారు. ఈ రెండు కర్మాగారాలను రాష్ట్రంలోనే పేరొందిన నిజాం చక్కెర కర్మాగారం పరిధిలోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ తరు వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గ్లోబలైజేషన్ పేరుతో రాష్ట్రంలో పలు చక్కెర కర్మాగారాలను కొంతమంది అనుచరగణానికి కారుచౌకగా కట్టబెట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వాధీనంలో ఉన్న సీతానగరంలోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం ప్రైవేటు పరమైంది. అప్పటి యూజమాన్యం కర్మాగారంలో కొన్నేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులను మిగులు పేరుతో కొందరిని, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పేరుతో మరి కొంతమందిని బలవంతంగా విధుల నుంచి తొలగించారు. ఇలా మొత్తం 80 మందిని ఉద్యోగాల నుంచి తొలగిం చారు. వారిని విధుల నుంచి తొలగించిన కొద్ది రోజులకే హైదరాబాద్‌లోని మెట్పల్లిలో ఉన్న ప్రభుత్వ, యాజమాన్య చక్కెర కర్మాగారానికి 180 మందిని బదిలీ చేశారు. ఒక సీజన్ తరువాత అక్కడి యూజమాన్యం మళ్లీ వారిని వెనక్కి పంపించడంతో కష్టాలు మొదలయ్యాయి. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని కార్మికులు చంద్రబాబును కోరినప్పటికీ వినిపిం చుకోకపోవడంతో బతుకు తెరువు కోసం అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయూరు. కొందరు స్వగ్రామాలకు వచ్చి వ్యవసా య కూలీలుగా పని చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు కొట్టిన దెబ్బకు ఇప్పటికీ వారు ఆర్థికంగా తేరుకోలేకపోతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
సీతానగరం/బొబ్బిలి రూరల్, న్యూస్‌లైన్ : సీతానగరం మండలం కాశీపేట వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామభద్రపురం మం డలం ఆరికతోట గ్రామానికి చెందిన జక్కు చంద్రశేఖర్(3) మృతి చెందాడు. ఆరికతోట నుంచి మామయ్య సింహాచ లం, తల్లి, అన్నతో కలసి చంద్రశేఖర్ ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. సీతానగరం మండలం నిడగళ్లుకు వీరు వెళ్తున్నారు. కాశీపేట వద్ద ఎడ్లబండిని వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో చంద్రశేఖర్ రోడ్డుపై తుళ్లిపోయి, తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాలుడిని 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. బాలుడిని విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాలుడి తండ్రి సురేష్ రామగుండంలోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సీతానగరం ఎస్సై ఆర్.వాసుదేవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ఓబీ పనులు జరిగేనా..?
సీతానగరం, న్యూస్‌లైన్ : సీతానగరం మండల కేంద్రంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. పాల కుల నిర్లక్ష్యం... అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పను ల్లో పురోగతి లేదు. దీనికితోడు నిధుల లేమి వల్ల పను లు అర్ధాంతరంగా నిలిచిపోయూరుు. దీంతో ఈ మార్గం లో రాకపోకలు చేస్తున్న ప్రయూణికులు నిత్యం నరకయూతన అనుభవిస్తున్నారు. మండల కేంద్రంలోని రాష్ట్రీ ్టయ్ర రహదారి మీదుగా చెన్నై, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ తదితర ప్రాం తాలకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు చేస్తుంటారుు. అరుుతే రహదారి పరిధిలో రైల్వేగేటు ఉం డడం.. రైళ్ల రద్దీ కూడా పెరగడంతో రైల్వేగేటు వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తువి. ఈ నేపథ్యంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రా జీవ్పల్లెబాటలో భాగంగా ఇక్కడకు వచ్చారు. ఆయనకు అప్పటిఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు, ఎం పీ బొత్స ఝాన్సీలక్ష్మి ఆర్ఓబీ నిర్మాణంపై విన్నవించా రు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2008లో ఆర్ఓబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారుు.రైల్వేలైన్‌లో 402/ 6 కిలోమీటర్ల వద్ద రోడ్లు భవనాల శాఖ పరిధిలో...చిలకపాలెం-రామభద్రపురం మీదుగా రాయగడ రోడ్డు 92/8 కిలోమీటర్ల (సీతానగరం) వద్ద రూ. 15.50 కోట్లతో ఆర్ఓబీ నిర్మా ణా నికి సన్నాహాలు చేశారు. 2009లో అప్పటి ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2010-11 ఆర్థిక సంవత్సరానికి పనులు పూర్తి చేయూలని అప్పట్లోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైల్వేట్రాక్‌ల పరిధిలో రైల్వే అధికారులు ఏడాదిలోనే పనులు పూర్తి చేశారు. కా నీ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు ఐదేళ్లు కావస్తున్నా.. పూర్తి కావడం లేదు. దీనికితోడు కాంట్రాక్టర్ నిధులు చాలవని పనుల ను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో వందలాది ప్రయూణికులు నిత్యం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా రు. పనులను త్వరగా పూర్తి చేయూలని స్థానికులు కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పలుమార్లు విన్నవించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పనులు పూర్తి చేయూలని స్థాని కులు కోరుతున్నారు.