స్నేహితుడిని కృష్ణానదిలోకి తోసేశారు
గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు....స్నేహితుడిని దారుణంగా హతమార్చిన ఘటన గురువారం స్థానికంగా కలకలం సృష్టించింది. స్నేహితుడిని ప్రకాశం బ్యారేజీ పైనుంచి తోసేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.... వారు కూడా బ్యారేజ్ పైనుంచి దూకేశారు.
అయినా స్థానికులు వారిని వెంటాడి పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మృతుడితో పాటు, ఇద్దరు యువకులు విజయవాడకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు సమాచారం. నిందితులను విజయవాడ పోలీసులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.