
చెరువులో మునిగిన విదేశీ పక్షిని ఒడ్డుకు తెచ్చిన సీతయ్య, పక్షికి సపర్యలు చేస్తున్న గ్రామస్తులు
సాక్షి, సీతానగరం(విజయనగరం) : వేల మైళ్లు దాటుకుని జిల్లాకు వచ్చిన విదేశీ అతిథి (పక్షి) అనుకోని చిక్కుల్లో ‘పడింది’. ఓ గ్రామస్తుడు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. దశాబ్దాలుగా సైబీరియా నుంచి సీతానగరం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాలకు కొన్ని పక్షులు వచ్చివెళ్తుంటాయి. మండలంలోని లచ్చయ్యపేట గ్రామానికి చెందిన సీతయ్యతో పాటు మరికొంత మంది రోజు మాదిరిగానే చేపలు పట్టేందుకు చెరువులోకి దిగారు. అంతలో ఓ పక్షి నీటిలో గిలాగిలా కొట్టుకుంటూ వారికి కనిపిం చింది. వెంటనే స్పందించిన సీతయ్య ఆ పక్షిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. భారీ సైజులో ఉన్న ఆ పక్షిని చూసేందుకు పలువురు పోటీపడ్డారు. ఈ విధంగా వర్షాకాల విడిదికి వచ్చిన విదేశీ అతిథి (పక్షి)కి జిల్లావాసి పునర్జన్మ ప్రసాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment