సాక్షి, సీతానగరం : సభ్యసమాజం తలవంచుకునే సంఘటన ఇది. తరిగిపోతున్న మానవ విలువలకు పరాకాష్ట ఇది. కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీతానగరం ఎస్ ఐ వి.లోవరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పైల మైనరుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరికీ వివాహాలు కావడంతో అదే గ్రామంలో వారు వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. అయితే పెద్ద కుమార్తెపై ఎప్పటినుంచో కోరిక కలిగి న ఆ ప్రబుద్ధుడు భార్య ఆరోగ్యం బాగులేందున పెద్దకుమార్తెను తీసుకురమ్మని చిన్నకుమార్తెను పంపించాడు.
తండ్రి కబురుతో శుక్రవారం కన్నవారింటికి వచ్చిన పెద్ద కుమార్తెపై ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆమె అదే రోజు సాయంత్రం గ్రామ వలంటీర్, సచివాలయ పోలీసుకు సమాచారం అందివ్వగా వారి ఫిర్యాదు మేరకు బొబ్బిలి రూరల్ సీఐ బి.ఎం.డి.ప్రసారా వు, సీతానగరం ఎస్‌ఐ వి.లోవరాజు హుటాహుటిన గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. మహిళా పోలీసుల ద్వారా బాధితరాలిని అన్ని కోణాల్లో విచారణ జరిపి, కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలియజేశారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment