అడవి మామిడిపల్లి శివారులో ఆర్‌వోబీ పనులను పరిశీలిస్త్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్
ఆర్మూర్/మాక్లూర్: మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి శివారులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) పనులు నత్తనడకన సాగుతుండటంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో నిర్వహించిన పార్లమెంట్ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి వెళుతుండగా మా ర్గమధ్యలో ఆర్‌వోబీ పనులను మంగళవారం ఆయ న పరిశీలించారు.
ఎన్‌హెచ్ డిప్యూటీ ఈఈ శంక ర్‌కు ఫోన్ చేసి వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధుల తో చేపడుతున్న ఆర్‌వోబీ పనులకు, రూ.14 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేసినా పనులు నెమ్మదిగా సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచని పక్షంలో కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని హెచ్చరించారు. డిప్యూటీ ఈఈ శంకర్ సమాధానానికి సంతృప్తి చెందని ఎంపీ అర్వింద్ ఈఈ కాంతయ్యకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులను వివరించారు.
వారం రోజుల్లో పనులు వేగంగా జరిగేలా చూస్తానని ఈఈ హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్మాణంపై బీఆర్‌ఎస్ నాయకులు దేశ్ కీ నేతా కేసీఆర్, జీవనన్న అంటూ రాసిన పెయింటింగ్‌లపై అ భ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులకు దేశ్ కీ నేతా అని కాకుండా దేశ్ కా నేతా అని రాయాలని సలహా ఇచ్చారు. బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment