railway bridge
-
2 కి.మీ. నిడివి రూ. 332 కోట్ల వ్యయం
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల సమీపంలో మానేరునదిపై 2.4 కిలోమీటర్ల పొడవుతో భారీ రైలువంతెన నిర్మించనున్నారు. ఇందుకు రూ.332 కోట్లు ఖర్చు కానుంది. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గోదావరి నదిపై పెద్ద వంతెనలున్నాయి. ఇప్పుడు మానేరుపై నిర్మించే ఈ వంతెన వాటి సరసన చేరనుంది. విజయవాడ రైలు వంతెన తరహాలో..కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన రైలు వంతెన తరహాలో ఇనుప గర్డర్లతో దీన్ని రూపొందించబోతున్నారు. రైళ్లు వేగంగా వెళ్లినప్పుడు ఏర్పడే కంపన ప్రభావం పిల్లర్లపై పెద్దగా ప్రభావం చూపకుండా ఇనుప గర్డర్లు అడ్డుకుంటాయి. దీంతో ఈ డిజైన్‌కు మొగ్గు చూపారు. భారీ వరద పోటెత్తినా ఇబ్బంది కానిరీతిలో..మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. రైలు సిరిసిల్లకు చేరుకోవాలంటే మానేరు నదిని దాటాలి. సిరిసిల్ల శివారులో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. అక్కడకు చేరుకునే మార్గానికి కేవలం 10 కి.మీ. దూరంలో మిడ్ మానేరు జలాశయం ఉంది. దీంతో అక్కడ బ్యాక్ వాటర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో నీటి నిల్వ పెరిగి నది మరింత వెడల్పుతో ప్రవహిస్తుంది.గతంలో గరిష్ట నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని అంతకంటే ఎక్కువ నీళ్లు చేరినా రైలు మార్గానికి ఇబ్బంది కాని రీతిలో వంతెనకు డిజైన్ చేశారు. దీంతో 2.4 కి.మీ. నిడివితో నిర్మించాలని నిర్ణయించారు. నదీతీరంలో ఉన్న గోపాలరావుపల్లి వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమై.. సిరిసిల్ల వైపు అనుపురం గ్రామపరిధిలో ల్యాండ్ అవుతుంది. 120 కి.మీ. వేగంతో రైలు ప్రయాణించేలా..సాధారణంగా వంతెనలపై రైళ్ల వేగాన్ని కనిష్ట స్థాయికి కుదిస్తారు. ప్రయాణికుల రైళ్లు గంటకు 120 కి.మీ.వేగంతో దూసుకుపోయినా ఇబ్బందికాని విధంగా ఈ వంతెన నిర్మించనున్నారు. అయితే సరుకు రవాణా రైళ్ల గరిష్ట వేగాన్ని 65 కి.మీ.కు అనుమతిస్తారు. ఆంగ్ల అక్షరం ‘ఎస్’ఆకృతిలో..ఈ వంతెన ఆంగ్ల అక్షరం ‘ఎస్’ఆకృతిలో మలుపుతో ఉంటుంది. వంతెన నిర్మించే ప్రాంతంలో కొంతభాగం అటవీ ప్రాంతం అలైన్‌మెంట్‌లోకి చొచ్చుకొచ్చింది. మరోవైపు గుట్టలున్నాయి. దీంతో వాటిని తప్పిస్తూ ఎస్ ఆకృతిలో డిజైన్ చేశారు. వెంటనే పనులు..వంతెన పనులను వెంటనే ప్రారంభించేలా దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. గతంలో ఈ సెక్షన్ మధ్యలో భూ పరిహార మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డిపాజిట్ చేయలేదు. దీంతో పనుల్లో జాప్యం జరిగింది. ఇటీవల ఆ మొ త్తం చెల్లించటంతో పనులు జరుగుతున్నాయి. ఇక మానేరు నది అవతల సిరిసిల్ల నుంచి కరీంనగర్ (కొత్తపల్లి) వరకు భూసేకరణ ప్రక్రియ నిలిచిపో యింది. పరిహారం మొత్తం రూ.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయలేదు. దీంతో భూమి రైల్వే ఆధీనంలోకి రాలేదు. ఫలితంగా అక్కడ టెండర్లు కూడా పిలవలేదు. దీంతో ప్రాజెక్టు అనుకున్న సమ యంలో పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో మిగ తా పనులతో ప్రమేయం లేకుండా వంతెన భా గాన్ని వేగంగా నిర్మించి, ప్రాజెక్టులో అపరిమిత జాప్యాన్ని నివారించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సిరిసిల్ల వైపు లైన్ నిర్మాణం పూర్తయ్యేనాటికి వంతెన సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తోంది. 18 నుంచి 20 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయనున్నట్టు పేర్కొంటోంది. -
మనసులు కలిపే వంతెన..
యాండే.. గోదారి బ్రిడ్జి ఎప్పుడు వస్తుందండీ పడుచుపిల్ల ఉత్సాహంగా అడిగింది.. లేదే లక్ష్మి రాగానే చెప్తాను నువ్ కాస్త పడుకో.. ఓహ్.. ఇంకా టైముందా... సరే రాగానే మర్చిపోకు మరి అంటూ అటు తిరిగింది అమ్మాయి.. ఇంకో పాతికేళ్ల కుర్రాడు పై బెర్త్ నుంచి కిందికి చూస్తూ రాయమండ్రి బిర్జి వచ్చేహిందా అన్నాడు.. లేదండీ.. బండింకా సామాల్కోట దాట్లేదు .. ఇంకా టైముంది అన్నాడు కిందిబెర్త్ అంకుల్.. ఓహో.. ఐతే రైల్ బ్రిడ్జి మీదకు ఎంటరవగానే చెప్పండే అంటూ కుర్రాడు మళ్ళీ ఫోన్లో బుర్ర దూర్చేసాడు. ఓలమ్మి.. రామండ్రి గోదారి బ్రిడ్జి వచ్చిండేటి అంది వరాలమ్మ.. లేదమ్మమ్మా.. ఇంకా రానేదు.. వచ్చినప్పుడు దడదడదడ సప్పుడొస్తది.. అందరికి తెలుస్తాదిలే.. నేను లేపుతాను నువ్వు తొంగోయే అని చెప్తోంది మనవరాలు మంగ... ఐడ్రాబాడ్ .. విశాపట్నం.. లేదా ఇసాపట్నం మద్రాస్.. ఈరూట్లో వెళ్ళేవాళ్ళకు గోదారి బ్రిడ్జి ఒక ఎమోషన్. ఒక బంధం.. అంతవరకూ నిప్పులుగక్కుతూ యుద్ధానికి వెళ్తున్న వైజయంతి యుద్ధ ట్యాంక్ మాదిరిగా దూసుకెళ్లే రైళ్లన్నీ గోదారిని చూడగానే.. ఎక్కడలేని సిగ్గును పులుముకున్న పడుచుపిల్ల పెళ్ళిచూపుల్లో నడిచినట్లు వగలుపోతూ స్లో అయిపోతాయి. అక్కడికి వచ్చేసరికి అడుగులు తడబడినట్లు.. అడుగులో అడుగేసినట్లు.. వాలుజడ ఊగినట్లు.. జడలోని మల్లెలు నవ్వినట్లు.. అంత సొగసుగా నడుస్తుంది ట్రైన్ అదంతే .. గోదారి.. దానిమీద వంతెన.. ఈ దక్షిణభారతంలోనే ఒక ఐకానిక్ నిర్మాణం...అది కేవలం తూర్పు.. పశ్చిమ గోదావరి జిలాలలను మాత్రమే కలిపే వంతెన కాదండి.. ఎన్నో మనసులతో ముడేసుకున్న బంధం.. కాదనుకున్నా వెంటాడే అనుబంధం. 1964 లో మూడో పంచవర్ష ప్రణాళికలో ఇక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి బీజం పడింది. 1974లో వంతెన నిర్మాణం పూర్తవగా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దాన్ని జాతికి అంకితం చేసారు. ఆ మహా మహా నిర్మాణం ప్రారంభోత్సవాన్ని అప్పటి విజయవాడ కేంద్రంగా ఉన్న ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీని నిర్మాణంతో రాజమండ్రి, కొవ్వూరు మధ్య లాంచీల ప్రయాణం స్థానే బస్సులను నడపడం మొదలైంది. రెండు గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సులువయ్యాయి. ఈ ఏడాదితో గోదారి రైల్. రోడ్ బ్రిడ్జికి యాభయ్యేళ్ళు నిండాయి..ఇక ఈ మార్గంలో ట్రైన్ మీదుగా ప్రయాణించే కోట్లాదిమందికి ఈ వంతెన మీదుగా ట్రైన్ నడవడం.. దాన్ని కిటికీలోంచి చూడడం ఒక అద్భుత భావన. ఒరేయ్.. బుడ్డోడా.. గోదారొచ్చింది.. చిల్లర పైసలు ఉంటే ఇవ్వరా అంటూ తీసుకుని కిటికీలోంచి గోదారమ్మకు దక్షిణ సమర్పించి ఒక దండం పెట్టుకుని సంతృప్తి పడని జీవులు లేనట్లే లెక్క. రాత్రి పూలతో బెర్త్ మీద నిద్దరోయి తెల్లారి వాటిని బయటపడేయకుండా గోదారి వచ్చేవరకూ ప్రేమగా చేతిలో పట్టుకుని కూర్చునే నవవధువులు.. సాయం సంధ్యవేళ దూరంగా కొండల్లోకి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆదిత్యుని.. గోదారిని కలిపి చూడడం.. అందులోని భావుకత్వాన్ని ఆనందించడం కవులకే సాధ్యం.. అమ్మా కిందికి చూడు ఎన్ని బోట్లో... అంటూ ముద్దుముద్దుగా చెబుతున్న పిల్లాడిని దగ్గరకు పొదుముకుంటూ అవున్నన్నా గోదారిలో అన్నీ ఉంటాయి.. వాళ్లంతా చేపలు పడుతున్నారు అని వివరించే తల్లి. బ్రిడ్జి రాగానే... నోట్లో నీళ్లూరుతుండగా యాండే ఈ సీజన్లో గోదారిలో పులస దొరుకుతుందండీ... అది పులుసూపెట్టుకుని మర్నాడు తింటే ఉంటుందండీ అని వివరించే ఇంకో ఫుడీ నేరేషన్.. ఇంకో లెవెల్..ఇలా గోదావరి వంతెన కేవలం ఒక నది మీద కట్టిన ఇనుప నిర్మాణం కాదండి.. అందులో బంధం.. ఆత్మీయత.. ఒక తీయని అనుభూతి.. ఇలా చెబుతూ వెళ్తే ఇంకెంతైనా రాయొచ్చు..- సిమ్మాదిరప్పన్న -
ఫోటో షూట్ పిచ్చి: లోయలోకి దూకేసిన కొత్త జంట వీడియో వైరల్
ఫోటోలు, రీల్స్ పిచ్చి ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన అనేక విషాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొంతమంది తీరుమారడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని పాలిలో ఫోటో షూట్ సమయంలో జరిగిన ప్రమాదం సంచలనం రేపింది. ఇరుకుగా ఉన్న రైలు పట్టాలపై ఫోటోషూట్ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన షాకింగ్‌గా మారింది.వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పాలి సమీపంలోని గోర్మ్ ఘాట్ వద్ద పురాతన రైల్వే వంతెన ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతితో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి చాలామంది సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని బాగ్దీ నగర్‌కు చెందిన కొత్త జంట రాహుల్ మేవాడ (22), భార్య జాహ్నవి (20) కూడా ఈ ప్రదేశానికి వచ్చారు. వీరికి తోడుగా రాహుల్ సోదరి, ఆమె భర్త వచ్చారు. నలుగురూ కలిసి బ్రిడ్జిపై ఫొటో షూట్ చేసుకునే ఉత్సాహంతో మీటర్ గేజ్ ట్రాక్‌పైకి చేరుకున్నారు. పరిసరాలను మైమరిచి ఫోటోలకు ఫోజులిస్తుండగా రైలు దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన రాహుల్ సోదరి, ఆమె భర్త ట్రాక్‌పై నుంచి పక్కకు వచ్చేసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొత్త జంట మాత్రం రైలు సమీపానికి వచ్చేదాకా విషయాన్ని గమనించలేదు.राजस्थान के पाली जिले में एक बड़ा हादसा हुआ। राहुल मेवड़ा अपनी पत्नी जाह्नवी संग हेरिटेज पुल पर फोटो शूट करा रहे थे। तभी ट्रेन आ गई। ट्रेन से बचने को दोनों 90 फीट गहरी खाई में कूद गए। दोनों का इलाज जारी है।🚨Disturbing Visual🚨 pic.twitter.com/WwDSTd5jrW— Sachin Gupta (@SachinGuptaUP) July 14, 2024ఇక ఏం చేయాలో అర్థంకాక, రైలు పట్టాలకింద నుజ్జు నుజ్జు కావడం ఖాయం, పక్కనున్న లోయలోకి దూకడం తప్ప వేరే మార్గం లేదని గమనించిన ఆ జంట చేయి చేయి పట్టుకొని 90 అడుగుల లోయలోకి దూకేసింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను దాటిన మొదటి రైలు అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. ఇది యోగా దినోత్సవం కాబట్టి, మన మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయని సూచించడానికి ఇది సరైన చిత్రం అని ట్వీట్ చేశారు.ఎత్తైన రైల్వే బ్రిడ్జ్భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపైన రైలు బోగీల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ బిడ్జి మీద రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బిడ్జిని ఇప్పటికే ఇంజినీర్లు, రైల్వే అధికారులు పరీక్షించారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించారు.చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జి ద్వారా రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసీ మధ్య రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎత్తైన బ్రిడ్జి ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా ఇది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.The first train to cross the world’s highest railway bridge—the Chenab Bridge in India.Since it’s Yoga Day, it’s the perfect image to signify that our infrastructure is stretching itself as far towards the skies as possible….🙂pic.twitter.com/T73OnJBGup— anand mahindra (@anandmahindra) June 21, 2024 -
హేవలాక్.. గోదావరి ఐకానిక్..
సాక్షి డెస్క్, రాజమహేంద్రవరం: అమ్మమ్మగారింటికనో.. చుట్టాలింటికనో గోదావరి అవతల ఉన్న ఏ విజయవాడకో.. మెడ్రాసుకో (ఇప్పుడంటే చైన్నె కానీ.. అప్పట్లో అలానే కాస్త స్టైలుగా అనేవారు ఎందుకో! కాకపోతే కొందరు మద్రాసు, మదరాసు అనేవారు) చిన్నప్పుడు వెళ్లిన వాళ్లందరికీ రాజమండ్రి పాత రైలు బ్రిడ్జిపై ప్రయాణం ఎప్పటికీ చెదరని ఓ మధుర జ్ఞాపకమే. పగటి పూట అయితే చాలామంది కాకినాడ – మెడ్రాసు సర్కార్ ఎక్స్‌ప్రెస్ లేకపోతే ప్యాసింజర్ రైలు ఎక్కేవారు. అప్పట్లో బొగ్గు ఇంజన్. కూ... అంటూ చెవులు చిల్లులు పడేలా పే....ద్ధ కూత పెట్టుకుంటూ చుక్చుక్చుక్ మంటూ వచ్చేది. రైలు నెమ్మదిగా రాజమండ్రి (కొంతమంది ‘రాజమంట్రి’ అనేవారు. అదేమిటో!) చేరిందంటే చాలు.. గోదావరి వచ్చేసిందని పెద్దవాళ్లు అప్రమత్తం చేసేవారు. అందరూ పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు, పది, 20 పైసలు.. కాస్త ఉన్న వాళ్లయితే పావలా నుంచి రూపాయి కాసు వరకూ చేతులతో పట్టుకుని రైలు బోగీ కిటికీలు, గేట్ల వద్దకు ఉరికేందుకు సిద్ధంగా ఉండేవారు. ఏదో యుద్ధానికి సిద్ధమైన యోధుల్లా..రైలు కూత పెట్టి నెమ్మదిగా రాజమండ్రి స్టేషన్‌ను వీడేది. ఇంజిన్.. దాని వెనుకనే ఒకదాని వెనుకన ఒక్కో బోగీ గోదావరి బ్రిడ్జి మీదుగా పరుగులు తీసేవి. ఇప్పుడంటే రోడ్ కం రైల్వే బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి ఉన్నాయి కానీ.. అప్పట్లో రైలు గోదావరి దాటాలంటే ఒక రకం జేగురు రంగులో ఉండే రెడ్ ఆకై ్సడ్ పూత పూసిన పాత బ్రిడ్జి ఒక్కటే దిక్కు.. దీనికే హేవలాక్ బ్రిడ్జి అని మరో పేరు. అమ్మో బ్రిడ్జి మీద ప్రయాణమే.. అప్పట్లో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటే చాలామందికి హడల్.. గుండెలు గుబగుబలాడిపోయేవి. ఓపక్క ఠక్‌ఠక్.. ఠక్‌ఠక్ అంటూ రైలు చక్రాల సౌండ్.. అది ఇనుప బ్రిడ్జి కావడంతో వాటి అదురు నుంచి వచ్చే రీసౌండ్.. చిన్న పిల్లలైతే భయంతో బిర్రబిగుసుకుపోయేవాళ్లు. మరోపక్క కిందన అఖండ గోదావరి. ఎటు చూసినా కనుచూపు మేరంతా అగాధంలాంటి జలరాశే. అసలే ఆ బ్రిడ్జికి అటూ ఇటూ ఏమీ ఉండేవి కావు. ఒక వేళ ఈ రైలు ఆ బ్రిడ్జి మీంచి కింద పడిపోతే.. అనే ఆలోచన వస్తేనే పై ప్రాణాలు పైనే పోయినట్టుండేది. (ఒకవేళ బ్రిడ్జికి అటూ ఇటూ గోడలుంటే మాత్రం వేగంగా వెళ్తున్న రైలు పడితే ఆపుతాయా? అదో వెర్రి ఆలోచన.) ఈలోగా గోదావరిలో డబ్బులేసేవాళ్లు.. పూలు, పండ్లు విసిరేవారు.. చల్లగా చూడాలమ్మా అంటూ తల్లి గోదారికి దణ్ణాలు పెట్టేవాళ్లు. ఈ ప్రాంత ప్రజలతోనే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలతో కూడా అనుబంధం పెనవేసుకున్న ఈ హేవలాక్ వంతెనకు చాలానే చరిత్ర ఉంది. అంతకు ముందు కేవలం పడవలే.. హేవలాక్ బ్రిడ్జి నిర్మించక ముందు గోదావరి నదిని దాటడానికి ఇక్కడి ప్రజలు పడవలే వినియోగించేవారు. ఆ రోజుల్లో గోదావరి వరద ఉధృతంగా ఉంటే ఒక్కోసారి పడవలు తలకిందులై ప్రాణనష్టం కూడా జరిగేది. అటువంటి దుస్థితికి ఈ వంతెన చెక్ చెప్పింది. ప్రజలు సురక్షితంగా గోదావరి దాటడానికి ఒక రవాణా సాధనం లభించింది. అప్పట్లో బ్రిడ్జిపై ఎలాంటి ఆధారం లేకుండా రైలు వెళ్తూంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవారు. అదే సమయంలో థ్రిల్‌గా కూడా ఫీలయ్యేవారు. పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు ప్రణాళిక రైళ్ల రాకపోకలను 1997లో నిలిపివేసిన పదేళ్ల తరువాత ఈ వంతెనను పర్యాటకంగా, రాజమహేంద్రవరం – కొవ్వూరు మధ్య పాదచారుల మార్గంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2008లో ఈ వంతెన సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు తీర్మానం చేసింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించలేదు. నాటి ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించాల్సిందిగా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. హేవలాక్ బ్రిడ్జిని తొలగించి, దానిలోని ఉక్కును తీసుకువెళ్లాలని రైల్వే శాఖ చేసిన యత్నాలను స్థానికులు తిప్పి కొట్టారు. ఈ ఐకానిక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. బ్రిడ్జిపై రోడ్డు వేస్తే చిరు వ్యాపారులకు, రైతులకు ఉపయోగపడుతుందని, వాకింగ్ ట్రాక్‌గా కూడా పనిస్తుందని చెప్పారు. చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో రైల్వే శాఖకు కొంత మొత్తం చెల్లించి, సొంతం చేసుకుంది. దీనిని వారసత్వ సంపదగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుత రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కల సాకారమయ్యే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు పొడవు : 2.7 కిలోమీటర్లు – వెడల్పు: 1.7 మీటర్లు నిర్మాణం ప్రారంభం : 1897 నవంబర్ 11 నిర్మాణ అంచనా వ్యయం : రూ.47 లక్షలు వంతెన ప్రారంభం : 1900 ఆగస్టు 30 వంతెన మూసివేత : 1997 స్తంభాలు : 56 (రాతి కట్టడాలు) మొట్టమొదట ప్రయాణించిన రైలు : మెయిల్ చివరిసారి ప్రయాణించిన రైలు : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ 1897లో నిర్మాణం ఆరంభం ఈ వంతెనను అఖండ గోదావరిపై బ్రిటిష్ వారి పాలనలో హౌరా – మద్రాసు (నేటి చైన్నె) రైలు మార్గంలో రాజమహేంద్రవరం – కొవ్వూరు పట్టణాల మధ్య 1897లో నిర్మించారు. దీనిని వంద సంవత్సరాల పాటు వినియోగంలో ఉండేలా అప్పట్లో డిజైన్ చేశారు. స్తంభాలు పూర్తి రాతి కట్టడాలు. బలమైన ఉక్కు గడ్డర్లు ఉపయోగించారు. దీని నిర్మాణానికి ఫ్రెడరిక్ థామస్ గ్రాన్విల్లే వాల్డన్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. ఈ వంతెనకు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవ్‌లాక్ పేరు పెట్టారు. -
గోదావరి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి మూసివేత
రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు: గోదావరి నదిపై రాజమహేంద్రవరం–కొవ్వూరు పట్టణాల మధ్య ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం నెల రోజుల పాటు మూసివేయనున్నారు. 1974 నవంబర్ 20న ఈ వంతెనను అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ ప్రారంభించారు. 49 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందించిన ఈ వంతెన పూర్తిగా పాడైంది. సెంట్రల్ క్యారేజ్ వే, వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకూ ఈ బ్రిడ్జిని మూసివేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదివారం ప్రకటించారు. మరమ్మతు పనులకు, తక్షణ పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా ఈ వంతెనపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లు సహా బీటీ క్యారేజ్‌వే పునరుద్ధరణ, 4.473 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్ గ్రిడ్ల ప్రత్యేక మరమ్మతులకు రూ.2.10 కోట్లు వెమరమ్మతుల స్తున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే మిల్లింగ్ మెషీన్‌తో బీటీ సర్ఫేస్ తొలగింపు తదితర పనులు చేపట్టారు. ఈ బ్రిడ్జి మీదుగా తిరిగే వాహనాలను గామన్ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, రవాణా, ఆర్టీసీ అధికారులను కోరామని కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. బ్రిడ్జి మూసివేతపై జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. -
బ్రిడ్జి కింద నలిగిన బతుకులు
కోల్‌కతా/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఘోరం జరిగింది. ఐజ్వాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 100 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనుల్లో ఉన్న కారి్మకుల్లో కనీసం 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంకా కనీసం ఐదుగురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అత్యధికులు పశి్చమ బెంగాల్‌కు చెందిన వారే. ప్రమాద ప్రాంతం సైరంగ్ ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురింగ్ నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పైకి చేర్చే క్రమంలో గాంట్రీ కుప్పకూలడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయ, తరలింపు తదితర చర్యల్లో మిజోరం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు రైల్వే శాఖ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress. Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7 — Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023 ఇది కూడా చదవండి: Live Updates: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్–3 -
ఆ స్టీల్ వంతెన బరువు 1,100టన్నులు
సాక్షి, హైదరాబాద్: మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గంలో రాజీవ్ రహదారిపై ధనుస్సు ఆకారంలో ఉండే ఓ స్టీల్ వంతెన రూపుదిద్దుకుంటోంది. తొలుత ఈ మార్గంలో గజ్వేల్ ఔటర్ రింగురోడ్డుపై ఓ వంతెన నిర్మించగా, ఇప్పుడు దానికంటే మరింత పెద్దదైన ఈ వంతెనను సిద్దిపేట మార్గంలో కుకునూరుపల్లి శివారులో దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. గజ్వేల్ దాటిన తర్వాత కుకునూరుపల్లి పొలిమేరలో రాజీవ్ రహదారిని మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ దాటుతుంది. మనోహరాబాద్–కొత్తపల్లి సింగిల్‌లైన్ భవిష్యత్తులో మరో రెండు లైన్లకు విస్తరించాల్సి ఉంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు లైన్లకు వీలుగా ‘బో స్ట్రింగ్ గర్డర్’పద్ధతిలో నిర్మిస్తోంది. ఇది కాంక్రీట్‌తో సంబంధం లేకుండా పూర్తిగా స్టీల్‌తో రూపొందుతోంది. 60 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 10.5 మీటర్ల ఎత్తుతో ఉండే భారీ స్టీల్ వంతెనను రోడ్డుతో అనుసంధానిస్తారు. ఇలా హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు దారిలో ఒకటి, సిద్దిపేట నుంచి హైదరాబాద్ దారిలో మరోటి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సిద్దిపేట వైపు దారిలో దాన్ని బిగిస్తున్నారు. ఒక్కోటి 550 టన్నుల బరువుండే స్టీల్‌తో రూపొందించారు. నెలలోగా పూర్తి.. సిద్దిపేట వైపు ఉన్న రోడ్డులో ధనుస్సు ఆకారంలో ఉండే స్టీల్ గర్డర్ ఏర్పాటు పూర్తయింది. దానిమీద 8 ఎంఎం మందంతో స్టీల్ షీట్ అమర్చే పని జరుగుతోంది. రెండురోజుల తర్వాత దానిమీద 250 ఎంఎం మందంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మిస్తారు. నెలరోజుల్లోగా ఈ మార్గంలో వాహనాలకు అనుమతిస్తారు. సిద్దిపేట –హైదరాబాద్ రోడ్డు భాగంలో రెండో గర్డర్ రెండు వైపులా రెండు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. వంతెన మీద నుంచి వాహనాలు కిందకు రావటానికి, కిందినుంచి వంతెన మీదకు వెళ్లేందుకు వీలుగా వాటిని నిర్మిస్తున్నారు. గజ్వేల్ శివారులో ఔటర్ రింగురోడ్డును క్రాస్ చేసేందుకు వీలుగా ఇదే పద్ధతిలో చిన్న పరిమాణంలో ఉండే బో స్ట్రింగ్ గర్డర్లతో వంతెన నిర్మాణం పూర్తయింది. దానికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. సిద్దిపేట వద్ద బాక్స్ బ్రిడ్జ్.. కుకునూరుపల్లి వద్ద రైల్వే లైన్ రాజీవ్ రహదారిని క్రాస్ చేస్తుండగా, మళ్లీ సిద్దిపేట బైపాస్ దాటగానే మరోసారి క్రాస్ చేస్తుంది. అక్కడ కూడా వెంతెన నిర్మించాల్సి ఉంది. అయితే అక్కడ, రైల్వే లైన్ రోడ్డు పై నుంచి నిర్మిస్తారు. ఇందుకుగాను నగరంలోని ఒలిఫెంటా వంతెన తరహాలో బాక్సు నమూనా వంతెన నిర్మించనున్నారు. సిమెంట్ క్రాంక్రీట్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బాక్సు రూపొందించి దాని వీదుగా రైల్వే లైన్ దాటేలా ఏర్పాటు చేస్తారు. -
రైల్వే బ్రిడ్జిలకు రక్షణ కవచం
సాక్షి, అమరావతి: రైల్వే వంతెనలపై ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. భారీ వర్షాలు, వరదల సమయంలో రైల్వే వంతెనలు, సమీపంలోని ట్రాక్‌ల భద్రత చర్చనీయాంశంగా మారుతోంది. అందుకే 24 గంటలూ రైల్వే వంతెనలతోపాటు నది, సముద్ర తీరాలకు సమీపంలోని ట్రాక్‌ల భద్రతను పర్యవేక్షించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసేలా బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టం(బీఎంఎస్)ను ప్రవేశపెట్టింది. వెబ్ ఆధారిత అప్లికేషన్ సాయంతో.. బీఎంఎస్ అనేది వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక వ్యవస్థ. దేశంలోని రైల్వే వంతెనలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని 24/7 విధానంలో ఇది అందుబాటులో ఉంచుతుంది. రైల్వే వంతెనల డిజైన్, అధికారుల తనిఖీల వివరాలు, తాజా ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచుతూ ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు దోహదపడుతుంది. వంతెనల వద్ద నీటిమట్టం, ప్రవాహ వేగం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. రైల్వే అధికారులను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. బీఎంఎస్ విధానానికి అనుబంధంగా మరికొన్ని అప్లికేషన్లను కూడా రైల్వే శాఖ జోడించింది. ‘ఆన్లైన్ మానిటరింగ్ ఆఫ్ రోలింగ్ స్టాక్ (ఓఎంఆర్ఎస్), ‘వీల్ ఇంపాక్ట్ లోడ్ డిటెక్టర్ (డబ్ల్యూఐఎల్‌డీ) పేరుతో రెండు వ్యవస్థలను బీఎంఎస్‌కు అనుబంధంగా ప్రవేశపెట్టారు. నదీ ప్రవాహ వేగం, వంతెనల వద్ద ప్రవాహ వేగం, నీటిమట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎప్ఐడీ) ట్యాగ్‌లను ఏర్పాటు చేశారు. వాటితోపాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), హాట్ బాక్స్ డిటెక్టర్ (బీబీడీ), మెషిన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టం (ఎంబీఐఎస్)లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. తద్వారా వర్షాలు, వరదలు ముంచెత్తిన సమయంలో నది, సముద్ర తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దాంతో ఆ మార్గంలో రైళ్లను అనుమతించవచ్చా లేదా అనే దానిపై అధికారులు తక్షణం నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మొదటి దశలో దేశంలో 305.. రాష్ట్రంలో 5 బీఎంఎస్ కింద మొదటి దశలో దేశంలో 305 రైల్వే వంతెలను, ట్రాక్‌లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 5 వంతెనలు ఉన్నాయి. దేశంలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 1.44 లక్షల రైల్వే వంతెనలు ఉండగా.. వాటిలో మేజర్ వంతెనలు 37,689 ఉన్నాయి. ఎంపిక చేసిన 305 వంతెనలను మొదటి దశలో బీఎంఎస్ వ్యవస్థ కిందకు రైల్వే శాఖ తీసుకువచ్చింది. ఇందులో ఏపీలో 5 వంతెనలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 678 రైల్వే వంతెనలు ఉండగా వాటిలో మేజర్ వంతెనలు 31 ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, అనకాపల్లి సమీపంలోని శారదా నదిపై వంతెన, రాజమహేంద్రవరంలో గోదావరి వంతెన, విజయవాడ కృష్ణా నదిపై వంతెన, నెల్లూరులోని పెన్నా నదిపై నిర్మించిన వంతెన ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని దాదాపు 150 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణను రైల్వే శాఖ బీఎంఎస్ పరిధిలోకి తీసుకువచ్చింది. భారీ వర్షాలు, వరదల సమయంలో ఈ రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో రైళ్లను నిలిపివేయాల్సి వస్తోంది. అందుకే వాటిని ఎంపిక చేసినట్టు రైల్వేవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని రైల్వే వంతెనలు బీఎంఎస్ విధానం పరిధిలోకి చేరనున్నాయి. -
Chenab Railway Bridge: చుక్చుక్బండి.. మేఘాలలో ప్రయాణమండి..
ఇది విదేశాల్లోని చిత్రం కానే కాదు.. మనదే. మన దేశంలోనిదే. కశ్మీర్లో ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమైన రైల్వే బ్రిడ్జిగా పేరొందింది. ఇది రియాసి జిల్లాలోని బక్కర్, కౌరి మధ్య ఉంది. చీనాబ్ వంతెనకు సంబంధించిన కొన్ని ఫోటోలను రైల్వే శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా.. రైళ్ల రాకపోకలకు ఇంకా అనుమతించలేదు. డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశముంది. -
అమాంతం కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు
సిమ్లా: కుంభవృష్టి ప్రభావంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వణికిపోతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా.. ఇరు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రా జిల్లా చక్కీ బ్రిడ్జి ఆకస్మిక వరదలకు కుప్పకూలింది. పిల్లర్లు డ్యామేజ్ కావడంతో వదర ఉదృతిని తట్టుకోలేక బ్రిడ్జి అంతా చూస్తుండగానే కూలిపోయి.. చక్కీ నదిలో కొట్టుకుపోయింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు జిల్లా అయి కంగ్రాలో చక్కీ నదిపై ఉన్న 800 మీటర్ల రైల్వే వంతెన శనివారం కూలిపోయింది. దీంతో వంతెన కొత్త పిల్లర్‌ను నిర్మించేంత వరకు పఠాన్‌కోట్, జోగిందర్ నగర్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. Chakki railway bridge near Kandwal in Nurpur has collapsed due to heavy rain.#TTRHimachal #Kangra #railways @rpfnrumb @drm_fzr @drm_umb @HP_SDRF @SpKangra @DdmaKangra pic.twitter.com/y3lPvcAR8J — HP Traffic, Tourist & Railways Police (@TTRHimachal) August 20, 2022 ఈ బ్రిడ్జిని 1928లో బ్రిటిషర్లు కట్టించారు. రోడ్లు, బస్సు మార్గాలు అందుబాటులో లేకపోవడంతో.. పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గం ఆధారం. అయితే.. నదీ గర్భంలో అక్రమ మైనింగ్‌తో 90 ఏళ్ల నాటి వంతెన బలహీనపడింది. దీనిపై పలు ఫిర్యాదులు సైతం అధికారులకు అందాయి. గతంలో ఓ పిల్లర్‌కు పగుళ్లు రావడంతో రైలు సేవలను నిలిపివేయగా.. ఇప్పుడు ఏకంగా స్థంభమే కొట్టుకుపోయింది. మరోవైపు ధర్మశాలలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా.. మండిలో మరో పదమూడు మంది కూడా మరణించి ఉంటారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జై రామ్ థాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్చల్: వైరల్ -
హైదరాబాద్ సిటీలో సాఫీ జర్నీకి సై
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ) ద్వారా పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ ఆయా ప్రాంతాల్లో రైలు ఓవర్ బ్రిడ్జీలు (ఆర్ఓబీలు), రైలు అండర్ బ్రిడ్జీలు (ఆర్‌యూబీలు) కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న డజనుకుపైగా ఆర్ఓబీలు, ఆర్యూబీలతోపాటు కొత్తగా మరో మూడు ఆర్‌యూబీలు, ఆరు ఆర్ఓబీలు నిర్మించాలని భావిస్తోంది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల్ని తగ్గించేందుకు సదరు ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం ట్రాఫిక్ సర్వే పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా.. నగరంలో ట్రాఫిక్ చిక్కుల్లేని ప్రయాణాల కోసమే రూ.25వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వం ఎస్సార్డీపీ ద్వారా ఫ్లై ఓవర్లు, తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఆ పనులన్నీ పూర్తయ్యేలోగా ప్రధాన మార్గాల్లో ఎదురవుతున్న చిక్కుల్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలుగా మంత్రి కేటీఆర్ ఆలోచనతో లింక్, స్లిప్ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వాటితో మంచి ప్రయోజనం కలగడంతో శివారు స్థానికసంస్థల పరిధిలో సైతం లింక్, స్లిప్రోడ్లకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. మరోవైపు రైల్వే మార్గాలున్న ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తే చిక్కులు తగ్గుతాయని భావించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఆర్ఓబీలు, ఆర్‌యూబీలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని విస్తరించాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట్ వంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విస్తరించాలని సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ సూచించారు. ఇటీవల రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా జీహెచ్ఎంసీ, రైల్వే అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాటితోపాటు ఇరుగ్గా ఉన్న ఆర్ఓబీలు, ఆర్‌యూబీలను విస్తరించాలని కోరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు వీటిని త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన చర్యల్లో తలమునకలయ్యారు. (క్లిక్: చార్మినార్ వద్ద బయట పడ్డ భూగర్భ మెట్లు) -
ఇండియన్ ఇంజనీర్ల అద్భుతం! జేమ్స్‌బాండ్ ఇక్కడ ఫైట్ చేయాల్సిందే
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా భారత రైల్వేస్ నిర్మించిన రైల్వే బ్రిడ్జ్‌కు ఫిదా అవుతూ ఆసక్తికర పోస్ట్‌ను ట్విటర్లో షేర్ చేశారు. జేమ్స్ బాండ్ సినిమా ఓపెనింగ్ సీన్ అక్కడే..! జమ్ము కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ను నిర్మిస్తోంది. ఇది నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది.బ్రిడ్జ్‌పై నుంచి రైల్ పోతే..బ్రిడ్జ్ కింద నుంచి మేఘాలు పోతాయి. ఈ చీనాబ్ బ్రిడ్జ్‌కు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో సివిల్ సర్వెంట్ పోస్ట్‌ను షేర్ చేశారు. దాన్ని ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేస్తూ...“అసాధారణ విజయం. తదుపరి జేమ్స్ బాండ్ సినిమా ఓపెనింగ్ సీన్?” అంటూ రాసుకొచ్చారు. జేమ్స్ బాండ్ తదుపరి సినిమాలో ఓపెనింగ్ సీన్‌ను ఈ బ్రిడ్జిపై షూట్ చేయాలని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. గత ఏడాది కూడా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ చీనాబ్ బ్రిడ్జ్ సంబంధించిన వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. అప్పుడు ఈ ప్లేస్‌ను తాను సందర్శించే ప్రదేశాల బకెట్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఇండియన్ మార్వెల్..! చీనాబ్ నదిపై నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జ్ భారత మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ భారత ఇంజనీర్స్ నిర్మించిన మార్వెల్ కట్టడంగా నిలుస్తోంది. ఈ బ్రిడ్జ్‌ను నిర్మాణం 2004లో ప్రారంభమైంది. అయితే ఈ ప్రాంతంలో తరచుగా వీచే గాలుల కారణంగా 2008-09లో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కానుంది. ఈ బ్రిడ్జ్ గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదని రైల్వే సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీని జీవిత కాలం 120 సంవత్సరాలు. Extraordinary achievement. The scene for the next James Bond movie opening? https://t.co/F8bAVvhwxG — anand mahindra (@anandmahindra) February 14, 2022 చదవండి: ఇలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది - ఆనంద్ మహీంద్రా -
రైతు వంతెన వద్ద ఇరుక్కుపోయిన భారీ కంటెయినర్ : ముంబై
-
విశేషాలు: ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్
భారత రైల్వేలో మరో అద్భుత నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. చీనాబ్ నదిపై ఈఫిల్ టవర్ కన్నా ఎత్తయిన బ్రిడ్జ్ నిర్మితమవుతోంది. భారత ఇంజనీరింగ్ గొప్పదనాన్ని ఈ రైల్వే బ్రిడ్జ్ మకుటంగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందని మార్చ్‌లో ప్రారంభానికి సిద్ధమైందని కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ ట్విటర్ వేదికగా చెప్పారు. కశ్మీర్ ప్రాంతానికి రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రైల్వే మార్గం వేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కౌరీ ప్రాంతంలో ఉన్న చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కత్రా, బనిహాల్ ప్రాంతాలను ఈ బ్రిడ్జ్ కలపనుంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1,178 అడుగుల ఎత్తులో బాంబు పేలుళ్లు, భూకంపాలకు తట్టుకునేలా ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ 63 ఎంఎం పరిమాణంలో ఉన్న స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా మీటర్లు ఎక్కువ. ‘మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుతం. చీనాబ్ నదిపై స్టీల్ బ్రిడ్జ్ భారత రైల్వే నిర్మాణంలో మరో మైలు రాయి కాబోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది’ అని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ట్వీట్ చేశారు. ఉద్దంపూర్-శ్రీనగర్- బరాముల్లా రైల్వే మార్గం (111 కిలోమీటర్లు)లో ఈ బ్రిడ్జ్ నిర్మితమవుతోంది. కశ్మీర్ లోయ ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం చేపడుతున్నారు. 2004లో 1.315 కిలోమీటర్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చీనాబ్ నది ప్రవాహానికి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు. గంటకు 90 కిలోల వేగంతో వీచే గాలులను కూడా ఈ బ్రిడ్జ్ తట్టుకుని నిలబడుతుంది. నిర్వహణకు సెన్సార్ ఏర్పాటుచేశారు. 120 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జ్ చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. దీని నిర్మాణ వ్యయం మొత్తం రూ.12,000 కోట్లు అని తెలుస్తోంది. Infrastructural Marvel in Making: Indian Railways is well on track to achieve another engineering milestone with the steel arch of Chenab bridge reaching at closure position. It is all set to be the world's highest Railway bridge 🌉 pic.twitter.com/yWS2v6exiP — Piyush Goyal (@PiyushGoyal) February 25, 2021 -
ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు వచ్చే ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్ ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా ఈ వంతెనను డిజైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్– క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 111 కిలోమీటర్ల పొడవైన కాట్రా–బనిహాల్ సెక్షన్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించినట్లు అధికారులు వివరించారు. చదవండి: ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు -
వందేళ్లు నిండినవి 37 వేలు
న్యూఢిల్లీ : వందేళ్లు దాటిని రైలు బ్రిడ్జ్‌లు దేశంలో 37వేలు ఉన్నాయని, వీటలో 32శాతం ఉత్తర రైల్వే జోన్ పరిధిలోనే ఉన్నట్లు రాష్ట్ర రైళ్లశాఖ మంత్రి రాజెన్ గోహెయిన్ ప్రకటించారు. మొత్తం 37,162 బ్రిడ్జ్‌ల్లో ఉత్తర రైల్వే జోన్లో 8,691, సెంట్రల్ జోన్లో 4,710, తూర్పు జోన్లో 3,119, దక్షిణ సెంట్రల్ జోన్లో3,040, పశ్చిమ జోన్లో 2,858 బ్రిడ్జ్‌లు ఉన్నట్లు లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. రాజెన్ గోహెయిన్ మాట్లాడుతూ ‘వందేళ్లు పూర్తయినప్పటికి ఈ బ్రిడ్జ్‌లు మంచి స్థితిలోనే ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ఆధునాతన సాంకేతికను వాడుతున్నాం. ప్రతి సంవత్సరం వర్ష కాలనికి ముందు ఒకసారి, తరువాత ఒకసారి పరిక్షిస్తాం. అవసరమయిన చోట ఈ బ్రిడ్జ్‌లకు మరమ్మత్తులు కూడా చేస్తాం. ఆ సమయంలో రైళ్ల వేగాన్ని తగ్గిస్తాం. గత 5 సంవత్సరాలలో 3,675 బ్రిడ్జ్‌లకు మరమత్తులు చేశారు. ఏప్రిల్1, 2017నాటికి 3,017 బ్రిడ్జ్‌ల మరమత్తులకు అనుమతించినట్టు’తెలిపారు. 2017, అక్టోబరులో దేశంలో మరమత్తుల అవసరం వున్న రైలు బ్రిడ్జ్‌లు సమాచారాన్నిఇవ్వాల్సిందిగా రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. క్షీణ స్థితిలో ఉన్న 252 బ్రిడ్జ్‌ల మీద రైళ్లు నిత్యం ప్రయాణిస్తున్నాయని, ఇది ప్రమాదకరం అని తెలిపింది. రైలు బ్రిడ్జ్‌లు నాణ్యతకు సంబంధించి మూడు రకాల రేటింగ్లను పాటిస్తారు. దీన్ని ఒవర్ ఆల్ రేటింగ్ (ఓఆర్ఎన్) 1, 2, 3గా విభజించారు. ఓఆర్ఎన్ - 1ఉన్న బ్రిడ్జ్‌లకు తక్షణ మరమత్తులు అవసరం. ఓఆర్ఎన్ - 2 ఉన్న బ్రిడ్జ్‌లను ప్రణాళి ప్రకారం మరమత్తులు చేయాలి. ఓఆర్ఎన్ - 3 ఉన్న బ్రిడ్జ్‌లకు ప్రత్యేక మరమత్తులు అవసరం ఉన్నట్టు అర్థం. -
రైతులను ఆదుకుంటాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ. 50 కోట్లతో గోదాంల నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మంగళవారం శంకర్‌పల్లిలో రూ.30 కోట్లతో నిర్మించిన రైల్వే బ్రిడ్జి, రెండు కోట్ల నిధులతో చేపట్టిన మార్కెట్ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రాంతాలను నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. హైదరాబాద్ - బీజాపూర్ అంతర్ రాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయటంతో పాటు శంకర్‌పల్లిని నగర పంచాయితీగా ఏర్పాటు చేసి ముంబై-బెంగుళూరు జాతీయ రహదారులను కలిపేలా మరో రెండు లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు అందిస్తామని తెలిపారు. శంకర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దేశంలో రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. -
బ్రిటిషర్లు కట్టిన బ్రిడ్జీలే నయం..!
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత కట్టిన రైల్వే వంతెనలతో పోలిస్తే బ్రిటిష్ హయాంలో కట్టిన కొన్ని వంతెనలే పటిష్ట స్థితిలో ఉన్నాయని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) అభిప్రాయపడింది. ‘భారతీయ రైల్వేల్లో వంతెనల నిర్వహణ’ పేరిట రూపొందించిన నివేదికను కాంగ్రెస్ నేత ఖర్గే నేతృత్వంలోని పీఏసీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైల్వే వంతెనల నిర్మాణం నాసిరకంగా ఉండటానికి అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని నివేదికలో తెలిపింది. వంతెనల నిర్మాణంలో రైల్వే శాఖ అలసత్వం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందని వ్యాఖ్యానించింది. 3,979 రైల్వే వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వగా, 2015 నాటికి కేవలం 710 బ్రిడ్జీలే పూర్తికావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
రైల్వే బ్రిడ్జిలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ వాసుల ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు ఒక కదలిక వచ్చింది. జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రధాన మార్గాల్లో ఎదుర్కొంటున్న ట్రాఫిక్ నరకయాతనకు రానున్న రోజుల్లో ముగింపు పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైల్వేబ్రిడ్జిలను నిర్మించనున్నాయి. రెండు ప్రధాన మార్గాల్లో ఒకటి రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్ఓబీ), మరొకటి రైల్వే అండర్‌బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్‌తోపాటు అంచనా వ్యయాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపట్టే అవకాశం ఉంది. తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్బ్రిడ్జే.. ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం కోసం ప్రభుత్వాలు రూ.76 కోట్లు మంజూరు చేశాయి. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వాటానే అధికంగా ఉండనుంది. ట్రాక్ నిర్మా ణం ఉన్న చోటనే కేంద్రం నిధులు వెచ్చిస్తుందని అధికా రులు చెబుతున్నారు. మిగతా బ్రిడ్జి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీంతోనే రాష్ట్రంపైనే అధిక భా రం పడనుంది. ప్రధానంగా మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మించాలన్నది ఆదిలాబాద్ ప్రజల చిరకాల స్వప్నం. ఇక్కడ ఆర్ఓబీ నిర్మాణానికి సాధ్యత(ఫీజిబిలిటీ) కాదని చెప్పడం నిరాశ కలిగిస్తోంది. ఈ జంక్షన్ క్రాసింగ్ దగ్గర నుంచి 8 మీటర్ల తర్వాత వాహనాలు బ్రిడ్జి పైకి రావడానికి ఏటవాలుగా నిర్మించేందుకు అనువుగా లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఆర్ఓబీ నిర్మించిన పక్షంలో అటు హైదరాబాద్, ఇటు నాగ్‌పూర్ కు ఎటువైపు అయిన మలిపేందుకు అనువుగా 90 డిగ్రీ ల టర్నింగ్ పాయింట్ నిర్మించేందుకు అనువుగా లేదని పేర్కొంటున్నారు. జంక్షన్ నుంచి పంజాబ్‌చౌక్ వరకు వెళ్లే దగ్గర ఈ సాధ్యత లేదని అధికారులు చెబుతున్నా రు. ఆర్అండ్బీ ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇక్కడ ఆర్ఓబీ నిర్మా ణం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. కాగా ఇటీవల కాలంలోనే పంజాబ్‌చౌక్ వద్ద రూ.1కోటి 20లక్షలతో చెరోవైపు 12 మీటర్ల వెడల్పుతో ఇరుపక్కల కొత్తగా రహదారిపై బ్రిడ్జిను పునర్నిర్మాణం చేపట్టారు. ఒకవేళ ఇక్కడ ఆర్ఓబీ నిర్మించిన పక్షంలో ఈ బ్రిడ్జి నిర్మాణం వృథా అయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా అధికా రులు ఆర్ఓబీ నిర్మాణానికి వెనక్కి వస్తున్నారని తెలు స్తోంది. అదే సమయంలో ఇక్కడ వ్యాపార సముదా యం అధికంగా ఉండడంతో ఆర్ఓబీ నిర్మిస్తే ఈ సముదాయానికి ఇబ్బంది ఎదురవుతుందన్న కోణంలో ఆర్‌యూబీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్పిన్నింగ్ మిల్లు వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి.. స్పిన్నింగ్ మిల్లు వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మించనున్నారు. ప్రధానంగా రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి అధిక వ్యయం అవుతుంది. అదే సమయంలో ఇక్కడ నిర్మాణానికి సాధ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రాక్ నుంచి మార్కెట్ యార్డు వైపు 240 మీటర్లు, కలెక్టరేట్చౌక్ వైపు 150 మీటర్ల పొడవున ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. కలెక్టరేట్ చౌక్ వద్ద ఏటవాలుగా వాహనాలు దిగిన తర్వాత ఇటు హైదరాబాద్, అటు నాగ్‌పూర్‌కు సులువుగా మలిగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఇక్కడే ఆర్ఓబీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
రైల్వేబ్రిడ్జిని ఢీకొట్టిన ఆర్మీ ట్రక్
-
రైల్వే బ్రిడ్జిపై ఎంతటి బరి తెగింపు..!
ఘజియాబాద్: అచ్చం సినిమాలో మాదిరిగా నరాలు తెగే ఉత్కంఠ.. ఏం జరుగుతుందో అనే ఆందోళన.. రైలు డ్రైవర్ కూడా కాస్తంత వణికిపోయే పరిస్థితి.. కానీ పట్టాలపై నిల్చున్న ఆ ఏడుగురు ఆకతాయిలకు మాత్రం ఎలాంటి జంకూ బొంకూ లేదు. రైలు తమను తాకేంత దగ్గరగా వచ్చే వరకు అలాగే చూశారు. తగులుతుందా అనే సమయంలో గబాళ్లున దూకేశారు అది కూడా నదిలోకి. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్ ఘజియాబాద్ లోని మసురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వీడియో బయటకు రావడంతో వెంటనే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి పిచ్చిపని చేసిన ఆ యువకులు ఎవరో గుర్తించాలని, ఎందుకిలా చేశారో కనుక్కోవాలని పోలీసులకు స్ట్రిట్ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 50 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఈ దృశ్యం కనిపించింది. మసురి ప్రాంతంలో గంగా నది కాలువపై ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దీనిపైకి వెళ్లిన కొంతమంది ఏడుగురు రైలును కూడా లెక్కచేయకుండా స్టంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయింది. -
రైల్వే బ్రిడ్జి కింద పసికందు మృతదేహం లభ్యం
చాంద్రాయణగుట్ట: ఆరేడు నెలల పసికందు మృతదేహం లభ్యమైన ఘటన ఛత్రినాక ఠాణా పరిధిలో గురువారం వెలుగుజూసింది. ఎస్ఐ షానవాజ్ కథనం ప్రకారం.....ఆర్యమేఘ ఆసుపత్రి సమీపంలోని కందిల్ ఫ్లై రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ పాప మృతదేహం పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందితే ఎవరో ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. చిన్నారి మెడపై చీమలు కరిచిన ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే బ్రిడ్జి కింద చిన్నారి మృతదేహం
ఆరేడు నెలల వయసున్న ఓ చిన్నారి పాప మృతదేహం లభ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం వెలుగుజూసింది. ఎస్ఐ షానవాజ్ తెలిపిన వివరాల ప్రకారం.....ఆర్యమేఘ ఆసుపత్రి సమీపంలోని కందిల్ ఫైల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ పాప మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా...దాదాపు ఆరేడు నెలల వయసున్న పాపగా గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందితే ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారీ మెడపై చీమలు కరిచినట్లు ఉందని ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
రైల్వే బ్రిడ్జి కింద శిశువు మృతదేహం
చాంద్రాయణగుట్ట : ఆరేడు నెలల వయసున్న ఓ శిశువు మృతదేహం లభ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం వెలుగుజూసింది. ఎస్ఐ షానవాజ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్యమేఘ ఆసుపత్రి సమీపంలోని కందికల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ పాప మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా.. దాదాపు ఆరేడు నెలల వయసున్న పాపగా గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందితే ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారి మెడపై చీమలు కరిచినట్లు ఉందని ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
రైల్వేబ్రిడ్జి పై నుంచి పడ్డ కారు, బైక్.. ముగ్గురి మృతి
హైదరాబాద్: అల్వాల్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే వంతెన పైనుంచి కారు, బైక్ కిందపడ్డాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సహా బైక్ నడుపుతున్న వ్యక్తి మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం తిరుమలగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 29 బీబీ 4454 అని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతులు శక్తిసింగ్, కృష్ణమాచార్య, కమలిని అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కర్మాన్ ఘాట్ కు చెందిన కృష్ణమాచార్య కుటుంబం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శక్తిసింగ్ అనే వ్యక్తి బైక్ రాంగ్ రూట్ లో నడుపటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయిన ప్రయత్నంలో కారు రైల్వే వంతెన పైనుంచి కిందకి పడిపోగా, ఆ వెంటనే బైక్ కూడా పడిపోయింది. -
పడుతూ..లేస్తూ..
పడకేసిన ప్రాజెక్టులు నత్తనడకన రైల్వే వంతెనల పనులు ప్రతిపాదనలకే పరిమితమైన తుకారంగేట్ సిటీబ్యూరో: చుట్టూ నీరు.. మధ్యలో మౌన ముద్రలో ఉన్న తథాగతుడు.. నిత్యం వేలమంది సందర్శకులు.. ఆనందం కోసం బోటు షికారు.. హుస్సేన్ సాగర్ వద్ద నిత్యం ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. అయితే, బోటుపై జల విహారం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు బోటింగ్ నిపుణులు. కాళేశ్వరంలో పడవ బోల్తా సంఘటన జరిగిన నేపథ్యంలో పర్యటకులను అప్రమత్తం చేయనున్నారు. హుస్సేన్ సాగర్‌లో స్పీడు బోట్లు, రాజహంస, మెకనైజ్డ్, భాగమతి, భగీరథతో పాటు ఇటీవల వచ్చిన అమెరికన్ బోట్లు పర్యాటకులకు సాగర్‌లో సేవలందిస్తున్నాయి. అయితే, ఒక్కోసారి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఇలాంటప్పుడు బోట్ల సామర్థ్యం తెలుసుకుని ఎక్కాలని సూచించారు నిపుణులు. డ్రైవర్ చెప్పినట్టుగా బరువు సమతుల్యత పాటించాలన్నారు. బోట్ సామర్థ్యానికి మించి ఎక్కినా, ప్రయాణించేటప్పుడు అందరూ ఒకే వైపు వెళ్లినా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. చిన్న బోట్లల్లో ప్రయాణించేవారు లైఫ్ జాకెట్ తప్పని సరిగా వేసుకోవాలన్నారు. ఒక్కసారి వేసుకున్న లైఫ్ జాకెట్‌ను తిరిగి ఒడ్డుకు చేరేదాకా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బోట్లలో నిలబడడం గానీ, డాన్స్‌లు చేయడం చేస్టలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సిటీబ్యూరో: ‘నీవు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’ అన్నాడో సినీకవి. ఈ సామెత రైలుకే కాదు.. రైల్వే ప్రాజెక్టులకు సైతం సరిపోతుంది. మహానగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో తెలిసిందే. చాలా చోట్ల రోడ్డు మార్గాలను విడదీస్తూ రైలు ట్రాకులున్నాయి. ఈ ప్రాంతాల్లో ఒక్కసారి గేటు పడితే వేలాది వాహనాలకు బ్రేకులు పడతాయి. క్షణాల్లో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రైల్వే వంతెనల పనులు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణం ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. ప్రతి ఏటా వచ్చే రైల్వే బడ్జెట్లో ప్రజలకు మెరుగైన సదుపాయాల ‘కల్పన’గా మారుతున్నాయి. ప్రతిపాదనలు ఫైళ్లకూ పరిమితమవుతున్నాయి. చేపట్టిన పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఐదారేళ్ల పాటు పనులు సాగి ఇటీవల పూర్తయిన రైల్ నిలయం, ఆలుగడ్డ బావి, కందికల్ గేట్ రైల్వే వంతెనలు మినహా మిగతా చోట్ల నిర్మాణ పనులు పడకేశాయి. ఆకస్మాత్తుగా గేట్లు పడిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సఫిల్‌గూడ, తుకారంగేట్, మల్కాజిగిరి, ఉప్పుగూడ తదితర ప్రాంతాల్లోని ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణ పనులు మూడేళ్లుగా సాగుతునే ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ నరకాన్ని అనుభవించాల్సి వస్తోంది. రైల్వే బడ్జెట్ నేపథ్యంలో నగరంలో నిలు పలు ప్రాజెక్టుల ప్రగతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సఫిల్‌గూడ రైలు మార్గంలో రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణానికి 2001-02 బడ్జెట్లో రైల్వేబోర్డు అనుమతి ఇచ్చింది. 11 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో రూ. 31 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఇచ్చేందుకు డిఫెన్స్ అధికారులు నిరాకరించడంతో ప్రాజెక్టు వాయిదా పడింది. డిఫెన్స్ నుంచి స్థల ం తీసుకునే అంశంలో ఇటు జీహెచ్ఎంసీ, అటు రైల్వే అధికారులు చొరవ చూపలేదు. దీంతో బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. ఉత్తమ్‌నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద మూడేళ్ల క్రితం రూ. 24 కోట్ల అంచనా వ్యయంతో ఆర్యూబీ పనులు చేపట్టారు. అవి ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. పైగా కేవలం రెండు లైన్ల కోసమే చేపట్టిన ఈ పనులను ప్రస్తుతం 4 లైన్లకు విస్తరించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ చేపట్టిన పనుల్లోనే నిర్లక్ష్యం రాజ్యమేలుతుండగా, మరో రెండింటి పనులు ఎప్పటికి విస్తరిస్తారనేది సందేహం. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వేగేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణం కోసం 2007లో ప్రతిపాదనలు చేశారు. ఉప్పుగూడ- యాకుత్‌పురా మార్గంలో నిర్మించ తలపెట్టిన ఈ బ్రిడ్జి కోసం రూ. 10.84 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు ఒక్క అడుగూ పడలేదు. ఈస్ట్ ఆనంద్‌బాగ్ వద్ద చేపట్టిన ఆర్యూబీ నిర్మాణం కూడా రెండేళ్లుగా కుంటి నడకే నడుస్తోంది. ఈ పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.లాలాగూడ రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న తుకారాంగేట్ వద్ద ఆర్యూబీ కోసం దశాబ్దం కిందటే ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ ఆర్యూబీ కోసం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. లాలాగూడ స్టేషన్ చుట్టూ ఉన్న వందలాది కాలనీలు ఈ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. గేటు పడిందంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే. గేటు పడితే ఇక అంతే.. తుకారాం గేట్ పడిందంటే ప్రయాణంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఒక్కోసారి ఒకదాని వెనుక ఒకటి నాలుగైదు రైళ్లు పరుగులు తీస్తాయి. గంటకు పైగా బండి ఆపుకుని నిలబడాల్సిందే. సమయానికి గమ్యం చేరుకోవడం అసాధ్యం. ఈ గేట్ విషయంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. - సాజిద్ ఇంత నిర్లక్ష్యమా..! ప్రతి సంవత్సరం ఏవేవో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం కాకుండా ఆర్ఓబీలు, ఆర్యూబీల విషయంలో నిర్ధిష్టంగా పనులు ప్రారంభించాలి. లక్షలాది మంది రాకపోకలు సాగించే మార్గాల్లో ఇంతటి నిర్లక్ష్యం సరైంది కాదు. - భాను -
గోదామ్గూడలో శిశువు మృతదేహం
ధారూర్ మండలం గోదామ్గూడ రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని శిశువు మృతదేహం ఆదివారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన కేంద్ర బృందం
రాజమండ్రి సిటీ/కొవ్వూరు: రాజమండ్రి-కొవ్వూరుల మధ్య గోదావరి నదిపై ఉన్న మూడో రైలు వంతెన కాస్త కుంగిపోయింది. ఈ విషయం గమనించిన రైల్వే అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం వంతెనను పరిశీలించింది. 19వ స్టాండ్ వద్ద యాంగ్యులర్ దెబ్బతినడంతో ఈ మార్గంలో రాకపోకల వేగాన్ని 20కిలోమీటర్లకు తగ్గించారు. ఫలితంగా ఈ మార్గంలో నడిచే అన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ సందర్భంగా విజయవాడ డీఆర్ఎమ్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల్లో రూ. కోటితో మరమ్మత్తులు చేస్తామన్నారు. దీంతో మరమ్మత్తులు పూర్తయ్యే వరకు వంతెనపై రైళ్ల వేగాన్ని నియంత్రించనున్నట్లు తెలిపారు. మరో ఆరు నెలల్లో ఇదే వంతెనపై రెండో ట్రాక్‌ను నిర్మించనున్నామని తెలిపారు. రూ. 100కోట్ల అంచనా వ్యయంతో నాలుగేళ్లలో ఈ ట్రాక్ పనులు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిసెప్షన్ ఆర్డీఎస్వో సమారియా, రైల్వే బోర్డు సలహా మండలి సభ్యుడు ఎన్.కె సిన్హా, ఢిల్లీకి చెందిన రిసర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రత్యేక బృందం వంతెనను పరిశీలించింది. -
రైల్వేబ్రిడ్జి కింద మహిళ మృతదేహం
గుంటూరు (మంగళగిరి) : అనుమానాస్పద స్థితిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలోని రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం జరిగింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది తమ పరిధిలోకి రాదని, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఎక్కడైనా హత్య చేసి తెచ్చి ఇక్కడ పడేశారా, లేక ఇక్కడే హతమార్చారా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నా -
జ్ఞాపకాల పందిరి.. విషాద లోగిలి
పెళ్లి పుస్తకంలో ఓ పేజీ రక్తసిక్తమైంది. వధూవరులు.. బంధుమిత్రుల రాకతో మధురజ్ఞాపకాలు మిగిల్చాల్సిన తిరుగుపెళ్లి విషాదం నింపింది. ఓ గంట గడిస్తే.. సంబరం అంబరాన్నంటాల్సిన ఆ ఇల్లు శోకసంద్రమైంది. ఆనందాలకు స్వాగతం పలుకుదామని ఒళ్లంతా కళ్లుచేసుకున్న మామిడి తోరణం ముడుచుకుపోయింది. ఆ జంట జీవితంలో సరికొత్త రాగం ఆలపించాల్సిన పాట మూగబోయింది. పెళ్లి ముచ్చట్లతో సాగుతున్న ఆ ప్రయాణాన్ని మృత్యువు అడ్డగించింది. మలుపులో మాటేసి పంజా విసిరింది. వందేళ్ల జీవితానికి సాక్ష్యంగా నిలవాల్సిన రోజు.. ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. మహానంది: కర్నాలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం అర్ధరాత్రి పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 42 మంది క్షతగాత్రులు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన శిరీషకు గిద్దలూరు పట్టణంలోని చట్రెడ్డిపల్లెకు చెందిన నరసయ్యతో ఈనెల 18న వివాహమైంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తిరుగుపెళ్లి నిమిత్తం వధూవరులతో పాటు బంధుమిత్రులు సుమారు 50 మంది లారీలో బయలుదేరారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నల్లమలలోని పాత రైల్వే బ్రిడ్జి వద్దనున్న మలుపులో అదుపుతప్పిన లారీ కొండను ఢీకొంది. ఘటనలో చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు(55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందగా.. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 31 మందికి తీవ్ర గాయాలు కాగా.. కర్నూలు, నంద్యాల, ఒంగోలు, నరసరావుపేట, గిద్దలూరులో చికిత్సనందిస్తున్నారు. వీరిలోనూ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పెళ్లికూతురు స్వగ్రామం గోపవరంలో విషాదం అలుముకుంది. -
మృత్యు గేట్లు
నగరంలోని వివిధ మార్గాల ద్వారా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో రైల్వే గేట్లు ఉన్నాయి. అక్కడ గంటల కొద్దీ ట్రాఫిక్ జాం అవుతోంది. గేటు దాటాలనే ఆత్రుతతో ప్రజలు ప్రమాదాలకు గురవతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో నగరంలో రోడ్ అండర్ బిడ్జ్రి (ఆర్యూబీ),రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఏళ్ల తరబడి నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. కొన్ని వంతెనల నిర్మాణాలు ఫైళ్లకే పరిమిత మయ్యాయి. నగరంలో దాదాపు 15 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ప్రజల కష్టాలు కొంత మేరకు తీరే అవకాశం ఉంది. ఉప్పుగూడలో నరకమే.. ఇక్కడ ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకాన్ని చ విచూస్తున్నారు. ఈ ప్రాంతంలో రెండు లైన్ల ఆర్వోబీ నిర్మాణానికి తొలుత అంచనాలు రూపొందించారు. అప్రోచ్ రోడ్లతో సహా రూ. 19.58 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. పనులు ప్రారంభమయ్యే సమయంలో స్థానిక నేతలు, ప్రజల విజ్ఞప్తి మేరకు ఆర్వోబీని ఆర్యూబీగా మార్చారు. ఈ మార్పుతో రైల్వే నుంచి అదనపు భూసేకరణ అవసరమైంది. పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు.. ఉప్పుగూడ, కందికల్ రైల్వేగేట్ల నిర్మాణ పనులకు ఒకేసారి శంకుస్థాప న చేసినప్పటికీ, రెండు బ్రిడ్జిల నిర్మాణం ఒకే సారి చేపడి తే ఇబ్బందులు ఎదురవుతాయన్న జాగ్రత్తతో అధికారులు కందికల్ ఆర్వోబీ పూర్తయిన అనంతరం ఉప్పుగూడ రైల్వేబ్రిడ్జిని నిర్మించేందుకు నిర్ణయించారు. ఐదు నిమిషాలకోమారు పడుతున్న ఈ గేట్‌తో వాహనదారులు నరకయాతను అనుభవిస్తున్నారు. అనుమతి ఎప్పుడో... తుకారాం గేట్ వద్ద రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో ఆర్యూబీ నిర్మాణం చేపట్టాలని తొలుత ప్రతిపాదనలు చేశారు. దీనికి సంబంధించి రైల్వే వర్గాల మార్గదర్శకాలు మారడంతో.. అందుకనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డీపీఆర్‌ను) రూపొందించాల్సి ఉంది. భవిష్యత్‌లో ట్రాఫిక్ పెరగనుండడంతో రెండు లైన్ల స్థానంలో నాలుగలైన్లున్న ఆర్‌యూబీకి ఫీజుబిలిటీ నివేదిక నివ్వాల్సిందిగా కన్సల్టెంట్‌ను కోరారు. ప్రస్తుత ం ఆ పని జరుగుతోంది. అది పూర్తయ్యాక, రైల్వేశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అంచనా వ్యయం రూ. 14.2 కోట్లకు పెరిగింది. కందికల్ గేట్ వద్దా అదే తంతు.. కందికల్ గే ట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్వోబీ నిర్మించాలని నిర్ణయించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్వే శాఖ, అప్రోచ్ మార్గాలను జీహెచ్ఎంసీ నిర్మించాలన్నది తొలి ప్రతిపాదన. అప్రోచ్‌ల నిర్మాణానికి రూ. 23.47 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్రోచ్ మార్గాల పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అందుబాటులోకి రాలేదు. ఆర్వోబీకి చెందిన 33 పిల్లర్లకు గాను 32 పిల్లర్లు పూర్తయ్యాయి. 33 శ్లాబులకు గాను 14 శ్లాబుల పనులే జరిగాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రారంభం కాని పనులు నేరేడ్మెట్: వాజ్పేయినగర్ రైల్వే గేటు వాహనదారుల పాలిట శాపంగా మారింది. తరుచూ రైల్వే గేట్ పడుతుండడంతో ప్రజల అవస్థలు వర్ణణాతీతం. మల్కాజ్గిరి, ఆనంద్‌బాగ్, వినాయక్‌నగర్, సఫిల్‌గూడ తదితర ప్రాంతాల ప్రజలు నేరేడ్మెట్కు ఈ గేటు మీదుగా వెళ్లాలి. ఇక్కడ గేటు పడితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆర్యూబీ నిర్మాణం చేస్తున్నామని అధికారులు చెప్పినా ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదు. సా..గుతున్నాయి.. బేగంపేట ఆర్వోబీ- ఫతేనగర్ లింక్‌రోడ్డు మార్గం పనులు ఏడేళ్లుగా సాగుతున్నాయి. ఆర్వోబీ పూర్తయినా, లింక్‌రోడ్డు పూర్తి కాకపోవడంతో అందుబాటులోకి రాలేదు. ఇది పూర్తయితే బాలానగర్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ. 13.5 కోట్లు. మోక్షం ఎప్పుడో.. ►సఫిల్‌గూడ రైలు మార్గంలో రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి 2001-02 బడ్జెట్లోనే రైల్వేబోర్డు అనుమతినిచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 32.89 కోట్లతో అంచనాలు చేశారు. ప్రతిపాదనలు మారడంతో పనులు ప్రారంభం కాలేదు. ►జీహెచ్ఎంసీ సూచన మేరకు ఉప్పుగూడ-యాఖుత్పురా మార్గంలో నిర్మించతలపెట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జిని రోడ్ అండర్ బ్రిడ్జిగా మార్పు చేశారు. రూ.10.84 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ►రైల్‌నిలయం వద్ద రూ. 10.80 కోట్లతో చేపట్టిన ఆర్యూబీ నిర్మాణానికి సంబంధించి డ్రైనేజీ , ఆప్రోచ్ పనులు పూర్తికాలేదు. ►ఆలుగడ్డ బావి వద్ద ఆర్‌యూబీకి సైతం అప్రోచ్ మార్గాలు, డ్రైనేజీ పనులు పూర్తికాలేదు. అంచనా వ్యయం రూ. 17.93 కోట్లు. ►సంజీవయ్య పార్కు వద్ద ఆర్యూబీ పనులకు హెచ్ఎండీఏ వాటా నిధులందాల్సి ఉండడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. అంచనా వ్యయం రూ. 14.7 కోట్లు. ►ఆనంద్‌బాగ్ వద్ద ఆర్యూబీ పనులు టెండరు దశలో ఉన్నాయి. అంచనా వ్యయం రూ. 21.13 కోట్లు. ►నేరెడ్మెట్ వద్ద రూ. 21.13 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ యూబీ నిర్మాణానికి ప్రతిపాదించారు. టెండరు దశలో ఉంది. ►హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ వద్ద నాలుగులేన్ల ఆర్యూబీ నిర్మించాలని భావించారు. అక్కడున్న మంజీరా పైపులైన్ల కారణంగా ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం సాధ్యం కాదని తేల్చారు. ►కై త్లాపూర్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి ప్రతిపాదించారు. నిర్మాణ వ్యయం అంచనాలను రైల్వేశాఖకు పంపించాల్సి ఉంది. ► ఫలక్‌నుమా, శాస్త్రిపురంల వద్ద ఎల్సీ నెం. 7 వద్ద గ్రేడ్ సెపరేటర్‌కు ఫీజుబిలిటీ సర్వే నిర్వహించారు. నివేదికను రైల్వే శాఖకు పంపించారు. ►రాణిగంజ్ దగ్గరి ఆర్యూబీని కర్బలా మైదాన్ వరకు పొడిగించాలనే ప్రతిపాదనలున్నాయి. అంచనా వ్యయం రూ. 29 కోట్లు. -
ఏటీఎం మాయగాడు
* సాంకేతిక లోపాన్ని అడ్డుపెట్టుకుని రూ. 1.45 కోట్లు డ్రా * నకిలీ పేర్లతో బ్యాంకుల్లో ఖాతాలు.. 32 ఏటీఎం కార్డులు * నిందితుడు ఎల్బీనగర్ వాసి * వెంటాడి పట్టుకున్న గుంతకల్లు పోలీసులు గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్: ఏటీఎంలోని సాంకేతిక లోపాన్ని పసిగట్టి, మారుపేర్లతో వివిధ బ్యాంకుల్లో 32 ఏటీఎం కార్డులు సంపాదించి.. రూ.1.45 కోట్లు కొల్లగొట్టిన ఏటీఎం మాయగాడి ఉదంతమిది. ఇతడిని అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన మనగంటి కార్తీక్ విలాసాలకు బానిసై చోరీల బాటపట్టాడు. ఈ క్రమంలో ఓ రోజు నంద్యాలలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న ఏటీఎం నుంచి తన ఏటీఎంతో రూ. 10 వేలు డ్రా చేశాడు. అయితే మిషన్ నుంచి డబ్బు వచ్చే లోగా ట్రాన్సాక్షన్‌ను వద్దనుకుని క్యాన్సెల్ బటన్ నొక్కాడు. అయినా ఆశ్చర్యంగా రూ. 10 వేలు బయటకు వచ్చాయి. వెంటనే చెక్ చేసుకోగా కార్తీక్ అకౌంట్లో మొత్తం డబ్బు అలాగే ఉంది. దీంతో ఏటీఎంలో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. ప్రతిసారీ డబ్బు డ్రా చేయడం, ఆ వెంటనే క్యాన్సిల్ బటన్ నొక్కడం చేస్తూ నగదు కొల్లగొట్టేవాడు. ఇలాగైతే పట్టుపడతానని భావించి వివిధ పేర్లతో, నకిలీ గుర్తింపు కార్డులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి 32 ఏటీఎం కార్డులను సంపాదించాడు. రూ. 13 లక్షలతో హుందాయ్ వెర్న కారును కొన్నాడు. నంద్యాల్లోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో నగదులో తేడా వస్తుండటంపై బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు. సీసీ కెమెరాలను పదేపదే పరిశీలించారు. ఎట్టకేలకు దొంగ ఎవరో తెలుసుకుని.. అతను ఎక్కువగా నగదు డ్రా చేసే ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును అలర్ట్ చేశారు. బుధవారం తెల్లవారు జామున కార్తీక్ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు చెప్పాడు. పసిగట్టిన కార్తీక్ కారులో ఉడాయించాడు. అతడి కారు అనంతపురం వైపు మళ్లడంతో అనంతపురం జిల్లా ఎస్పీకి సమాచారమిచ్చారు. పోలీసులు వెంటాడుతున్నారని గమనించిన కార్తీక్ గుంతకల్లు సమీపంలో కారాపి పొలాల్లోకి వెళ్లి దుస్తులు మార్చుకున్నాడు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్ వైపు పరుగుదీస్తుండగా గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో కార్తీక్‌ను పట్టుకున్నారు. 32 ఏటీఎం కార్డులు, రూ. 8వేలు, 4 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఓ మహిళ ఉన్నట్లు ఆనవాళ్లను బట్టి కనుక్కున్నారు. ఆమె పరారీలో ఉంది. -
అధికారుల గుండెల్లో రైళ్లు
- చుక్క నీరు నిలిచినా బాధ్యులను చేస్తామన్న సర్కార్ - అవసరమైతే జరిమానాలు విధిస్తామని హెచ్చరిక - దీంతో పూడికతీతలు, నీరు నిలిచే ప్రాంతాలపై దృష్టిసారించిన ఇంజనీర్లు - వానాకాలానికి సన్నద్ధమవుతున్న కార్పొరేషన్లు న్యూఢిల్లీ: వర్షాకాలానికి దాదాపు రెండు నెలల సమయమున్నా ఎల్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఈ వర్షాకాలంలో రోడ్లపై చుక్క నీరు నిలిచినా సంబంధిత అధికారులను, ఇంజనీర్లను బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పనుల విభాగం, సంబంధిత అధికారులు, ఇంజనీర్లను బాధ్యులను చేయడమే కాకుండా వారి నుంచి జరిమానాలు కూడా వసూలు చేయనుంది. గురువారం సమావేశమైన కీలక ప్రభుత్వ విభాగాలు వర్షాకాల ఏర్పాట్ల విషయమై చర్చించాయి. ఈ సమావేశంలో ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులతోపాటు వరదలు, నీటిపారుదల విభాగం అధికారులు, ప్రజాపనుల విభాగం అధికారులు పాల్గొని తమ తమ పరిధుల్లో వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై సమీక్షించారు. ఢిల్లీలో ప్రస్తుతం ప్రభుత్వమేదీ లేనందున అన్ని విభాగాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన జారీ చేసిన ఆదేశాల మేరకే ఆయా ప్రభుత్వ విభాగాలు గురువారం సమావేశమయ్యాయని, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోవడం పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో దానిపైనే ప్రధానంగా చర్చ జరిపారని తెలిసింది. ఈ సమస్యకు తాము బాధ్యులము కాదంటూ మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రజాపనుల విభాగం తప్పించుకునే ప్రయత్నం చేసేవి. దీంతో ఈసారి కూడా అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు దాదాపు రెండు నెలల ముందుగానే సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. ఇందులోభాగంగానే సమస్య తలెత్తితే సంబంధిత అధికారితోపాటు అక్కడి ఇంజనీర్‌ను బాధ్యలను చేసి, వారి నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్ణయించారు. ‘నగరంలో 153 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు కురిసినా నీరు నిలిచిపోతుంటుంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పరిష్కరించకపోతే ఒక్క వర్షాకాలంలోనేకాకుండా శాశ్వత సమస్యగా మారే అవకాశముంది. ఈ విషయంలో అధికారులను, ఇంజనీర్లను బాధ్యులను చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయి. పరిష్కారానికి అధికారుల వద్ద కూడా తగినంత సమయముంది. ఐటీఓ, వికాస్ మార్గ్, కశ్మీరీ గేట్, సరాయి కాలేఖాన్, ధౌలాకువా, మూల్‌చంద్ ఫేస్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నీరు నిలుస్తుంటుంది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ఆయా విభాగాల అధికారులు సమావేశమై, పరస్పర సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసుకొని, సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాల’ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. వానాకాలానికి సన్నద్ధమవుతున్న కార్పొరేషన్ వానాకాలం అనగానే... వేసవి ఎండల తాకిడికి వాడిపోయిన ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ ఢిల్లీ నగరం మాత్రం ఇందుకు మినహాయింపు. కారణం... వానలతో పాటు ఇక్కడి వాళ్లకు సమస్యలూ వరదల్లా రావడమే. అస్థవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ, మురికి, బురద, ఎక్కడ చూసినా నిలిచిన వరద నీరు... ఇలా వర్షాకాలం రాగానే ఢిల్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ఇందుకు ప్రధాన కారణం... నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ అతి పురాతనమైనది కావడం, అంతసమర్థవంతమైనది కాకపోవడం. దీంతో వర్షపు నీరు బయటకు పోలేక కాలనీల్లోనే నిలిచిపోతుంది. వర్షాకాలంలో నగరం నీటి ప్రపంచాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నీటిపారుదల, వరద నివారణ శాఖ, ఢిల్లీ మున్సిపల్ కర్పొరేషన్ సంయుక్తంగా నీరు నిలవకుండా ఉండేందుకు, వరద నీటిని అదుపు చేసేందుకు ప్రతి ఏటా ముందస్తు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఇందులో భాగంగా వర్షపు నీటి కాలువల శుద్ధి, మరమ్మతులు, నీటి పైపులను శుద్ధి, మరమ్మతులు, నగరంలోని 12 మున్సిపల్ జోన్లలో కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ఈశాన్య మున్సిల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి యోగేంద్రమన్ తెలిపారు. ‘ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యవేక్షణ ప్రారంభించాం. నిలిచిపోయిన నీటిని తోడి పారబోయడానికి కొత్త పంపులను కూడా ఏరాపటు చేశాం. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూమ్‌లను కూడా ఏర్పాటు చేశామని యోగేంద్ర చెప్పారు. అన్ని విభాగాలు కలిసి ఈ ఏడాది వానాకాలంలో వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, జూన్ 15కల్లా పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అయితే డ్రైనేజ్ కాలువల్లో ప్లాస్టిక్ బ్యాగులు పడేయకుండా ఉండాలని యోగేంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ఏరియా, బరఫ్ ఖానా చౌక్, ఐఎస్బీటీ కష్మీరీ గేట్, రైల్వేబ్రిడ్జ్, సబ్జీమండీ, షాద్రా, జేజే బులంద్ మసీదు, మానస సరోవర్ పార్క్, బాదర్పూర్ రోడ్, ఖిచ్రిపూర్, మండవలిలను అత్యంత దుర్భలమైన ప్రాంతాలుగా గుర్తించింది కార్పొరేషన్. చిన్నవర్షం పడినా చిత్తడిగా మారే ఈ ప్రాంతాలపై దృష్టి సారించింది. -
గోదావరి బ్రిడ్జిపై తప్పిన ఘోర ప్రమాదం