రైల్వే బ్రిడ్జి కింద శిశువు మృతదేహం | Infant dead body found under railway bridge | Sakshi
Sakshi News home page

రైల్వే బ్రిడ్జి కింద శిశువు మృతదేహం

Published Thu, Jun 30 2016 3:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

Infant dead body found under railway bridge

చాంద్రాయణగుట్ట : ఆరేడు నెలల వయసున్న ఓ శిశువు మృతదేహం లభ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం వెలుగుజూసింది. ఎస్‌ఐ షానవాజ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్యమేఘ ఆసుపత్రి సమీపంలోని కందికల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ పాప మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా.. దాదాపు ఆరేడు నెలల వయసున్న పాపగా గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందితే ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారి మెడపై చీమలు కరిచినట్లు ఉందని ఎస్‌ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement