
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత కట్టిన రైల్వే వంతెనలతో పోలిస్తే బ్రిటిష్ హయాంలో కట్టిన కొన్ని వంతెనలే పటిష్ట స్థితిలో ఉన్నాయని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) అభిప్రాయపడింది. ‘భారతీయ రైల్వేల్లో వంతెనల నిర్వహణ’ పేరిట రూపొందించిన నివేదికను కాంగ్రెస్ నేత ఖర్గే నేతృత్వంలోని పీఏసీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
రైల్వే వంతెనల నిర్మాణం నాసిరకంగా ఉండటానికి అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని నివేదికలో తెలిపింది. వంతెనల నిర్మాణంలో రైల్వే శాఖ అలసత్వం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందని వ్యాఖ్యానించింది. 3,979 రైల్వే వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వగా, 2015 నాటికి కేవలం 710 బ్రిడ్జీలే పూర్తికావడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment