Public Accounts Committee
-
సెబీ చైర్మన్‌ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్‌గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
పీఏసీలకు మరిన్ని అధికారాలివ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లకు మరిన్ని అధికారాలివ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలోని కార్యనిర్వాహక అధిపతులను, మొత్తం న్యాయ వ్యవస్థను మినహాయించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు సమన్లు జారీ చేసే అధికారాలను ఇవ్వాలని అన్నారు. కొన్ని ఆంశాలపై దర్యాప్తు కోసం కాగ్‌కి సూచించే అధికారం పీఏసీకి లేదని, మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం కాగ్‌కి అంశాలను సూచించడానికి అనుమతించాలని కోరారు. శనివారం పార్లమెంట్లో జరిగిన పార్లమెంటు, రాష్ట్రాల పీఏసీల అధ్యక్షుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘పీఏసీల సిఫార్సుల అమలు – సమయపాలన – ఖచ్చితమైన సమ్మతి కోసం మెకానిజం’ అనే అంశంపై మాట్లాడారు. కాగ్ నివేదికలోని అంశాల ప్రాధాన్యత తగ్గిపోకముందే, వాటిని పీఏసీలు పరిశీలించాలని సూచించారు. దీని ద్వారా పీఏసీలు మరింత శక్తివంతమవుతాయని తెలిపారు. కాగ్ నివేదికల్లో పరిశీలించాల్సిన అంశాలు, వ్యవధితో వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాలని చెప్పారు. 2010 కామన్వెల్త్ క్రీడల గేమ్స్ అవినీతిపై పీఏసీ నివేదిక 7 సంవత్సరాల తర్వాత ఇచ్చిందని, ఈ ఆలస్యం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందనే వాస్తవాన్ని అందరూ మరిచిపోయారని చెప్పారు. పబ్లిక్ అకౌంట్లలోని అస్థిరతలను సరైన సమయంలో గుర్తించి, మొగ్గలోనే తుంచివేయడం ఎంత కీలకమో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. విజయసాయిరెడ్డి చేసిన మరికొన్ని సూచనలు.. ► పీఏసీ సిఫార్సులను ప్రభుత్వాలు ఏ విధంగా ఆచరణలో పెట్టాయో అంచనా వేయడానికి మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రధానమైనది. పీఏసీ సిఫార్సులపై సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యల సమర్పణను రియల్ టైంలో ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే ఆడిట్ పారా మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ప్రభావవంతంగా పనిచేసేందుకు రెండు ప్రధాన సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. కాగ్ నివేదికలను పీఏసీ సత్వరమే చర్చించలేకపోవడం ఓ సమస్య. ► మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యల సమర్పణలో ఆలస్యం మరో సమస్య. ఈ చర్యల ప్రత్యుత్తరాలను సమర్పించేలా చూసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో సెక్రటరీ స్థాయి నోడల్ అధికారిని నియమించాలి. ► మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రత్యుత్తరాల కోసం ఒక ఫార్మాట్‌ను రూపొందించాలి. దీని ద్వారా మంత్రిత్వ శాఖలు జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేవు ► ఆడిట్ పారా మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ► పీఏసీ ఆఫ్ విక్టోరియా (ఆస్ట్రేలియా) అనుసరించే స్వీయ–అప్రైజల్ మోడల్‌ను అనుసరించాలి. దీనివల్ల రాబోయే సంవత్సరానికి లక్ష్యాలను, గత పనితీరును వివరించే వార్షిక ఎజెండాను నిర్ణయించవచ్చు ► పీఏసీ సభ్యులు ఆడిట్ నివేదికను అర్థం చేసుకోవడానికి కాగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై సాంకేతిక సలహాదారులుగా నియమించాలి. ► పీఏసీ సమావేశాలను యూఎస్ఏలో మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలి. -
డీఆర్ఐ వద్దన్నా.. 80:20 తెచ్చారు
న్యూఢిల్లీ: పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా 2013లో ప్రవేశపెట్టిన 80:20 బంగారం దిగుమతుల పథకాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వ్యతిరేకించినట్లు తెలిసింది. ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఉప కమిటీతో ఆర్థిక శాఖ అధికారులు ఈ వివరాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఆ పథకం ప్రారంభించడంలో అవలంబించిన పద్ధతులు, విధానాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని ఉప కమిటీ నిర్ణయించింది. రెవెన్యూ కార్యదర్శితో పాటు ఈడీ, సీబీడీటీ, సీబీఈసీ ఉన్నతాధికారులు ఉప కమిటీ ముందు హాజరై ఈ పథకం గురించి వివరణ ఇచ్చారు. 80:20 పథకంతో నల్లధనం తెల్లధనంగా మారడంతో పాటు, మనీ లాండరింగ్ పెరుగుతుందని అప్పట్లోనే డీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్వ ఏడాది దిగుమతుల నుంచి 20 శాతం బంగారాన్ని ఎగుమతి చేసిన తరువాతే మళ్లీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనే నిబంధనతో తెచ్చిన ఈ పథకాన్ని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నవంబర్‌లో రద్దు చేసింది. కార్తీకి నార్కో పరీక్షలు?: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరానికి నార్కో పరీక్ష చేయడానికి అనుమతి కోరుతూ సీబీఐ ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. మార్చి 9న ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పెషల్ జడ్జీ సునీల్ రానా చెప్పారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగించుకుని కార్తీ మళ్లీ అదే రోజు కోర్టుకు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ భాస్కరరామన్, సహ నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీలపై జారీ అయిన వారెంట్లు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లనూ కోర్టు విచారణకు చేపడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్తీ విచారణకు సహకరించడం లేదన్న నేపథ్యంలో నార్కో పరీక్షల కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
బ్రిటిషర్లు కట్టిన బ్రిడ్జీలే నయం..!
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత కట్టిన రైల్వే వంతెనలతో పోలిస్తే బ్రిటిష్ హయాంలో కట్టిన కొన్ని వంతెనలే పటిష్ట స్థితిలో ఉన్నాయని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) అభిప్రాయపడింది. ‘భారతీయ రైల్వేల్లో వంతెనల నిర్వహణ’ పేరిట రూపొందించిన నివేదికను కాంగ్రెస్ నేత ఖర్గే నేతృత్వంలోని పీఏసీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైల్వే వంతెనల నిర్మాణం నాసిరకంగా ఉండటానికి అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని నివేదికలో తెలిపింది. వంతెనల నిర్మాణంలో రైల్వే శాఖ అలసత్వం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందని వ్యాఖ్యానించింది. 3,979 రైల్వే వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వగా, 2015 నాటికి కేవలం 710 బ్రిడ్జీలే పూర్తికావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
27 ఏళ్లకు బోఫోర్స్‌పై పీఏసీ నివేదిక!
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు ఒప్పందాన్ని 27 ఏళ్లుగా పరిశీలిస్తున్న ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి చెందిన ఓ ఉప సంఘం.. ఎట్టకేలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సమయంలోనే తన నివేదికకు తుదిరూపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. బోఫోర్స్ ఒప్పందంపై కాగ్ 1989–90లో ఇచ్చిన నివేదిక అప్పటి నుంచి ఆరుగురు సభ్యుల పీఏసీ ఉప సంఘం వద్ద పెండింగ్‌లోనే ఉంది. కాగ్ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించాక, దానిని పరిశీలించడమే పీఏసీ ప్రధాన విధి. బీజేడీకి చెందిన భర్తృహరి మహతబ్ ఈ రక్షణ వ్యవహారాల ఉప సంఘానికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు. ఒప్పందం గురించి సమగ్ర వివరాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ అంశం 27 ఏళ్లు ఆలస్యమైందని ఉపసంఘంలోని ఓ సభ్యుడు తెలిపారు. తమ నివేదిక సమగ్రంగా, ఒప్పందం గురించి ఉన్న అపోహలను తొలగించేలా ఉంటుందన్నారు. ఉప సంఘం ఈ నివేదికను రూపొందించిన తర్వాత దాన్ని పీఏసీ ప్రధాన కమిటీకి పంపుతారు. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రధాన కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. -
మన్మోహన్‌కు పీఏసీ క్లీన్ చిట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) నివేదిక తేల్చి చెప్పింది. పీఏసీ చైర్మన్ కేవీ థామస్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మాజీ ప్రధాని మన్మోహన్ గాని, అప్పటి ప్రధాని కార్యాలయం గాని కామన్వెల్త్ గేమ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేదని 24 మంది సభ్యులు గల పీఏసీ నివేదిక రూపొందించింది. ఇందులో కాంగ్రెస్ వాళ్లు కేవలం నలుగురే. అధికార పార్టీ అయిన బీజేపీ సభ్యులే 12 మంది ఉన్నారు. ఈ నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించనున్నాం. అనంతరం నివేదిక పూర్తి పాఠం వెల్లడవుతుంది’ అని చెప్పారు. -
పీఏసీ చైర్మన్‌గా తప్పుకున్న భూమా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) చైర్మన్ పదవి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తప్పుకున్నారు. సోమవారం సమితి సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. ఆ సమావేశానికి భూమా అధ్యక్షత వహించారు. సభ్యులు ఆదిమూలం సురేష్, తోట త్రిమూర్తులు, పి. శమంతకమణి హాజరయ్యారు. గనులు, రోడ్లు, భవనాలు, నౌకాశ్రయాలు తదితర శాఖలపై సమీక్షించి నివేదిక రూపొందించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పీఏసీ తన నివేదికను సభకు సమర్పించాల్సి ఉంది. సమావేశంలో పాల్గొన్న భూమా మాట్లాడుతూ.. చైర్మన్‌గా తనకు ఇదే చివరి సమావేశమని చెప్పారు. ఆ వెంటనే సమావేశం నుంచి బైటకు వెళ్లిపోయారు. -
పీఏసీ సిఫారసులపై విధిగా చర్చ జరగాలి
చైర్మన్ల సదస్సులో భూమా నాగిరెడ్డి న్యూఢిల్లీ/కర్నూలు: ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చేసే సిఫారసులపై రాష్ట్రాల చట్టసభల్లో విధిగా చర్చ జరగాలని, ఆ చర్చలో శాసన సభ్యులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రెండురోజుల రాష్ట్రాల పీఏసీ చైర్మన్ల సదస్సులో ఆయన మాట్లాడారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై, కేంద్ర పీఏసీ చైర్మన్ కేవీ థామస్, రాష్ట్రాల పీఏసీ ఛైర్మన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. మంగళవారం తొలిరోజు ఈ సదస్సులో భూమా మాట్లాడుతూ పీఏసీకి అధికార పక్షాలు, అధికారులు సహకరించకపోవడం వల్ల మెరుగైన పనితీరు సాధ్యపడడం లేదని పేర్కొన్నారు. పీఏసీ సిఫారసులపై చట్టసభల్లో లోతుగా చర్చ జరగడం లేదని, విధిగా అందరు శాసనసభ్యులూ చర్చలో పాల్గొనేలా సంస్కరణలు తేవాలని పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి ఈ అంశంపై మాట్లాడినప్పుడు అన్ని రాష్ట్రాల చైర్మన్లు ఏకీభవించారు. కేవలం కాగ్ నివేదికల్లోని అంశాలకే పరిమితం కాకుండా కాగ్ నివేదికల్లో లేని అంశాలపై కూడా సుమోటాగా విచారణ జరిపే అధికారం ఉన్నందున దానిని వినియోగించుకోవాలని, అప్పుడే ప్రభుత్వ వ్యయంలో మరింత పారదర్శకత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. భూమా చేసిన సూచనలతో ఏకీభవించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయన్ను అభినందించారు. వివిధ రాష్ట్రాల చైర్మన్లు మాట్లాడినప్పుడు సైతం భూమా ప్రసంగాన్ని ఉటంకించారు. ఈ సదస్సులో వచ్చిన సూచనలు, చర్చలపై బుధవారం కొన్ని తీర్మానాలు చేయనున్నారు. -
పీఏసీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సభ్యులతో మూడు ఆర్థిక కమిటీలను నియమించారు. ప్రజా పద్దు ల సమితి (పీఏసీ) చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి నియమితులయ్యారు. అంచనాల కమిటీకి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి కాగిత వెంకట్రావు చైర్మన్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బులెటిన్ జారీ చేశారు.