ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) చైర్మన్ పదవి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తప్పుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) చైర్మన్ పదవి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తప్పుకున్నారు. సోమవారం సమితి సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. ఆ సమావేశానికి భూమా అధ్యక్షత వహించారు. సభ్యులు ఆదిమూలం సురేష్, తోట త్రిమూర్తులు, పి. శమంతకమణి హాజరయ్యారు.
గనులు, రోడ్లు, భవనాలు, నౌకాశ్రయాలు తదితర శాఖలపై సమీక్షించి నివేదిక రూపొందించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పీఏసీ తన నివేదికను సభకు సమర్పించాల్సి ఉంది. సమావేశంలో పాల్గొన్న భూమా మాట్లాడుతూ.. చైర్మన్‌గా తనకు ఇదే చివరి సమావేశమని చెప్పారు. ఆ వెంటనే సమావేశం నుంచి బైటకు వెళ్లిపోయారు.