మన్మోహన్‌కు పీఏసీ క్లీన్ చిట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) నివేదిక తేల్చి చెప్పింది.
పీఏసీ చైర్మన్ కేవీ థామస్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మాజీ ప్రధాని మన్మోహన్ గాని, అప్పటి ప్రధాని కార్యాలయం గాని కామన్వెల్త్ గేమ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేదని 24 మంది సభ్యులు గల పీఏసీ నివేదిక రూపొందించింది. ఇందులో కాంగ్రెస్ వాళ్లు కేవలం నలుగురే. అధికార పార్టీ అయిన బీజేపీ సభ్యులే 12 మంది ఉన్నారు. ఈ నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించనున్నాం. అనంతరం నివేదిక పూర్తి పాఠం వెల్లడవుతుంది’ అని చెప్పారు.