British rule
-
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊహకు అందని ఉక్కిరిబిక్కిరి
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘జరగని’ ఒక ఘటన ఆనాటి బ్రిటిష్ ఆధిపత్యంలోని భారత సామ్రాజ్యాన్ని వణికించింది. మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయభ్రాంతులు వ్యాపించాయి. సింగపూర్‌ను లొంగదీసుకున్న జపాన్‌కు తర్వాతి లక్ష్యం ఈ ప్రాంతమే అనుకోవ డమే దీనికి కారణం. దాంతో నగరంలోని 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో పారిపోయారు. మద్రాసు జూ లోని సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను కాల్చి చంపారు... బాంబులు పడితే అవి ఆ గందరగోళంలో జనాల మీద పడకుండా! ఆ యుద్ధానికి అవి మూల్యం చెల్లించాయి. ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే ఆనాటి ప్రభుత్వం అంతగా ప్రభావితం అయిందా? అవునని ఒప్పుకోక తప్పదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై ఏళ్లు అయినప్పటికీ, ఆ యుద్ధం గురించి మనకు తెలియనిది ఏముంటుందని చాలామంది అనుకుంటారు. అది తప్పు అని ముకుంద్ పద్మనాభన్ రుజువు చేశారు. అసలేనాడూ సంభవించకనే, నిజంగానే సంభవించిందన్నంతగా ఒక అసంబద్ధ మైన కలవరానికి గురిచేసిన ఒకానొక ఘటనపై తాజాగా ఆయన పుస్తకం రాశారు. దాని పేరు: ‘ద గ్రేట్ ఫ్లా్యప్ ఆఫ్ 1942: హౌ ద రాజ్ ప్యానిక్డ్ ఓవర్ ఎ జపనీస్ నాన్–ఇన్వేషన్’. 1942 ఫిబ్రవరిలో సింగపూర్ పతనానంతరం... అప్పటికింకా బ్రిటిష్ ఆధిపత్యంలోనే ఉన్న భారత సామ్రాజ్యానికి–మరీ ముఖ్యంగా మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయ భ్రాంతులు వ్యాపించాయి. మలయా ద్వీపకల్పానికి మద్రాసు దగ్గరగా ఉండటమన్నది... సింగపూర్ తర్వాత జపాన్ తదుపరి దాడి ఇక మద్రాసు మీదనేనన్న సూచనప్రాయతకు తావిచ్చింది. అసలక్కడేమీ లేకుండానే, ఊరికే ఊహించుకుని భయపడ్డామని ప్రత్యేకించి మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆ భయాందోళన స్థాయి మరింతదైన గొప్ప దిగ్భ్రమను కలిగిస్తుంది. సింగపూర్ పతనం అయ్యే సమయానికి మద్రాసులోని మూడింట ఒక వంతు జనాభా ప్రాణ భయంతో తట్టాబుట్టా వదిలి పారిపోయింది. ఆరు వారాల తర్వాత నగర జనాభా కేవలం 25 శాతమే మిగిలి ఉందని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ రాసింది. పాల్ జయరాజన్ అనే ఐసీఎస్ అధికారి అంచనా ప్రకారమైతే మద్రాస్ జనాభా 13 శాతానికి తగ్గిపోయింది. దానర్థం 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో నగరాన్ని వదిలి వెళ్లారని! ‘ఈ లెక్క నమ్మశక్యమైనదిగా కనిపించకున్నా, నమ్మశక్యం కానిది గానూ అనిపించడం లేదు’ అని ముకుంద్ పద్మనాభన్ వ్యాఖ్యానించారు. పుస్తకంలో ఆహ్లాదం కలిగించే కథలు చెప్పుకోదగినన్ని ఉన్నప్ప టికీ, వాటిల్లో ఒక్కటి కూడా మద్రాసులో జరిగిన దానిని మించి అద్భు తమైనదేమీ కాదు. ‘‘సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను వెతికి మరీ కాల్చి చంపారు. జపాన్ విసిరే బాంబులు కనుక జంతు ప్రదర్శన శాలలను, వాటì కదలికలను నియంత్రించి ఉంచిన ఆవరణలను (ఎన్క్లోజర్లు) ధ్వంసం చేసినప్పుడు, వాటి నుంచి క్రూర జంతువులు స్వేచ్ఛగా బయటికి ఉరికి, మనుషుల మీద పడకుండా నివారించటానికి ముందస్తుగానే వాటిని చంపేయాలన్న ఆదేశాలు అమలు అయ్యాయి.’’ చూస్తుంటే ఆనాటి జరగని ఘటనకు అత్యధిక మూల్యం చెల్లించుకున్నది జంతువులే అనిపిస్తోంది. నిజంగా ఇటువంటిదే లండన్‌లో జరిగింది. ‘‘1939 సెప్టెంబర్ ఆరంభంలో, యుద్ధం మొదలైన మొదటి వారం... విస్తుగొల్పేటంతటి స్థాయిలో 4 లక్షల నుంచి 7 లక్షల 50 వేల దాకా పిల్లులు, శునకాలను చంపేశారని అంచనా.’’ అంటే, బ్రిటిష్ ప్రజలు తమ పెంపుడు జీవు లను త్యాగం చేయటానికి కూడా సంకోచించనంతగా ప్రేమిస్తారు! మద్రాసు గవర్నరు పారిపోయి ఉండకపోవచ్చు. కానీ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు చేసింది కచ్చితంగా పారిపోవటమే! సర్ సిడ్నీ వాడ్స్‌వర్త్ ‘‘రెండు కార్లలో తన సతీమణి, డ్రైవరు, బట్లరు, కుక్, మూడు పెంపుడు శునకాలతో అనంతపురం బయలుదేరారు. తమ వాహనాల పైభాగాన పరుపులను కట్టి, వాటిల్లో పింగాణీపాత్రలు, గిన్నెలు, బట్టలు, న్యాయశాస్త్ర గ్రంథాలు, వెండి దీపాల వంటి అవస రమైన, విలువైన సామగ్రిని కుక్కేశారు’’. తిరిగి రెండు వారాల తర్వాత ఆయన వెనక్కు వచ్చారు. ఒక మంచి ఉల్లాసభరితమైన సెలవు సమయాన్ని గడిపాక! ఐ.సి.ఎస్. అధికారులు మద్రాసును విడిచిపెట్టి పోలేదు. బదు లుగా వారు జపాన్ సేనలకు చుక్కయినా దక్కకుండా ఉండేందుకు ‘గొప్ప’ మార్గాలనే కనిపెట్టారు. చెట్టినాడు రాజా సాహచర్యంలో పాల్ జయరాజన్ మద్రాస్ క్లబ్బుల్లో పీకల దాకా మద్యం సేవించారు. తర్వాత, వారంతా కలిసి ‘‘మిగిలిన మద్యాన్నంతా కాలువలో పారబోశారు’’. ఇక జపాన్ బాంబు దాడుల గురించి చింతించాల్సినంత భయం లేని ఢిల్లీలో కవి డబ్లు్య.హెచ్. ఆడెన్ సోదరుడైన జాన్ బిక్నెల్ ఆడెన్ సౌత్ బ్లాక్‌ను రక్షించటానికి ఒక హాస్యాస్పదమైన తలతిక్క పథకాన్ని రూపొందించారు. సౌత్‌బ్లాక్ భవంతిని కనిపించనీయ కుండా చేయటం కోసం దట్టమైన పొగ మేఘాలను సృష్టించే ఒక పరికరాన్ని తయారు చేశారు. అయితే అది కేవలం కాలుష్యాన్ని వెదజల్లడానికి మాత్రమే పనికొచ్చింది. యునైటెడ్ ప్రావిన్సు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్)లో ఒక వదంతి అనియంత్రిత ఆందోళన గాడ్పులను వ్యాపింపజేసింది. ‘‘ఒక జపాన్ మనిషి ఆకాశం నుంచి భూమిపైన జరుగుతున్న ఒక వేడుకలోని జనసమూహం మధ్యకు దిగి, వారిని ఉద్దేశించి ప్రసంగించి, తిరిగి అలాగే ఆకాశంలోకి వెళ్లిపోయాడు అనే కథ అది.’’ కళ్లారా చూసినంతగా ఆ వదంతిని అంతా నమ్మేశారు. చివరికొచ్చేసరికి పద్మనాభన్ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. కానీ దురదృష్టవశాత్తూ వాటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు. ‘‘కేవలం ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే భారతదేశం అంతగా ప్రభావితం అయిందా? పాలన యంత్రాంగం ఆ స్థాయిలో అప్రమత్తం అవాల్సి ఉండిందా? దేశవ్యాప్తంగా అంతగా కీకర బీకరలు అవసరమా?’’ సహజంగానే విమర్శలు వచ్చాయి. ‘‘టిబెట్‌లోకి ఉపసంహరించుకోవడానికి గానీ భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందా? లేక, చివరికి మనం పామిర్ పర్వతాలను అధిరోహించి, ప్రపంచ పైకప్పును గానీ చేరుకోబోతున్నామా? ఇంకా ఎక్కడైనా ధైర్య సాహ సాలు మిగిలి ఉన్నాయా?’’ అని ‘ద స్టేట్స్‌మన్’ పత్రిక గొప్ప గద్దింపుతో ఉరిమింది. కానీ ఎవరూ ఆ ఉరుమును విన్నట్లు లేరు. సరే, ఇంత జరిగినా ‘ద గ్రేట్ ఫ్లా్యప్...’ రావలసినంతగా ఎందుకు గమనింపునకు రాలేదు? ఎందుకంటే, ‘‘ఇండియా వైపు నుంచి ఒక్క అధికారిక ప్రకటన, ఒక్క పరిగణన కూడా లేకపోవడం వల్ల!’’ మద్రా సును వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిన తన తాత గారి నుంచి, తన తల్లి నుంచి పద్మనాభన్ ఆనాటి విషయాలను తెలుసుకున్నారు. వారు చెప్పిన కథల్ని ఈయన మరింతగా తవ్వి పోశారు. తత్ఫలితంగా నాటి భయాలు ఎంత విస్తృతంగా, ఎంత అతిశయోక్తితో ఉండేవో, తరచు వాటి ప్రతిస్పందన ఎంత నవ్వు పుట్టించేలా ఉండేదో ఆయన కనుగొన్నారు. ఇది కనుక మీకు డాడ్స్ ఆర్మీ (ప్రహసనం)ని గుర్తు చేసినట్లయితే, అలా గుర్తుకు రావటం తప్పేమీ కాకపోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తు!
బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం మంది విద్యావంతులేనని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. 70 శాతం మంది విద్యావంతు లని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు చదువుకునేవారనే అర్థం వస్తోంది. భారతదేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గత తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు. ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భాగవత్ కొంతకాలంగా అసాధారణ ప్రకటనలు చేస్తు న్నారు. దేవుడు కులాన్ని సృష్టించలేదనీ, పండిట్లు (పూజారులు) కులాన్ని సృష్టించారనీ అన్నారు. శాస్త్రాలు మౌఖికంగా బదిలీ అయి నంతకాలం బాగుండేవనీ, వాటిని ఎప్పుడైతే రాయడం జరిగిందో తప్పుడు విషయాలు పొందుపరుస్తూ వచ్చారని కూడా అన్నారు. ఈ రెండు ప్రకటనలు కాస్త సంస్కరణ తత్వంతో ఉన్నాయి. ‘2023 మార్చి 5న మోహన్ భాగవత్ బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం విద్యావంతులేనని పేర్కొన్నారు. అప్పట్లో దేశంలో నిరుద్యోగమనేది లేదని కూడా చెప్పారు’. ఆయన ఈ ప్రకటనకు మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. సావిత్రీబాయి ఫూలే జయంతి నేపథ్యంలో 2023 మార్చి 7న ‘పుణేకర్ న్యూస్’లో కేమిల్ పార్ఖే 1824లో బాంబేలో మొట్టమొదటి బాలికా పాఠశాలను ప్రారంభించిన అమెరికన్ మిషనరీ మహిళ సింథియా ఫరార్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం రాశారు. పుణేలో బాలికల పాఠశాలను ప్రారంభించడానికి మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ఫరార్ ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలలోనే సావిత్రీ బాయి, ఫాతిమా బాలికలకు పాఠాలు చెప్పేవారు. జాతీయవాద దృష్టితో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీ బాయిని దేశం పరిగణిస్తోంది. నిజానికి సింథియా ఫరార్‌ను మొదటి మహిళా టీచర్‌గా భావించాలి. సింథియా పెళ్లి చేసుకోలేదు. భారత దేశంలో బాలికా విద్య కోసం తన జీవితాంతం కృషి చేశారు. అహ్మద్‌నగర్‌లో 1862లో మరణించారు. ‘‘ముంబై, అహ్మద్ నగర్లలో అనేక బాలికా పాఠశాలలు, బాలికల బోర్డింగ్ స్కూల్స్‌ను ప్రారంభించిన ఘనత సింథియా ఫరార్దే’’ అంటారు పార్ఖే. చరిత్రలో ఏ కాలంలోనైనా భారత్‌లో హిందూ బ్రాహ్మణ మిషనరీలు అలాంటి బాలికా పాఠశాలలను ప్రారంభించడం జరిగిందా? 70 శాతం మంది భారతీయులంటే, అందులో శూద్రులు, గ్రామాల, పట్టణాల చివర నివసిస్తున్న దళితులకు విద్యాహక్కు ఉండాలి. బ్రిటిష్ పూర్వ భారతదేశం అంటే మొఘలాయి పాలన గురించి ఆయన మాట్లాడుతున్నారని అర్థం. ముస్లిం పాలనాకాలంలో 70 శాతం మంది భారతీయులు చదువుకున్నవారేనన్న అర్థాన్ని ఇస్తోంది మోహన్ భాగవత్ ప్రకటన. అదే నిజమైతే, ముస్లింల పాలన ఎందుకు చెడ్డది? మొఘలుల పాలనాకాలంలో భారత్‌లో 70 శాతం మంది ముస్లింలు లేరు. ముస్లిం పాలకులు శూద్రులను, దళితులను విద్యావంతుల్ని చేశాక కూడా వాళ్లు ఇటీవలి కాలం వరకూ నిరక్ష రాస్యులుగానే ఎందుకు ఉండిపోయినట్లు? మోహన్ భాగవత్ ప్రకటన సాధారణంగా ఆరెస్సెస్ వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. కులం, మహిళల అసమానత్వం అనేవి సంస్కృత శాస్త్రాల్లోకి తదనంతర రచయితలు ప్రవేశపెట్టారని ఆరెస్సెస్ చెబు తున్నట్టయితే– ఆరెస్సెస్/బీజేపీ ప్రభుత్వం ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చి శాస్త్రాల్లో కులం, మహిళల అసమానత్వం గురించిన ప్రస్తా వనలను తొలగించవచ్చు. శాస్త్రాలు, పురాణాల్లో దేవతలకు కూడా కులం అంటగట్టేశారు. ఉదాహరణకు రాముడిని క్షత్రియుడిగా, కృష్ణు డిని యాదవుడిగా పేర్కొంటారు. శూద్ర, చండాల వంటి కుల బృందాలను అత్యంత హీనంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. అదే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య సామాజిక వర్గాలను అత్యంత గౌరవనీయమైన రీతిలో పేర్కొన్నారు. పైగా శూద్రులు, చండాలురు వీరిని సేవించాల న్నారు. శాస్త్రాల్లో అలాంటి భాషను మార్చడాన్ని ఎవరూ ఆపరు. హిందువులుగా తమను పరిగణించుకునే అన్ని వృత్తి బృందాలకు అర్చక విద్య పొందే హక్కును కల్పించాలి. ‘దేవుడు కులాన్ని సృష్టించలేదు’ అని ఆరెస్సెస్ అధినేతగా భాగవత్ చెబుతున్నందున ఇది అవసరమైన చర్యే. ఆధ్యాత్మిక విద్యలో సమాన అవకాశాలపైన ఆధ్యా త్మిక సమానత్వం ఆధారపడి ఉంటుంది. హిందూ పిల్లలందరికీ హిందూ ఆధ్యాత్మిక విద్యను ఆరెస్సెస్, బీజేపీ కూటమి ప్రారంభించవచ్చు. ఇటీవలి కాలం వరకూ హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే హక్కు శూద్రులకు, దళితులకు ఉండేది కాదని తెలిసిన విష యమే. ఈ పుస్తకాల్లోనే వీరి జీవితాన్ని పశువులతో సమానంగా చిత్రించారు. ‘రామచరిత్ మానస్’లో అలాంటి భాష గురించి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. ఆరెస్సెస్, బీజేపీ పాలిస్తున్నప్పుడు అన్ని రంగాల్లో సమానమైన వాతావరణంలో విద్యా హక్కుకు హామీ ఉండేలా చూడాలి. భారతీయ వృత్తిజీవులందరి హుందాతనాన్ని నిలబెట్టేలా పాఠ్యప్రణాళిక ఉండాలి. ఏ కాలంలో, ఏ సమాజమైనా వ్యవసాయం, పశుపోషణ, చేతి వృత్తులు లేకుండా మనుగడ సాగించలేదు. కానీ రుగ్వేదం నుంచి రామాయణ, మహాభారతాల వరకు ఈ వృత్తులను దైవికం కానివిగా చూశాయి. అందువల్ల అవి శూద్ర లేదా చండాలమైనవి. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఆధునిక యువత ఇలాంటి భాషను ఆమోదించలేదు. కాబట్టి మార్పు అవసరం. బ్రిటిష్ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది విద్యావంతులని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు, మహిళలు చక్కగా చదువుకునే వారనే అర్థం వస్తోంది. దీనికి రుజువు ఉందా? ప్రాచీన, మధ్య యుగాల్లో అంటే బ్రిటిష్ వారు అడుగుపెట్టేంతవరకూ విద్యావిధానం నుంచి శూద్రులు, దళితులు, మహిళలను దూరం పెట్టాలని శాస్త్రాలే స్వయంగా చెబుతున్నప్పుడు బ్రిటిష్ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది భారతీ యులు చదువుకున్నారని మోహన్ భాగవత్ అనడంలో అర్థం ఉందా? భారతదేశంలో అన్ని కులాలు, సామాజిక బృందాల పిల్లలకు సూత్రరీత్యా విద్యను అందించేందుకు ఆమోదించిన మొట్టమొదటి పాఠశాలను విలియం కేరీ అనే బ్రిటిష్ మిషనరీ 1817లో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో ప్రారంభించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మొట్టమొదటి బాలికల పాఠశా లను 1824లో బాంబేలో అమెరికన్ మరాఠీ మిషన్ ప్రారంభించింది. ఆ మిషన్ తరఫున భారత్ వచ్చిన సింథియా ఫరార్ అన్ని కులాల మహిళలకు, పిల్లలకు బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ముస్లిం పాలనా కాలంలో కానీ, అంతకుముందు కానీ భారత దేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? అలాంటి విద్యాసంస్థలు లేకుండా దేశంలోని 70 శాతం మంది పిల్లలకు ఎవరు విద్య నేర్పారు? ఏ రాజరిక ప్రభుత్వమూ పాఠశాలలను నడపలేదు. బ్రాహ్మణులు (ప్రధానంగా బ్రాహ్మణులు, క్షత్రియ విద్యావంతులు) ఆ పని చేసి ఉండాల్సింది. కానీ దానికి శాస్త్రాలు వారిని అనుమతించలేదు. మొఘలుల కాలంలో కూడా పర్షియా భాషలో అన్ని కులాల కోసం పాఠశాలలను ఏర్పర్చలేదు. సార్వత్రిక విద్యకు వ్యతిరేకులైన బ్రాహ్మణ పండితుల సూచన ప్రకారమే అక్బర్‌తో సహా మొఘల్ పాలకులు నడుచుకున్నారు. మొఘలుల పాలనాకాలంలో విషాదకర మైన విషయం ఏమిటంటే – ఇస్లాంలోకి మతం మార్చుకున్న కింది కులాల వారికి ఉన్నత కులాల ముల్లాలు, పఠాన్లు లేదా మొఘల్ జాతి వారు విద్య నేర్పలేదు. నేడు దళిత అక్షరాస్యత కంటే కిందికులాలకు చెందిన ముస్లింల నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. 70 శాతం అక్షరాస్యత గణాంకాలకు ఆరెస్సెస్ అధినేతకు ఆధారం ఏమిటి? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గతంలోని తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటు పైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Amarnath Vasireddy: దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి సాయపడింది వారే! ఇక..
ఏ రాజ్యంలో , ఏ దేశంలో రాజులు ప్రజలకు మేలుచేసిండ్రు ... ? ఒక ప్రఖ్యాతి పొందిన పాట ! నిజమే ! ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం ? నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం ... శ్రీ శ్రీ .. రాజులకు , బ్రిటిష్ వలస పాలనకు ఒక మౌలిక తేడా ఉంది. ఒక రాజు ఎంత క్రూరుడైనా, అధిక పన్నులు వేసి ప్రజల రక్తాన్ని జుర్రినా , ఆ డబ్బు తన విలాసాలకు తగలెట్టినా ఆ డబ్బు ఇక్కడే వుండేది. ఆ రాజు గారి విలాసాల వల్ల కనీసం కొంతమందికి ఉపాధి వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే సర్కులేట్ అయ్యేది. బ్రిటిష్ పాలనలో మన సంపద వారి దేశానికి తరలి వెళ్ళిపోయింది. మహానుభావుడు గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆన్ ఇండియా గా పేరొందిన దాదాభాయ్ నౌరోజి తన "పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" అనే గ్రంధం లో "డ్రైన్ అఫ్ వెల్త్ "అంటే సంపద జుర్రుడు లేదా సంపద వలస సిద్ధాంతం లో దీన్ని వివరించాడు . అందరు స్వతంత్ర సమర యోధులకు ఈ గ్రంధం మార్గదర్శి అయ్యింది. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వారు తమ దేశానికి తరలించిన సంపద విలువ సుమారుగా రెండు వేల అయిదువందల లక్షల కోట్లు (ఇరవై అయిదు ట్రిలియన్ పౌండ్లు) బ్రిటిష్ వారి కారణంగా కృత్రిమ అంటే మానవ ప్రేరేపిత కరువులు వచ్చాయి. బ్రిటిష్ పాలనకు ముందు ఆకలితో కరువుతో పెద్దగా చనిపోయిన దాఖలాలు లేవు. బ్రిటిష్ వారి కాలం లో కరువుతో ఆకలితో చనిపోయిన వారు సంఖ్య మూడు కోట్లు. పెద్దామె చనిపోతే అయ్యో పాపం అనడం తప్పుకాదు. ఇంగ్లాండ్ వెళ్లి ఉద్యోగం చెయ్యడం తప్పుకాదు. బతుకు తెరువు కోసం, మెరుగైన జీవనం కోసం వలసలు సహజం. అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు కక్ష తీర్చుకోండి అని చెప్పడం లేదు. చరిత్రనే మరచి లేదా పిల్లి మొగ్గల పుస్తకాలూ చదివి బ్రిటిష్ వారివల్లే మనం డెవలప్ అయ్యాము. మనకు ఉపాధి వచ్చినది అంటే.. మీ అవగాహన, మీ ఇష్టం . తెలియక పొతే అడగండి. ఎన్ని గంటలైనా చెబుతాను. కానీ నాకు తెలిసిందే సర్వం అని మన సమర యోధుల త్యాగఫలాలను అవహేళన చేసేలా మాట్లాడం అన్యాయం. ఇలాంటి బ్యాచ్ బ్రిటిష్ కాలంలో కూడా ఉండేది. దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి వారే సాయపడింది. అది కాకుండా ఇంకో బ్యాచ్ ఉండేది.. మనదైతే కంపు కొడుతుంది. తెల్లటి బ్రిటిష్ దొరల మలం సువాసనలు వెదజల్లుతుంది అని నమ్మే వారు. ఇది జోక్ కాదు. నిజం. ఇలాంటి కంపు బ్యాచ్‌తో మాట్లాడే ఓపికే నాకు లేదు. - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు చదవండి: Amarnath Vasireddy: కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ -
రాణి ఎలిజబెత్–2కు భారత్ అంటే అభిమానం
లండన్: భారత్ అంటే రాణి ఎలిజబెత్–2కు ప్రత్యేకాభిమానం. బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తు్తరాలైన తొలి పాలకురాలు ఆమే. 1952లో రాణిగా బాధ్యతలు స్వీకరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు అమితాసక్తి చూపేవారు. 1961, 1983, 1997ల్లో మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. ‘జలియన్‌వాలాబాగ్’పై విచారం.. 1961లో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తొలిసారిగా ఇండియా వచ్చారు. నాటి బాంబే, మద్రాస్, కలకత్తాలను సందర్శించారు. తాజ్మహల్నూ తిలకించారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాదరక్షలు విప్పి గౌరవం చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ భవనాన్ని ప్రారంభించారు. కామన్వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు 1983లో ఎలిజబెత్ రెండోసారి భారత్ వచ్చారు. మదర్ థెరిసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేశారు. ఇక భారత 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1997లో భర్తతో కలిసి మూడోసారి భారత్ వచ్చారు. వలస పాలన నాటి చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ జలియన్‌వాలా బాగ్ ఉదంతం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ముగ్గురు భారత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ప్రతిభా పాటిల్‌కు ఇంగ్లండ్‌లో రాణి ఆతిథ్యమిచ్చారు. 1983లో భారత్ పర్యటన సందర్భంగా ఇందిరాగాంధీతో... -
భరతమాత తొలి వెలుగులకు దూరమైన తెలంగాణ
1600 సంవత్సరంలో భారత గడ్డపై వ్యాపార నిమిత్తం కాలు మోపి, ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, భారతీయుల, పాలకుల అమాయకత్వాన్ని తమకు అనువుగా మలచుకొంటూ సాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ జైత్రయాత్ర ప్లాసీ యుద్ధం అనంతరం మరింతగా విస్తరించి, బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. భారతదేశ స్వయం సిద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిని కాపాడుకుంటూ సాగే జీవన విధానం, విద్యా వ్యవస్థ మరియు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే ధార్మిక మూలాలు, వాటి విశిష్టతని అర్థం చేసుకున్న కంపెనీ పాలకులు, వారి వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉంటుందన్న భావనతో దేశం మొత్తాన్ని ముందుగా తమ చేతుల్లోకి తీసుకుంది. అనంతరం భారతీయ మూలాల్ని పెకిలించే కంపెనీ ప్రక్రియ యథేఛ్చగా సాగడం వల్ల దేశ ప్రజల్లో రాజుకున్న స్వతంత్ర కాంక్ష 1857 లో సిపాయి రెబెల్లియన్గా ,తొలి స్వాతంత్య్ర పోరాటంగా మారడం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, అఖండ భారత పాలన కేవలం కంపెనీతో సాధ్య పడదని తెలుసుకుని నేరుగా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. భారతీయులకి ఈ స్థితి నేరుగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది. మెల్లిమెల్లిగా రాజుకుంటున్న స్వాతంత్ర కాంక్షని ముందుగానే అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1861, 1892, 1909, 1919 లలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ రూపంలో దేశ ప్రజలకి ఎంగిలి మెతుకుల్ని విదిల్చినట్టు అధికారంలో, పాలనలో తమకు అడ్డు రాకుండా కొద్దిపాటి భాగ స్వామ్యాన్ని కల్పించింది. అరకొరగా ఇచ్చిన పాలనా భాగస్వామ్యం ప్రజల్లో పెరుగుతున్న స్వాతంత్య్ర భావనని తగ్గించక పోగా మరింత తీవ్రరూపం దాల్చడంతో ఇండియన్ యాక్ట్ 1935 రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి పూర్తి పాలన స్వేఛ్చని ఇచ్చినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే తమ సోదరులు, మిగిలిన భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని చాటుతూ ముందుకు సాగుతుంటే, తెలంగాణ, మరట్వాడ మరియు కల్యాణ కర్ణాటక (ఉత్తర కర్ణాటక ) ప్రాంత వాసులు మాత్రం, 1724 లో మొగలు రాజుల నుండి సొంత జెండా ఎగరవేసిన అసిఫ్ జాహి నిజాం పాలకుల కబంధ హస్తాల్లోకి వెళ్లి, విద్యకి ,వైద్యానికి, చివరికి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, మత స్వేచ్ఛని కోల్పోయి మానవ సమాజంపై జరిగే దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో మునిగి పోయారు.15 ఆగష్టు, 1947, దేశం పూర్తి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకునే సమయంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం రజాకార్ల రూపంలో ఉన్న మానవ మృగాల పైశాచిక దాడిని ఎదుర్కొంటూ, తమను తాము రక్షించేకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. విలాసాలు , వినోదాలతో సాగిన నిజాం పాలన ప్రజల కనీస హక్కులు కాలరాస్తూ సాగి, చివరకి అప్పు కట్టలేక తన రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ, కంపెనీకి , బ్రిటిష్ పాలకులకు అప్పగించే స్థితి దాపురించింది . 1768లో మచిలీపట్టణం సంధి ద్వారా కోస్తా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన నిజాం, 1903 లో బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పాడు. ఇదే క్రమంలో సీడెడ్ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. జులై 4 1946 వరంగల్ జిల్లాలోని కడవేని గ్రామంలో దొడ్డ కొమరయ్య అనే రైతు హత్య ఘటన, నిజాం అనుచరులైన దొరలపై రైతుల తిరుగుబాటుకి దారి తీసింది. రజాకార్ల పైన ఆత్మ రక్షణ యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై, కుల సంఘాలు, వామపక్షాలు, రైతులు, విద్యావంతులు గెరిల్లా యుద్దాన్ని చేబట్టారు. గోండు జాతిని రక్షించే బాధ్యత, 1900-1949 సమయంలో కొమరం భీంపై పడి, జమిందార్ లక్ష్మణ్ రావు దాష్టికాలపై, నిజాంపై 1900-1949 మధ్య కాలంలో సాగిన అస్తిత్వ పోరాటం..‘జల్, జంగిల్ జమీన్’ నినాదంతో సాగి 1940 లో భీం ప్రాణాలని హరించింది. విసునూరు రామ చంద్రా రెడ్డి విశృంఖల దౌర్జన్యానికి, నిజాం దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సాగిన చాకలి ఐలమ్మ పోరాటం మనకి సదా ప్రాతఃస్మరణీయం. ఈ హైదరాబాద్ సంస్థాన వాసుల దయానీయ స్థితిని గమనించిన భారత ప్రభుత్వం, మన ప్రథమ హోం శాఖామాత్యులు, స్వర్గీయ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సాగించిన పోలీస్ ఆక్షన్ 13 సెప్టెంబర్ 1948 లో మొదలై 17 సెప్టెంబర్ 1948న నైజాం దాస్య శృంకలాల నుంచి స్వేఛ్చ వాయువుల్ని పీల్చుకునే వరకు సాగింది. దేశం ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, ఆ మధురమైన అమృత ఘడియలు, ఆ అద్భుత మైన అనుభూతికి దూరంగా, హైదరాబాద్ సంస్థాన వాసులు మాత్రం తీర్చలేని వెలితితో భరతమాత తొలి వెలుగులకు దూరంగా ఉండిపోయింది. దొర్లి పోయిన కాలంలో గాయపడ్డ తెలంగాణ మరకలు అలాగే మిగిలి పోయాయి. -వేముల శ్రీకర్, ఐఆర్ఎస్, కమిషనర్, ఇన్‌కంటాక్స్ -
ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?
భారత స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం. బ్రిటిష్ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు? వలస వాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు దాదాపు నూట యాభై ఏళ్ళు సాగించిన మహోజ్జ్వల పోరాటాల ధారలో ఒక మజిలీ 1947 ఆగస్ట్ 15. ఆ విస్తృత పోరాట సంప్రదాయం ఏ ఒక్క పార్టీదో, ఏ ఒక్క ప్రజా సమూహానిదో, ఏ ఒక్క నినాదానిదో, ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క ఆశయానిదో కాదు. అది ఈ దేశ ప్రజలందరూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కావాలనే విశాల ఆశయానిది! పద్ధెనిమిదో శతాబ్ది చివరి నుంచే ఆదివాసులు ప్రారంభించిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలూ; రైతుబిడ్డలైన సైనికులూ, రైతాంగమూ, సంస్థానాధీశులూ, రెండు ప్రధాన మతాలకూ చెందిన ప్రజలందరూ ఐక్యంగా పాల్గొన్న ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటమూ; ఆ తర్వాత ముప్ఫై సంవత్సరాలకు ప్రారంభమైన మధ్యతరగతి జాతీయోద్యమమూ, ఇరవయ్యో శతాబ్ది తొలి అర్ధభాగంలో సాగిన ఎన్నో విప్లవోద్యమాలూ, భిన్నమైన రాజ కీయ ఉద్యమాలూ, ఆ ఉద్యమాలలో పాల్గొన్న అన్ని ప్రజాసమూ హాలూ, అన్ని ప్రాంతాలూ... జాతీయోద్యమంలో భాగమే. ► అది ప్రధా నంగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. చాలాచోట్ల అది స్థానిక భూస్వామ్య దోపిడీ, పీడనలను కూడా వ్యతిరేకించిన ఉద్యమం. భారత సమాజం అనుభవిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం అది. ► బ్రిటిష్ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఈ ఏడున్నర దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధి గణాంకాలు చూపి, ‘‘స్వతంత్ర భారత ప్రగతి’’ గురించి చెప్పడానికి అవకాశం ఉంది. భారత ఉపఖండంలోని ఇరుగు పొరుగు దేశాలలో ప్రజా స్వామ్యం అనుభవించిన అవాంతరాలను చూపి, భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదనే అవకాశమూ ఉంది. వలసానంతర భారత సమాజ గమనాన్ని అర్థం చేసుకోవ డానికీ, విశ్లేషించడానికీ ఎన్నో సూచికలూ ప్రాతిపదికలూ ఉన్నప్పటికీ, ప్రగతి, ప్రజాస్వామ్యం అనే రెండు సూచికలే కీలకమైనవి. ► బ్రిటిష్ వలస పాలన తొలగిపోవాలని భారత ప్రజలు కోరు కోవడానికీ, ఉద్యమించడానికీ మూల కారణం వలసవాదం భారత సంపదలను దోచుకుపోతున్నదనే అవగాహన. విస్పష్టమైన గణాం కాల ఆధారంగా దాదాభాయి నౌరోజీ 19వ శతాబ్ది చివరి రోజుల్లో ప్రతిపాదించిన ‘వనరుల తరలింపు’ సిద్ధాంతాన్ని దాదాపుగా జాతీయోద్యమంలోని అన్ని పాయలూ అంగీకరించాయి. భారత సమాజ వనరులతో స్థానికంగా సంపద పోగుపడడానికీ, తద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధి జరగడానికీ వలస పాలన అవకాశం ఇవ్వడం లేదని జాతీయోద్యమ నాయకులందరూ భావించారు. వలస పాలన భారత సమాజ అభివృద్ధిని అడ్డుకుంటున్నదనీ, అందువల్ల దాన్ని తొలగించి స్వరాజ్యం సాధించినప్పుడే స్వతంత్ర, భారత ప్రజా ప్రభుత్వం భారత వనరులను స్థానికాభివృద్ధికి వినియోగించగలుగు తుందనీ జాతీయోద్యమం భావించింది. ► 75 ఏళ్ళ క్రితం వలస పాలకులు వెళ్లిపోయారు. భారత ప్రజల మైన మనం మన స్వతంత్ర రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ప్రణాళికా బద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని రచించుకున్నాం. కుంటుతూనో, నడుస్తూనో, పరుగులతోనో పన్నెండు ప్రణాళికలు అమలయ్యాయి. ప్రణాళిక అంటేనే సోషలిజం చిహ్నమేమో అని భయంతో గంగ వెర్రులెత్తే రాజకీయపక్షం అధికారం సాధించి, ప్రణాళికా సంఘాన్నీ, ప్రణాళికలనూ రద్దు చేసి పారేసి ఏడేళ్ళు గడిచాయి. ప్రణాళిక లేకుం డానే భారతదేశాన్ని పరివర్తన చెందిస్తానని కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. అనేక గ్రంథాలు కాగలిగిన ఈ సుదీర్ఘ చరిత్రలో భారత సమాజం సాధించిన ఆర్థిక, సామాజిక అభివృద్ధి ఎంత? ► జాతీయాదాయం 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 140 లక్షల కోట్ల రూపాయలకు, ఆహార ధాన్యాల ఉత్పత్తి 5 కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు, ఎగుమతులు ఒక బిలియన్ డాలర్ల నుంచి 38 బిలియన్ డాలర్లకు, రోడ్డు మార్గాలు 4 లక్షల కి.మీ. నుంచి 64 లక్షల కిలోమీటర్లకు పెరిగాయని... అటువంటి గణాంకాలతో మనం సాధించిన ప్రగతి గురించి చెప్పుకోవచ్చు. కానీ నాణానికి ఈ బొమ్మతో పాటే బొరుసు ఉంది. ఇక్కడ ఎన్నో రెట్లు పెరిగినట్టు కనబడుతున్న అంకెల పొట్ట విప్పి చూస్తే ఆ పెరుగుదలలోని ఒడుదొడుకులు బయట పడతాయి. ఉదాహరణకు జాతీయాదాయం లెక్కలో ఒక వంద మందిని మినహాయిస్తే, హఠాత్తుగా మన జాతీయాదాయం సగానికి పడిపోతుంది. ఆ వందమంది ఆదాయం 55 కోట్ల మంది ఆదాయం కన్నా ఎక్కువ. ► అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఆరు రెట్లు పెరుగు దల, జనాభా పెరుగుదల నాలుగు రెట్ల కన్న తక్కువే ఉన్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో ఆకలిచావులు, అర్ధాకలి కొనసాగుతూనే ఉన్నాయి. ఎగుమతుల్లో 38 రెట్ల పెరుగుదల కనబడుతున్నప్పటికీ, దిగుమ తులు ఇదే కాలంలో ఒక బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పెరిగి, విదేశీ వాణిజ్య లోటు విపరీతంగా హెచ్చింది. ఎగుమతి దిగుమతుల వ్యత్యాసం 2 కోట్ల రూపాయల నుంచి 20 వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ 75 ఏళ్ళలో ఆర్థిక, సామాజిక అసమానతలు, అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలు గణనీయంగా మారలేదు. ఏ ఒక్క అభివృద్ధి గణాంకం తీసుకున్నా, ఆ వెలుగు వెనుక పెనుచీకటి కనబడుతూనే ఉన్నది. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు? ► అంత మాత్రమే కాదు, ఆ నాడు ఒక్క బ్రిటన్‌కు వలసగా ఉన్న భారతదేశం ఇవాళ, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాల తర్వాత అనేక పెట్టుబడిదారీ దేశాలకు ముడిసరుకులు అందించే వనరుగా, వాళ్ల సరుకులు అమ్ముకునే మార్కెట్‌గా మారిపోయింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులకూ, దిగుమతుల కోసం ఆధారపడిన అన్ని దేశాల అవమా నకర ఆదేశాలకూ తలొగ్గి, సార్వభౌమాధికారాన్నే పలుచబరచుకునే స్థితి వచ్చింది. ఆధునికత, విద్య, రవాణా, సమాచార సంబంధాలు, పారిశ్రామికాభివృద్ధి వంటి రంగాలలో అంకెల్లో మాత్రమే చూస్తే బ్రిటిష్ వలస పాలన కూడ ఇటువంటి ప్రగతి సాధించినట్టే కనబడు తుంది. కానీ, సుపరిపాలన ఉన్నా సరే, స్వపరిపాలనకు ప్రత్యా మ్నాయం కాదు అని జాతీయోద్యమం కోరుకుంది. ► ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలనీ, పరాయి పాలన పీడన తొలగిపోవాలనీ కోరుకుంది. సంపద తరలింపు గురించి మాట్లాడిన నౌరోజీయే ‘‘బ్రిటిషేతర పాలన’’ అన్నాడు. అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రా తృత్వం వంటి నినాదాల పుట్టుకకు కారణమైన పెట్టుబడిదారీ విధానం వలస వాదంగా, సామ్రాజ్యవాదంగా మారి, ఆ నినాదాల స్ఫూర్తిని వదిలేసి, తమ వలస ప్రజలకు స్వేచ్ఛ లేని స్థితి కల్పించిందని అర్థం. ఆర్థికాభివృద్ధి కన్నా ముఖ్యం స్వాతంత్య్రం అని సాగిన జాతీయోద్యమం 1947 ఆగస్ట్ 15న ఆ స్వాతంత్య్రాన్ని సాధించానని భావించింది. ► కానీ, ఆ తరువాతి ఇన్నేళ్ళ చరిత్రను అవలోకిస్తే, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే విశాల భావనను ఐదు సంవత్సరాలకు ఒకసారి మొక్కుబడిగా జరిగే ఎన్నికలకు కుదించారు. ఆ ఎన్నికలు అక్రమాలకు నిలయాలయ్యాయి. ఒకసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే ఐదేళ్ళలో ఏమైనా చేసే అధికారం చేజిక్కుతున్నది. ప్రభుత్వాధికారం వ్యక్తిగత సంపదలు పెంచుకునే సాధనంగా మారిపోయింది. ఉదాత్తంగా రాసుకున్న రాజ్యాంగ ఆదేశాల అమలు కన్నా ఉల్లంఘన ఎక్కువ జరుగుతున్నది. ప్రజా భాగస్వామ్యంతో నడవవలసిన పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌన సాక్షులుగా మిగిలి పోయారు. బహుళత్వానికి నిలయమైన దేశంలో నెలకొనవలసిన, బలపడవలసిన పరస్పర సహాయ సహకార సంఘీభావాల స్థానంలో కుల, మత, ప్రాంత, భాషా విద్వేషాల రాజకీయాలు చెలరేగి సమాజ అస్తిత్వమూ, భవిష్యత్తూ ప్రమాదకర స్థితికి చేరాయి. వలస పాలకులు తయారు చేసిన న్యాయవ్యవస్థ, భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి స్వల్పమైన మార్పులతో కొనసాగుతున్నాయి. ► వలస పాలకులు సృష్టించిన రాజద్రోహ నేరం ఇప్పటికీ అట్లాగే ఉంది. జాతీయోద్యమం తీవ్రంగా వ్యతిరేకించిన రౌలట్ చట్టాన్ని మించిన దుర్మార్గమైన ప్రజావ్యతిరేక చట్టాలు లెక్కలేనన్ని స్వతంత్ర భారత పాలనలో అమలులోకి వచ్చాయి. ‘దేశమనియెడు దొడ్డ వృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయి/ నరుల చమటను తడిసి మూలం/ ధనం పంటలు పండవలెనోయి’ అని గురజాడ అప్పారావు ‘దేశభక్తి’ గీతంలో రాసి నప్పుడు మొదటి రెండు పంక్తులు ప్రజాస్వామ్యానికీ, బహుళత్వ సామరస్యానికీ , చివరి రెండు పంక్తులు సంపద అభివృద్ధికీ, సమాన పంపిణీకీ సూచనలు. ఈ 75 ఏళ్లలో భారతదేశం అనే దొడ్డ వృక్షం ఎన్నో పూలు పూసింది, ఫలాలూ ఇచ్చింది, నరుల చెమటతో ధనం పంటలూ పండించింది. కానీ ఆ ప్రగతి ఫలాలు దక్కిందెవరికి? ఆ ధనం నింపిన బొక్కసాలెవరివి అనే ప్రశ్నలు ఇంకా భారత సమాజం ముందు నిలిచే ఉన్నాయి. ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు -
శతమానం భారతి: కార్మిక వర్గం
భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్ పాలనకు నిరసనగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరురోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్ కమ్యూన్ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్ సెషన్‌లోకి దూసుకెళ్లడం పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్ సభ, వర్కర్స్ పీసెంట్స్ పార్టీ కార్యాచరణలు.. యునైటెడ్ ప్రావెన్స్‌లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. 1946లో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటుకు ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు బ్రిటిష్ రాజ్‌కి చివరి సమాధి రాయిగా మారింది. ఈ కాలంలోనే, దేశంలో మొట్టమొదటి కార్మిక వర్గ సమాఖ్య అయిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు బలమైన రాజకీయ మద్దతు లభించింది. లాలా లజపతి రాయ్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సరోజిని నాయుడు వరకు ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. మరోవైపున 1944లో ‘ఎ బ్రీఫ్ మెమొరాండమ్ అవుట్‌లైనింగ్ ఎ ప్లాన్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా’ (బాంబే ప్లాన్ గా సుప్రసిద్ధమైంది) ప్రచురితమైంది. పూచీ తీసుకునే ప్రభుత్వం, ప్రభుత్వ రంగానికి ప్రాముఖ్యత ఉండే ఆర్థిక వ్యవస్థను బాంబే ప్లాన్ ప్రబోధించింది. ఆ భావన సాకారమయ్యేలా వచ్చే ఇరవై ఐదేళ్లలో ఆచరణీయతకు భారత్ సంకల్పం పెట్టుకుంది. (చదవండి: చైతన్య భారతి: అణుశక్తిమాన్) -
తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. అంటే సగటున వారానికి పదన్నమాట! 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 56 మంది పౌరులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో ఈ నిత్య మారణకాండకు అక్కడి తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం. అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ). ఏమిటీ ఎన్ఆర్ఏ? అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్ఆర్ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్ఆర్ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా. పౌరులదీ అదే దారి తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు. అంగడి సరుకులు మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది. నలుగురు అధ్యక్షులు బలయ్యారు ఎక్కడపడితే అక్కడ అతి సులువుగా దొరుకుతున్న తుపాకులు అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292! నలుగురు అమెరికా అధ్యక్షులు కూడా తుపాకులకే బలైపోయారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ.గార్ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తూటాలకు నేలకొరిగారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ తదితర అధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయట పడ్డారు. తుపాకుల నీడలో ► అమెరికాలో సగటున రోజుకు 50 మందికి పైగా తుపాకులకు బలైపోతున్నారు. ► జనాభాలో 58 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో తుపాకుల బెదిరింపులకు లోనైనవారే. ► దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే, తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు. ► దేశంలో 63 వేల మంది లైసెన్సుడ్ ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులు మరో ముగ్గురి దుర్మరణం లాగునావుడ్స్: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా చర్చి, హూస్టన్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా చర్చిలో మధ్యాహ్న భోజన సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులకు సమాచారమంది వారు వచ్చేలోపే కాల్పులకు ఒకరు బలవగా ఐదుగురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భక్తులు దుండగున్ని బంధించారు. కాల్పులకు దిగిన వ్యక్తి 60 ఏళ్ల ఆసియా సంతతికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం తెలియరాలేదు. ఇంకో ఘటనలో హూస్టన్ మార్కెట్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. వీటిలో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బఫెలోలో ఓ శ్వేతజాతి యువకుడు పదిమందిని కాల్చిచంపిన విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అ‘పూర్వ బంధం’
బి.కొత్తకోట: బ్రిటీష్ పాలనలో కడప జిల్లాలో కలిసి ఉన్న చిత్తూరుజిల్లా పశ్చిమ ప్రాంతాలు మళ్లీ పూర్వ కడప జిల్లా పరిధిలోని ప్రాంతాలతో కలిసి కొత్తజిల్లా ఏర్పాటు కావడం విశేషంగా చెప్పుకోవాలి. నిన్నమొన్నటి వరకు ఏదైనా పాత రికార్డులు కావాలంటే చిత్తూరు జిల్లా ప్రజలు కడప కలెక్టరేట్‌పై ఆధారపడేవాళ్లు. జిల్లాల పునర్విభజనతో చిత్తూరు పశ్చిమ ప్రాంతం ఎక్కడినుంచి విడిపోయిందో మళ్లీ అదే ప్రాంతంలో కలిసింది. చోళ రాజుల పాలన నుంచి మైసూర్ మహరాజుల పాలన వరకు తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గ ప్రాంతాలు వారి సామ్రాజ్యాల్లో భూ భాగంగా ఉండేవి. వైడుంబులు, పాలేగాళ్లు, రేనాటిచోళులు, మలిచోళులు, విజయనగర, మైసూర్రాజు టిప్పు సుల్తాన్ పాలనలో ఉన్న ఈ నియోజకవర్గాలను మైసూర్ బెల్ట్ ప్రాంతంగా పిలిచేవారు. 1800 అక్టోబర్ 12న నిజాం పాలకులతో వెల్లస్లీకి కుదిరిన ఒప్పందం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, ఇప్పటి కర్నాటకలోని బళ్లారి జిల్లాలు బ్రిటీష్ పాలన కిందకు వచ్చాయి. అప్పటినుంచి చిత్తూరుజిల్లా కడప జిల్లా పరిధిలో ఉండేది. ఈ ప్రాంతానికి కడప కలెక్టర్ పాలకుడు. అప్పటి కడపజిల్లా విస్తీర్ణం అధికం కావడంతో పాలనా సౌలభ్యం కోసం బ్రిటీష్ పాలకులు 1850లో మదనపల్లెను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేశారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చేసిన వారిని ఇక్కడ సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ పాలన సాగించారు. ఈ ప్రాంతంలో జరిగే ఉత్తరప్రత్యుత్తరాలు, రిజిస్ట్రేషన్లు, అధికారిక కార్యకలాపాలన్నీ కడపజిల్లా పేరుతోనే జరిగాయి. సరిగ్గా 111 ఏళ్లకు మళ్లీ.. బ్రిటీష్ పాలనలో కడప జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలను కలుపుకొని 1911 ఏప్రిల్ ఒకటిన చిత్తూరు జిల్లా ఏర్పడింది. సరిగ్గా 111 ఏళ్ల తర్వాత యాదృచ్ఛికంగా మళ్లీ కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలతో కలిసి కొత్తగా ఏర్పడిన అన్నమయ్యజిల్లాలో కలిసింది. కొత్తజిల్లా ఏర్పడటం అటుంచితే పూర్వం ఈ మూడు నియోజకవర్గాలు కడపలో భాగమైనవే. ఒకసారి వీడిపోయిన ఈ ప్రాంతాలు కడప జిల్లా నియోజకవర్గాలతో మళ్లీ కలిశాయి. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయలు భిన్నమైనవే. ఆహార, ఆహర్యం, భాష, వ్యవహారికం పరంగా తేడా కనిపిస్తుంది. కడపలో సుబ్బయ్య, వెంకటసుబ్బయ్య, సుబ్బమ్మ ఇలాంటి పేర్లు అధికంగా వింటాం. ఈ నియోజకవర్గాల పరిధిలో తిరుమలలో కొలువైన వెంకటేశ్వరస్వామి, శ్రీకాళహస్తీశ్వరుడి పేరు కలిసివచ్చేలా పేర్లుంటాయి. 1850లోనే మదనపల్లె డివిజన్ కేంద్రం అత్యధిక విస్తీర్ణం కలిగిన కడప నుంచి జిల్లా పరిపాలన కష్టంగా భావించిన బ్రిటీష్ పాలకులు 1850లోనే మదనపల్లెలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే సబ్‌కలెక్టర్ కోసం అందమైన కార్యాలయం, బంగళాను నిర్మించారు. ఇక్కడ పనిచేసిన బ్రిటిష్ పాలకులందరూ ఐసీఎస్ అధికారులు. స్వాతంత్య్రం వచ్చేదాకా ఇక్కడ పనిచేసిన సబ్కలెక్టర్లలో అత్యధికులు బ్రిటీషర్లే. ఇప్పటి 31 మండలాలతో డివిజన్ ఉండగా బ్రిటిష్‌పాలనలో పరిధి ఇంకా ఎక్కువ. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో తంబళ్లపల్లెలోని ఆరు, మదనపల్లెలోని మూడు, పీలేరులోని రెండు మండలాలతో డివిజన్ ఏర్పడింది. హార్సిలీహిల్స్ కనుగొన్న కలెక్టర్ 1865–67 మధ్య మదనపల్లె సబ్‌కలెక్టరుగా పనిచేసిన డబ్ల్యూడీ హార్సిలీ గుర్రంపై పర్యటిస్తూ బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామంలోని ఏనుగుమల్లమ్మ కొండ పరిసరాల్లో సంచరిస్తుండగా మండువేసవిలో చల్లటి వాతావరణ అనుభూతి పొందారు. గుర్రంపైనే కొండపైకి వెళ్లారు. అక్కడ పశుకాపరులతో ఏనుగుమల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవాలని వారిచేత పలికించారు. అప్పటినుంచి హార్సిలీహిల్స్‌గా పేరొచ్చింది. 1871లో కడప కలెక్టరుగా పని చేసిన డబ్ల్యూడీ హార్సిలీ మద్రాసు ప్రభుత్వం నుంచి హార్సిలీహిల్స్‌ను వేసవి విడది కేంద్రంగా అనుమతులు పొందారు. నియోజకవర్గ పరిధుల మార్పులు చిత్తూరు జిల్లా ఏర్పడ్డాక తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు మారుతూ వస్తున్నాయి. 1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం లేదు. బి.కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. 1957 ఎన్నికల నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంగా మారింది. అప్పటినుంచి పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాలు పూర్తిగా, బి.కొత్తకోట మండలంలోని బయ్యప్పగారిపల్లె, శీలంవారిపల్లె, బండారువారిపల్లె, కోటావూరు, తుమ్మనంగుట్ట, గోళ్లపల్లె పంచాయతీలు తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో ఉండేవి. బి.కొత్తకోట, గుమ్మసముద్రం, గట్టు, బీరంగి, బడికాయలపల్లె పంచాయతీలు, కురబలకోట మండలం మదనపల్లె నియోజకవర్గంలో ఉండేవి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కురబలకోట, బి.కొత్తకోటలో అన్ని పంచాయతీలను మదనపల్లె నుంచి వేరుచేసి తంబళ్లపల్లె నియోజకవర్గంలో కలిపారు. మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె మున్సిపాలిటీ, రూరల్, నిమ్మనపల్లె మండలాలుండగా తొలగించిన బి.కొత్తకోట, కురబకోట మండలాల స్థానంలో పుంగనూరు నియోజకవర్గంలోని రామసముద్రం మండలాన్ని మదనపల్లెలో కలిపారు. 2009 వరకు వాయల్పాడు నియోజకవర్గం ఉండగా పునర్విభజనలో వాయల్పాడు, గుర్రంకొండ, కలికిరి, కలడక మండలాలను పీలేరు నియోజకవర్గంలో కలపగా వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగైంది. పీలేరులోని కొన్ని మండలాలను చంద్రగిరి నియోజకవర్గంలో కలిపారు. -
మిడతలను పట్టే ‘మెథడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘హెవెన్–సెంట్ విసిటేషన్ (స్వర్గం పంపించిన పర్యవేక్షకులు)’ అని పంటలపైకి దాడికి వచ్చిన మిడతల దండును భారతీయులు ఒకప్పుడు భావించేవారట. అందుకని మిడతలను పట్టుకుంటే డబ్బులిస్తామంటూ బ్రిటీష్ పాలకులు ఎంత పిలిచినా వెళ్లేవారు కాదట. మిడతల వల్ల పంటలు దెబ్బతిని దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని, వ్యవసాయ రైతులు పన్నులు చెల్లించే పరిస్థితుల్లో ఉండరనే ఉద్దేశంతో బ్రిటిష్ పాలకలు మిడతలను కూలీ ఇచ్చి పట్టించే వారు. (చదవండి: మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!) అప్పట్లో మిడతలను పారద్రోలేందుకు, పట్టుకునేందుకు పలు పద్ధతులు అమల్లో ఉండేవి. మిడతలను పారద్రోలేందుకు అవి ఆశించిన పంట పొలాల్లోకి వెళ్లి తపాలాను కర్రలతో మోగించేవారు. ఆ శబ్దాలకు అవి పారిపోయేవి. శబ్దాలు వినిపించని చోటుకు వెళ్లేవి. అక్కడ కూడా అలాంటి శబ్దాలనే వినిపించినట్లయితే అక్కడి నుంచి మరోచోటుకు వెళ్లేవి. కానీ నశించేవి కావు. నూనెలో తడిపిన తెరలను పొలాల వద్ద గాలివాటున కట్టే వారు. గాలి వాటున వచ్చే మిడతలు నూనెలో తడిపిన తెరకు అంటుకొనేవి. వాటిలో కొన్ని చనిపోయేవి. సైప్రస్ దేశంలో ఆ తెరల విధానాన్ని ఎక్కువగా ఉపయేగించేవారట. అందుకనే ఆ నూనెలో తడిపిన తెరలను ‘సైప్రస్ స్క్రీన్’ అని పిలిచేవారు. ఆ తెరల విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో మిడతలను పట్టేందుకు బుట్టలాంటి సంచులను గిరిగిరా తిప్పుతూ పొలాల్లో తిరిగేవారు. మిడతలు వాలిన మొక్కలపైకి బ్లాంకెట్లు వలల్లా విసిరి, వాటి కింద చిక్కిన మిడతలను పట్టుకునేవారు. ఈ పద్ధతులను ఉపయోగించి మిడతలను పట్టేందుకు బ్రిటీష్ పాలకులు కూలీలను నియమించేవారు. మిడతలను స్వర్గ పర్యవేక్షకులని భావించిన భారతీయులు మాత్రం కూలీకి వెళ్లేవారు కాదట. (చదవండి: మిడతలపై ఎదురుదాడికి ‘ఎల్‌డబ్లూఓ’) -
మిడతలపై ఎదురుదాడికి ‘ఎల్‌డబ్లూఓ’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ఓ పక్క భారత్ సర్వశక్తులా పోరాడుతుండగానే అనూహ్యంగా దేశంపై మరో ఉపద్రవం మిడతల దండు రూపంలో వచ్చి పడింది. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన మిడతల దాడిని అడ్డుకోక పోయినట్లయితే పచ్చని పంటలను కోల్పోవాల్సిన ప్రమాదం ఉంది. అయినా మిడతల దాడిని ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇందులో రెండు శతాబ్దాల అనుభవం భారత్‌కు ఉంది. 81 సంవత్సరాల క్రితం, అంటే దేశానికి స్వాతంత్య్రం రాకముందు, బ్రిటీష్ పాలనలో మగ్గుతున్నప్పుడే ‘లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్’ ఆవిర్భవించింది. ప్రస్తుత మిడతల దాడిని ఎదుర్కోవడానికి పాత అనుభవాలు ఎక్కువగా పనికొచ్చే అవకాశం ఉంది. భారత్‌పై మిడతల దాడిని బ్రిటీష్ పాలకులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకు కారణం వారు వ్యవసాయ పన్నుపై ఎక్కువ ఆధారపడడం, మిడతల దాడిని సకాలంలో అడ్డుకోకపోతే పంటలు దక్కక కరవు కాటకాలు ఏర్పడేవి. పన్నులు చెల్లించే స్థోమత రైతులకు ఉండేది కాదు. 19వ శతాబ్దంలో 1812, 1821, 1843–44, 1863, 1869, 1878, 1889–92, 1896–97 సంవత్సరాల్లో భారత్ భూభాగంపై మిడతల దాడులు ఎక్కువగా జరిగాయి. మిడతల్లో సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన దాని సైకిల్ ఏమిటి? ఎప్పుడు అవి పంటలపైకి దాడికి వస్తాయి? వాటి సామాజిక జీవనం ఎట్టిదో తెలుసుకునేందుకు అధ్యయం చేయాల్సిందిగా ఎంటమాలజిస్ట్ (క్రిమికీటకాల అధ్యయన శాస్త్రవేత్తలు)లను బ్రిటీష్ పాలకులు ప్రోత్సహించారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు స్థానికంగా అనుసరిస్తున్న పద్ధతులతోపాటు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులను కూడా పరిగణలోకి తీసుకొని నాటి బ్రిటీష్ పాలకులు తగిన చర్యలు తీసుకున్నారు. 1927–29 సంవత్సరంలో భారత్‌లోని కేంద్ర ప్రాంతాలతోపాటు, పశ్చిమ ప్రాంతాలను కూడా మిడతలు ఏకకాలంలో ముట్టడించడంతో వాటిని ఎదుర్కొనేందుకు ఓ కేంద్రీకృత సంస్థ ఉండాలని నాటి పాలకులు భావించారు. 1929లో స్టాండింగ్ లోకస్ట్ కమిటీని, 1930లో లోకస్ట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిని మిలితం చేసి 1939లో ‘లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థనే ఇప్పటికీ కొనసాగుతోంది. (భారత్‌పై మిడతల దాడి: పాక్ నిర్లక్ష్యపు కుట్ర) 1943లో మిడతలపై తొలి అంతర్జాతీయ సదస్సు రోజు రోజుకు తీవ్రమవుతున్న మిడతల దాడిని ఎదుర్కోవడం ఎలా ? అన్న అంశంపై ఫ్రాన్స్ మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును 1943లో మొరాకన్ నగరం రాబత్‌లో ఏర్పాటు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలు సహారా ప్రాంత దేశాలు హాజరయ్యాయి. అప్పటికే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ వలస ప్రభుత్వానికి ఆ సదస్సు ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో సహారా దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా ఉండేవి. ఆఫ్రికా, ఆరేబియా, ఇరాన్, భారత్ సహా ఆసియా దేశాలన్నింటితోపాటు మధ్యప్రాచ్య దేశాలకూ మిడతల దాడులు విస్తరించిన నేపథ్యంలో దీనిపై నేడు అంతర్జాతీయ సదస్సును నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగితేనే సార్థకతతోపాటు సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. -
చిట్టగాంగ్ చిరుత
చిట్టగాంగ్, సెప్టెంబర్ 23, 1932...రాత్రి 10. 45.‘భారతీయులకీ, కుక్కలకీ ప్రవేశం లేదు’ అని రాసి ఉన్న పహార్తలీ యూరోపియన్ క్లబ్‌కు నిప్పు పెట్టారు కొందరు. లోపల ఉన్న బ్రిటిష్ అధికారులు ఎదురు కాల్పులు ఆరంభించారు. అందులో ఒక సిక్కు యువకుడు గాయపడ్డాడు. కానీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న పోటాషియం సైనేడ్ మింగి చనిపోయాడు. అలాంటి మాటలతో వేరే జాతీయులని అవమానించామని శ్వేతజాతి జాత్యహంకారం ఆనాడు చంకలు గుద్దుకునేది. కానీ అవే అణగారిన జాతిలో ఆత్మ గౌరవ స్పృహ కోసం పాంచజన్యం పూరించాయి. చిట్టగాంగ్‌లోని పహార్తలీ యూరోపియన్ క్లబ్ ఉదంతం ఇదే చెబుతుంది. అలాంటి మాటలు రాసిన పలకలు చాలా బ్రిటిష్ కార్యాలయాల మీద ఆనాడు వేలాడుతూ కనిపించేవి. మరీ ముఖ్యంగా వాళ్ల క్లబ్‌ల ముందు కనిపించేవి. ఘనత వహించిన బ్రిటిష్ పాలనలో పాలితులకి దక్కిన గౌరవాలలో ఇదొకటి. దక్షిణాఫ్రికాలో కూడా ప్రిటోరియా పాలనలో ఇలాంటి మర్యాదే భారతీయులకీ, బ్రిటిష్ జాతీయులు కాని వారికి ఇదే గౌరవం ఉండేది. ఈ గౌరవంలో నీచత్వం ఎలాంటిదో గాంధీజీ రుచి చూసినది అక్కడే. అయినా ఈ గౌరవాన్ని కూడా ఆనందంగా భరించాలనుకున్నవారే భారత జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులు. కానీ కుక్కలనీ, భారతీయులనీ ఒకే విధంగా చూసే దురహంకారాన్ని భరించడానికి సిద్ధంగా లేమనీ ఇలాంటి కుసంస్కారానికి ఆయుధంతోనే సమాధానం ఇస్తామని నెత్తుటి ప్రతిజ్ఞలు చేసినవారు ఉన్నారు. కానీ వారి ధర్మాగ్రహాన్ని చరిత్ర పుటలు నిషేధించాయి. అలా నెత్తురు మీద ప్రమాణం చేసినవారు దేశమంతటా ఉన్నారు. వారంతా రకరకాల రహస్య సంస్థల వారు. పంజాబ్, మహారాష్ట్ర, మధ్య భారతం, తెలుగు ప్రాంతాలలో అలాంటి తీవ్ర జాతీయవాదం కనిపిస్తుంది. బెంగాల్లో చిట్టగాంగ్ ఉద్యమకారుల త్యాగాలు కూడా అలాంటివే. కానీ బెంగాల్లో తప్ప చిట్టగాంగ్ వీరుల గురించి మిగిలిన భారతదేశంలో తక్కువ తెలుసు. సూర్యసేన్ (మాస్టర్ దా) నాయకత్వంలో జరిగిన చిట్టగాంగ్ సాయుధదాడికి బ్రిటిష్ ప్రభుత్వం గంగవెర్రులెత్తిపోయింది. ఇందుకు కారణం, చిట్టగాంగ్ అనే ప్రాంతానికి వ్యూహాత్మకంగా ఉన్న ప్రాముఖ్యం. బ్రిటిష్ వలసగా ఉన్న భారత్ మీద శత్రుదేశాలు దాడి చేస్తే అది అక్కడ నుంచే ఆరంభమవుతుంది. అలాంటి చోట ఆయుధాగారం మీద విప్లవకారులు దాడి చేస్తే అది ఎలాంటి సంకేతాలను పంపుతుందోనని హడలెత్తిపోయింది నాటి ప్రభుత్వం. అందుకే వారి పట్ల మరీ అమానవీయంగా వ్యవహరించింది. పహార్తలీ క్లబ్‌ను దగ్ధం చేసిన చిట్టగాంగ్ వీరులకు నాయకత్వం వహించిన ఆ పంజాబీ యువకుని గురించి....ఆ రాత్రి ఆ క్లబ్ మీద దాడి చేసిన బృందానికి నాయకత్వం వహించినవారు నిజానికి పంజాబీ కాదు. యువకుడు అంతకంటే కాదు. ఒక యువతి ఆ వేషం ధరించింది. ఆమె పేరు ప్రీతిలతా వాడ్డేదార్. ఆ దాడిలో ఆమెకు సహకరించిన కాళీశంకర్ డె, బీరేశ్వర్ రాయ్, ప్రఫుల్ల దాస్, శాంతి చక్రవర్తి, మహేంద్ర చౌధురి, పన్నా సేన్ .. అంతా రకరకాల వేషాలు ధరించారు. ప్రేమలతా వాడ్డేదార్ (మే 5, 1911–సెప్టెంబర్ 23, 1932) అవిభక్త బెంగాల్లో చిట్టగాంగ్‌కు చెందినది. పాటియా ఉప జిల్లా ధాల్‌ఘాట్‌లో జన్మించారు. వారి పూర్వీకుల ఇంటిపేరు దాస్‌గుప్తా. తరువాత ఆ కుటుంబానికి వాడ్డేదార్ అనేది బిరుదుగా స్థిరపడింది. ప్రీతిలత తల్లి ప్రతిభా మాయాదేవి, గృహిణి. తండ్రి జగబంధు వాడ్డేదార్. చిట్టగాంగ్ నగరపాలక సంస్థలో గుమాస్తా. వారి ఆరుగురు బిడ్డలలో ప్రీతిలత రెండో సంతానం. ఆమెకు రాణి అన్న ముద్దు పేరు కూడా ఉంది. తండ్రి పిల్లలందరికీ మంచి చదువు చెప్పించారు. చిట్టగాంగ్‌లోనే ఆనాడు ఎంతో పేరున్న డాక్టర్ ఖస్తగీర్ బాలికోన్నత పాఠశాలలో ప్రీతిలత చదివింది. జాతీయ భావాలకు అంకురార్పణ జరిగింది అక్కడే. అక్కడ ఉష అనే ఉపా«ధ్యాయురాలు ఉండేవారు. ఆమెను పిల్లలంతా ఎంతో ప్రేమగా ఉషాదా అని పిలుచుకునేవారు. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత గాథలను పిల్లలకు చేప్పేవారు. చిట్టగాంగ్ సాయుధ దాడిలో మరొక సభ్యురాలు కల్పనా దత్తా (1913–1995) కూడా ఇదే పాఠశాలలో అదే తరగతిలో ఉండేవారు. ‘ఆ పాఠశాలలో చదువుకుంటున్న రోజులలో మా భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో మేం ఏనాడూ ఉహించలేదు. కానీ ఝాన్సీ రాణీ జీవిత ఘట్టాలు మాకు ఒక భావనను ఏర్పరిచాయి. అవి వింటూ ఉంటే కొన్ని సందర్భాలలో అసలు మాకు భయం అంటే ఏమిటో తెలియనట్టే ఉండేది’ అని కల్పన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ప్రీతికి కళలు, సాహిత్యం అంటే ఆసక్తి. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఇచ్చే వేతనంతో ఆమె చదువు సాగింది. చిట్టగాంగ్‌లో చదువు పూర్తయిన తరువాత ఢాకాలోని ఈడెన్ కళాశాలలో ప్రీతి చేరారు. ఆమె జాతీయ భావాలు ఇంకొంచెం విస్తరించే అవకాశం అక్కడ వచ్చింది. అదే పాఠశాలలో చదువుతున్న లీలా నాగ్ (రాయ్) (1900–1970) దీపాలీ సంఘ్ అనే రహస్య సంస్థ నడిచేది. అందులో ప్రీతి చేరారు. ఆపై బిఎ చదవడానికి కలకత్తాలోని బెథూన్ కళాశాలకు వెళ్లారు. అదే ఆమె జీవితంలో పెద్ద మలుపు. 1931లో చిట్టగాంగ్ ఉద్యమంలో పనిచేసిన వారు చిట్టగాంగ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ క్రేగ్‌ను తుదముట్టించాలని పథకం వేశారు. ఇందుకు రామకృష్ణ బిస్వాస్, కాళీపాద చక్రవర్తి అనే ఇద్దరిని నియమించారు. కానీ ఆ ఇద్దరు పొరపాటున చాంద్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ తరిణి ముఖర్జీని కాల్చి చంపారు. పైగా పోలీసులకు తరువాత పట్టుబడ్డారు. కాళీపాదకు ద్వీపాంతర శిక్ష వేసి అండమాన్ తరలించారు. బిస్వాస్‌కు ఉరిశిక్ష వేసి ఆలీపూర్ జైలుకు పంపారు. ఇది కలకత్తాలో ఉంది. తరువాత అతడిని చూసి రావడానికి ఉద్యమకారుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలోనే ఉద్యమకారులు కలకత్తాలో చదువుకుంటున్న ప్రీతిలతను ఆశ్రయించారు. ఆమె ఆలీపూర్ జైలుకు వెళ్లి సోదరినంటూ చెప్పి బిస్వాస్‌ను కలుసుకునేవారు. ఒకటి రెండుసార్లు కాదు నలభయ్ సార్లు. ఆయనతో జరిపిన సంభాషణలతో ప్రీతిలో ఒక ఉద్యమకారిణి నిర్మితమైంది. ఆమె బిఏ మూడేళ్లు చదువు పూర్తయింది. కానీ కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు పట్టా ఇవ్వకుండా నిలిపివేసింది. దీనితో ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం అసలు రూపం ఏదో ఇంకాస్త స్పష్టమైంది. తిరిగి చిట్టగాంగ్ వచ్చి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా చేరారు. కానీ ఆమె మనసంతా భారత స్వాతంత్య్రోద్యమంలో చేరాలని ఆరాటపడేది. ఆ సమయంలోనే సూర్యసేన్ ఆమెకు కబురు చేశారు. ప్రీతి జన్మించిన ధాల్‌ఘాట్ శిబిరంలోనే ఆమె జూన్ 13, 1932న మాస్టర్దాను కలుసుకుంది. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో ఉండగా ఆయన కార్యకలాపాలకు ప్రభావితమైంది. ఇప్పుడు స్వయంగా ఆయనను కలుసుకుంది. వెంటనే ఉద్యమంలో ప్రవేశించింది. ఇందుకు మొదట కొందరు చిట్టగాంగ్ ఉద్యమకారులు వ్యతిరేకించారు. కానీ సూర్యసేన్ దృష్టి వేరు.మహిళలతో ఆయుధ సేకరణ సులభంగా చేయవచ్చు. అదే గ్రామంలో సావిత్రీదేవి అనే ఉద్యమ సానుభూతిపరురాలి ఇంటిలో ఉండగా పోలీసు దాడి జరిగింది. అది సావిత్రీదేవి భర్త చేయించిన పని.ఆయన ఒకప్పుడు ఉద్యమకారుడే. తరువాత మారిపోయాడు. సూర్యసేన్, ప్రీతిలత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చిట్టగాంగ్‌లోని రెండు ఆయుధాగారాలను, పహార్తలీ క్లబ్‌ను, ఇతర బ్రిటిష్ కార్యాలయాల మీద దాడి చేయాలని సూర్యసేన్ పెద్ద పథకం వేశారు. ఇదే చరిత్రలో చిట్టగాంగ్ దాడిగా నమోదైంది. నలభయ్ మంది సభ్యులను మూడు బృందాలుగా విభజించి, క్లబ్ మీద దాడి చేసే బృందానికి ప్రీతిని నాయకురాలిని చేశారు సేన్. నిజానికి ఈ పని కల్పనా దత్తాకు అప్పగించాలి. కానీ ఆమె అప్పటికి వారం ముందే అరెస్టయ్యారు. దీనితో ప్రీతికి అప్పగించారు. ఇందుకోసం ఆమెకు కోటోవాలీ సీసైడ్ అనేచోట ఆయుధ శిక్షణ ఇచ్చారు. అనుకున్న ప్రకారం క్లబ్ మీద దాడి జరిగింది. సలీవాన్ ఇంటి పేరున్న ఒక బ్రిటిష్ మహిళ ఈ దాడిలో చనిపోయింది. నలుగురు పురుషులు, ఏడుగురు స్త్రీలు కూడా గాయపడ్డారు. లోపల పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఒక బుల్లెట్ ప్రీతికి తగిలింది. ఆమె పారిపోతూ ఉండగా ఒక పోలీసు పట్టుకున్నాడు. అరెస్టును నివారించేందుకు నాయకులు ముందే ఆదేశించినట్టు పొటాషియం సైనేడ్ మింగి చనిపోయింది. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. శవపరీక్ష సమయంలో ఆమె చిట్టగాంగ్ ఉద్యమంలో పనిచేస్తున్నదని చెప్పడానికి అన్ని ఆధారాలు దొరికాయి. కొన్ని కరపత్రాలు దొరికాయి. దాడికి సంబంధించిన మ్యాప్ దొరికింది. వాటì తో పాటు ఒక ఫొటో కూడా. అది ఆలీపూర్ కారాగారంలో, సోదరిగా పరిచయం చేసుకుని తాను నలభయ్ పర్యాయాలు సమావేశమైన రామకృష్ణ బిస్వాస్ ఫొటో. తనలోని ఉద్యమకారిణికి ఆకృతి ఇచ్చిన బిస్వాస్ ఫొటో. ఆయనంటే ఆమెకు అంత ఆరాధన. బ్రిటిష్ జాతి నీచత్వం అక్కడ బయటపడింది. పైగా ప్రీతి కాల్పులలో తనకు తగిలిన తూటాకు ప్రాణాలు విడవలేదు. పొటాషియం సైనేడ్‌తోనే చనిపోయిందన్న సంగతి తెలిసింది. అందుకే కాబోలు రామకృష్ణ బిస్వాస్‌కు ప్రీతి ఉంపుడు గత్తె అని రాశారు. ప్రీతిలత పేరు మన చరిత్రలో మరొక కోణం నుంచి కూడా నమోదు కావలసి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆయుధం ఎత్తిన తొలి బెంగాలీ యువతి ప్రీతిలత. -
ఉద్యమ సూరీడు
‘మరణం నా తలుపు తడుతోంది. నా మనస్సు అనంతత్వం వైపు ఎగిరిపోతోంది. అలాంటి ఆహ్లాదకర, అలాంటి తీక్షణ, అలాంటి గంభీర క్షణంలో నేను మీకు ఏం ఇవ్వగలను? ఒక్కటే ఒక్కటి ఇవ్వగలను! అది నా కల. నా బంగారు స్వప్నం ఇవ్వగలను. ఏప్రిల్18, 1930న జరిగిన చిట్టగాంగ్ తూర్పు దిక్కు తిరుగుబాటును మరచిపోకండి! భారతమాత స్వేచ్ఛ కోసం త్యాగాలు చేస్తూ బలిపీఠాలు ఎక్కిన దేశభక్తుల పేర్లు మీ గుండెలలో లిఖించుకోండి! ’ఒక విప్లవకారుడు తన సహచరులకి రాసిన ఆఖరి లేఖ ఇది. ఆ ఉత్తరం రాసిన తరువాత ఆయనను ఉరి తీశారు. బ్రిటిష్ పాలన నాటి జైళ్ల గోడలకి నోరొస్తే మొదట తీవ్ర జాతీయవాదుల మీద జరిగిన అకృత్యాల గురించి చెబుతాయి. చిట్టగాంగ్ కేంద్ర కారాగారపు గోడలు మాత్రం ఆ విప్లవకారుడి మీద జరిగిన చిత్రవధ గురించి పలుకుతాయి. ఆ ఉరి కంబానికి నోరుంటే ఆ శిక్ష అమలైన తీరు ఎంత ఘోరమో మొదట చెబుతుంది. కారాగారంలోని గదిలో నుంచి ఆ విప్లవకారుడిని బ్రిటిష్ పోలీసులు, అధికారులు ఈడ్చుకుని వచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో హింసించారు. పరమ కిరాతకంగా ప్రవర్తించారు. సుత్తితో కొట్టి పళ్లన్నీ ఊడగొట్టారు. చేతులూ కాళ్లూ సుత్తితోనే కొట్టి విరిచేశారు. కీళ్లు బద్దలుకొట్టారు. అన్ని గోళ్లు ఊడబెరికారు. అంత బాధను ఆయన మౌనంగానే భరించడం విశేషం. ఆఖరికి స్పృహ తప్పిన ఆ దేహాన్నే ఉరికంబం ఎక్కించి, శిక్ష అమలు చేశారు. భౌతికకాయాన్ని ఒక బోనులో పెట్టి సముద్రంలోకి విసిరేశారు. జనవరి 12, 1934న ఈ ఘాతుకం జరిగింది. సూర్యకుమార్ సేన్ అనే విప్లవవీరుడి మరణ దృశ్యమిది. సూర్యసేన్గా, మాస్టర్‌దా పేరుతో ప్రసిద్ధుడైన ఆయనంటే శ్వేతజాతికి ఎందుకంత ద్వేషం? ఆయన మీద అంత క్రూరత్వం ఎందుకు? సూర్యసేన్ (మార్చి 22, 1894–జనవరి 12, 1934) వంగదేశంలోని చిట్టగాంగ్ దగ్గరి నవ్‌పారాలో జన్మించారు (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది). తండ్రి నిరంజన్ సేన్. తల్లి శీలాబాలా దేవి. నిరంజన్ ఉపాధ్యాయుడు. సూర్యసేన్ మొదట తీవ్ర జాతీయవాదిగా విప్లవోద్యమంలో పనిచేశారు. కొద్దికాలం భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. చిట్టగాంగ్ జిల్లా శాఖ అధ్యక్షుడు కూడా అయ్యారు. మళ్లీ విప్లవోద్యమం వైపే నడిచారు. వంగ భంగ (బెంగాల్ విభజన) సమయంలో సేన్ నవ్‌పారాలో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం తరువాత తీవ్ర జాతీయవాదంగా కూడా పరిణమించింది. చిట్టగాంగ్‌లోనే ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు తన అధ్యాపకుల నుంచి తొలిసారి భారత స్వాతంత్య్రోద్యమం గురించి ఆయన విన్నారు. పైగా ఆనాడు బెంగాల్లో అనేక తీవ్ర జాతీయవాద సంస్థలు పనిచేసేవి. వాటిలో అనుశీలన్ సమితి ఒకటి. శరత్‌చంద్రబోస్ ఈ సంస్థను ఆరంభించారు. శరత్చంద్రకు స్వామి వివేకానంద, సిస్టర్ నివేదితల అండ ఉండేది. అనుశీలన్ సమితి సాయుధ పంథాని నమ్మింది. సంస్థ కోసం నిబద్ధతతో పనిచేస్తామని కొత్త సభ్యుల చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించేవారు. బెంగాలీల ఆరాధ్యదేవత కాళీమాత బొమ్మ ఎదురుగా ఆయుధాలను వినియోగించడంలో వారు తర్ఫీదు తీసుకునేవారు. సతీశ్‌చంద్ర చక్రవర్తి అనే అధ్యాపకుడు సమితిలో పనిచేసేవారు. ఆయన ప్రోద్బలంతో సేన్ అనుశీలన్ సమితిలో సభ్యుడయ్యారు. అనుశీలన్ సమితి అనే పేరు బంకించంద్ర ఛటర్జీ రాసిన ఒక వ్యాసం నుంచి విప్లవకారులు తీసుకుని తమ సంస్థకు పెట్టుకున్నారు. తరువాత 1916 నాటికి బీఏ చదవడానికి సేన్ బెర్హంపూర్ వెళ్లారు. అక్కడ యుగాంతర్ పార్టీలో చేరారు. ఇది కూడా తీవ్ర జాతీయవాద సంస్థే. సాయుధ పంథాను నమ్మేదే. 1918లో బీఏ పూర్తి చేసి చిట్టగాంగ్ వచ్చిన సేన్ నందన్‌కానన్ అనే చోట ఉపాధ్యాయునిగా చేరారు. అక్కడ జుగాంతర్ పార్టీని స్థాపించడానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఇంగ్లిష్ వారి చమురు సంస్థలో, టీతోటలో సమ్మె జరిగితే దానిని సూర్యసేన్ నాయకత్వంలోని యుగాంతర్ పార్టీ చిట్టగాంగ్ శాఖ సమర్థించింది. జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి నిరసనగా ఉద్యమం నిర్వహించింది. సేన్ గొప్ప వక్త. మనుషులను ఏకం చేయగలిగే ఆకర్షణ ఉన్నవారు. నిర్వహణా సామర్థ్యం కలవారు. అందుకే అనతికాలంలోనే అందరి చేతా మాస్టర్‌దా అని పిలిపించుకునేటంత గౌరవం సంపాదించారు. ఆ తరువాతే సేన్ జీవితం చిన్న మలుపు తిరిగింది. 1921లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపునిచ్చారు. పైగా కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలోనే ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానం విషయంలో చిత్తరంజన్‌దాస్ కీలకంగా వ్యవహరించారు. దాస్‌తో సేన్‌కు సాన్నిహిత్యం ఉండేది. ఏమైనప్పటికీ ఆ సమయంలో సేన్ కూడా జాతీయ కాంగ్రెస్ పట్ల, గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షణ పెంచుకున్నారు. కానీ 1922 ఫిబ్రవరిలో జరిగిన చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం నిలిపివేశారు. ఆయన నిర్ణయం దేశంలో ఒక నిరాశా ప్రభంజనాన్ని వదిలిపెట్టింది. రాజకీయ శూన్యాన్ని ఏర్పరించింది. యువకులలో ఎక్కువ మంది కాంగ్రెస్ అప్పటిదాకా బోధించిన అహింసా, విన్నపాల మార్గం మీద ఒక్కసారిగా నమ్మకం కోల్పోయారు. విశాఖమన్యంలో రామరాజు, ఉత్తర పరగణాలలో చంద్రశేఖర ఆజాద్, చిట్టగాంగ్‌లో సూర్యసేన్ అలాంటి వారే. బ్రిటిష్ జాతి నుంచి దేశానికి విముక్తి కల్పించడమనేది ఒక్క సాయుధ సమరంతోనే సాధ్యమని వీరంతా నమ్మారు. బ్రిటిష్ వారి ఆయుధాలను దొంగిలించాలి. వాటితోనే బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయాలి. ఇందుకు గెరిల్లా పోరాట పంథాను అనుసరించాలి. చిత్రంగా రామరాజు, ఆజాద్, సేన్ ముగ్గురిదీ ఒకటే ఆలోచన. ఒకటే వ్యూహం. వీరు ఒకరికి ఒకరు తెలియదనే చెప్పాలి. తెలిసే అవకాశం లేదు. ఒక కాలం, ఆ కాలం పంచిన క్షోభ వీరిలో ఏకాభిప్రాయానికి ఆస్కారం కల్పించింది. కానీ సేన్ మధ్య మధ్య మళ్లీ కాంగ్రెస్ కార్యకలాపాలలో కూడా పాలు పంచుకునేవారు. సూర్యసేన్ దాదాపు తను పుట్టి పెరిగిన చిట్టగాంగ్‌ను తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. గణేశ్ ఘోష్, లోక్‌నాథ్ బాల్, అంబికా చక్రవర్తి, అనంత్‌సింగ్, నిర్మల్ సేన్, అన్రూప్సేన్, నాగేశ్ సేన్, చారుబికాస్ దత్ వంటి విప్లవకారులతో తన ఉద్యమం నిర్వహించారు. కల్పనా దత్, ప్రీతిలాల్ వదేదార్ అనే ఇద్దరు మహిళలు కూడా ఆయన ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. చిట్టగాంగ్‌లో విప్లవ సేనల ప్రభుత్వం ఏర్పడింద -
బ్రిటిషర్లు కట్టిన బ్రిడ్జీలే నయం..!
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత కట్టిన రైల్వే వంతెనలతో పోలిస్తే బ్రిటిష్ హయాంలో కట్టిన కొన్ని వంతెనలే పటిష్ట స్థితిలో ఉన్నాయని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) అభిప్రాయపడింది. ‘భారతీయ రైల్వేల్లో వంతెనల నిర్వహణ’ పేరిట రూపొందించిన నివేదికను కాంగ్రెస్ నేత ఖర్గే నేతృత్వంలోని పీఏసీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైల్వే వంతెనల నిర్మాణం నాసిరకంగా ఉండటానికి అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని నివేదికలో తెలిపింది. వంతెనల నిర్మాణంలో రైల్వే శాఖ అలసత్వం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందని వ్యాఖ్యానించింది. 3,979 రైల్వే వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వగా, 2015 నాటికి కేవలం 710 బ్రిడ్జీలే పూర్తికావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
బీజేపీకే ఎక్కువ కష్టాలు
బ్రిటిష్ పాలనలో కాంగ్రెస్ కూడా ఇన్ని ఎదుర్కోలేదు * అన్ని పార్టీల కంటే ఎక్కువ త్యాగాలు చేసింది మా పార్టీనే * ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు * బీజేపీ నూతన ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన న్యూఢిల్లీ: బ్రిటిష్ వారి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ప్రతికూలతలకంటే స్వతంత్ర భారతదేశంలో బీజేపీ ఎక్కువ కష్టాలను ఎదుర్కొందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల కంటే ఎక్కువ త్యాగాలు చేసినదిబీజేపీనే అన్నారు. అయితే బీజేపీ మంచి ప్రయత్నాలన్నింటినీ చెడు దృష్టితో చూస్తున్నారని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో బీజేపీ నూతన ప్రధాన కార్యాలయానికి మోదీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేతలు అద్వానీ, రాజ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరినీ కలుపుకుని ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ నినాదాన్ని సార్థకం చేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. ‘‘పుట్టినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఏకైక పార్టీ బీజేపీ. ప్రతి మలుపులోనూ అది ప్రతికూలతలు ఎదుర్కొంది.’’ అని మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, కోల్‌కతాలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు జాగా దొరకలేదని, ఎందుకంటే ఎవరైనా తమకు చోటిస్తే వారు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికార టీఎంసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ మాతృసంస్థ జన్‌సంఘ్ 1969లో మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే వరకూ దాన్ని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు పట్టించుకోలేదని, వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పటికీ మనం ఎంత ఎదిగామో చూసి వారంతా ఆశ్చర్యపోయారన్నారు. వారంతా ప్రజల ద్వారా మన గురించి తెలుసుకోవాలని భావించారని, కానీ ఎప్పుడూ మనల్ని సరిగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. పార్టీ కొంత మంది నాయకులు, ప్రధాని, సీఎంలపై ఆధారపడి అభివృద్ధి చెందలేదని, లక్షలాది మంది కార్యకర్తలతోనే ఇది సాధ్యపడిందన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి దేశంకోసం, ప్రజాస్వామ్యం కోసం ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి తెలియజెప్పాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమిత్‌షా మాట్లాడుతూ.. పార్టీ ఇప్పుడు ఉచ్ఛస్థితిలో ఉందని, ప్రజల మద్దతును నిలబెట్టుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని కొనియాడారు. రెండెకరాలు.. ఆరు అంతస్తులు రెండెకరాల్లో పార్టీ సంసృతిని, జాతీయవాదాన్ని ప్రతిబింబించేలా ఆరు అంతస్తుల్లో బీజేపీ నూతన కార్యాలయానికి రూపకల్పన చేశారు. జిల్లా, బ్లాక్ స్థాయి కార్యకర్తలతో అనుసంధానమయ్యేలా కమ్యూనికేషన్ వ్యవస్థ, కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పించనున్నారు. ఈ కార్యాలయంలో 2 వేల నుంచి 3 వేల మంది కార్యకర్తలతో సమావేశం కావొచ్చు. కాగా, గురువారం రెండున్నర గంటల పాటు ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. 2018 డిసెంబర్ నాటికి ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తుందని పార్టీ అంచనా. -
తెల్లదొరలూ.. శ్రీవారి సేవకులే
టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు 1. దిట్టం 2. కైంకర్యపట్టీ 1801-1820 3. బ్రూస్‌కోడ్ 1821 4. సవాల్-ఇ- జవాబ్ 1819 5. పైమేయిషి అకౌంట్ సాక్షి, తిరుమల: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుమలలో బ్రిటీష్ పాలనపై సవివరమైన కథనం... 1801 నుంచి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటీష్ ఈస్టిం డియా కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి. ఆలయ సిబ్బంది, అర్చకులు, జీయర్ల మధ్య సఖ్యత కొరవడిందని చరిత్ర. దీంతో బ్రిటీష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలన గాడిలో పెట్టారట. ఆనాడు నార్త్ ఆర్కాట్ జిల్లా తొలి బ్రిటీష్ కలెక్టర్ స్టాటన్ దొర. తిరుమల విస్తీర్ణం, ఆలయ సిబ్బంది, వారి హోదా, జీత భత్యాలు, ఆలయ నిర్వహణ వ్యయం, నైవేద్యం, ఆర్జిత సేవల నిర్వహణపై ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి కలెక్టర్ స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలన జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు. దిట్టం శ్రీవారికి నిత్యం సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాలు తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే సరఫరా చేసి పుష్పకైంకర్యం నిర్వహిస్తున్నారు. కొండ లడ్డూ ఇప్పటికీ రుచిగా ఉండడానికి ప్రధాన కారణంగా దిట్టంలో పేర్కొన్న ప్రమాణాలే. ఆ ప్రకారమే సరుకులు సరఫరా చేసి నిత్యం లడ్డూలు, ప్రసాదాలు తయారు చేస్తారు. కైంకర్యపట్టీ తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీదారులు, జీయ్యర్ సిబ్బంది విధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చేశారు. దీని ప్రకాారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి. ఈ పట్టీ రికార్డులు నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్, తిరుపతి తహశీల్దార్, తిరుమల ఆలయ పారుపత్తేదారు వద్ద ఉంటాయి. బ్రూస్‌కోడ్ దేవస్థానం పాలనకు మార్గదర్శంగా బ్రూస్‌కోడ్ ఉంది. బ్రిటీష్ ప్రావిన్సియల్ జడ్జి పి.బ్రూస్ ఈస్టిండియా కోడ్ ఆఫ్ డెరైక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు 1821, జూన్ 25న ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. ఈ కోడ్ లోని మార్గదర్శక సూత్రాల ప్రకారమే పాలన సాగాలని మద్రాసు బ్రిటీషు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి ధార్మిక సంస్థలో బ్రూస్‌కోడ్ అమలైంది. సవాల్-ఇ-జవాబు శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నం చేసింది. 1819లో 14 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే సవాల్-ఇ-జవాబు పట్టీగా పిలుస్తారు. పైమేయిషి అకౌంట్ ఆలయ స్థిర, చరాస్తులు, దేవతా విగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషి అకౌంట్’ అని పిలుస్తారు. ధార్మిక సంస్థ పరిపాలనలో రికార్డులు, విధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది. 1843లో ఆలయ ధర్మకర్త (విచారణకర్త)గా శ్రీహథీరాం మఠం మహంతు దేవాదాస్ను నియమిస్తూ పరిపాలన బాధ్యతలు అప్పగించడంతో తిరుమల ధార్మిక సంస్థలో ఈస్టిండియా పాలన ముగిసింది. శేషాచలం హద్దుల ఖరారు ప్రభుత్వ జీవో నెంబరు 713, తేదీ 18.11.1876 ప్రకారం 4.5 చదరపు మైళ్లు అంటే 12.5 చదరపు కిలోమీటర్లు అటవీ భూమిని నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి షెఫిల్ తిరుమల ఆలయానికి కేటాయించారు. ఆ మేరకు తిరుమల ఆలయ పరిపాలనాధికారి హథీరాంమఠం మహంతు ధర్మదాస్‌కు అప్పగించారు. జీవో ఎంఎస్ నెంబరు 4429 తేదీ 23.09.1940, జీవో ఎంఎస్ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ఉత్తర్వుల ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చ.కి స్థల విస్తీర్ణ పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు ఆనాడు బ్రిటీషు పాలకులు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండడం వారి పరిపాలన దక్షతకు నిదర్శనం. స్వామి సేవలో తరించిన తెల్లదొరలు పదహారు వందల సంవత్సరం తర్వాత ఆంగ్లేయులు, ఆ తర్వాత ఈస్టిం డియా కంపెనీ, వీరి నేతృత్వంలో మద్రాసు రాష్ట్ర రెవెన్యూ బోర్డు ఆధ్వర్యంలో ఉత్తర ఆర్కాటు జిల్లా కలెక్టర్ (1817 నాటి ఏడో మద్రాసు శాసనం ఆధారంగా) 1843 వరకు ఆలయ పరిపాలన సాగింది. 1843 ఏప్రిల్ 21వ తేదీ అప్పటి కలెక్టర్ ‘సనద్’ నివేదిక ప్రకారం ఆలయ పాలన హథీరాంజీ మఠం మహంతుల చేతుల్లోకి వెళ్లింది. 1843 జూలై 10 తేదీ నుంచి ఆలయానికి తొలి విచారణకర్త/ ధర్మకర్తగా మహంత్ సేవాదాస్ బాధ్యతలు చేపట్టారు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే అన్న ప్రసాదాలు పెట్టే రాగి గంగాళాన్ని ‘మన్రో గంగాళం’ అంటారు. ఒకప్పుడు దత్తత మండలం (నేటి రాయలసీమ) కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్ మన్రో అనే బ్రిటీష్ అధికారి స్వామిని దర్శించుకోవాలని తపించేవాడట. కారణం తెలియదు కాని ఆయన కోరిక మాత్రం తీరలేదని చరిత్ర. కానీ ఆయన బహూకరించిన రాగి గంగాళంలోనే నేటికి శ్రీనివాసుడికి నైవేద్య ప్రసాదం అందుతోంది. కింగ్‌జార్జ్, విక్టోరియా రాణి చిత్రాలు ఉన్న 492 నాణేలతో స్వామికి హారా న్ని తెల్లదొరలు తయారు చేయించారు. ఆలయంలో మూలమూర్తికి 1972 ముందు ఈ హారాలనే వినియోగించేవారు. ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా ఆభరణాలు విరాళంగా అందుతుండడంతో పురాతన ఆభరణాలను టీటీడీ ఖజానాలో భద్ర పరిచింది. మరికొన్నింటిని కరిగించి బంగారు బార్లుగా మార్పిడి చేసి జాతీయ బ్యాంకుల్లో ఆస్తుల రూపంలో భద్ర పరిచారు. భక్తులు కానుకలు సమర్పించే హుండీ/కొప్పెర కూడా ఈస్టిండియా కం పెనీ పాలన కాలంలో 1821, జూలై 25న ఏర్పాటు చేశారని ఆలయ పరి పాలనా విధానాలను నిర్ధేశించే చట్టం బ్రూస్‌కోడ్-12 ఆధారంగా ఉంది. స్వామి ప్రసాదంగా లడ్డూ అన్నది తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనల్లో ఉండగా, ఆ తర్వాత అమల్లేదన్నది ప్రచారం. 1803లో అప్పటి బ్రిటీషు ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలోని తెల్లదొరలే తిరుమల ఆలయంలో బూందీని ప్రసాదంగా పంచడం మొదలు పెట్టించారట. 1940 తర్వాత క్రమంగా బూందీ లడ్డూగా స్థిరపడింది. కాలినడక తప్ప మరొక మార్గంలేని శేషాచలం అడవిలో తొలిసారిగా 1944 ఏప్రిల్ 10వ తేదీ తిరుమలకు తొలి ఘాట్‌రోడ్డు ఏర్పాైటై నల్లరంగు చిన్న బస్సులు నడిచాయి. అప్పటి మద్రాసు ఉమ్మడి బ్రిటీషు గవర్నర్ ఆర్థర్ హూప్ నేతృత్వంలో భారతీయ ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో మొదటి ఘాట్‌రోడ్డు రూప కల్పన చేశారు. ఆ తర్వాత టీటీడీ ఆవిర్భవించిన నలభై ఏళ్లనాటికి అంటే 1973లో రెండో ఘాట్‌రోడ్డు నిర్మించి భక్తులకు ప్రయాణ సౌకర్యాలు పెంచారు. 1970 కి ముందు మొదటి ఘాట్ రోడ్డులో నడిచిన బస్సులు. -
ఆ జ్ఞాపకానికి 114 ఏళ్లు
చెక్కుచెదరని వల్లంపూడి పోలీస్‌స్టేషన్ భవనం ఆంగ్ల పాలకుల హయాంలో నిర్మితం వేపాడ: ఆంగ్ల పాలనలో వల్లంపూడిలో పోలీసు స్టేషన్ కోసం నిర్మించిన భవనం నేటికీ చెక్కు చెదరలేదు. అప్పట్లో నిర్మించిన పెంకుల భవనం, రాతి గోడలు నేటికీ దఢంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. భవనాన్ని నిర్మించి నేటికి 114 ఏళ్లవుతోందని గ్రామానికి చెందిన వయోవద్ధులు చెబుతున్నారు. ఆంగ్ల పాలకులు 1902లో వల్లంపూడిలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు బుదరాయవలస, మానాపురాల్లో ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్లు ఎప్పుడో నేలమట్టమయ్యాయి. వాటిస్థానంలో కొత్త భవనాలు నిర్మించారు. వల్లంపూడిలో ఐదేళ్ల క్రితం కొత్త భవనం నిర్మించినా, ఆంగ్ల పాలకులు నిర్మించిన భవనం నేటికీ వినియోగంలో వుండటం విశేషం. అప్పట్లో బల్లంకి, కష్ణారాయుడుపేట, కోరువాడ, కోడూరు గ్రామాల్లో దొంగలుండేవారు. వారు ముందస్తు సమాచారం ఇచ్చిమరీ చోరీకి పాల్పడేవారు. ఈ పరిస్థితుల్లో వల్లంపూడిలో పోలీసు స్టేషను ఏర్పాటు చేశారు. డీఎస్పీ వస్తే పల్లకి సేవ: షేక్ ఖాదర్ మొహిద్దీన్, స్వాతంత్య్ర సమరయోధుడు, వేపాడ వల్లంపూడి పోలీసు స్టేషనుకు రావాలంటే అప్పట్లో సరైన రహదారి ఉండేది కాదు. దీంతో సోంపురం వరకు వాహనంపై వచ్చిన డీఎస్పీని పల్లకిలో వల్లంపూడికి మోసుకొచ్చేవారు. ఆయన వస్తే ఇక్కడ రెండ్రోజులుండి వెళ్లేవారు. ఆయనతో పాటు ప్రత్యేకంగా వంట మనిషిని తీసుకొచ్చేవారు. అప్పట్లో స్టేషనులో 10 మంది కానిస్టేబుళ్లు, ఒక రైటర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉండేవారు. -
కత్తి అంచున కలంతో కవాతు
‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’ వ్యాసాలలో మార్క్స్ భారతదేశంలో బ్రిటిష్ పాలనను సునిశితంగా పరిశీలించారు. రైల్వేల నిర్మాణం తీసుకొచ్చే ప్రగతి ద్వారా సామాజిక అంతరాలు కొంత తగ్గుతాయని భావించారు. ‘‘భారత ప్రజల మధ్య ఉన్న విభేదాల వల్ల ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా లేకుండా పోయింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బ్రిటిష్ వారికి సహకరించారు. దానితో ఆ తిరుగుబాటును అణచివేయడం బ్రిటిష్ వారికి సాధ్యపడింది’’ అని ఆయన విశ్లేషించారు. కార్మికుడి చెమటచుక్కల్లోనే పెట్టుబడిదారుడి దోపిడీ మూలాలున్నాయని తేల్చిచెప్పిన కార్ల్ మార్క్స్‌లోని మరో కోణం ఆయన జర్నలిస్టుగా పని చేయడం. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంపై ‘‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’’కు రాసిన ఒక వ్యాసంలో ఆయన ఆనాటి భారతదేశ పరిస్థితులను ఇలా వర్ణించారు:‘‘ఇండియాలో బ్రిటిష్ పరిపాలన దౌర్జన్యాల పుట్టగా ఉందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రజలను రకరకాల పద్ధతుల్లో అన్యాయానికి, అణచివేతకు గురిచేసిన విదేశీ పాలకులను పారదోలడానికి ఆ దేశ ప్రజలు ప్రయత్నించడం సమర్థనీయమే. నిష్పక్షపాతులైన విజ్ఞులందరూ ఈ విషయంలో సానుకూలంగానే ఉంటారని భావిస్తాను. వారి దుర్మార్గాలను హిందూ దేశీయులపై నెట్టివేస్తూ, బ్రిటిష్ పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పైగా ప్రజల తిరుగుబాటును ఒక నేరంగా చూపిస్తున్నారు.’’ పాత్రికేయునిగా మార్క్స్ కార్ల్ మార్క్స్ లండన్‌లో నివసిస్తున్న సమయంలో 1853 నుంచి 1858 వరకు అమెరికాలోని న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు రాసిన దాదాపు 500 వ్యాసా లలో ఇండియాపై రాసిన వ్యాసాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటివలన్లే భారతదేశంలో ఆనాడు నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మార్క్స్ దృష్టితో మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కారణాలను, తదనంతర పరిణామాలను విశ్లే షిస్తూ ఆయన రాసిన వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి. మార్క్స్ మిత్రుడు, కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలలో ఒకరైన ఫ్రెడరిక్ ఎంగెల్స్ కూడా అదే పత్రికలో భారతదేశ స్థితిగతులపై ఏడు వ్యాసాలు రాశారు. నిజానికి కార్ల్ మార్క్స్ తన విశ్వవిద్యాలయ విద్య ముగిసిన తర్వాత చేపట్టినది పాత్రికేయ వృత్తినే. మార్క్స్ చేసిన మొదటి, ఏకైక ఉద్యోగం కూడా అదే. 1818లో జర్మనీలోని ట్రయర్ నగరంలో జన్మించిన కార్ల్ మార్క్స్ అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1836 అక్టోబర్ 22న బెర్లిన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యలో చేరారు. ఆ తర్వాత తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడై 1939లో ‘‘డెమొక్రటస్-ఎపిక్యూరస్ ప్రకృతి తత్వాల మధ్య వ్యత్యాసం’’ అన్న అంశంపై పరిశోధన ప్రారంభించి, 1841 నాటికి ముగించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ట్రయర్కు తిరిగి వచ్చాడు. ప్రష్యాలోని రైన్ రాష్ట్రం నుంచి 1842లో ‘‘రైనిష్ జెటుంగ్’’ అనే పత్రిక ప్రచురణ మొదలైంది. మార్క్స్ చొరవను, రచనాశక్తిని చూసిన ప్రచురణకర్తలు ఆ పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వ హించాలని ఆయనను ఆహ్వానించారు. 1842 అక్టోబర్‌లో ఆయన ‘‘రైనిష్ జెటుంగ్’’ సంపాదక బాధ్యతలు స్వీకరించారు. తన విజ్ఞానదాయకమైన, రాజకీయ విశ్లేషణలతో మార్క్స్ ఆ పత్రికకు ఊపిరి అయ్యాడు. అయితే మొదటి నుంచే కమ్యూనిస్టు పత్రికగా ముద్రపడ్డ ఆ పత్రికను 1843 మార్చి 31న ప్రభుత్వం నిషేధించింది. యజమానులు ప్రభుత్వంతో రాజీపడగా మార్క్స్ దానికి రాజీనామా చేశారు. సంపాదకుడిగా తాను.. సమాజంలో భౌతికమైన కోర్కెలు ఎంత పెద్ద పాత్రను నిర్వహిస్తాయో, బూర్జువా వర్గ కపటత్వం, కుట్రతత్వం ఎలాంటివో తెలుసుకున్నానని అన్నాడు. ప్రష్యాలోని కొలోన్‌లో ఉద్యోగం వదులుకోవడంతో మార్క్స్‌కి జీవనాధారం కావాల్సి వచ్చింది. అందుకే పారిస్ వెళ్ళాలనుకున్నాడు. 1843 అక్టోబర్‌లో పారిస్ చేరుకున్న కార్ల్ మార్క్స్ కుటుంబం రాజకీయ ప్రవాస జీవితాన్ని మొదలు పెట్టింది. 1844 జనవరిలో మార్క్స్ సంపాదకత్వాన ‘‘ఫ్రెంచి జర్మన్ ఇయర్ బుక్’’ను ప్రారంభించారు. ఆ కాలంలో ప్రచురితమైన వ్యాసాలు, లేఖలు చూస్తే ఆయన విప్లవ ప్రజాతంత్ర వాదం, కమ్యూనిజం వైపు మొగ్గాడని అర్థం అవుతుంది. అయితే, 1845 జనవరిలో పారిస్ ప్రభుత్వం ఆయన రచనలకు బెదిరి, 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. దానితో మార్క్స్ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరారు. మొదటి కమ్యూనిస్టు విప్లవ పత్రిక 1845 నుంచి 1948 వరకు కార్ల్ మార్క్స్ ఎన్నో ముఖ్యమైన పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యమైనది కమ్యూనిస్టు ప్రణాళిక. ఇది ఫిబ్రవరిలో అచ్చయ్యింది. అయితే ఏప్రిల్‌లో మార్క్స్, ఎంగెల్స్‌లు ప్రష్యాలోని కొలోన్ చేరుకున్నారు. అక్కడ కమ్యూనిస్టు లీగ్ చాలా శక్తివంతమైన సంస్థగా ఎదిగింది. దాని తరఫున మార్క్స్ 1848, జూన్ 1 నుంచి ‘‘నియోరైనిష్ జెటూంగ్’’ అనే పత్రికను ప్రారంభించాడు. ఎంగెల్స్ దీని ప్రచురణ బాధ్యతలను చూడడంతో పాటు, ఎన్నో వ్యాసాలను రాశారు. ‘‘అవి విప్లవాత్మక దినాలు. అలాంటి రోజుల్లో దిన పత్రికల్లో పనిచేయడం ఎంతో ఉల్లాసకరమైన పని. ప్రతి మాటా ఎంత శక్తివంతమైందో ప్రత్యక్షంగా అలాంటి సమయంలోనే తెలుస్తుంది. తమ వ్యాసాలు చేతి బాంబుల్లా పేలడాన్ని రచయితలు గమనిస్తారు.’’ అంటూ ఎంగెల్స్ ఆ పత్రిక ప్రాముఖ్యాన్ని తెలిపారు. 1849 మే తిరుగుబాట్లను రక్తపాతంతో అణచివేయడం మొదలు పెట్టిన ప్రష్యన్ మిలిటరీ రాజ్యం మార్క్స్ సంపాదకత్వంలోని ‘‘నియోరైనిష్ జెటూంగ్’’పై దాడికి దిగింది. 24 గంటలలోగా ప్రష్యాను వదిలిపెట్టవలసిందిగా మార్క్స్‌ను ఆదేశించింది. పోలీసుల వేధింపులు ఎక్కువ కాగా ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ పత్రిక మూతపడింది. పత్రికను మూసివేస్తూ చివరి రోజున ఎంగెల్స్ ‘‘మేము మా కోటను స్వాధీనం చేయాల్సి వస్తున్నది. అయితే మా ఆయుధాలు, సామాను మూటగట్టుకొని ఉపసంహరించుకుంటాం. మా పతాకాన్ని ఎగురవేస్తూనే ఉంటాం. ఆఖరి సంచిక బ్యానర్ అరుణ పతాకమే’’ అని రాశారు. శాస్త్రీయ కమ్యూనిజం ప్రాతిపదికగా, విప్లవోద్యమం కోసం కృషి చేసిన మొదటి దినపత్రిక చరిత్ర అలా ముగిసింది. మార్క్స్ ముఖ్యమైన పనులన్నీ ముగించుకుని జర్మనీకి వెళ్ళాడు. అక్కడా పరిస్థితులు అనుకూలంగా లేక పారిస్‌కు వెళ్ళాడు. అక్కడా పరిస్థితులు బాగా లేక తప్పని పరిస్థితుల్లో ఆయన లండన్ చే రారు. 1849 ఆగస్టు, 26న లండన్‌లో కాలు మోపిన మార్క్స్ కొత్త పత్రిక పెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘నియోరైనిష్ జెటూంగ్’ను దిన పత్రికగా గాక, మాస పత్రికగా తేవాలనుకున్నారు. దానిని రాజకీయ, ఆర్థిక సమీక్షగా ఉంచాలనుకున్నారు. 1850 మార్చి నెలలో 2,500 కాపీలతో మొదటి సంచిక వెలువడింది. అయితే ఉద్యమాలు దెబ్బతినడంతో ఆ మాస పత్రికను నడ పడం కూడా కష్టమైంది. కొన్ని సంచికల తర్వాత అదీ మూతపడింది. మార్క్స్ దృష్టిలో భారతదేశం ఈ క్రమంలోనే అమెరికాలోని ‘‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’’కు మార్క్స్ 1853 నుంచి లండన్ విలేకరిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఆ పత్రికకు రాసిన వ్యాసాలలో ఆయన భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనను సునిశిత దృష్టితో పరిశీలించారు. శిస్తు వసూళ్లలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన అమానుషాలను ఆయన తన వ్యాసాల ద్వారా అక్కడి ప్రజల ముందుంచారు. ‘‘మా ప్రాంతం తహశీల్దారు మా దగ్గర నుంచి కఠినంగా భూమిశిస్తు వసూలు చేయడం మొదలు పెట్టాడు. నన్ను, మరికొందరు రైతులను నిర్బంధించారు. మమ్మల్ని రోజూ ఎండలో వంగోబెట్టి మా వీపుల మీద బండలు పెట్టి, మండుతున్న ఇసుకలో నిలబెట్టేవారు. అటువంటి దుర్మార్గం మూడు నెలలపాటు సాగింది’’ అంటూ ఒక రైతు వ్యధను ఆయన ఎంతో హృద్యంగా ఒక వ్యాసంలో అభివర్ణించారు. భారతదేశంలో రైల్వేల నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ, రైల్వేలు, రోడ్డుమార్గాలు లేకపోవడం వల్ల ఏ గ్రామానికి ఆ గ్రామం విసిరివేసినట్టుండి, చీకట్లో మగ్గుతున్నాయనీ, రైల్వేల నిర్మాణం ఆ లోటును భర్తీ చేస్తుందనీ అభిప్రాయపడ్డారు. సామాజిక అంతరాలు కూడా ఈ రైల్వేలు తీసుకొచ్చే ప్రగతి ద్వారా కొంత తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 1853లో రాసిన ‘‘ఇండియాలో బ్రిటిష్ పరిపాలన, భావి ఫలితాలు’’ అన్న వ్యాసంలో భారత దేశం అనేకసార్లు పరాధీనం కావడానికి దారి తీసిన సామాజిక పరిస్థితులను ఎత్తి చూపారు. ‘‘మహ్మదీయుడు, హిందువు అనే వ్యత్యాసం వల్ల మాత్రమే కాకుండా, తెగకీ, తెగకీ, కులానికీ కులానికీ మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల దేశం చీలిపోయింది. సమాజంలో అసమానతల ఆధారంగా జీవనం సాగుతున్నది. ఇటువంటి దేశం ఎన్నిసార్లైనా ఓడిపోయి, బానిసత్వంలోకి వెళుతుంది’’ అని విశ్లేషించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం ఓటమి గురించి ప్రస్తావిస్తూ ‘‘భారత దేశంలోని ప్రజల మధ్య ఉన్న విభేదాల వల్ల ఆ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా లేకుండా పోయింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బ్రిటిష్ వారికి సహకరించారు. దానితో ఆ తిరుగుబాటును అణచివేయడం బ్రిటిష్ వారికి సాధ్యపడింది.’’ అని విశ్లేషించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అని పిలుపునిచ్చిన మార్క్స్ అందించిన మార్క్సిజం ప్రపంచమంతటా ఎన్నో విప్లవాలకు, ఉద్యమాలకు, తిరుగుబాట్లకు, శ్రామివర్గ దోపిడీ విముక్తికి ప్రేరణగా నిలిచింది. అరుదైన ప్రపంచ కార్మికవర్గ నాయకుడు కార్ల్ మార్క్స్ సమాజంలో దోపిడీ పీడనలున్నంత వరకు ప్రపంచ పీడిత వర్గాలకు మార్గదర్శిగా ఉంటాడు. (నేడు కార్ల్ మార్క్స్ జయంతి) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
స్వాతంత్య్ర జ్వాల...
జలియన్‌వాలా బ్రిటిష్ పాలనపై భారతీయుల తిరుగుబాటుకు తక్షణ ప్రేరణ... జలియన్‌వాలా బాగ్ దురంతం. ఈ ఘోర ఘటన తర్వాతే గాంధీజీ సహాయ నిరాకరణ మొదలైంది. నిరాకరణ నిరసన అయ్యింది. నిరసన సత్యాగ్రహం అయింది. సత్యాగ్రహం ఆయుధం అయ్యింది. ఆ ఆయుధమే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది. ‘అన్ని యుద్ధాలనూ అంతం చేయడానికి చేస్తున్న యుద్ధం’ అంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో నినాదం ఇచ్చిన ఇంగ్లండ్, ఆ తరువాత భారతీయుల మీద మాత్రం తన యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అందుకు నిలువెత్తు నిదర్శనమే జలియన్‌వాలా బాగ్ దురంతం (ఏప్రిల్ 13, 1919). గ్రేట్‌వార్ ముగిసిన కొన్ని నెలలకే ఈ ఘోరాన్ని ఇంగ్లండ్ చరిత్ర పుటల్లో నమోదు చేసింది. రెండువేల మంది దేశభక్తుల రక్తంతో తడిసిన నేల అని జలియన్‌వాలా బాగ్ స్మారక స్తూపం మీద రాసి ఉంటుంది. పిలుపు అందుకుంది పంజాబీలే! జలియన్‌వాలా బాగ్ నెత్తుటి కాండకు ఉన్న నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్‌వార్ చరిత్ర దగ్గరకు నడవాలి. నాటి భారత రాజకీయ, స్వాతంత్య్రో ద్యమ సన్నివేశాలను, మనోభావాలను శోధించాలి. ఆ యుద్ధంలో సిక్కులు చూపించిన తెగువను జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ప్రపంచ సంగ్రామంలో 13 లక్షల మంది భార త సైనికులు పాల్గొన్నారు. మొత్తం 74,000 మంది చనిపోయారు. మిగిలిన భారత భూభాగాల కంటే పంజాబ్.. బ్రిటిష్ జాతికి మరింత సేవ చేసిందనే చెప్పాలి. యుద్ధం ఆరంభించే సమయానికి (1914) భారత వలస సైన్యంలో సిక్కుల సంఖ్య దాదాపు లక్ష. ‘యుద్ధంలో చేరి వీరత్వం ప్రదర్శించ’మంటూ ఇంగ్లండ్ ప్రభుత్వంలో వార్ కార్యదర్శి లార్డ్ కిష్నర్ ఇచ్చిన పిలుపునకు గాఢంగా స్పందించిన వారు పంజాబీలే. కిష్నర్ ప్రకటన తరువాత పంజాబీ సైనికుల సంఖ్య 3,80,000కు చేరుకుంది. అంతేకాదు, రెండుకోట్లు యుద్ధ నిధి ఈ ప్రాంతం నుంచి వెళ్లింది. పది కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిటిష్ ప్రభుత్వం విక్రయించిన వార్ బాండ్లను తీసుకున్నది కూడా పంజాబీలే. కానీ యుద్ధంలో వీరు అనుభవించిన వేదన వర్ణనాతీతం. ‘‘... రోజూ వేలమంది మనుషులు చనిపోతున్నారు... చూడబోతే యుద్ధం ముగిసే సరికి రెండు వైపులా ఒక్కరు కూడా మిగిలేటట్టు లేరు. అప్పుడు శాంతి నెలకొనకుండా ఉంటుందా?’’ అంటూ ఇషేర్సింగ్ (59వ సిఖ్ రైఫిల్స్ దళ సభ్యుడు) పంజాబ్‌లోని తన మిత్రుడికి రాసిన లేఖ (మే 1, 1915) లోని ఈ మాటలు ఆ వేదనకు ఒక నిదర్శనం. భారతదేశం మొత్తం మీద ప్రతి 150 మందికి ఒకరు యుద్ధానికి వెళితే, ప్రతి 28 మంది పంజాబీలకూ 1 సిపాయి వంతున ప్రపంచ యుద్ధంలో పోరాడాడు. గాంధీజీపై అనిబిసెంట్ ఆగ్రహం! ఆ ఘోర యుద్ధంలో వలస భారత సైనికులను ఉపయోగించుకోవడం మీద ఆనాటి స్వాతంత్య్రోద్యమ నేతలలో ఏకాభిప్రాయం లేదు. చెప్పాలంటే గట్టి వ్యతిరేకతే ఉంది. యుద్ధం చేస్తున్న ఇంగ్లండ్ అవసరాలను తీరుస్తానంటూ ముందుకొచ్చిన గాంధీజీ సైతం విమర్శలపాలు కావలసి వచ్చింది. ఊరికి 20 మంది బలశాలురైన యువకులు చేరాలంటూ గుజరాత్ ప్రాంతమంతా గాంధీజీ పాదయాత్ర చేశారు. మొత్తానికి నలభై మంది మాత్రం చేరారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకో వలసిందిగా సర్దార్ పటేల్‌ను గాంధీజీ కోరినా ఆయన నిరాకరించడం విశేషం. అహింసా సిద్ధాంతం వదిలి గాంధీజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనిబిసెంట్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. గాంధీజీని ఆమె ‘రిక్రూటింగ్ సార్జెంట్’ అని ఎద్దేవా చేశారు. అయినా గాంధీజీకి ఒక ఆశ. ఆ యుద్ధంలో బ్రిటన్‌కు సహకరిస్తే, భారతీయుల ‘స్వరాజ్యం’, ‘స్వయం పాలన’ కోరికలకు కదలిక వస్తుందని అనుకున్నారు. కానీ యుద్ధంతో సతమత మవుతున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవాలన్నది చాలామంది తీవ్ర జాతీయవాదుల ఆశయం. అందులో గదర్ పార్టీ ప్రధానమైనది. ఈ పార్టీలో ఎక్కువ మంది పంజాబ్, బెంగాల్ ప్రాంతాల నుంచి వచ్చినవారే (తెలుగు ప్రాంతం నుంచి దర్శి చెంచయ్య వెళ్లి ఈ పార్టీలో పనిచేశారు). 1857 తరహాలో 1915 ఫిబ్రవరిలో ఒక తిరుగుబాటు తేవాలన్న యోచన కూడా బలీయంగా ఉంది. ఇలాంటి విస్తృత పథకానికి వ్యూహం పన్నినవారు అమెరికా, జర్మనీ దేశాలలో ఉండి భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్నవారే. ఇందుకు 1914 నుంచి 1917 వరకు చాలా కృషి జరిగింది. కానీ గదర్ పార్టీలోకి గూఢచారులు చొచ్చుకుపోవడం వల్ల రహస్యాలు బయటకు పొక్కి పథకం విఫలమైంది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం -1915 ఈ పరిణామాల ఫలితమే. దీనికి కొనసాగింపు సెడిషన్ కమిటీ 1918. సిడ్నీ రౌలట్ (న్యాయమూర్తి) దీని అధ్యక్షుడు. జర్మన్, బొల్షివిక్-భారత తీవ్ర జాతీయవాదుల మధ్య సంబంధాలను వెలికి తీయడం కూడా ఈ కమిటీ విధులలో ఒకటి. అలా వచ్చింది రౌలట్ చట్టం. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగమే జలియన్‌వాలాబాగ్ దురంతం. బాగ్ ఘటనకు బీజం ఇక్కడే! ఒక పక్క అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తూనే, మరోపక్క గ్రేట్‌వార్‌లో బ్రిటిష్ వారికి సాయం చేయాలని గాంధీజీ యోచించారు. సరిగ్గా ఈ అంశం మీదే ఉద్యమకారులు రెండు వర్గాలయ్యారు. అహింసా పథానికీ, భూగోళాన్ని రక్తంతో తడుపుతున్న మొదటి ప్రపంచ యుద్ధానికి చేయూతనివ్వడానికీ పొంతన లేదన్నదే తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం. అయినా గాంధీజీ అహింసాయుత పంథాలోనే ఎక్కువ మంది కాంగ్రెస్‌వాదులు నడిచారు. పంజాబ్ ప్రముఖులు డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ గాంధీజీ అహింసా ప్రబోధాలను విశ్వసించినవారే. ఈ ఇద్దరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఏప్రిల్ 10, 1919న అరెస్టు చేసి, రహస్య ప్రదేశంలో ఉంచింది. గాంధీజీ అహింసను ప్రజలకు తెలియచేసే క్రమంలో... అరెస్టయిన వీరి విడుదల కోసం హింసాత్మక ఉద్యమం మొదలైంది. మైఖేల్ ఓడ్వయ్యర్ అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్. అమృత్సర్ మిలిటరీ కమాండర్ - బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యర్. సత్యపాల్, కిచ్లూ అరెస్టయిన రోజునే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ (పంజాబ్) నివాసం ఎదుట ఆందోళన జరిగింది. కాల్పులు జరిగాయి. ముగ్గురు బ్యాంక్ అధికారులను కార్యాలయాల్లోనే జనం హత్య చేశారు. ఏప్రిల్ 11న మార్సెల్లా షేర్వుడ్ అనే మహిళా మిషనరీని సైకిల్ మీద నుంచి పడేసి చంపారు. ఈ పరిణామాల తరువాత సత్యపాల్, కిచ్లూలను విడుదల చేసి, సైనిక శాసనం విధించారు. అప్పుడే, అంటే ఏప్రిల్ 13న సిక్కుల పండుగ ైవె శాఖి వచ్చింది. సైనిక శాసనం గురించి తెలియని గ్రామీణ ప్రాంతాల సిక్కులు ఏటా అక్కడ జరిగే ఉత్సవానికి హాజరయ్యారు. ఆ ఉత్సవం తరువాతే సభ జరుగుతుందని గూఢచారుల ద్వారా జనరల్ డయ్యర్‌కు సమాచారం అందింది. డయ్యర్‌కు పార్లమెంట్ ప్రశంస! నిజానికి బాగ్‌లో కాల్పులు జరిపే ఉద్దేశం డయ్యర్‌కు లేదని నిక్ లాయిడ్ (ది అమృత్సర్ మేసకర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ వన్ ఫేట్ఫుల్ డే) అనే చరిత్రకారుడు అంటాడు. 90 మంది బలగం (బలూచీ, గూర్ఖా దళాలు)తో నగరంలో సైనిక శాసనం అమలును పర్యవేక్షిస్తున్నాడు డయ్యర్. ఆరేడు ఎకరాల బాగ్‌లో జరుగుతున్న సభ దగ్గరకు కూడా వచ్చాడు. అక్కడ 15 వేల నుంచి 25 వేల వరకు అక్కడ జనం ఉండడం గమనించి, వెంటనే కాల్పుల నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘట్టం రక్తదాహానికీ ప్రబల నిదర్శనం. అమానవీయతకు, వలసవాదానికీ మధ్య ఉండే బంధాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేసిన రక్తరేఖ. ఈ దురంతానికి పాల్పడిన డయ్యర్‌ను నాటి బ్రిటిష్ పార్లమెంట్ శ్లాఘించడమే విచిత్రం. టాగూర్ తిరిగి ఇచ్చేశారు! జలియన్‌వాలా బాగ్ కాల్పులు ప్రపంచ చరిత్రలోనే ఒక ఘోర ఉదంతం. చరిత్ర మీద కనిపించే దీని జాడే అందుకు నిదర్శనం. కాల్పుల సమాచారం తెలియగానే రవీంద్రనాథ్ టాగూర్ తన సర్ బిరుదును త్యజించారు (మే 22న గానీ ఘటన సంగతి బెంగాల్ చేరలేదు, గాంధీజీకి జూన్‌లో ఈ సంగతి తెలిసింది). జనరల్ డయ్యర్‌ను శిక్షించాలని బ్రిటిష్ ప్రముఖుడు విన్స్టన్ చర్చిల్ ప్రతినిధుల సభలో (జూలై 8, 1920న) కోరడం విశేషం. అమృత్సర్ అమానుషానికి బాధ్యునిగా ప్రసిద్ధికెక్కిన ఓడ్వయ్యర్‌ను మార్చి 13, 1940న లండన్ నగరంలో ఉన్న క్యాక్స్టన్ హాలులో రెండు దశాబ్దాల తరువాత ఉధమ్‌సింగ్ కాల్చి చంపాడు. పసితనంలో చూసిన ఆ బీభత్సం అతడిని ఈ హత్యకు పురికొల్పింది. తరువాత ఇంగ్లండ్ దమననీతి ఎలాంటిదో చూడండంటూ జర్మన్ అనుకూల దేశాలు తరువాత జలియన్‌వాలా బాగ్ దురంతం గురించి ప్రపంచమంతటా ప్రచారం చేశాయి. కొసమెరుపు: 1961, 1983 సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించారు. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి ఘటించి వెనుదిరిగారు. అక్టోబర్ 13, 1997న మళ్లీ భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో కలసి వచ్చారు. డయ్యర్ కుమారుడు చెప్పిన దానిని బట్టి ఫిలిప్ ఈ సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న సంస్మరణ ఫలకం మీద అంకెను చూసి ఇంతమంది మరణించలేదని నాకు తెలిసిందని ఆయన వ్యాఖ్యానించాడు. బ్రిటిష్‌రాణి ‘మన గతం ఇబ్బందికరమైనది....’ అని కొన్ని మాటలు చెప్పి వెళ్లారు. ఫిబ్రవరి, 2013లో నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించాడు. మృతులకు నివాళి ఘటించాడు. ఈ ఘోర దురంతం మీద బ్రిటిష్ నేతల నుంచి సాంత్వన వాక్యాలు వస్తాయని ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది. - డా॥గోపరాజు నారాయణరావు -
టీడీపీ కంటే బ్రిటీష్ పాలనే నయం
- రైతుకూలీ సంఘం విమర్శ భోగాపురం : తెలుగుదేశం పార్టీ కన్నా పూర్వం పరిపాలించిన బ్రిటీష్ పాలనే నయమని రైతుకూలీ సంఘం సహాయకార్యదర్శి జె.కిషోర్‌బాబు విమర్శించారు. మండలంలోని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాలను గురువారం సాయంత్రం రైతుకూలీల సంఘం, అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీయూ) నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలనలో రైలు మార్గానికనో, రోడ్డు మార్గానికనో, లేదా ఒక కంపెనీ స్థాపనకో రైతుల వద్దనుంచి భూమిని సేకరించేవారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అవేమీ కాకుండా విదేశీ వ్యాపారసంస్థలకు అప్పజెప్పేందుకు పేద రైతుల వద్దనుంచి భూములు లాక్కుంటుందని మండిపడ్డారు. అధికారపార్టీ మంత్రుల భూముల మినహాయించి పేద రైతుల భూమిని తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో మోదీ, అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు బాధితుల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దంతులూరి వర్మ, రాష్ట్రకార్యవర్గ సభ్యులు టి.అరుణ, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయక కార్యదర్శి గణేష్‌పాండా, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బెహరా శంకరరావు, ఎం.గోపాలం తదితరులు పాల్గొన్నారు. -
ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు
-
ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు
⇒ స్వతంత్ర భారత చరిత్రపై చెరగని మచ్చ ⇒ ప్రజాస్వామ్యానికి ఎదురైన ఏకైక తొలి సవాలు అదే బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారత్‌లో.. ఈ ప్రజాస్వామ్యం ఎన్నాళ్లు మనగలుగుతుంది? అన్న ప్రశ్న ఆదిలోనే తలెత్తింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. కానీ.. సువిశాల భారతావనిలోని ప్రజలు.. భిన్న మతాలు, సంస్కృతుల కలయిక కనుక దేశం త్వరగానే ముక్కలతుందని చాలా మంది ‘జోస్యం’ చెప్పారు. కానీ.. ఆ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ ఏడు దశాబ్దాలుగా భారత్ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. భారత్‌తో పాటు స్వాతంత్య్రం పొందిన పొరుగు దేశాలు.. సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనల్లో కూరుకుపోతూ ఉంటే.. భారత్‌లో ప్రజాస్వామ్య పునాదులు రోజురోజుకూ బలపడుతున్నాయి. కానీ.. ఈ 70 ఏళ్ల ప్రజాస్వామ్య పయనంలో భారత్ కూడా ఒక పెను సవాలు ఎదుర్కొంది. ఒక చీకటి అధ్యాయం లిఖితమైంది. సరిగ్గా 40 ఏళ్ల కిందట.. ఈ దేశంలో ‘ఎమర్జెన్సీ’ పేరుతో నియంతృత్వం జూలు విదిల్చింది. ప్రజాస్వామ్య మూల స్తంభాలను నాటి నియంతృత్వ ప్రభుత్వం తన కబంధ హస్తాల్లో బంధించింది. విపక్షాన్ని జైల్లో నెట్టి, పత్రికల గొంతు నొక్కేసింది. శాసనవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని చట్టాలను మార్చేసింది. 21 నెలలుసాగిన ఆ చీకటి యుగంలో.. పౌరుల ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి. వాక్స్వాతంత్య్రమే కాదు.. జీవన స్వాతంత్య్రమూ లేదని నాటి ప్రభుత్వమే చెప్పింది. ఆనాటి నియంతృత్వ ప్రభుత్వం ఏక వ్యక్తి ప్రభుత్వం.. ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఆమె కోటరీ ప్రభుత్వం. ఆ చీకటి యుగం.. 1975 జూన్ 25 అర్ధరాత్రితో మొదలై.. 1977 మార్చి 21 వరకూ కొనసాగింది. ప్రజాస్వామ్యానికి ఎదురైన ఆ పెను సవాలును భారత్ అధిగమించింది. అందుకు కారణం.. ప్రజాస్వామ్య విలువలపై ఈ దేశ ప్రజల అచంచల విశ్వాసం, రాజీలేని పోరు! ఆ ఎమర్జెన్సీ ఆరంభానికి ఈ గురువారానికి 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ తరుణంలో ఎప్పటిలానే ‘ఎమర్జెన్సీ’పై చర్చ మొదలైంది. అలాంటి నియంతృత్వ పాలన ముప్పు ఇంకా తొలగిపోలేదని.. నాడు జైలు నిర్బంధంలో ఉన్న అద్వానీ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల కిందట ‘ఎమర్జెన్సీ’ పూర్వాపరాలపై ‘సాక్షి’ ఫోకస్.. ఎమర్జెన్సీకి కారణాలేమిటి? ఎమర్జెన్సీకి ముందు ఇందిరాగాంధీ చాలా ప్రజాదరణగల నాయకురాలు. 1966లో నాటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి మరణించిన తర్వాత.. తొలి భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ కుమార్తె అయిన ఇందిరను కాంగ్రెస్ ప్రధానిగా ఎన్నుకుంది. కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్వహించిన ఓటింగ్‌లో మొరార్జీదేశాయ్ను 355 - 169 ఓట్ల తేడాతో ఓడించి.. భారత తొలి మహిళా ప్రధానిగా ఆమె పగ్గాలు చేపట్టారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పటికీ.. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. మొత్తం 518 సీట్లలో 352 సీట్లు గెలుచుకుంది. 1971లో పాక్‌తో యుద్ధంలో భారత్ గెలవటంతో ఆమె ప్రతిష్ట పెరిగింది. కానీ.. రెండేళ్లు తిరిగేసరికే ఇందిర ప్రతిష్ట మసకబారటం మొదలైంది. ఆమె సర్కారుతో పాటు.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గుజరాత్లో నవ నిర్మాణ్ ఉద్యమం, బిహార్‌లో జయప్రకాష్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ ఊపందుకున్నాయి. దేశ వ్యాప్తంగా రైల్వే కార్మికులు సమ్మె చేశారు. దీనిపై ఇందిర ప్రభుత్వం కఠినంగా విరుచుకుపడింది. వేలాది మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి, వారి కుటుంబాలను క్వార్టర్ల నుంచి గెంటివేసింది. ప్రతిపక్షాల నుంచి ఇందిర సర్కారుపై దాడి ముమ్మరమైంది. పార్లమెంటులో సైతం ఇందిర కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 1966 నుంచి తొమ్మిదేళ్లలో పది అవిశ్వాస తీర్మానాలను ఇందిర ఎదుర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు... ఈ పరిస్థితుల్లో.. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు.. 1971 ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. ఆ ఎన్నికలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ నిధులను ప్రచారానికి వినియోగించారని.. అదే స్థానంలో ఆమె ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయిణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఇందిర మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని నిషేధం విధించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఇందిర ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లతో ప్రతిపక్షాల నుంచి భారీ నిరసనలు వెల్లువెత్తాయి. విపక్షాల నేతలు రాష్ట్రపతిని కలసి.. హైకోర్టు తీర్పుతో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, ఇందిరను తొలగించాలని కోరారు. కాంగ్రెస్‌లోనూ ఇందిర రాజీనామా కోసం డిమాండ్లు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు... హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పుపై 1975 జూన్ 24న స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇందిర కొన్ని షరతులకు లోబడి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగవచ్చని అనుమతిచ్చింది. ఒక ఎంపీగా పార్లమెంటు సమావేశాల్లో కానీ, ఓటింగ్‌లో కానీ పాల్గొనరాదని, లోక్‌సభ సభ్యురాలిగా వేతనాలు అందుకోరాదని ఆదేశించింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిర లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించినది అయినందున.. ఈ షరతులు ఆమె ప్రధానమంత్రి హోదాపై ప్రభావం చూపబోవని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాని హోదాలో ఆమె పార్లమెంటు సమావేశాలకు హాజరుకావచ్చునని (ఓటింగ్ హక్కు లేకుండా), ప్రధానిగా ఇతర విధులూ నిర్వర్తించవచ్చని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. జేపీ ‘సహాయ నిరాకరణ’ పిలుపు... అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇందిర రాజీనామా చేసి తప్పుకోవాలంటూ జయప్రకాష్ నారాయణ్(జేపీ) డిమాండ్ చేస్తూ ‘సంపూర్ణ విప్లవం’ పిలుపుతో భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో.. సైన్యం, పోలీసులు, ప్రభుత్వాధికారులు ఇందిర సర్కారుకు ‘సహాయ నిరాకరణ’ చేయాలని, ఆమె ఆదేశాలను పాటించవద్దని, రాజ్యాంగానికి కట్టుబడాలని జేపీ పిలుపునిచ్చారు. ఇందిర రాజీనామా కోసం దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. పత్రికలపై ఆంక్షలు... ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభమైన పత్రి కా రంగం ఇబ్బందుల పాలైంది. పత్రికలు, చానళ్లు, రేడియో ప్రసారాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రచురించే, ప్రసారం చేసే వార్తలు, కథనాలను ప్రభుత్వానికి చూపించి, ఆమోదం పొందాలని షరతులు విధించారు. జేపీ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక మినహా.. ఈ ఆంక్షలను ధిక్కరించే ధైర్యం మరెవరూ చేయలేకపోయారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. సంపాదకీయం స్థానాన్ని ఖాళీగానే ఉంచి ముద్రించింది. సంజయ్ ఆదేశాలను పాటిం చేందుకు తిరస్కరించినందుకు.. అప్పటి కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ఐ.కె.గుజ్రాల్‌ను కూడా ఇందిర తొలగించి.. విద్యాచరణ్శుక్లాను ఆయన స్థానంలో నియమించారు. పౌరులకు హక్కులు లేవు.. కోర్టులు ప్రశ్నించ జాలవు.. ఎమర్జెన్సీ ప్రకటనతోనే దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి. ఎవరినైనా ఎటువంటి ఆరోపణా లేకుండా, ఎటువంటి విచారణా లేకుండా అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచే అధికారం ప్రభుత్వానికి దక్కింది. దీంతో.. ప్రభుత్వ వ్యతిరేకులు అనుకున్న వారినందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించటం షరా మామూలుగా మారింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.40 లక్షల మందిని ఎటువంటి విచారణా లేకుండా నిర్బంధించినట్లు అంచనా. ఎమర్జెన్సీలో ఇందిర చట్టాలను యథేచ్ఛగా తిరగరాశారు. తనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హం చేసిన కేసులో అభియోగాల నుంచి విముక్తి లభించే విధంగా.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. తన ఆదేశాలు, ఆర్డినెన్సులను కోర్టులు సమీక్షించకుండే ఉండేలా కొన్ని చట్టాలను సవరించారు. ఎమర్జెన్సీలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను వాయిదా వేశారు. తనను వ్యతిరేకించే ప్రభుత్వాలు ఉన్న గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం 356 అధికరణను వినియోగించి రాష్ట్రపతి పాలనను విధించారు. ఎమర్జెన్సీ ఎత్తివేత.. ఇందిర పరాజయం... ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విక్షాలన్నీ ఉద్యమించాయి. పంజాబ్‌లో సిక్కులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జనతా పార్టీ, సీపీఎం, ఆర్ఎస్ఎస్ కూడా జైళ్లలో ఉన్న నేతలు, అజ్ఞాతంలో ఉన్న కార్యకర్తల సారథ్యంలో ఉద్యమాలు కొనసాగించాయి. ఈ పరిస్థితుల్లో 21 నెలల పాటు సాగిన చీకటి పాలనకు స్వయంగా ఇందిరే తెరదించారు. అన్ని వర్గాల వ్యతిరేకత, విదేశీ పరిశీలకుల విమర్శలు దీనికి కారణమని భావిస్తున్నారు. పైగా.. ఎన్నికల్లో తాను మళ్లీ గెలుస్తానని ఆమె ధీమాగా ఉన్నారని పరిశీలకులు అంటారు. 1976 ఫిబ్రవరి 4న లోక్‌సభ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించిన ఇందిర సర్కారు.. ఆ మరుసటి ఏడాది జనవరి 18న లోక్‌సభను రద్దు చేసింది. మార్చిలో ఎన్నికలు ప్రకటించింది. అరెస్ట్ చేసిన నాయకులందరినీ విడుదల చేసి మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించింది. 1977 మార్చి నాటి ఎన్నికల్లో.. భారత ప్రజానీకం ఆగ్రహావేశాలను ఇందిర చవిచూశారు. స్వాతంత్య్రానంతరం 30 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తొలిసారి ఘోరంగా ఓడించారు. ఇందిర, సంజయ్ స్వయంగా పరాజయం పాలయ్యారు. జేపీ నేతృత్వంలోని జనతా పార్టీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఒకప్పుడు.. ఇందిర ప్రభుత్వంలోనే ఉప ప్రధానిగా పనిచేసిన మొరార్జీదేశాయ్.. ఎమర్జెన్సీ తర్వాత తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇందిర అరెస్టు.. మళ్లీ గెలుపు... ఈ ‘జనతా’ ప్రభుత్వం.. ఎమర్జెన్సీ అకృత్యాలపై 1977 మే 28న షా కమిషన్‌ను నియమించింది. ఇందిర ఆమె అవసరాల కోసమే ఎమర్జెన్సీ తెచ్చారని షా తప్పుబట్టారు. దీనికి సంబంధించిన ఆరోపణలపై.. జనతా ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చౌదరి చరణ్‌సింగ్.. ఇందిర, సంజయ్‌ల అరెస్టుకు ఆదేశించారు. అయితే.. ఈ అరెస్టులు, ఆపై సుదీర్ఘ విచారణలు.. సమస్యలు పరిష్కరించటంలో జనతా పార్టీ వైఫల్యం కలగలసి.. అనంతర కాలంలో ఇందిరపై ప్రజల్లో సానుభూతి పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇందిర తన ప్రసంగాల్లో ‘చేసిన పొరపాట్ల’కు క్షమాపణలు చెప్పటం వంటి పరిణామాలతో.. మూడేళ్లు తిరక్కముందే 1980 ఎన్నికల్లో ఆమె మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఎమర్జెన్సీ విధించటం అంత సులభమా? 1978కి ముందు.. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించటం.. ఇప్పటితో పోలిస్తే సులభమే. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ.. 1978లో రాజ్యాంగ నిబంధనలను సవరించి ఎమర్జెన్సీ విధించటాన్ని మరింత కఠినతరం చేసింది. ఇందిర నాడు ‘అంతర్గత అలజడుల’ ప్రాతిపదికన ఎమర్జెన్సీని విధించారు. కానీ.. జనతా సర్కారు ఆ పదాన్ని ‘సాయుధ తిరుగుబాటు’గా మార్చి మరింత నిర్దిష్టతను ఇచ్చింది. ఇందిర ఎమర్జెన్సీ విధించినప్పుడు.. అందుకు తొలుత రాష్ట్రపతి ఆమోదం పొందారు. ఆ మరుసటి రోజున తన మంత్రివర్గానికి ఆ విషయాన్ని తెలియజేశారు. 1978లో చేసిన సవరణ ప్రకారం.. రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ ప్రకటన చేయటానికి ముందు.. దానికి కేంద్ర మంత్రివర్గం అంగీకారం తప్పనిసరి. 1978 సవరణకు ముందు.. ఎమర్జెన్సీ ప్రకటనకు కానీ, దానిని పొడిగించటానికి కానీ.. పార్లమెంటులో సాధారణ మెజారిటీ ఆమోదం ఉంటే సరిపోతుంది. అంటే.. హాజరైన సభ్యుల్లో ఓటు వేసిన వారిలో సగం మంది కన్నా ఒక్కరు ఎక్కువగా ఆమోదం తెలిపితే సరిపోతుంది. దీనిని సవరించి.. పార్లమెంటు ఆమోదాన్ని కఠినతరం చేశారు. ఎమర్జెన్సీ విధించటానికి కానీ, కొనసాగించటానికి కానీ.. పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ.. అంటే హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మూడింట రెండు వంతులు.. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో (హాజరుకాని వారితో సహా) కనీసం సగం మంది ఆమోదించాలని మార్చారు. ఆ రాత్రే ఎమర్జెన్సీ.. అరెస్టులు... జూన్ 25 అర్ధరాత్రికి కొన్ని నిమిషాల ముందు.. ఇందిర సిఫారసుతో నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ‘ఎమర్జెన్సీ’ ప్రకటించారు. దేశంలో ‘అంతర్గత అలజడులు’ చెలరేగుతున్నాయంటూ ఎమర్జెన్సీ ఉత్తర్వులు జారీచేశారు. దేశరక్షణ, ప్రజా ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఇందిర సమర్థించుకున్నారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ఆమె కుమారుడు సంజయ్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం ఎస్.ఎస్.రే తదితరుల ప్రోద్బలం ప్రబలంగా ఉందన్న వాదనలు ఉన్నాయి. ఆ రాత్రికి రాత్రే.. ప్రధాన వార్తా పత్రికలన్నిటికీ కరెంటు నిలిపివేశారు. ఇందిరను ప్రశ్నిస్తున్న దాదాపు 100 మంది నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. వీరిలో జేపీ, మొరార్జీ దేశాయ్, ఎల్.కె.అద్వానీ, అటల్ బిహారీ వాజపేయి వంటి నేతలు ఉన్నారు. దాదాపు ప్రతిపక్షమంతా జైల్లోనే అన్న స్థితి ఉండేది. నాలుగు మత, రాజకీయ, విప్లవ పార్టీలన నిషేధించారు. వీటిలో ఆనంద్‌మార్గ్, ఆర్ఎస్ఎస్, జమాత్-ఎ-ఇస్లామీ వం టి సంస్థలున్నా యి. తొలి విడత అరెస్టుల తర్వాత మిగతా నాయకు లు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సంజయ్‌గాంధీ అకృత్యాలు.. ఎమర్జెన్సీ ద్వారా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాదు.. అప్పటికే ‘రాజ్యాంగేతర శక్తి’గా పేరుపడ్డ ఆమె తనయుడు సంజయ్‌గాంధీ కూడా అపరిమిత అధికారాలు చలాయించారు. ముఖ్యంగా దేశంలో జనాభా పెరుగుదలను తగ్గించేందు కోసమంటూ కుటుంబ నియంత్రణ పేరుతో.. ఆయన లక్షలాది మందికి నిర్బంధ గర్భనిరోధ శస్త్రచికిత్సలు చేయించారు. ఒరిగిపోగలం కానీ.. మేం తల వంచలేం! సత్యం సంఘర్షణ.. అధికారంతో న్యాయం పోరాటం.. నిరంకుశంతో అంధకారం సవాలు విసిరింది కిరణమే తుది అస్త్రం అవుతుంది! - అటల్ బిహారీ వాజపేయి (ఎమర్జెన్సీ సమయంలో జైల్లో రాసిన కవిత) -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం .. డిష్యుం
సైరన్ మోగిస్తూ కాన్వాయ్ ఏర్పాటు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన పోలీసులు ఎంపీని పట్టించుకోని వైనం పోలీసుల తీరును జీర్ణించుకోలేని ఓ వర్గంతెలుగు తమ్ముళ్లు చంద్రగిరి:నియోజకవర్గంలో పోలీసుల పనితీరు బ్రిటీష్ పాలనను తలపిస్తోంది. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా గోపినాథ్ జట్టి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో ప్రశాంత వాతావరణం నెల కొంది. ఎర్రచందనం అక్రమ రవాణా ను నిలువరించడంలో విజయం సా ధించారు. చంద్రగిరి నియోజకవర్గం లో మాత్రం అర్బన్ ఎస్పీ పాలన కని పించడంలేదు. ప్రజాప్రతినిధులను చంద్రగిరి పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టవర్‌క్లాక్ వద్ద ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు నారమల్లి శివప్రసాద్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల లో ఓటమి పాలైన మాజీ మంత్రికి పోలీసులు సీఐ శివప్రసాద్ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి హంగామా సృష్టించారు. ఎంపీ, మాజీ మంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ పాకాలలో కార్యక్రమానికి బయల్దేరినా పోలీసులు పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత మాజీ మంత్రి గల్లా కూడా పాకాలకు పయనమయ్యారు. పోలీసులు కాన్వాయ్‌ని ఏర్పాటు చేసి సైరన్ మోగిస్తూ రోడ్డుపై వాహనాలను పక్కకు పంపిస్తూ హంగామా సృష్టించారు. ఆమెను రాచమర్యాదలతో సాగనంపారు. పార్లమెంట్ సభ్యుడిని మాత్రం పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికిపోలీసులు చేసిన రాచమర్యాదలను టీడీపీ నాయకులు సైతం జీర్ణించుకోలేపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు మాత్రం సైరన్ మోగిస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి జిల్లా ఎస్పీ తీవ్ర కృషి చేస్తుంటే, చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం పోలీసులు మాజీ మంత్రి మెప్పు కోసం నానా హంగామా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒక వర్గం టీడీపీ నాయకులు సైతం కోరుతున్నారు. -
న్యాయస్థానాల్లో తెలుగేదీ?
ప్రస్తుతం న్యాయస్థానాల్లో దాఖలయ్యే దావాలు, అర్జీలు వాటి కి జవాబులు, ఫిర్యాదులు, కక్షిదారులు, వారి సాక్షుల సాక్ష్యా లు, తీర్పులు నూటికి నూరు శాతం ఆంగ్లంలోనే ఉంటున్నాయి. దీనివల్ల కక్షిదారులు తమ వ్యాజ్యాలలో ఏమి జరుగుతున్నదో, ఏమి నమోదవుతున్నదో స్వయంగా తెలుసుకోలేక నష్టపోతు న్నారు. తాను చెప్పదలచిన, చెప్పిన అంశం యథాతథంగా రాశారో లేదో స్వయంగా తెలుసుకునే అవకాశం కక్షిదారునికి లేకుండా పోతున్నది. ఆంగ్లంలో నమోదైన సాక్ష్యాలను, సాక్షుల మాతృభాషలో చదివి వినిపించి సరిగా ఉన్నదని నిర్ధారణ చేసుకునే యంత్రాంగం లేనం దున నమోదైన సాక్ష్యాలపై సాక్షులు, కక్షిదారు అయో మయంగా సంతకాలు చేసి వస్తున్నారు. హిందీ రాష్ట్రా ల్లోని న్యాయస్థానాల్లో హిందీని, తమిళనాడు రాష్ట్రంలో తమిళాన్ని, కర్ణాటక రాష్ర్టంలో కన్నడాన్ని వాడుతున్నా మన రాష్ట్రం లో తెలుగును వాడటం తప్పుగా, చిన్నతనంగా, నామోషీగా భావించే న్యాయమూర్తులు న్యాయవాదులు, సిబ్బంది ఉన్నా రు. సామాన్య ప్రజల కోసం, సామాన్యుల భాషను న్యాయస్థా నాల్లో ఎందుకు వాడరు? న్యాయస్థానాల్లో తెలుగు వాడకం అత్యవసరం కాదా? బ్రిటిష్ పాలన వారసత్వంగా వచ్చిన ఇంగ్లిష్ వాడకాన్ని ఇకనైనా న్యాయస్థానాల నుంచి తొలగిస్తే చాలా మంచిది. కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై -
బ్రిటిష్ పాలనే నయం
వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి ఏలూరు : మహాధర్నా సభలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ 200 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలనలో కూడా ప్రజలు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా రైతుల వద్ద ఒక బస్తా ధాన్యం కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా బాబు నిలబెట్టుకోలేదన్నారు. రుణమాఫీ అమలు చేయాలనే డిమాండ్‌తో తమ పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసిందని సుబ్బారాయుడు ఆరోపించారు. ధర్నాకు రావడానికి బస్సులను ఇవ్వవద్దని, ఆయా రూట్లల్లో నిత్యం తిరిగే ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశించడం దివాలకోరుతనమని విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కనుసైగ చేస్తే జిల్లా ప్రజలు తమ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారని కొత్తపల్లి పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచి, కళ్లు తెరిపించి హామీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయించడం కోసం తమ పార్టీ పోరాడుతుందని, అవసరమైతే నిరాహారదీక్షలకు కూడా వెనుకాడబోమని సుబ్బారాయుడు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, అధికారం కోసం చంద్రబాబునాయుడు చెప్పని అబద్ధం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం వాటి ఊసు కూడా ఎత్తడం లేదని విమర్శించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి చెందినవారు?
బిటిష్ పాలనలో విద్యా సంస్కరణలు ప్రాచీన కాలంలో తక్షశిల, నలందా, విక్రమశిల మొదలైన విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధిగాంచినవి. 19వ శతాబ్దంలో మన విద్యా వ్యవస్థలో అనేక లోపాలున్నందువల్ల, ఆంగ్ల పద్ధతిలో బోధన ఉత్తమంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఆంగ్ల విద్యనే ప్రవేశపెట్టాలని, ఆ విద్యను అభ్యసించిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల భారతదేశంలో ప్రాచీన విద్య మనుగడ ప్రమాదంలో పడింది. ఆంగ్లేయులు వచ్చిన మొదటి శతాబ్దంలో విద్య గురించి ఎక్కువ శ్రద్ధ చూపలేదు. క్రీ.శ. 1781లో వారన్ హేస్టింగ్స తొలిసారిగా కలకత్తాలో పర్షియా, అరబిక్ భాషల్లో బోధన కోసం ‘కలకత్తా మదర్సా’ అనే విద్యా సంస్థను స్థాపించాడు. క్రీ.శ. 1791లో డంకన్ బెనారస్‌లో సంస్కృత కళాశాలను ఏర్పాటుచేశాడు. లార్డ వెల్లస్లీ క్రీ.శ. 1802లో ఆంగ్లేయ అధికారులకు భారతీయ భాషలను, సాంఘిక ఆచారాలను బోధించడానికి ‘విలియం కోట’ కళాశాలను స్థాపించాడు. కానీ, ఈ కళాశాలను బోర్డ ఆఫ్ డెరైక్టర్‌స ఆదేశం మేరకు మూసివేశారు. 1813 చార్టర్ చట్టం వచ్చేంతవరకు విద్యకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ ఎలాంటి చర్యలనూ చేపట్టలేదు. 1813 చార్టర్ చట్టంలో ఈస్టిండియా కంపెనీ విద్యావ్యాప్తికి ఏటా లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించింది. విద్యావ్యాప్తి కోసం చట్టం ద్వారా ధనాన్ని కేటాయించడం అదే తొలిసారి. ఆంగ్లేయాది పరభాష గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువాదం చేయడానికి, సంస్కృతం, అరబ్బీ, పర్షియన్ భాషల్లో గ్రంథాలను అచ్చువేయడానికి ఈ ధనాన్ని వినియోగించారు. రెండు దశాబ్దాల వరకూ విద్యావిషయమై కంపెనీ ఏ చర్యా తీసుకోలేదు. తర్వాత భారతదేశంలో బోధన ప్రాచ్య విద్యలో ఉండాలా? పాశ్చాత్య (ఇంగ్లిష్) విద్యలో ఉండాలా? అనే వివాదం చెలరేగింది. ప్రాచ్య విద్యను ప్రవేశపెట్టాలని విల్సన్, ప్రిన్సెస్ సోదరులు సూచించారు. ఆంగ్లభాషలో విద్యను బోధించాలని రాజారామ్మోహన్రాయ్ మద్దతుతో ‘చార్లెస్ ట్రావెలియన్’ వాదించారు. ఆంగ్ల మాధ్యమంలో పాశ్చాత్య శాస్త్రాలు, పాండిత్యాన్ని బోధించాలని పాశ్చాత్య విద్యావాదులు చెప్పారు. క్రీ.శ.1835లో మెకాలే భారతదేశంలో బోధన ఇంగ్లిష్‌లో ఉండాలని ప్రకటించిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. దీనివల్ల ఆంగ్లేయులకు, భారతీయులకు ఇద్దరికీ లాభమని మెకాలే అభిప్రాయం. భారతదేశంలోని గ్రంథాలన్నీ కలిపినా ఆంగ్ల భాషలోని కొన్ని పుస్తకాలతో సరితూగవు అని ఇతడు పేర్కొన్నాడు. కాబట్టి ఆంగ్ల భాష నేర్చుకున్నట్లయితే ఆంగ్ల గ్రంథాలను చదివి భాషాశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలవుతుందని, అప్పుడు భారతీయులు ఆంగ్లేయులతో సరితూగగలరని మెకాలే అభిప్రాయం. అందువల్ల ఆంగ్ల విద్య భారతీయులకు లాభదాయకమని వాదించాడు. బొంబాయి ప్రభుత్వం 1845లో ఒక ఆర్డినెన్స జారీ చేస్తూ బెంగాల్, మద్రాస్ ప్రభుత్వాల మాదిరిగానే పాఠశాల, కళాశాల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, పాశ్చాత్య జ్ఞానాన్ని మాతృభాషలోనే బోధించాలని నిశ్చయించింది. ఆంగ్ల విద్య చరిత్రలో క్రీ.శ. 1854కు ప్రాముఖ్యం ఉంది. 1853లో బ్రిటిష్ పార్లమెంట్ భారత విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. ఫలితంగా క్రీ.శ. 1854లో బోర్డ ఆఫ్ డెరైక్టర్‌స అధ్యక్షుడైన సర్ చార్లెస్ ఉడ్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. ఈ కమిటీ విద్య విధానానికి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించింది. అదే ‘ఉడ్‌స డిస్పాచ్’గా ప్రసిద్ధి చెందింది. ఉడ్‌స ప్రణాళికలోని ముఖ్యాంశాలు: * భారతీయులను విద్యావంతులను చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి * ప్రభుత్వ సహాయంతో పాఠశాలను, కళాశాలలను ఏర్పాటు చేసేట్లుగా ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహమివ్వాలి. * ప్రతి ప్రావిన్‌సలో పాఠశాల ఇన్స్పెక్టర్లను, విద్యా డెరైక్టర్లను నియమించాలి. * పెసిడెన్సీ పట్టణాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. * భారతీయులకు పాశ్చాత్య విద్య.. ము ఖ్యంగా విజ్ఞానశాస్త్ర, తత్వజ్ఞాన, సాంఘిక శాస్త్రాలను బోధించి కంపెనీలో ఉద్యోగాలివ్వడానికి తగిన అర్హతలు కల్పించాలి. * ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి. పై అంశాలతో కూడిన బృహత్తర ప్రణాళికను ‘సర్ చార్లెస్ ఉడ్’ సూచించాడు. ఆ కాలం లో గవర్నర్ జనరల్‌గా పనిచేస్తున్న లార్డ డల్హౌసీ ఈ ప్రణాళికను అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాడు. ప్రభుత్వం ‘ఆక్స్ఫర్డ విశ్వవిద్యాలయం’ తరహాలో కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో విశ్వ విద్యాలయాలను స్థాపించింది. ఈ విశ్వవిద్యాలయాల్లో చాన్సలర్, వైస్ చాన్సలర్లను నియమించారు. ‘సెనెట్’ అనే ఒక సమావేశ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని దశాబ్దాల వరకు చార్లెస్ ఉడ్ సూచించిన విధంగా భారతదేశంలో విద్యా విధానం కొనసాగింది. ఉడ్‌స ప్రణాళిక తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రిప్పన్ కాలంలో 22 మంది సభ్యులతో ‘హంటర్’ అధ్యక్షతన ఒక కమిషన్ ను క్రీ.శ.1882లో నియమించారు. ప్రాథమిక, స్త్రీ విద్యకు ప్రాధాన్యమివ్వాలని ఈ కమిషన్ తన నివేదికలో సూచించింది. విద్య, సాంఘిక సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల మద్దతు పొందాలని ‘హంటర్’ సూచించాడు. క్రీ.శ. 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం, 1887లో అలహాబాద్ విశ్వవిద్యాలయాలను స్థాపించారు. లార్డ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టాడు. ఆ మార్పుల్లో భాగంగా విద్యాధికారులందరినీ సిమ్లాలో సమావేశపర్చి కొన్ని అంశాలను చర్చించారు. ఆ అంశాలను పరిశీలించడానికి ‘సర్ థామస్ ర్యాలీ’ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా లార్డ కర్జన్ క్రీ.శ. 1904లో విశ్వ విద్యాలయ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. విద్య ద్వారా భారతదేశంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్ హెన్రీ బట్లర్’ క్రీ.శ. 1913లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు. తర్వాత పాట్నా, నాగపూర్, రంగూన్, కాశీ, అలీఘర్, హైదరాబాద్‌లలో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. క్రీ.శ. 1916లో పుణేలో డి.కె. కార్వే స్త్రీల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. క్రీ.శ. 1917లో నియమించిన ‘శాడ్లర్ కమిటీ’ ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని సూచించింది. బీఏ (హానర్‌స) కోర్సును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని, టీచర్ ట్రైనింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, స్త్రీ, వృత్తి విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. క్రీ.శ. 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్లో ‘విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని’ ఏర్పాటు చేశారు. క్రీ.శ. 1927లో సైమన్ కమిషన్‌తోపాటు విద్యా విషయాలను పరిశీలించేందుకు ‘హార్టాగ్ (ఏ్చట్టౌజ)’ కమిటీని నియమించారు. తర్వాత 1944లో సార్జంట్ విద్యాప్రణాళికలో కొన్ని ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. మహాత్మాగాంధీ మరికొంత మంది జాతీయ నాయకులు సమావేశమై క్రీ.శ. 1937లో ‘సేవాగ్రామ్’లో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంతవరకు ఈ ప్రణాళికను అమలు చేశాయి. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంలో అనేకమార్పులు చోటుచేసుకున్నాయి. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో సరికానిది? (2001 సివిల్స్) 1) కలకత్తా మదర్సా:వారన్ హేస్టింగ్స (1781) 2) వారణాసి సంస్కృత పాఠశాల : జోనాథన్ డంకన్ (1792) 3) చార్లెస్ ఉడ్ డిస్పాచ్ : డల్హౌసీ (1854) 4) ఆంగ్ల విద్యాచట్టం: విలియం హార్వే (1828) సమాధానం: 4 వివరణ: 1835లో మెకాలే ‘లా’ కమిషన్ అధ్యక్షతన విలియం బెంటింక్(భారతదేశ తొలి గవర్నర్ జనరల్) ఆంగ్ల విద్యా చట్టాన్ని ప్రవేశపెట్టాడు. జోనాథన్ డంకన్ ‘వారణాసి’లో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో వారన్ హేస్టింగ్స మదర్సాను ఏర్పాటు చేశాడు. 2. కిందివాటిలో సరైంది ఏది? (2003 సివిల్స్) ఎ) ఇండాలజీ పితామహుడు: సర్ విలియం జోన్స బి) తులనాత్మక పితామహుడు: మాక్స్ ముల్లర్ సి) {పాచ్య పితామహుడు: వి.ఎ. స్మిత్ డి) పాశ్చాత్య పితామహుడు: జె.ఎస్. మిల్ 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, డి మాత్రమే 4) అన్నీ వాస్తవాలే సమాధానం: 4 వివరణ: సర్ విలియం జోన్స 1784లో ‘ఏసియాటిక్ సంస్థ’ను కలకత్తాలో ప్రారంభించి భారత సంస్కృతిని వెలుగులోకి తేవడానికి కృషి చేశారు. ఈ సంస్థ తరఫున కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం (నాటకం)ను, జయదేవుని-గీతాగోవిందం(పద్యకావ్యం)ను, మనుస్మృతి-న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు. ఇతని సహాయకుడు చార్లెస్ విల్కిన్స ‘భగవద్గీతను’ ‘సెలిటీయస్ సాంగ్స’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. మాక్స్ ముల్లర్ తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి. ఇతను 1862లో రుగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘వేదముల్లర్’గా పేరు గడించారు. ఈ గ్రంథం లో ఆర్యుల జన్మప్రాంతం ‘మధ్య ఆసియా’గా పేర్కొన్నాడు. వి.ఎ. స్మిత్ 1867లో భారతదేశాన్ని సందర్శించి అనేక గ్రంథాలు రచించాడు. ఇతడు సముద్రగుప్తుడిని భారత నెపోలియన్‌గా పేర్కొన్నాడు. 1817లో జేమ్స్ మిల్స్ భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా క్రోడీకరించారు. 3. విద్యా వ్యవస్థపై వచ్చిన కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో వాస్తవమైంది? (2004 సివిల్స్) ఎ) హంటర్ కమిషన్ - లార్డ రిప్పన్ (1882) బి) సర్ థామస్ ర్యాలీ - 1904 కర్జన్ సి) శ్లాడర్ కమిటీ - లార్డ ఇర్విన్ (1926) డి) వార్టాగ్ కమిషన్ - 1917 చేమ్స్‌ఫర్‌డ 1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ సరైనవే సమాధానం: 2 వివరణ: 1882లో లార్డ రిప్పన్ ‘హంటర్’ కమిటీని నియమించారు. దీని ప్రకారం స్త్రీ విద్య, మత విషయాలతో సంబంధం లేని విద్య, నైతిక విద్య అవసరం అని పేర్కొన్నారు. 1904లో కర్జన్ థామస్ ర్యాలీ కమిటీని నియమించారు. కలకత్తా, బొంబాయి, మద్రాస్ సెనెట్లలో 20 మంది సభ్యులు, మిగతా ప్రాంతాల్లో 15 మంది ఉండాలని కమిటీ సూచించింది. శ్లాడర్ 1917లో ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలలో చేర్చాలని తీర్మానించాడు. 1927లో వార్టాగ్ కమిషన్‌ను లార్డ ఇర్విన్ నియమించాడు. 4. ‘1857 ఉడ్ డిస్పాచ్’ కమిటీ తీర్మానాల్లో లేని అంశం ఏది? 1) ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి 2) తెలివైన విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి 3) ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు వేరే శాఖలో ఉండాలి 4) విద్యావ్యాప్తి కోసం 50 లక్షల రూపాయలు కేటాయించాలి సమాధానం: 4 వివరణ: 1912 చట్టంలో రెండో హార్డింగ్ రాజ ప్రతినిధి విద్యకోసం, ఆధునిక విద్య ప్రోత్సాహానికి 50 లక్షల రూపాయలను కేటాయించారు. వైస్రాయ్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్హెన్రీ బట్లర్’ 1913 లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు. -
పద్యానవనం: ...అలా నడచుకుంటే సరి!
పట్టపగటింటి సూర్యుని పగిది కర్ణు డుగ్ర మూర్తియై చెలరేగుచున్నవాడు మాధవా! మన రథమిప్డు మరలనిమ్ము బతికి యుండిన సుఖముల బడయవచ్చు! కాలం కలిసిరానప్పుడు భరిస్తూనయినా కాచుకొని ఉండాలె అని చెబుతూ, ‘‘...కాలమ్ము రాగానె కాటేసి తీరాలె’’ అంటాడు ప్రజాకవి కాళోజి నారాయణరావు ఉరఫ్ కాళన్న. కాటేసే సంగతెలా ఉన్నా, కలిసి రానప్పుడు కాస్త ఒకడుగు వెనక్కి తగ్గి ఉండటంలో తప్పు లేదన్నది చారిత్రక సత్యం. రాజ్యానికి వ్యతిరేకంగా సాగే సాయుధ పోరాటాల్లో కూడా ఈ ఎత్తుగడ ఉంది. చిన్న చిన్న ఓటములకు కూడా మనసు చిన్న బుచ్చుకోకుండా, మంచి తరుణం కోసం నిరీక్షించాలనే నీతి ఇందులో దాగుంది. బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో అనేక గణరాజ్యాలుండేవి. ఒకరి మీద ఒకరి దండయాత్రల్లో ఆయా రాజుల మధ్య దాడులు, దండయాత్రలు, యుద్ధాలు తరచూ జరిగేవి. తమకు బలమున్నప్పుడు అవతలి వారి రాజ్యభాగాలపై దండెత్తి కొంతో, సాంతమో సొంతం చేసుకునే వారు రాజులు. బలం లేనప్పుడు ప్రత్యర్థులు దాడులకు తెగబడితే... వీలయితే ఎదురొడ్డి పోరాడ్డం, కాకుంటే ఏదో విధంగా బతికి బట్టగట్టే ప్రయత్నం చేసేవారు. అలా దెబ్బతిన్న వాళ్లు, మళ్లీ ఏదోలా తంటాలు పడి, పుంజుకొని శక్తి కూడగట్టుకొని ఎదురు దాడులు చేసేవారు. అందులోనూ విజయమో, వీరస్వర్గమో అన్నట్టు పోరాట్టం ద్వారా ఎడనెడ తాము పోగొట్టుకున్న రాజ్యాల్ని తిరిగి స్వాధీనపరచుకున్న ఉదంతాలూ ఉన్నాయి. పనిలో పనిగా పోగొట్టుకున్నదానికి ఎన్నోరెట్లు అధికంగా పొందినవారూ ఉన్నారు. అంతిమ విజేతలకు కూడా ఒకోసారి పోరాటం మధ్యలో, ‘అయ్యో! ఏంటి నా పరిస్థితి? ఇదేంటి, ఇలా అయిపోతోంది!’ అని ఆందోళన కలిగించే సందర్భాలూ వస్తాయి. అటువంటి సందర్భం మహాభారతంలోనూ ఉంది. ఆ మాటకొస్తే, మహాభారతంలో ఉండి నిజజీవితంలో ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఓ సారి జరగందంటూ ఏమీ లేదంటారు. అలాగే జీవితంలో జరిగేవన్నీ ఎక్కడో ఓ చోట ఏదో రూపంలో మహాభారతంలో జరిగినవే, ఉన్నవే అనీ అంటారు పండితులు. మన జీవితాలతో ఆ ‘పంచమవేదం’ అంతగా ముడివడి ఉందన్నమాట. మహాభారతంలో అత్యధిక భాగం తెలుగించిన తిక్కన నాటకోచిత రచనా పటిమకు మచ్చుతునక ఈ చిన్న పద్యం. కురుక్షేత్ర రణభూమిలో యుద్ధం జోరుగా సాగుతోంది. కర్ణుడు విజృంభిస్తున్నాడు. విజయుడని పేరున్న అర్జునుడే బెంబేలెత్తిపోతున్నాడు. చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న కర్ణుడ్ని చూసి జడుసుకున్నాడేమో అర్జునుడు తన రథసారథి అయిన బావ కృష్ణుడితో ‘‘బావా! బతికుంటే బలుసాకులు తిని సుఖపడవచ్చు, ముందు మనమిక్కడ్నుంచి జారుకుందాం, అదుగో ఆ కర్ణుడ్ని చూడు మిట్ట మధ్యాహ్నపు సుర్యుడిలాగా మండిపోయి ఉగ్రరూపంలో చెలరేగుతున్నాడు, ఇప్పటికైతే రథాన్ని వెనక్కి మలుపు’’ అని బతిమాలుతాడు. కృష్ణుడంత తేలిగ్గా సరే అంటాడా? అప్పటికే ఓ పేద్ద గీతాసారాన్ని బామ్మర్దికి బోధించి ఉన్నాడు. మళ్లీ నాలుగు ఊతమిచ్చే మాటలు చెప్పి విజయుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. సాఫీగా యుద్ధం సాగిపోతుంది. కర్ణ వధా జరుగుతుంది. అదో పెద్ద కథ! ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, కష్టాలు మనుషులకు కాకుండా రాళ్లకొస్తాయా? ధైర్యంతో తట్టుకోవాలి. ముందుకు పురోగమించడానికి, వ్యూహాత్మకంగా అవసరమైతే ఓ అడుగు వెనక్కి వేయాలి. ‘అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా?’ అంటాడు యోగివేమన. పరిస్థితుల్ని చూసుకొని మెదలాలి. అన్ని వేళలూ ఒక్కలా ఉండవు. అధికారం చేజారడమైనా, ఆశించింది లభించకపోవడమైనా, రాష్ట్రం విడిపోవడమైనా, రాజధాని ప్రాభవం తగ్గడమైనా, ఆర్థిక లోటుపాట్లయినా, ఇంకోటైనా, మరోటైనా... అనుకూల, ప్రతికూల సకల యత్నాల తర్వాత కూడా కొన్ని అనివార్యంగా జరిగిపోయే పరిణామాలుంటాయి. వాటిని తట్టుకొని నిలవడం తప్ప వేరేగా చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే మనసుకవి ఆత్రేయ అంటాడు ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’ అని. నిజాయితీగా నిష్కామకర్మను ఆచరించిన తర్వాత మంచి ఫలితం కోసం నిరీక్షించడం తప్ప నిరాశ చెందనవసరం లేదన్నదే నిజమైన జీవనసూత్రం. - దిలీప్‌రెడ్డి -
ఘనంగా ‘క్వీన్’ జన్మదినోత్సవం
సాక్షి, ముంబై: పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే ముంబై-పుణే ‘డెక్కన్ క్వీన్’ రైలు 85వ పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా నిృ్వహించారు. ప్రయాణికులు ఏటా క్రమం తప్పకుండా ఈ రైలుకు జన్మదినోత్సవం నిర్వహించడంవల్ల డెక్కన్క్వీన్కు ఆదరణ పెరుగుతూనే ఉంది. దీని పుట్టిన రోజు సందర్భంగా బోగీలను రంగురంగుల కాగితాలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. శనివారం ఈ రైలు విధులు నిర్వహించిన మోటార్‌మన్ (డ్రైవర్) గార్డుకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల వ్యయాన్ని రైలులో శనివారం రాకపోకలు సాగించిన ఉద్యోగులే భరించారు. 1930 నుంచీ సేవలు.. బ్రిటిష్‌పాలనలో ముంబై-పుణే నగరాల మధ్య మొట్టమొదటిసారిగా 1930 జూన్ ఒకటిన డెక్కన్ క్వీన్ అనే పేరుతో ఈ రైలును ప్రారంభించారు. అప్పట్లో బ్రిటిష్ రాణులు, వారి బంధువులు ఇందులో రాకపోకలు సాగించేవారిని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా ఈ రెండు నగరాల మధ్య ఉద్యోగులు, వ్యాపారుల రాకపోకలు పెరిగిపోవడంతో అందరూ ఈ రైలునే ఆశ్రయించడం మొదలయింది. అతి తక్కువ సమయంలోనే దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలకు ఈ రైలు అనువుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఉదయం ముంబైకి రావడం, సాయంత్రం పుణేకు ఇది తిరుగు ప్రయాణ మవుతుంది. ఇందులో తరచూ ప్రయాణించే వాళ్లంతా కుటుంబ సభ్యుల్లా కలసిమెలసి ఉంటారు. పుణే-ముంబై మధ్య ప్రత్యేకంగా ప్రతీరోజు డెక్కన్ క్వీన్, ప్రగతి ఎక్స్‌ప్రెస్, సింహగఢ్, ఇంటర్సిటీ ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతాయి. ఇవన్నీ ఉదయం ముంబై వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడతాయి. ఉద్యోగులకు డెక్కన్ క్వీన్ రైలు టైం టేబుల్ అనుకూలంగా ఉండడం వల్ల అత్యధికులు దీనినే ఆశ్రయిస్తారు. డెక్కన్ క్వీన్ ఇంజన్ మొదలుకుని బోగీలు సైతం నీలం రంగులో ఉంటాయి. కిటికీలపైన తెల్లని రంగుతో పట్టీ కనిపిస్తుంది. ఎంతో ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతం ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అనే పాటలో ఒక చోట నీలం రంగుతో కనిపిస్తున్న రైలు కూడా ఇదే కావడం విశేషం. ఈ 85 ఏళ్లలో డెక్కన్ క్వీన్‌ను నిత్యం వినియోగించుకున్న ఎందరో ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. భారత రైల్వే చరిత్రలో ఒకప్పుడు రైళ్లకు వేర్వేరు రంగులు ఉండేవి. అన్నీ ఒకేవిధంగా కనిపించాలనే ఉద్దేశంతో (ఇటీవల వచ్చిన దురంతో రైళ్లు మినహా) రైళ్లన్నింటికీ ఒకే రంగు వేశారు. డెక్కన్ క్వీన్ రైలు రంగు మాత్రం అలాగే ఉంది. దీని ఇంజన్ కూడా నీలం రంగులోనే ఉంటుంది. ఈ రైలుకు ఐదు ఏసీ చైర్‌కార్ బోగీలతోపాటు సీజన్పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేకంగా బోగీలు కేటాయించారు. డైనింగ్ కార్ బోగీ కూడా ఉంది. ఇందులో ఒకసారి 32 మంది ప్రయాణికులు కూర్చుని అల్పాహారం, టీ, శీతల పానియాలు సేవించవ చ్చు. -
విభజనకు ‘భాష’ కారణమా?!
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ముల్కీ-నాన్‌ముల్కీ గొడవకు పరిష్కారంగా మూడు ప్రాంతాలలోని విద్యా, ఉపాధి అవకాశాలలో ఎవరూ దెబ్బతినకుండా రాష్ట్రావతరణ తర్వాత పదిహేనేళ్లకు ఇందిరాగాంధీ ‘371-డి’ అనే ప్రత్యేక అధికరణను (32వ రాజ్యాంగ సవరణ ద్వారా) రూపొందించడానికి కారకులయ్యారని మరవరాదు! దీన్ని సవరించాలంటే 368వ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ను సవరించి తీరాలనేది అందుకే! ‘విభజించి పాలించే’ బ్రిటిష్ వలస పాలకుల ‘నీతి’ మత సరిహద్దులు కూడా దాటింది. ఆ కూట నీతి మన దేశంలో ఏ స్థాయికి వ్యాపించిందంటే, ఒకే భాషా సంస్కృతుల పునాదిగా ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలను సహితం కకావికలు చేయగలిగే వరకు వెళ్లింది. అక్కడ కూడా ఆగకుండా అసలు ‘భాష’ అనేదే రాష్ట్రం విడిపోవడానికి లేదా విభజనకు కారణమని తాజా వాదన లేవదీసే వరకూ వెళ్లింది! మజ్లిస్ నాయకుడు, గౌరవ పార్లమెంటు సభ్యుడు ఒవైసీ సమైక్య రాష్ట్రంతోనే అందరి అభివృద్ధి అని చాటుతూన్న సమయంలో, హైదరా బాద్‌కు చెందిన కులీన కుటుంబానికి చెందిన ప్రసిద్ధులు నవాబ్ మెహ బూబ్ అలామ్ ఖాన్ రాష్ట్రం విడిపోవడానికి ‘భాష’ సబబైన కారణమని అభిప్రాయపడినట్టు (‘ది హిందూ’,‘ఆఫ్ ది రికార్డు’: 13.1.2014) వచ్చిం ది! ఇందుకు నవాబ్ అలామ్ చేస్తున్న వాదనేమిటి? ‘‘హైదరాబాద్, గుల్బ ర్గాలు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు మీరు ప్రయాణిస్తున్నప్పుడు తేడా ఏదీ మీకు అనిపించదు. కాని, రాష్ట్రంలో ఉన్నప్పటికీ, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తుంటే తేడా కనిపిస్తుంద’’ని ఆయన అంటారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరమైందో చెప్పడానికి ఈ పోలిక తెచ్చారట! హైదరా బాద్ స్టేట్‌లో నాలుగు విభిన్న భాషలు-ఉర్దూ, తెలుగు, కన్నడం, మరాఠీ మాట్లాడేవారుండేవారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా రాకపోకలు సాగించే వారు, నేడు ఒకే రాష్ట్రంలోని ఒక భౌగోళిక ప్రాంతాన్ని దాటి సుఖంగా వెళ్ల లేకపోతున్నారు కాబట్టి ఒకే భాషాప్రయుక్త రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం విడిపో వాలనుకోవడానికి ఇంతకన్నామించిన కారణం ఏముంటుంద’’ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు! అన్నిచోట్లా అన్ని భాషల వారూ... అలామ్ ప్రస్తావించిన నాలుగు విభిన్న భాషలు మాట్లాడే ప్రజలు నేడు ఏ ఒక్క తెలంగాణ ప్రాంతానికో పరిమితమైలేరు. బహుముఖీనంగా విస్తరి స్తున్న ఆధునిక సంస్కృతిలో భిన్న భాషలు మాట్లాడే ప్రజలు అసోం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ, కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా విస్తరించుకుని ఉన్నారు! రెండు పరాయి పాలక వంశాల ఇలాకాల్లో (నిజాం సంస్థానం, బ్రిటిష్ పాలన) చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఇటు 200 ఏళ్లకు పైగా అటు 150 ఏళ్లకు పైగా ప్రజల భాషకు, బతుకుతెరువుకు ఏర్పడిన కడగండ్లను అలామ్ పరిగణనలోకి తీసుకుని ఉంటే ‘భాష’ ఆధారంగా తెలుగు జాతి విచ్ఛిత్తిని, విభజనను సమర్థించడానికి సాహసించేవారు కాదు! పరిమి తంగానే అయినా ఒక్క కుతుబ్ షాహీల కాలంలో తెలుగు రాణించింది. అది మినహా తెలంగాణలో తెలుగు స్కూళ్లు తెరవనివ్వలేదు. తెలుగు సంస్కృతిని వికసించనివ్వలేదు. మద్రాసు రాజధానిగా సీమాంధ్ర ప్రాంతా లను ఏలుతూ వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యపాలనా వ్యవస్థవల్ల అక్కడి ప్రజలూ స్వరాష్ట్రం కోసం, స్వభాషాభివృద్ధి కోసం, ఉపాధి సౌకర్యాల కోసం తెలంగాణ సోదరుల మాదిరిగా నానా అగచాట్లు పడినవారే! నిజాంనూ ఆదేశించిన మద్రాసు 1942లో ‘జాయిన్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తిలో సాగిన క్విట్ ఇండియా ఉద్యమకాలంలో తెలుగు భాషా ప్రాంతాలకు మూడు ప్రాంతీయ కార్యాల యాలు ఏర్పడ్డాయి. తెలంగాణకూ ఓ ప్రాంతీయ కార్యాలయం ఏర్పడింది. ఈ కార్యక్షేత్రానికి కేంద్రం విజయవాడ. నిజాములు లొంగిపోయిన తరు వాత బ్రిటిష్ వలస పాలనకు దక్షిణాదిన, దక్కన్లోనూ మద్రాసు, హైద రాబాద్ నగరాలే ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. మద్రాసు నుంచే అన్ని రకాల ‘హుకుమ్’లూ జారీ అవుతూ ఉండేవి. హైదరాబాద్‌కు సంబంధించి తెలుగు సహా నాలుగు భాషల వారి గురించి అలామ్ ప్రస్తావించారు. కానీ భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడేవారు వారి వారి భాషా రాష్ట్రాలకు తరలిపోతుంటే ఎందుకు అడ్డు కోలేకపోయారో చెప్పగలరా? అసలు ప్రాంతాల వారీగా ఇక్కడున్న వివిధ భాషా ప్రజల వివరాలను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వెల్లడించిన సంగతిని గుర్తుచేసుకోవాలి. రాష్ట్రం మొత్తంమీద తెలుగు వారు 85 శాతం. హైదరా బాద్ సహా మొత్తం తెలంగాణలో చూస్తే 77 శాతం ఉన్నారు. హైదరాబాద్ మినహాయించి కేవలం తెలంగాణలో తెలుగువారు 81 శాతం ఉన్నారు. కేవలం హైదరాబాద్‌లో 47 శాతం. రాయలసీమలో 80 శాతం, కోస్తాం ధ్రలో 93 శాతం ఉన్నారని కమిషన్ చెప్పింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే పెక్కు భాషలు-తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడం, హిందీ మాట్లాడే ప్రజలున్నారని ఆ కమిటీ తేల్చింది! ఈ సందర్భంగా, ‘ముల్కీ’ (స్థానికులు, నాన్-ముల్కీ అంటే స్థానికేతరులు) భావన ఎందుకు తలె త్తిందో శ్రీమతి ముదిగొండ సుజాతారెడ్డి ఇచ్చిన వివేచనాత్మకమైన వివరణ చూద్దాం: ‘‘ఉత్తర భారతంలో మొగల్ సామ్రాజ్యం, లక్నోలో అవధ్ నవా బుల రాజ్యం (1857) కూలిపోయిన తర్వాత అక్కడి రాజాస్థానాల్లో ఉన్న తోద్యోగులెందరో హైదరాబాద్‌కు వలసవచ్చి, నిజాం రాష్ట్రంలో స్థిరపడి పోయారు. దాంతో ఇక్కడ పాలితులు, పాలకులు అనే భేదం, వర్గ భేదం విస్తరించింది. పూర్తిగా ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడింది. భూస్వాముల చేతుల్లోకి చాలా భాగం వ్యవసాయ భూములు చేరిపోయాయి. కాపులు, రైతులంతా కౌల్దారులుగా మాత్రమే మిగిలిపోయారు. కష్టం వాళ్లవంతయింది. ఫలాలు ఫ్యూడల్ దొరలపాలై ప్రభువు నిజాం ధనవంతుడయ్యాడు. వృత్తి పనుల వారు, మాలమాదిగలు తమ భుక్తి కోసం పనులు చేసేదానికన్నా దొరలకు దేశ్‌ముఖ్‌లకు సేవలు, వెట్టిచాకిరీ చేయడంలోనే కాలం గడిచిపోయింది. స్వాతంత్రోద్యమంలోనూ నిజాం రాష్ట్రంలోనూ క్రమంగా ఆ గాలులు ప్రవే శించాయి. కాని చాలా నిర్బంధాలుండటం చేత మొదట భాషాపరమైన, సాంస్కృతిక పరమైన గుర్తింపుల కోసం ప్రయత్నాలు జరిగాయి’’. తెలుగు తెలుగువారందరిదీ... వాదన కోసమో లేదా నిజాం పాలనావశేషాల పట్ల మిగిలిపోయిన మమకా రంతోనో ‘భాష’ విభజనకు లేదా విడిపోవడానికి కారణమని అలామ్ వాదించి ఉంటారు. మత సామరస్యానికి పేరెన్నికగన్న హైదరాబాద్ (భాగ్య) నగరంలో భిన్న మతస్థుల మధ్య సంబంధాలను పరిశీలించి నివే దిక ఇవ్వమని, సరోజినీ నాయుడి కుమార్తె పద్మజా నాయుడిని జాతీయ కాంగ్రెస్ పురమాయించింది. 1938, డిసెంబర్ 1న పద్మజా నాయుడు ప్రత్యేక అనుబంధాలు సహా ఒక నివేదికను సమర్పించింది. అందులో హైదరాబాద్‌లోని మెజారిటీ, మైనారిటీ ప్రజల హక్కుల సమస్య గురించిన ప్రస్తావనలో ఇలా ఉంది. ‘‘ఈ సమస్యను గోరంతలు కొండంతలు చేసి దానికి కృత్రిమమైన ప్రాధాన్యం కల్పించారు. అలా ఎందుకు జరిగిందంటే, బ్రిటిష్ ఇండియాలో పాలన విదేశీయులది కాబట్టి, హిందువులు, ముస్లిం లు సఖ్యంగా ఉన్నారు. హైదరాబాద్‌లో పాలన ముస్లిం ప్రభువులది. పైగా 1909, ఏప్రిల్ 7న విడుదలైన ఫర్మానాలో హైదరాబాద్‌ను ‘ఇస్లామిక్ స్టేట్’ అని పేర్కొన్నారు. అప్పట్లో స్టేట్‌లోని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న అధి కారులు ముస్లింలే అయినందున ఉన్నత, కిందిస్థాయి పదవులు పెక్కిం టిలో ముస్లింలనే నియమించారు. పైగా ఉర్దూ భాషనే బోధనా భాషగా చేయడం వల్ల హైదరాబాద్ మొత్తం (1,41,36,148) జనాభాలో కనీసం ఒక తరం తరం, ఆ అధికార మార్పిడి కాలంలో ఉద్యోగాల కోసం నిర్వహిం చిన పోటీ పరీక్షలో 90 శాతం తీవ్రంగా నష్టపోయారు’’! పేరు మార్చుకుందాం! ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ముల్కీ-నాన్‌ముల్కీ గొడవకు పరిష్కారం గా మూడు ప్రాంతాలలోని విద్యా, ఉపాధి అవకాశాలలో ఎవరూ దెబ్బతిన కుండా రాష్ట్రావతరణ తర్వాత పదిహేనేళ్లకు ఇందిరాగాంధీ ‘371-డి’ అనే ప్రత్యేక అధికరణను(32వ రాజ్యాంగ సవరణ ద్వారా) రూపొందించడానికి కారకులయ్యారని మరవరాదు! దీన్ని సవరించాలంటే 368వ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ను సవరించి తీరాలనేది అందుకే! ఒకవేళ అందులో ‘తెలంగాణ’ పదం చేర్చాలన్నా అందుకూ 7వ షెడ్యూ ల్కు సవరణ తేవాలేగాని అడ్డగోలు బిల్లు పనికిరాదని గుర్తించాలి! అంత కన్నా ఉర్దూ భాషా ప్రతిపత్తిని కాపాడుతూనే, రక్షణ కల్పిస్తూనే తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసుకోకుండా ‘ఆర్టికల్-3’లోని ‘ఇ’ క్లాజు ప్రకారం రాష్ట్రం పేరును ‘తెలుగునాడు’ లేదా ‘తెలంగాణ’ అని మార్చుకుంటే చక్కగా ఉండదూ! ఆలోచించండి! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు