తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి చెందినవారు? | educational reforms in british ruling | Sakshi
Sakshi News home page

తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి చెందినవారు?

Published Sat, Aug 2 2014 10:52 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి  చెందినవారు? - Sakshi

తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి చెందినవారు?

బిటిష్ పాలనలో విద్యా సంస్కరణలు
 
ప్రాచీన కాలంలో తక్షశిల, నలందా, విక్రమశిల మొదలైన విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధిగాంచినవి. 19వ శతాబ్దంలో మన విద్యా వ్యవస్థలో అనేక లోపాలున్నందువల్ల, ఆంగ్ల పద్ధతిలో బోధన ఉత్తమంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఆంగ్ల విద్యనే ప్రవేశపెట్టాలని, ఆ విద్యను అభ్యసించిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల భారతదేశంలో ప్రాచీన విద్య మనుగడ ప్రమాదంలో పడింది. ఆంగ్లేయులు వచ్చిన మొదటి శతాబ్దంలో విద్య గురించి ఎక్కువ శ్రద్ధ చూపలేదు.
 
 క్రీ.శ. 1781లో వారన్ హేస్టింగ్‌‌స తొలిసారిగా కలకత్తాలో పర్షియా, అరబిక్ భాషల్లో బోధన కోసం  ‘కలకత్తా మదర్‌సా’ అనే విద్యా సంస్థను స్థాపించాడు. క్రీ.శ. 1791లో డంకన్ బెనారస్‌లో సంస్కృత కళాశాలను ఏర్పాటుచేశాడు. లార్‌‌డ వెల్లస్లీ క్రీ.శ. 1802లో ఆంగ్లేయ అధికారులకు భారతీయ భాషలను, సాంఘిక ఆచారాలను బోధించడానికి ‘విలియం కోట’ కళాశాలను స్థాపించాడు. కానీ, ఈ కళాశాలను బోర్‌‌డ ఆఫ్ డెరైక్టర్‌‌స ఆదేశం మేరకు మూసివేశారు.   1813 చార్టర్ చట్టం వచ్చేంతవరకు విద్యకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ ఎలాంటి చర్యలనూ చేపట్టలేదు. 1813 చార్టర్ చట్టంలో ఈస్టిండియా కంపెనీ విద్యావ్యాప్తికి ఏటా లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించింది.
 
 విద్యావ్యాప్తి కోసం చట్టం ద్వారా ధనాన్ని కేటాయించడం అదే తొలిసారి. ఆంగ్లేయాది పరభాష గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువాదం చేయడానికి, సంస్కృతం, అరబ్బీ, పర్షియన్ భాషల్లో గ్రంథాలను అచ్చువేయడానికి ఈ ధనాన్ని వినియోగించారు. రెండు దశాబ్దాల వరకూ విద్యావిషయమై కంపెనీ ఏ చర్యా తీసుకోలేదు. తర్వాత భారతదేశంలో బోధన ప్రాచ్య విద్యలో ఉండాలా? పాశ్చాత్య (ఇంగ్లిష్) విద్యలో ఉండాలా? అనే వివాదం చెలరేగింది. ప్రాచ్య విద్యను ప్రవేశపెట్టాలని విల్సన్, ప్రిన్సెస్ సోదరులు సూచించారు. ఆంగ్లభాషలో విద్యను బోధించాలని రాజారామ్మోహన్‌రాయ్ మద్దతుతో ‘చార్లెస్ ట్రావెలియన్’ వాదించారు.
 
ఆంగ్ల మాధ్యమంలో పాశ్చాత్య శాస్త్రాలు, పాండిత్యాన్ని బోధించాలని పాశ్చాత్య విద్యావాదులు చెప్పారు. క్రీ.శ.1835లో మెకాలే భారతదేశంలో బోధన ఇంగ్లిష్‌లో ఉండాలని ప్రకటించిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. దీనివల్ల ఆంగ్లేయులకు, భారతీయులకు ఇద్దరికీ లాభమని మెకాలే అభిప్రాయం. భారతదేశంలోని గ్రంథాలన్నీ కలిపినా ఆంగ్ల భాషలోని కొన్ని పుస్తకాలతో సరితూగవు అని ఇతడు పేర్కొన్నాడు. కాబట్టి ఆంగ్ల భాష నేర్చుకున్నట్లయితే ఆంగ్ల గ్రంథాలను చదివి భాషాశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలవుతుందని, అప్పుడు భారతీయులు ఆంగ్లేయులతో సరితూగగలరని మెకాలే అభిప్రాయం. అందువల్ల ఆంగ్ల విద్య భారతీయులకు లాభదాయకమని వాదించాడు.
 
బొంబాయి ప్రభుత్వం 1845లో ఒక ఆర్డినెన్‌‌స జారీ చేస్తూ బెంగాల్, మద్రాస్ ప్రభుత్వాల మాదిరిగానే పాఠశాల, కళాశాల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, పాశ్చాత్య జ్ఞానాన్ని మాతృభాషలోనే బోధించాలని నిశ్చయించింది. ఆంగ్ల విద్య చరిత్రలో క్రీ.శ. 1854కు ప్రాముఖ్యం ఉంది. 1853లో బ్రిటిష్ పార్లమెంట్ భారత విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. ఫలితంగా క్రీ.శ. 1854లో బోర్‌‌డ ఆఫ్ డెరైక్టర్‌‌స అధ్యక్షుడైన సర్ చార్లెస్ ఉడ్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. ఈ కమిటీ విద్య విధానానికి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించింది. అదే ‘ఉడ్‌‌స డిస్పాచ్’గా ప్రసిద్ధి చెందింది.
 
 ఉడ్‌‌స ప్రణాళికలోని ముఖ్యాంశాలు:
*  భారతీయులను విద్యావంతులను చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి
* ప్రభుత్వ సహాయంతో పాఠశాలను, కళాశాలలను ఏర్పాటు చేసేట్లుగా ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహమివ్వాలి.
* ప్రతి ప్రావిన్‌‌సలో పాఠశాల ఇన్‌స్పెక్టర్లను, విద్యా డెరైక్టర్లను నియమించాలి.
* పెసిడెన్సీ పట్టణాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.
* భారతీయులకు పాశ్చాత్య విద్య.. ము ఖ్యంగా విజ్ఞానశాస్త్ర, తత్వజ్ఞాన, సాంఘిక శాస్త్రాలను బోధించి కంపెనీలో ఉద్యోగాలివ్వడానికి తగిన అర్హతలు కల్పించాలి.
* ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి.
 
పై అంశాలతో కూడిన బృహత్తర ప్రణాళికను ‘సర్ చార్లెస్ ఉడ్’ సూచించాడు. ఆ కాలం లో గవర్నర్ జనరల్‌గా పనిచేస్తున్న లార్‌‌డ డల్హౌసీ ఈ ప్రణాళికను అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాడు.
 
ప్రభుత్వం ‘ఆక్స్‌ఫర్‌‌డ విశ్వవిద్యాలయం’ తరహాలో కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో విశ్వ విద్యాలయాలను స్థాపించింది. ఈ విశ్వవిద్యాలయాల్లో చాన్సలర్, వైస్ చాన్సలర్లను నియమించారు. ‘సెనెట్’ అనే ఒక సమావేశ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని దశాబ్దాల వరకు చార్లెస్ ఉడ్ సూచించిన విధంగా భారతదేశంలో విద్యా విధానం కొనసాగింది.
 
ఉడ్‌‌స ప్రణాళిక తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రిప్పన్ కాలంలో 22 మంది సభ్యులతో ‘హంటర్’ అధ్యక్షతన ఒక కమిషన్ ను క్రీ.శ.1882లో నియమించారు. ప్రాథమిక, స్త్రీ విద్యకు ప్రాధాన్యమివ్వాలని ఈ కమిషన్ తన నివేదికలో సూచించింది. విద్య, సాంఘిక సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల మద్దతు పొందాలని ‘హంటర్’ సూచించాడు. క్రీ.శ. 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం, 1887లో అలహాబాద్ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.

లార్‌‌డ కర్జన్ వైస్రాయ్‌గా ఉన్నప్పుడు విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టాడు. ఆ మార్పుల్లో భాగంగా విద్యాధికారులందరినీ సిమ్లాలో సమావేశపర్చి కొన్ని అంశాలను చర్చించారు. ఆ అంశాలను పరిశీలించడానికి ‘సర్ థామస్ ర్యాలీ’ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా లార్‌‌డ కర్జన్ క్రీ.శ. 1904లో విశ్వ విద్యాలయ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
 
విద్య ద్వారా భారతదేశంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్ హెన్రీ బట్లర్’ క్రీ.శ. 1913లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు. తర్వాత పాట్నా, నాగపూర్, రంగూన్, కాశీ, అలీఘర్, హైదరాబాద్‌లలో విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
 
క్రీ.శ. 1916లో పుణేలో డి.కె. కార్వే స్త్రీల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. క్రీ.శ. 1917లో నియమించిన ‘శాడ్లర్ కమిటీ’ ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని సూచించింది. బీఏ (హానర్‌‌స) కోర్సును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని, టీచర్ ట్రైనింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, స్త్రీ, వృత్తి విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. క్రీ.శ. 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌లో ‘విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని’ ఏర్పాటు చేశారు.
 
క్రీ.శ. 1927లో సైమన్ కమిషన్‌తోపాటు విద్యా విషయాలను పరిశీలించేందుకు  ‘హార్టాగ్ (ఏ్చట్టౌజ)’ కమిటీని నియమించారు. తర్వాత 1944లో సార్జంట్ విద్యాప్రణాళికలో కొన్ని ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. మహాత్మాగాంధీ మరికొంత మంది జాతీయ నాయకులు సమావేశమై క్రీ.శ. 1937లో ‘సేవాగ్రామ్’లో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంతవరకు ఈ ప్రణాళికను అమలు చేశాయి. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంలో అనేకమార్పులు చోటుచేసుకున్నాయి.
 
మాదిరి ప్రశ్నలు

 1.    కిందివాటిలో సరికానిది?    
     (2001 సివిల్స్)
     1)    కలకత్తా మదర్‌సా:వారన్ హేస్టింగ్‌‌స (1781)
     2)    వారణాసి సంస్కృత పాఠశాల : జోనాథన్ డంకన్ (1792)
     3)    చార్లెస్ ఉడ్ డిస్పాచ్ : డల్హౌసీ (1854)
     4)    ఆంగ్ల విద్యాచట్టం: విలియం హార్వే (1828)
 సమాధానం: 4
 వివరణ: 1835లో మెకాలే ‘లా’ కమిషన్ అధ్యక్షతన విలియం బెంటింక్(భారతదేశ తొలి గవర్నర్ జనరల్) ఆంగ్ల విద్యా చట్టాన్ని ప్రవేశపెట్టాడు. జోనాథన్ డంకన్ ‘వారణాసి’లో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో వారన్ హేస్టింగ్‌‌స మదర్సాను ఏర్పాటు చేశాడు.
 
 2.    కిందివాటిలో సరైంది ఏది?
 (2003 సివిల్స్)
     ఎ)    ఇండాలజీ పితామహుడు: సర్ విలియం జోన్‌‌స
     బి)    తులనాత్మక పితామహుడు: మాక్స్ ముల్లర్
     సి)    {పాచ్య పితామహుడు:  వి.ఎ. స్మిత్
     డి)    పాశ్చాత్య పితామహుడు: జె.ఎస్. మిల్
     1) ఎ, బి మాత్రమే    2) బి, సి మాత్రమే
     3) ఎ, డి మాత్రమే    4) అన్నీ వాస్తవాలే
 సమాధానం: 4
 
వివరణ: సర్ విలియం జోన్‌‌స 1784లో ‘ఏసియాటిక్ సంస్థ’ను కలకత్తాలో ప్రారంభించి భారత సంస్కృతిని వెలుగులోకి తేవడానికి కృషి చేశారు. ఈ సంస్థ తరఫున కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం (నాటకం)ను, జయదేవుని-గీతాగోవిందం(పద్యకావ్యం)ను, మనుస్మృతి-న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు. ఇతని సహాయకుడు చార్లెస్ విల్కిన్‌‌స ‘భగవద్గీతను’ ‘సెలిటీయస్ సాంగ్‌‌స’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.
 
మాక్స్ ముల్లర్ తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి. ఇతను 1862లో రుగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘వేదముల్లర్’గా పేరు గడించారు. ఈ గ్రంథం లో ఆర్యుల జన్మప్రాంతం ‘మధ్య ఆసియా’గా పేర్కొన్నాడు. వి.ఎ. స్మిత్ 1867లో భారతదేశాన్ని సందర్శించి అనేక గ్రంథాలు రచించాడు. ఇతడు సముద్రగుప్తుడిని భారత నెపోలియన్‌గా పేర్కొన్నాడు. 1817లో జేమ్స్ మిల్స్ భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా క్రోడీకరించారు.
 
 3.    విద్యా వ్యవస్థపై వచ్చిన కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో వాస్తవమైంది?
     (2004 సివిల్స్)
     ఎ)    హంటర్ కమిషన్ - లార్‌‌డ రిప్పన్     (1882)
     బి)    సర్ థామస్ ర్యాలీ - 1904 కర్జన్
     సి)    శ్లాడర్ కమిటీ - లార్‌‌డ ఇర్విన్ (1926)
     డి)    వార్టాగ్ కమిషన్ - 1917 చేమ్స్‌ఫర్‌‌డ
     1) ఎ మాత్రమే    2) ఎ, బి మాత్రమే
     3) ఎ, బి, సి మాత్రమే
     4) పైవన్నీ సరైనవే
 సమాధానం: 2
 
వివరణ: 1882లో లార్‌‌డ రిప్పన్ ‘హంటర్’ కమిటీని నియమించారు. దీని ప్రకారం స్త్రీ విద్య, మత విషయాలతో సంబంధం లేని విద్య, నైతిక విద్య అవసరం అని పేర్కొన్నారు.      1904లో కర్జన్ థామస్ ర్యాలీ కమిటీని నియమించారు. కలకత్తా, బొంబాయి, మద్రాస్ సెనెట్‌లలో 20 మంది సభ్యులు, మిగతా ప్రాంతాల్లో 15 మంది ఉండాలని కమిటీ సూచించింది. శ్లాడర్ 1917లో ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలలో చేర్చాలని తీర్మానించాడు. 1927లో వార్టాగ్ కమిషన్‌ను లార్‌‌డ ఇర్విన్ నియమించాడు.
 
 4.    ‘1857 ఉడ్ డిస్పాచ్’ కమిటీ తీర్మానాల్లో లేని అంశం ఏది?
     1)    ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి
     2)    తెలివైన విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి
     3)    ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు వేరే శాఖలో ఉండాలి
     4)    విద్యావ్యాప్తి కోసం 50 లక్షల రూపాయలు కేటాయించాలి
 సమాధానం: 4
 
వివరణ: 1912 చట్టంలో రెండో హార్డింగ్ రాజ ప్రతినిధి విద్యకోసం, ఆధునిక విద్య ప్రోత్సాహానికి 50 లక్షల రూపాయలను కేటాయించారు. వైస్రాయ్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్‌హెన్రీ బట్లర్’ 1913 లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement