మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు | Boy kills sister to buy mobile handset | Sakshi
Sakshi News home page

మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు

Published Wed, Jul 15 2015 5:12 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు - Sakshi

మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు

ఐజ్వాల్: మొబైల్ ఫోన్పై మోజు ఆ యువకుడిని పిచ్చివాడిని చేసింది. తాను ఏం చేస్తున్నానో అనే ఆలోచన కూడా లేకుండా చేసింది. ఫలితంగా అతడు తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. సొంత అక్కాబావను హతమార్చాడు. అనంతరం ఇంట్లో నుంచి 36 వేలు ఎత్తుకెళ్లి చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఈ నెల 7న జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతానికి జువైనల్ కోర్టు అతడు నేరం చేసినట్లు నిర్దారించి జైలుకు తరలించింది. పోలీసుల వివరాల ప్రకారం, సవతి సోదరి, అతడి బావకు ఈ మధ్యనే ప్రభుత్వ సాయంగా ఓ 66 వేల రూపాయాలు వచ్చాయి.

అందులో ఓ ముప్పై వేలతో కొంత భూమి కొనుక్కోని మిగితావి ఇంట్లో పెట్టారు. దీంతో వాటిపై కన్నేసిన యువకుడు ఆ డబ్బుతో కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఆలోచించి, వారిని అడిగితే ఇవ్వరని భావించి ఊర్లో చుట్టుపక్కల జంతువులను వేటాడటానికి ఉపయోగించే సింగ్ బ్యారెల్ తుపాకీని తీసుకొని ముందుగా బావను హతమార్చాడు. ఆ వెంటనే సోదరిని అదే తుపాకీతో దారుణంగా కొట్టాడు. అనంతరం గొడ్డలితో తీవ్రంగా గాయపరిచాడు. చివరికి ఆమె చనిపోగానే ఇంట్లో ఉన్న 36 వేలు తీసుకొని ఏం తెలియనట్లు సొంతింటికి వెళ్లాడు. అలా వెళ్లిన మరుసటి రోజే పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement