Mobile handset
-
మళ్లీ లాభాల్లోకి నోకియా..
కోల్‌కతా: మొబైల్ హ్యాండ్సెట్ బిజినెస్‌లో నోకియా ప్రస్థానం విచిత్రమైంది. గతంలో ఈ సంస్థ ఫోన్ల వ్యాపారాన్ని శాసించిందనడంలో వింతేమీ లేదు. అప్పుడు భారత్‌లో నోకియా ఫోన్లకున్న డిమాండ్ అలాంటిది మరి. కానీ ఇది కొద్ది కాలమే. మొబైల్ హ్యాండ్సెట్ వ్యాపారంలో కొంగొత్త ఎత్తులు చూసిన నోకియా అనతికాలంలోనే కార్యకలాపాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ‘మాకు తెలిసి మేం ఎలాంటి పొరపాట్లూ చెయ్యలేదు. కానీ కార్యకలాపాలు మూసేయాల్సి వచ్చింది’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ కన్నీళ్లపర్యంతమైన క్షణాలను ఇప్పటికీ మరువలేం. కష్టాలు కొన్నాళ్లు మాత్రమే అన్నట్లుగా నోకియా మళ్లీ మొబైల్ హ్యాండ్సెట్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అడుగుపెట్టడమే కాదు... ఏడాది కాలంలోనే లాభాలు చూస్తోంది. తాము ఇప్పటికే భారత్‌లో లాభాల్లో ఉన్నామని ‘హెచ్ఎండీ గ్లోబల్’ సంస్థ బిజినెస్ హెడ్ (ఈశాన్య ప్రాంతం) అమిత్ గోయల్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఇతర అంశాలను వెల్లడించలేదు. నోకియా–6, నోకియా–7 ప్లస్, నోకియా–8 సిరొక్కొ హ్యాండ్సెట్స్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. నోకియా బ్రాండ్ ఇప్పుడు హెచ్ఎండీ గ్లోబల్దే. 7 కోట్ల యూనిట్ల విక్రయాలు 2017లో అంతర్జాతీయంగా 7 కోట్ల హ్యాండ్సెట్లను విక్రయించామని గోయల్ తెలిపారు. ఇందులో ఫీచర్ ఫోన్ల వాటా అధికమన్నారు. ఈ విభాగంపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని తెలిపారు. గ్లోబల్గానూ, భారత్‌లోనూ టాప్–3 హ్యాండ్సెట్ బ్రాండ్లలో మేం ఒకటిగా ఉండాలని లక్షించామని గోయల్ పేర్కొన్నారు. -
యాపిల్‌కు ఒక్క హ్యాండ్‌సెట్‌పై రూ.9,600 లాభం!
న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ 2017 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒక హ్యాండ్‌సెట్‌పై సగటున రూ.9,600కుపైగా (151 డాలర్లు) లాభం పొందింది. ఇది తన సమీప ప్రత్యర్థి శాంసంగ్ లాభంతో పోలిస్తే ఐదు రెట్లకుపైగా ఎక్కువ. ఇక చైనా బ్రాండ్ల లాభంతో పోలిస్తే ఏకంగా 14 రెట్లు అధికం. ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. శాంసంగ్ ఒక యూనిట్‌పై రూ.1,900కుపైగా (31 డాలర్లు) లాభం పొందింది. మొబైల్ హ్యాండ్సెట్ విభాగపు మొత్తం లాభంలో యాపిల్ దాదాపుగా 60 శాతం వాటాతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. -
షావోమి ‘మి మిక్స్ 2’@ రూ.35,999
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి మిక్స్ 2’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.35,999గా ఉంది. దీంతో షావోమి ఇండియాలో ప్రీమియం హ్యాండ్సెట్స్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లయ్యింది. కంపెనీ దేశంలో విక్రయిస్తున్న ఫోన్లు అన్నింటిలోకెల్లా ఇదే ఖరీదైనది. ‘మి మిక్స్ 2’లో 5.99 అంగుళాల ఫుల్‌స్క్రీన్ డిస్ప్లే, సెరామిక్ బ్యాక్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ‘మి మిక్స్2’ను విడుదల చేస్తున్న షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను జైన్, ప్రొడక్ట్ హెడ్ జై మణి. -
ఐఎంఈఐ నెంబర్ తారుమారు చేస్తే జైలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లకు ఉండే 15 అంకెల ఐఎంఈఐ నెంబర్‌ను ట్యాంపర్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. నకిలీ ఐఎంఈఐ నెంబర్లను అరికట్టడంతో పాటు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఫోన్ తయారీదారు కాకుండా వేరొకరు ఉద్దేశపూర్వకంగా ఐఎంఈఐ నెంబర్‌ను తొలగించడం, మార్చడం చట్టవిరుద్ధమని టెలికాం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఎంఈఐ నెంబర్‌ను మార్చడం, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం ఈ నిబంధనల కింద నేరంగా పరిగణిస్తారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌కు యూనిక్ ఐడీగా ఐఎంఈఐ నెంబర్‌ను కోడ్ చేస్తారు. సిమ్‌ను మార్చడం ద్వారా హ్యాండ్‌సెట్‌లో మొబైల్ నెంబర్‌ను మార్చడం సాధ్యమవుతుంది. అయితే ఐఎంఈఐ నెంబర్‌ను ప్రత్యేక పరికరాలతో సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే మార్చగలరు. ఈ తరహా ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కఠిన నిబంధనలతో ముందుకొచ్చింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఐఎంఈఐ నెంబర్‌ను తారుమారు చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. -
ఫోన్ గెలిచారంటూ మోసం
నారాయణపేట : హలో.. మేము సామ్సంగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. వంద ఫోన్‌నంబర్లలో మీ ఫోన్ నంబర్‌కు సామ్సంగ్ జే–7 లక్కి ప్రైజ్ వచ్చింది.. పోస్టాఫీస్‌కు వెళ్లి తీసుకోండంటూ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ అమాయకుడు మోసపోయాడు. ఈ విషయం సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మరికల్ మండలం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన నర్సింహులు అనే యువకుడికి పది రోజుల క్రితం 8750557241 నంబర్ నుంచి కాల్ వచ్చింది. వంద నంబర్లలో మీ నంబర్‌కు సామ్సంగ్ జే–7 ఫోన్ ప్రైజ్ లక్కీ ఆఫర్ వచ్చింది.. అడ్రస్ చెబితే పంపిస్తామంటూ నమ్మించి పూర్తి వివరాలను తీసుకున్నారు. సోమవారం మరోసారి కాల్చేసి మీరు చెప్పిన అడ్రస్ ప్రకారం పోస్టాఫీస్‌కు పార్సిల్ వచ్చింది తీసుకెళ్లాలని కోరారు. నర్సింహులు వారి మాయలో పడి పోస్టాఫీసులో రూ.4వేలు చెల్లించి పార్సిల్ తీసుకుని ఇప్పి చూశాడు. బాక్స్‌లో ఫోన్ లేదు. సబ్బుపెట్టెలు, ఓ బెల్టులు బయటపడటంతో అవాక్కయ్యాడు. వెంటనే కంపెనీ నుంచి వచ్చిన నంబర్‌కు కాల్చేశాడు. ‘తాము చేసేది ఇదే వ్యాపారం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ.. ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. జరిగిన మోసంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలాఉండగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన సంఘటన ఇది మండలంలో రెండోది. -
పాత ఫోన్ లలోనూ ‘పానిక్’ బటన్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం వాడకంలో ఉన్న ప్రతి మొబైల్ హ్యాండ్సెట్లోనూ పానిక్ బటన్ లాంటి ఫీచర్‌ను పొందుపరచాలని మొబైల్ తయారీ కంపెనీలను డాట్ ఆదేశించింది. పాత ఫోన్లలో పానిక్ బటన్ ఫీచర్‌ను అమర్చడం కోసం కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ నిమిత్తం రిటైల్ ఔట్‌లెట్స్‌లో ప్రత్యేకమైన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. పానిక్ బటన్ అంటే.. ఫోన్ వినియోగదారుడు ఏదైనా అత్యవసర సమయాల్లో అతని ఫోన్లోని 5 లేదా 9 బటన్‌ను నొక్కితే.. అప్పుడు ఆ ఫోన్ నుంచి ప్రభుత్వ విభాగాలకు ఒక కాల్ (112 నెంబర్‌కు) వెళుతుంది. అప్పుడు ఆయా విభాగాలు వెంటనే స్పందించి.. మొబైల్ వినియోగదారునికి సాయం అందిస్తాయి. వచ్చే ఏడాది (2017) జనవరి 1 నుంచి విక్రయించే అన్ని ఫోన్లలోనూ ఈ పానిక్ బటన్ ఉండాలని డాట్ ఇప్పటికే మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది. నిర్భయ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది. -
మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు
ఐజ్వాల్: మొబైల్ ఫోన్‌పై మోజు ఆ యువకుడిని పిచ్చివాడిని చేసింది. తాను ఏం చేస్తున్నానో అనే ఆలోచన కూడా లేకుండా చేసింది. ఫలితంగా అతడు తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. సొంత అక్కాబావను హతమార్చాడు. అనంతరం ఇంట్లో నుంచి 36 వేలు ఎత్తుకెళ్లి చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఈ నెల 7న జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతానికి జువైనల్ కోర్టు అతడు నేరం చేసినట్లు నిర్దారించి జైలుకు తరలించింది. పోలీసుల వివరాల ప్రకారం, సవతి సోదరి, అతడి బావకు ఈ మధ్యనే ప్రభుత్వ సాయంగా ఓ 66 వేల రూపాయాలు వచ్చాయి. అందులో ఓ ముప్పై వేలతో కొంత భూమి కొనుక్కోని మిగితావి ఇంట్లో పెట్టారు. దీంతో వాటిపై కన్నేసిన యువకుడు ఆ డబ్బుతో కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఆలోచించి, వారిని అడిగితే ఇవ్వరని భావించి ఊర్లో చుట్టుపక్కల జంతువులను వేటాడటానికి ఉపయోగించే సింగ్ బ్యారెల్ తుపాకీని తీసుకొని ముందుగా బావను హతమార్చాడు. ఆ వెంటనే సోదరిని అదే తుపాకీతో దారుణంగా కొట్టాడు. అనంతరం గొడ్డలితో తీవ్రంగా గాయపరిచాడు. చివరికి ఆమె చనిపోగానే ఇంట్లో ఉన్న 36 వేలు తీసుకొని ఏం తెలియనట్లు సొంతింటికి వెళ్లాడు. అలా వెళ్లిన మరుసటి రోజే పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం చెప్పాడు. -
ఫీచర్ ఫోన్లోనూ 4జీ స్పీడ్
వైఫై సౌకర్యం ఉంటే చాలు * హువాయితో కలిసి ఎయిర్టెల్ ప్రత్యేక గాడ్జెట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 4జీ వేగంతో డేటా కావాలంటే అందుకు తగ్గ మొబైల్ హ్యాండ్సెట్ ఉండాల్సిందే. అలా కాకుండా ఫీచర్ ఫోన్లోనూ వేగవంతమైన డేటా కావాలంటే? వైఫై సౌకర్యం ఉంటే చాలు తాము అందిస్తున్న 4జీ హాట్‌స్పాట్‌తో 30 ఎంబీపీఎస్ వరకు స్పీడ్‌ను ఉపయోగించుకోవచ్చని చెబుతోంది ఎయిర్టెల్. హువాయి సహకారంతో కంపెనీ రూ.2,300కు ఈ హాట్‌స్పాట్ గాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చేతిలో ఇట్టే ఇమిడిపోయే ఈ ఉపకరణం సిమ్‌తో పనిచేస్తుంది. ప్రయాణంలో ఉన్నాసరే... దీని ద్వారా ఒకేసారి 10 ఉపకరణాల్లో నెట్‌ను వినియోగించుకోవచ్చు. బ్యాటరీ 6 గంటల పాటు పనిచేస్తుంది. 4జీ హాట్‌స్పాట్ కోసం కొద్ది రోజుల్లో ప్రత్యేక డేటా ప్యాక్‌లు రానున్నాయి. ఎయిర్టెల్ ప్రస్తుతం 3జీ ధరకే 4జీని అందిస్తోంది. రెండింతల వినియోగం.. భారత్‌లో టెలికం కంపెనీల ఆదాయంలో డేటా నుంచి వస్తున్నది 14-15% వరకూ ఉంది. ఏడాదిలో ఇది 20%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘సగటున ఒక్కో కస్టమర్ డేటా కోసం నెలకు రూ.70-80 వెచ్చిస్తున్నారు. ఈ వ్యయం ఏటా 100% వృద్ధి చెందుతోంది. స్మార్ట్ఫోన్ల జోరుకు తోడు 4జీ కూడా డేటా వినియోగం పెరి గేందుకు దోహదం చేస్తోంది. 4జీ ఫోన్ల ధరలు క్రమేపీ తగ్గుతుండటం కూడా కలసి వచ్చే పరిణామమే. ఉపకరణాల ధరలు మరింత దిగి వస్తే 3జీని మించిన అవకాశాలుంటాయి’ అని వివరించారాయన. ఏడాదిలో 10 నగరాలకు..: ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్లో హైదరాబాద్, వైజాగ్‌లో ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఇటీవల ప్రారంభిం చింది. జూలై నుంచి వాణిజ్యపరమైన సేవలను మొ దలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ, వరంగల్, కర్నూలు, తిరుపతి సహా 10 నగరాల్లో 2015-16లో 4జీ అడుగు పెట్టనుంది. సర్కిల్లో సంస్థకు 2 కోట్లకుపైగా మొబైల్ యూజర్లున్నారు.