కోల్‌కతా: మొబైల్ హ్యాండ్‌సెట్ బిజినెస్‌లో నోకియా ప్రస్థానం విచిత్రమైంది. గతంలో ఈ సంస్థ ఫోన్ల వ్యాపారాన్ని శాసించిందనడంలో వింతేమీ లేదు. అప్పుడు భారత్‌లో నోకియా ఫోన్లకున్న డిమాండ్ అలాంటిది మరి. కానీ ఇది కొద్ది కాలమే. మొబైల్ హ్యాండ్‌సెట్ వ్యాపారంలో కొంగొత్త ఎత్తులు చూసిన నోకియా అనతికాలంలోనే కార్యకలాపాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది.
‘మాకు తెలిసి మేం ఎలాంటి పొరపాట్లూ చెయ్యలేదు. కానీ కార్యకలాపాలు మూసేయాల్సి వచ్చింది’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ కన్నీళ్లపర్యంతమైన క్షణాలను ఇప్పటికీ మరువలేం. కష్టాలు కొన్నాళ్లు మాత్రమే అన్నట్లుగా నోకియా మళ్లీ మొబైల్ హ్యాండ్‌సెట్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అడుగుపెట్టడమే కాదు... ఏడాది కాలంలోనే లాభాలు చూస్తోంది. తాము ఇప్పటికే భారత్‌లో లాభాల్లో ఉన్నామని ‘హెచ్‌ఎండీ గ్లోబల్’ సంస్థ బిజినెస్ హెడ్ (ఈశాన్య ప్రాంతం) అమిత్ గోయల్ తెలిపారు.
అయితే దీనికి సంబంధించి ఇతర అంశాలను వెల్లడించలేదు. నోకియా–6, నోకియా–7 ప్లస్, నోకియా–8 సిరొక్కొ హ్యాండ్‌సెట్స్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. నోకియా బ్రాండ్ ఇప్పుడు హెచ్‌ఎండీ గ్లోబల్‌దే.
7 కోట్ల యూనిట్ల విక్రయాలు
2017లో అంతర్జాతీయంగా 7 కోట్ల హ్యాండ్‌సెట్లను విక్రయించామని గోయల్ తెలిపారు. ఇందులో ఫీచర్ ఫోన్ల వాటా అధికమన్నారు. ఈ విభాగంపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని తెలిపారు. గ్లోబల్‌గానూ, భారత్‌లోనూ టాప్–3 హ్యాండ్‌సెట్ బ్రాండ్‌లలో మేం ఒకటిగా ఉండాలని లక్షించామని గోయల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment