
న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ 2017 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒక హ్యాండ్‌సెట్‌పై సగటున రూ.9,600కుపైగా (151 డాలర్లు) లాభం పొందింది. ఇది తన సమీప ప్రత్యర్థి శాంసంగ్ లాభంతో పోలిస్తే ఐదు రెట్లకుపైగా ఎక్కువ. ఇక చైనా బ్రాండ్ల లాభంతో పోలిస్తే ఏకంగా 14 రెట్లు అధికం.
ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. శాంసంగ్ ఒక యూనిట్‌పై రూ.1,900కుపైగా (31 డాలర్లు) లాభం పొందింది. మొబైల్ హ్యాండ్‌సెట్ విభాగపు మొత్తం లాభంలో యాపిల్ దాదాపుగా 60 శాతం వాటాతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment