మిజోరం ఓట్ల లెక్కింపు ప్రారంభం | Vote count begins in Mizoram | Sakshi
Sakshi News home page

మిజోరం ఓట్ల లెక్కింపు ప్రారంభం

Published Mon, Dec 9 2013 8:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

మిజోరం ఓట్ల లెక్కింపు ప్రారంభం - Sakshi

మిజోరం ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఐజ్వాల్: మిజోరం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల నుంచి 142 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీటిలో లుంగ్లెయ్ సౌత్ మినహా మిగిలినవన్నీ ఎస్టీ రిజర్వుడు స్థానాలే కావడం విశేషం. ఎంఎన్‌ఎఫ్, మరాలాండ్ డెమొక్రటిక్ అలయన్స్‌లతో కూడిన మిజోరం ప్రజాస్వామిక కూటమికి, అధికార కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది.

మిజోరంలో 81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటరు తాను ఎవరికి ఓటేసిందీ సరిచూసుకునేందుకు వీలు కల్పించే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా మిజోరంలో ఈసారి 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రవేశపెట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement