కాంగ్రెస్‌ –2, బీజేపీ–2, హంగ్‌–1! | Five States Assembly Elections 2023: Exit polls results to be declared | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ –2, బీజేపీ–2, హంగ్‌–1!

Published Fri, Dec 1 2023 5:10 AM | Last Updated on Fri, Dec 1 2023 8:33 AM

Five States Assembly Elections 2023: Exit polls results to be declared - Sakshi

న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్‌ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్‌లో 19న, రాజస్థాన్‌లో 25న పోలింగ్‌ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్‌ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి.

తెలంగాణలో పోలింగ్‌ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్‌ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్‌ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్‌ రావచ్చని తెలిపాయి...

మధ్యప్రదేశ్‌... బీజేపీకే మొగ్గు!
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా, టుడేస్‌ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ వంటి పలు సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్‌ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్‌ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్‌ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్‌కు 74 స్థానాలిచ్చింది.

ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్‌ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్‌ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్‌ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్‌కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్‌ కూడా కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్‌ కీ బాత్‌ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది.

రాజస్థాన్‌లో కమల వికాసమే
రాజస్థాన్‌లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్‌ బహుశా రాజస్థాన్‌లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్‌ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్‌కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది. కాంగ్రెస్‌ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్‌ బీజేపీకి 94–114, కాంగ్రెస్‌కు 71–91 సీట్లిచ్చింది.

జన్‌ కీ బాత్‌ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్‌ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్‌ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్‌ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్‌ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ పేర్కొంది.

 తెలంగాణలో కాంగ్రెస్‌ పాగా
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్‌కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్‌ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్‌ఎస్‌ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్‌కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్‌ టీవీ కూడా కాంగ్రెస్‌కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్‌ఎస్‌కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది.

ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ అయితే కాంగ్రెస్‌కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్‌ఎస్‌ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్‌కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్‌ చాణక్య కూడా కాంగ్రెస్‌కు 71 సీట్లు, బీఆర్‌ఎస్‌కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్‌ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్‌ సర్వే పేర్కొంది. బీఆర్‌ఎస్‌కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్‌ కీ బాత్‌ కూడా కాంగ్రెస్‌కు 48 నుంచి 64, బీఆర్‌ఎస్‌కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13,    మజ్లిస్‌ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని             చెప్పింది.

మిజోరంలో హంగ్‌
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. ఎంఎన్‌ఎఫ్‌కు ఈసారి జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్‌ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్‌ టీవీ మాత్రం ఎంఎన్‌ఎఫ్‌కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది.

ఏబీపీ సీవోటర్‌ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్‌పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్‌ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్‌ఎఫ్‌ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్‌ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్‌ఎఫ్‌కు 14 నుంచి 18 సీట్లు, జెడ్‌పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి.  

ఛత్తీస్‌గఢ్‌ ‘హస్త’గతం!
ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘెల్‌ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్‌ నౌ–ఈటీజీ     కాంగ్రెస్‌కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్‌ చాణక్య పేర్కొంది.

ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ సర్వే కాంగ్రెస్‌కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్‌ టీవీ కూడా కాంగ్రెస్‌44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్‌ కీ బాత్‌ తేల్చాయి. కాంగ్రెస్‌కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్‌ కీ బాత్‌ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్‌కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement