గుంటూరు : గుంటూరు-కృష్ణా జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఏఎస్ రామకృష్ణ గెలుపొందారు. ఏఎస్ రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై తొలి ప్రాధాన్యత ఓటుతో ఆయన విజయం సాధించారు. యూటీఎఫ్ తరపున బరిలోకి దిగిన ఏఎస్ రామకృష్ణకు 7,146 ఓట్లు రాగా, కేఎస్ లక్ష్మణరావుకు 5,392 ఓట్లు వచ్చాయి.
కాగా తొలి నుంచి చివరి వరకూ ఏఎస్ రామకృష్ణకు లక్ష్మణరావు పోటీ ఇచ్చారు. మరోవైపు రాజకీయంగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ఓట్లు వేయించుకున్నారని లక్ష్మణరావు ఆరోపించారు. కులపరంగా , వర్గ పరంగా టీచర్లను ఒత్తిళ్లకు గురిచేశారన్నారు. అయినా పెద్ద ఎత్తున టీచర్లు తనకు ఓట్లు వేశారని లక్ష్మణరావు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.