
మూడు స్థానాల కోసం 70 మంది పోటీ
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
తీవ్ర పోటీ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడిన 70 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment