సదాశివపేట, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలపై నెల కొన్న ఉత్కంఠకు రెండు రోజుల్లో తెరపడనుం ది. ఈనెల 12న మున్సిపల్, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కిపు జరుగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. అయితే అభ్యర్థు ల్లో ఫలితాల టెన్షన్ నెలకొంది. సదాశవపేట పట్టణంలోని మున్సిపల్, మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు హోరాహోరిగా జరి గాయి. మున్సిపల్ ఎన్నికల్లో 132 మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నలుగురు, ఎంపీటీసీ సభ్యులుగా 54 మంది బరిలో నిలిచారు. గెలిచేందుకు శతవిధాలుగా ప్రయత్నించి అన్ని అస్త్రాలను ఉపయోగించా రు. తమ స్థాయి కంటే అధికంగా డబ్బులు ఖర్చు చేశారు. కొందరు అభ్యర్ధులు స్థలాలు, పొలాలు, నగలు తాకట్టు పెట్టి మరి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చుపెట్టారు. అయినా తమను గెలుపు వరిస్తుందా లేదా అన్న గుబు లు వారిలో నెలకొంది. ఫలితాలు అనుకులం గా వస్తే సరి లేకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అభ్యర్ధులను వేధిస్తోంది. ఫలితాలు అనుకూలంగా రాకుంటే కొందరు అభ్యర్థులు దివాలు తీసే పరిస్థితి ఉందని సమాచారం.
మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం
జోగిపేట: స్థానిక ఓట్ల లెక్కింపు ఫలితాల తేదీ సమీపించడంతో మళ్లీ పల్లెలు, పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ఎవరు గెలుస్తారన్న విషయమై చిన్నా చితక పందేలు గ్రామాల్లో ఊపందుకున్నాయి. ఇన్నాళ్లు సార్వత్రిక ఎన్నికల మాటున మరచిపోయిన అభ్యర్థుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. నెల రోజుల నిరీక్షణ అనంతరం ఫలితాలు వస్తున్నాయని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటుండగా, మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలపై మళ్లీ ఉత్కంఠే నెలకొంది. ఈ పదవుల ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వకపోవడంతో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించనుండడంతో సందిగ్దం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పదవులకు పరోక్ష ఎన్నిక ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు కీలకం కానుంది. మరిన్ని రోజులు మున్సిపల్ చెర్మైన్, పరిషత్ చైర్మన్‌లపై ఆశలు పెట్టుకున్న వారికి మరిన్ని రోజులు నిరీక్షణ తప్పడంలేదు.
చైర్మన్ పీఠంపై పార్టీల గురి
వరుసగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడుతుండడంతో ఇప్పుడు అన్ని పార్టీలు చైర్మన్ పీఠంపై గురి పెట్టాయి. ఈ పదవులను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను బరిలో నిలిపిన అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. తమకు ఎన్ని స్థానాలు వస్తాయి..స్పష్టమైన మెజార్టీకి ఇంకా ఎన్ని స్థానాలు అవసరమవుతాయి.. స్వతంత్రులు ఎంత మంది గెలుస్తారు..చిన్న పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయి వారిని మనవైపు ఎలా త్రిప్పుకోవాలి..అనే ఆంశాలపై చర్చల్లో మునిగారు.
క్యాంపులంటేనే బెంబేలు
మున్సిపల్, జడ్పీ, పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంపులంటేనే పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఫలితాలు వచ్చిన పది రోజుల్లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే క్యాంపుల నిర్వాహణ పెద్ద భారం కాదు. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన చాలా రోజుల తర్వాత పరోక్ష ఎన్నికలు జరుగనుండడంతో క్యాంపులంటేనే పార్టీల నేతలు, పదవులు ఆశించే వారు హడలెత్తిపోతున్నారు. ఎన్నికల కమిషన్ ఈఎన్నికలపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం.
తేలనున్న నే‘తల రాత’
Published Sat, May 10 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement