sadasiva peta
-
కాయ్ రాజా కాయ్
రాజు(పేరు మార్చాం). అతను రోజు వారీ కూలి. రెండు రోజులు పనికెళ్తే ఓ ఆరు వందల రూపాయలు సంపాదిస్తాడు. కానీ అలా వచ్చిన డబ్బుతో ఇంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా మూడుముక్కలాట(పేకాట) ఆడతాడు. సంపాదించిందంతా ఇలా తగలబెట్టడం.. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడం అతని నిత్యకృత్యం. రోజులు గడిచాయి. అప్పులు పెరిగాయి. తీర్చేదారి లేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య పిల్లలు ఇప్పుడు దిక్కులేని వారిగా మిగిలారు. ఇలా సదాశివపేట ప్రాంతంలో పేకాట కారణంగా ముక్కలవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సదాశివపేట(సంగారెడ్డి): కాయ్ రాజా కాయ్ కాస్తే ఉంది.. చూస్తే లేదు, ముడు ముక్కలాట... మూడాసులు తిప్పు, ఒకటికి మూడు రెట్లు.. స్వర్గానికి మెట్లు, క్షణంలో సగంలో నువ్వు కుబేరుడివి. కనురేప్పపాటులో కుచేలుడివి.. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలో బాల గంగాధర్ తిలక్ జూదం గురించి రాసిన ఓ కవిత ఇది. సదాశివపేట మండల పరిధిలో అచ్చు అలాగే ఉంది పరిస్థితి ముక్క కలిస్తే అదృష్టం తమదే అని ఆశపడుతున్నారు కొందరు. కానీ అది తిరగబడి చాలా మంది కుచేరులుగా మారుతున్నారు. అప్పుల పాలై వాటిని తీర్చే దారిలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. జూదమే వారి ధ్యాస.. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది యువకులు జూదానికి బానిసవుతున్నారు. కష్టపడి సంపాదించినదంతా పేకాటలో పోగోట్టుకోవడం వీరికి అలవాటైంది. మద్యం మత్తు ఆపై పేకాట ఆడటం ఇదే ఈ ప్రాంతంలో కొందరి యువకుల జీవనశైలిగా మారింది. ముఖ్యంగ సదాశివపేట పట్టణ మండల పరిధిలోని వాటర్ప్లాంట్లు, పంక్షన్ హాళ్లు, ఇళ్లు ఇందుకు కేంద్రాలుగా మారాయి. జూదానికి బానిసైన వారు అన్నం, నీళ్లు మరచి మరీ గంటల తరబడి పేకాటలో నిమగ్నమవుతూ కుటుంబాలను పట్టించుకోని పరిస్థితి. ఇంతేకాదు పేకాటలో డబ్బుల విషయమై ఘర్షణలు తలెత్తడం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇక్కడ పారిపాటిగా మారింది. నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు.. సదాశివపేట పట్టణంలోని నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు ఈ పేకాట సంస్కృతి విస్తరించుకుపోయింది. పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, టెంట్‌హౌజ్‌లు, ఇళ్లలో కొందరు రాజకీయ, మీడియా ప్రతినిధులు పేకాట ఆడుతుంటారనేది బహిరంగ రహస్యం. సదాశివపేట పట్టణ మండల పరిధిలోని పంక్షన్ హాళ్లు, టెంట్‌హౌజ్‌లు, ఫాంహౌజ్‌లు, వాటర్ ప్లాంటుతో పాటు నివాస గృహలు, బహిరంగ ప్రదేశాల్లో చాల ప్రాంతాల్లో నిత్యం పేకాట యథేచ్ఛగా సాగుతోంది. కళ్లెం వేయరు.. కన్నీరు తుడవరు పేకాట అడుతున్న వ్యక్తులు మద్యం తాగడంతోపాటు దాడులు చేసుకుంటుండంతో సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న వేధన వర్ణనాతీతం. కొన్ని ఇళ్లల్లో అర్థరాత్రి వరకు నిత్యం పేకాట అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేకాటకు అడ్డుకట్ట వేసి కుటుంబాలు ఛిద్రం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు.. పట్టణ మండల పరిధిలో పేకాట ఆడితే చట్టపరంగ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారినైనా వదిలిపెట్టం. రాజకీయ వత్తిళ్లకు తలొగ్గం. పేకాట అడుతున్న స్థవరాలను ఇప్పటికే గుర్తించాం. అదును చూసి దాడులు చేస్తాం. ప్రజలు సైతం పేకాట స్థావరాలపై సమాచారం అందించాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డి -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
► కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ సదాశివపేట: కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం అందించే మద్దతు ధర రూ.1510కు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ సూచించారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ధ్యాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాణిక్కరాజ్ మాట్లాడుతూ.. సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ పరిపతి సహకార సంఘంలో 2007 మంది సభ్యులున్నప్పటికీ 600 మంది రైతులు మాత్రమే పంట రుణాలు తీసుకున్నారని, 50 మంది లాంగ్‌టర్న్ లోన్స్ తీసుకున్నారన్నారు. ఖరీఫ్ సీజన్లో కనీసం 1500 మంది రైతులు పంట రుణాలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పీఎసీఎస్ సొసైటీల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.5 వేల పంట రుణాలు తీసుకోవచ్చన్నారు. కాగా, రూ.5 వేల పంటరుణం డబ్బులను రైతు చేతికి అందజేమన్నారు. ఈక్రమంలో రైతులు తీసుకున్న రూ.5 రుణానికి ఆరు నెలల తర్వాత రూ.300 వడ్డీ కలిపి చెల్సించాల్సి ఉంటుందని తెలిపారు. ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి అయితే ఈ ఖరీఫ్‌లో ఖర్చు రూ.1000 తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌కు ధర రూ.1510, బీ గ్రేడ్‌కు రూ.1470 మద్దతు ధర లభిస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులను సూచించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చింతకుంట రాధాభాయి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతోందని చెప్పారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ఎదుట హమాలీలకు, రైతుల కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌ను కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రూరల్ బ్యాంక్ చైర్మన్లు గడీల అశిరెడ్డి, అంజిరెడ్డి, సివిల్ సప్లయ్ మేనేజర్ విజయ్‌కుమార్, మార్కెట్ డీఎం నరేందర్‌రెడ్డి, డీఎస్ఓ జితేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పెద్దగొల్ల అంజనేయులు, డైరెక్టర్లు తుల్జరామ్, ప్రభుదాస్, రాములు, మల్కయ్య, ఉల్లిగడ్డ విద్యాసాగర్, కొత్త రమేశ్, మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, సూపర్వైజర్ శ్రీనివాస్, పీఎస్సీస్ సీఈఓ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తగొల్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిన్న, యువత అధ్యక్షుడు విరేశం, మండల కో–ఆప్షన్ మెంబర్ సలావుద్దీన్, రైతులు పాల్గొన్నారు. -
తేలనున్న నే‘తల రాత’
సదాశివపేట, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలపై నెల కొన్న ఉత్కంఠకు రెండు రోజుల్లో తెరపడనుం ది. ఈనెల 12న మున్సిపల్, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కిపు జరుగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. అయితే అభ్యర్థు ల్లో ఫలితాల టెన్షన్ నెలకొంది. సదాశవపేట పట్టణంలోని మున్సిపల్, మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు హోరాహోరిగా జరి గాయి. మున్సిపల్ ఎన్నికల్లో 132 మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నలుగురు, ఎంపీటీసీ సభ్యులుగా 54 మంది బరిలో నిలిచారు. గెలిచేందుకు శతవిధాలుగా ప్రయత్నించి అన్ని అస్త్రాలను ఉపయోగించా రు. తమ స్థాయి కంటే అధికంగా డబ్బులు ఖర్చు చేశారు. కొందరు అభ్యర్ధులు స్థలాలు, పొలాలు, నగలు తాకట్టు పెట్టి మరి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చుపెట్టారు. అయినా తమను గెలుపు వరిస్తుందా లేదా అన్న గుబు లు వారిలో నెలకొంది. ఫలితాలు అనుకులం గా వస్తే సరి లేకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అభ్యర్ధులను వేధిస్తోంది. ఫలితాలు అనుకూలంగా రాకుంటే కొందరు అభ్యర్థులు దివాలు తీసే పరిస్థితి ఉందని సమాచారం. మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం జోగిపేట: స్థానిక ఓట్ల లెక్కింపు ఫలితాల తేదీ సమీపించడంతో మళ్లీ పల్లెలు, పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ఎవరు గెలుస్తారన్న విషయమై చిన్నా చితక పందేలు గ్రామాల్లో ఊపందుకున్నాయి. ఇన్నాళ్లు సార్వత్రిక ఎన్నికల మాటున మరచిపోయిన అభ్యర్థుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. నెల రోజుల నిరీక్షణ అనంతరం ఫలితాలు వస్తున్నాయని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటుండగా, మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలపై మళ్లీ ఉత్కంఠే నెలకొంది. ఈ పదవుల ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వకపోవడంతో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించనుండడంతో సందిగ్దం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పదవులకు పరోక్ష ఎన్నిక ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు కీలకం కానుంది. మరిన్ని రోజులు మున్సిపల్ చెర్మైన్, పరిషత్ చైర్మన్లపై ఆశలు పెట్టుకున్న వారికి మరిన్ని రోజులు నిరీక్షణ తప్పడంలేదు. చైర్మన్ పీఠంపై పార్టీల గురి వరుసగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడుతుండడంతో ఇప్పుడు అన్ని పార్టీలు చైర్మన్ పీఠంపై గురి పెట్టాయి. ఈ పదవులను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను బరిలో నిలిపిన అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. తమకు ఎన్ని స్థానాలు వస్తాయి..స్పష్టమైన మెజార్టీకి ఇంకా ఎన్ని స్థానాలు అవసరమవుతాయి.. స్వతంత్రులు ఎంత మంది గెలుస్తారు..చిన్న పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయి వారిని మనవైపు ఎలా త్రిప్పుకోవాలి..అనే ఆంశాలపై చర్చల్లో మునిగారు. క్యాంపులంటేనే బెంబేలు మున్సిపల్, జడ్పీ, పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంపులంటేనే పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఫలితాలు వచ్చిన పది రోజుల్లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే క్యాంపుల నిర్వాహణ పెద్ద భారం కాదు. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన చాలా రోజుల తర్వాత పరోక్ష ఎన్నికలు జరుగనుండడంతో క్యాంపులంటేనే పార్టీల నేతలు, పదవులు ఆశించే వారు హడలెత్తిపోతున్నారు. ఎన్నికల కమిషన్ ఈఎన్నికలపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. -
కేంద్రంలో బీజేపీదే అధికారం
సదాశివపేట, న్యూస్‌లైన్: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం యాద వ్ ఆధ్వర్యంలో అదివారం స్థానిక జ్యోతి టాకీస్ ఎదురుగా ఉన్న బీజేపీ కార్యాల య ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తమ పార్టీ ఉహించని విధంగా రోజురోజుకు బలపడుతోందన్నారు. తె లంగాణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బిల్లును అడ్డుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీలు నామ రూపాలు లేకుండా పోతాయన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం విద్యార్ధులు చనిపోతే వారి అంతిమయాత్రలకు రాని కాంగ్రెస్ నాయకులు జైత్రయాత్రలంటూ సోని యాగాంధీకి అభినందన సభలు ఏర్పా టు చేయడం విడ్డూరమన్నారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఏలాంటి అంక్షలు లే కుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమన్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ విజయ సాధిస్తుందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి పక్కా సమైక్యవాది అని, ఆయన విజయవాడ లేదా గుంటూరులో పోటీ చేస్తే బాగుంటుందన్నారు. ఎమ్మెల్యే గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా శంకుస్థాపనలు, శిలాఫలకాలకే పరిమితమన్నారు. నియోజకవర్గ ప్రజ లు అన్నీ గమనిస్తున్నారని, ఎమ్మెల్యే మాటలను నమ్మే స్థితిలో వారు లేరన్నారు. ఎమ్మెల్యే ఆటలు ఇక నియోజక వర్గంలో సాగవన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంగమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, కార్యదర్శి మాణిక్‌రావు, కోశాధికారి తొట చంద్రశేఖర్ పాల్గొన్నారు.