కేంద్రంలో బీజేపీదే అధికారం | BJP authority in central | Sakshi
Sakshi News home page

కేంద్రంలో బీజేపీదే అధికారం

Dec 29 2013 11:47 PM | Updated on Mar 29 2019 9:12 PM

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సదాశివపేట, న్యూస్‌లైన్:  వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో  బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల  బుచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం యాద వ్ ఆధ్వర్యంలో  అదివారం స్థానిక జ్యోతి టాకీస్ ఎదురుగా ఉన్న బీజేపీ కార్యాల య ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తమ పార్టీ ఉహించని విధంగా రోజురోజుకు బలపడుతోందన్నారు. తె లంగాణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బిల్లును అడ్డుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీలు నామ రూపాలు లేకుండా పోతాయన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం విద్యార్ధులు చనిపోతే వారి అంతిమయాత్రలకు రాని కాంగ్రెస్ నాయకులు జైత్రయాత్రలంటూ సోని యాగాంధీకి అభినందన సభలు ఏర్పా టు చేయడం విడ్డూరమన్నారు.

 కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఏలాంటి అంక్షలు లే కుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమన్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ విజయ సాధిస్తుందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి పక్కా సమైక్యవాది అని, ఆయన  విజయవాడ లేదా గుంటూరులో పోటీ చేస్తే బాగుంటుందన్నారు. ఎమ్మెల్యే గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా శంకుస్థాపనలు, శిలాఫలకాలకే పరిమితమన్నారు. నియోజకవర్గ ప్రజ లు అన్నీ గమనిస్తున్నారని, ఎమ్మెల్యే మాటలను  నమ్మే స్థితిలో వారు లేరన్నారు. ఎమ్మెల్యే ఆటలు ఇక నియోజక వర్గంలో సాగవన్నారు.  కార్యక్రమంలో  బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంగమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, కార్యదర్శి మాణిక్‌రావు, కోశాధికారి తొట చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement