Graduate mlc
-
నేడో, రేపో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండుమూడురోజుల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో జాబితాను రూపొందించి ఢిల్లీలోని జాతీయ ఎన్నికల కమిటీకి పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్నాయి.రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే గెలిచారు. దీంతో ఈ జిల్లాల పరిధిలోని ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను కచ్చితంగా గెలవాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేలా చేస్తున్న కసరత్తు పూర్తి అయినట్టు పార్టీవర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో ఈ మూడు స్థానాలకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను (తొమ్మిది మందితో) ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. పార్టీకి అంతగా బలం లేదని భావిస్తున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన భేటీలో అభ్యర్థుల పేర్లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ఎన్నికలు జరగబోయే ఆయాజిల్లాల పార్టీ అధ్యక్షుల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్‌కుమార్‌లతో ఓ ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. పోటాపోటీగా ప్రయత్నాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీనేతలతోపాటు, తటస్తులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి టికెట్ కోసం మంచిర్యాలకు చెందిన ఎర్రబెల్లి రఘునాథరావు, సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ ముందువరుసలో ఉన్నట్టుగా పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. అప్డేట్స్హోరాహోరీగా సాగిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మూడో రోజు.. కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటివరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్తీన్మార్ మల్లన్న ( కాంగ్రెస్) : 1,23,873రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 1,04,990గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి: 43,797గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నగెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిఅశోక్ ఫలితాలను వెల్లడించని అధికారులుఅశోక్ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మొదలుకానున్న బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శుక్రవారం మధ్యాహ్నానికి 37 మంది ఎలిమినేట్కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,862 ఓట్లు గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, 50,419 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి ఉన్నారు.మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచ్చినా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
-
ఇంకా తేలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం
-
ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న..
-
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్లోనూ లీడ్‌లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. -
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
-
‘గ్రాడ్యుయేట్స్’పై బీజేపీ గురి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 27న జరగనున్న నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొంది సత్తా చాటాలనే సంకల్పంతో రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇప్పటికే మూడుజిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ 3,4 రోజు లుగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. జహీరా బాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ త్వరలోనే ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించను న్నట్టు సమాచారం. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపొందిన అనుభవంతో పాటు విస్తృత పరిచ యాలు, ఎమ్మెల్సీ క్యాంపెయిన్‌కు సంబంధించి అవగాహన ఉన్న ఎన్.రామచందర్‌రావు ఈ ఎన్ని కకు పార్టీ తరఫున ఇన్చార్జ్గా వ్యవహరిస్తు న్నారు. ప్రచారం ముమ్మరం చేశామని, ఈసారి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని ‘సాక్షి’కి ఆయన వెల్ల డించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ పట్ల ఉన్న సానుకూలత తప్పకుండా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఉపయోగపడుతుందన్నారు. మంచి ఫలితం వస్తుంది: గుజ్జులరాష్ట్రపార్టీ నాయకత్వం, ముఖ్యనేతలు, వేలాది మంది కార్యకర్తల తోడ్పాటుతో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ›ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్ వారీగా మూడు, 4 బృందాలను ఏర్పాటు చేసి పార్టీనాయకులు, కార్య కర్తలు ఇంటింటికి వెళ్లి పట్టభద్ర ఓటర్లను కలుస్తు న్నారన్నారు. కోర్టులు, వాకర్స్‌ను కలుసుకో వడం, చిన్న చిన్నసమావేశాల నిర్వహణ ద్వారా ఓటర్స్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో ‘మోదీవేవ్’ స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందుతాననే నమ్మకం తనకు ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటుపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. -
2023లోనూ టీఆర్ఎస్దే విజయం: ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాల్లో చివరకు పల్లా విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేయగా రికార్డు మెజారిటీతో పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో నేరాలు తగ్గాయని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
తెలంగాణలో గ్రాడ్యుయేట్ పోరుకు సై..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యు యేట్ స్థానాలకు ఈనెల రెండో వారం నుంచి మార్చి మొదటి వారంలోపు ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలు వడే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాల రూపకల్పనపై పార్టీలు దృష్టి సారించాయి. కొం దరు తెలంగాణ ఉద్యమకారులు, స్వతంత్రులు సైతం బరిలో నిలుస్తుండడంతో ఎన్నికలపై ఆసక్తిని కలిగిస్తోంది. కారు జోరు టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన భుజాన వేసుకున్నారు. సిట్టింగ్ స్థానమైన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే బరిలో దింపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా జిల్లాల నేతలతో సమన్వయ భేటీలు నిర్వహించిన కేటీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సమావేశాలతో కారుదండు బిజీగా ఉంది. అయితే, తమకు ఎప్పుడూ కలసిరాని రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్నగర్ఎమ్మెల్సీ స్థానం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగేందర్‌గౌడ్, శుభప్రద పటేల్, పీఎల్ శ్రీనివాస్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ల పేర్లు టీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో ఎన్ఆర్ఐ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. మరోవైపు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌కు మద్దతు ఇచ్చే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందని తెలిసింది. కాంగ్రెస్ కసరత్తు ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న కాంగ్రెస్.. సామాజిక సమీకరణలతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిల పేర్లను దాదాపు ఖరారు చేసింది. అయితే, నల్లగొండ నుంచి ఎస్టీ కోటాలో రాములు నాయక్ కన్నా ఆదివాసీ కాం గ్రెస్ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్ మేలనే అభిప్రాయంతో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ దాసోజు శ్రావణ్, మానవతారాయ్‌ల అభ్యర్థిత్వాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక, రంగారెడ్డి విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వియ్యంకుడు, దిల్సుఖ్నగర్ విద్యాసంస్థల అధినేత ఎ.వి.ఎన్.రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఉండడం, విద్యావేత్త కావడం, రాజకీయ నేపథ్యం ఉండడంతో ఆయన పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని చెపుతున్నారు. కదనరంగంలో... కమలం ఇక ఇటీవలి విజయాలతో మంచి ఊపుమీదున్న బీజేపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. రంగారెడ్డి నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, నల్లగొండ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిలు కార్యక్షేత్రంలోకి దిగారు. రాంచందర్‌రావుకు ఉన్న మంచి ఇమేజ్‌తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ లాంటి ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న పట్టు మంచి ఫలితాలు సాధించి పెడతాయని, కనీసం సిట్టింగ్ స్థానాన్ని అయినా నిలబెట్టుకుంటామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. మరోవైపు నల్లగొండ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంగారెడ్డిలో వామపక్షాలు డాక్టర్. కె.నాగేశ్వర్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నాయి. -
అర్థరాత్రి తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం !
నల్గొండ: వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల తుది ఫలితాలు గురువారం అర్థరాత్రి తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ గెలుపునకు 7,013 ఓట్లు కావాల్సి ఉండగా, బీజేపీ గెలుపునకు 19,736 ఓట్లు కావాల్సి ఉందని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ పూర్తి అయిందన్నారు. అలాగే రెండో ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు.