Warngal district
-
వరంగల్ జిల్లాలో భారీ వర్షం
-
ఆర్టీసీ బస్సును ఢీకొట్టి.. 15 మీటర్లు ఈడ్చుకెళ్లి
శాయంపేట: మద్యం మత్తులో ఓ ఇసుక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా లారీని నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఆ వేగానికి ఆర్టీసీ బస్సును లారీ 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. లారీ సైతం అదుపుతప్పి పొలాల్లో పక్కకు ఒరిగింది. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారు గుట్టల సమీపాన నేషనల్ హైవేపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రయాణికుల్లో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండ నుంచి భూపాలపల్లి వైపు పరకాల డిపో బస్సు వెళ్తుండగా, కాళేశ్వరం నుంచి హన్మకొండ వైపు ఇసుక లారీ వెళ్తోంది. శాయంపేట సీఐ రమేష్ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఆర్టీసీ డ్రైవర్ పొన్నాల రవి, కండక్టర్ జె.రవితోపాటు ఇల్లంతకుంట మండలం లక్ష్మక్కపల్లెకు చెందిన తాటికొండ సమ్మక్క, రేగొండ మండలం రాజక్కపల్లెకు చెందిన ఎన్.మల్లికాంబ, గండి విజయ, చిట్యాల మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన బెజ్జల జోత్స్న, వరంగల్ లేబర్ కాలనీకి చెందిన కూరపాటి నాగరాజు, దుగ్గొండికి చెందిన కోలా సరోజన ఉన్నట్లు సీఐ, డీఎం వివరించారు. కొందరికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. లారీ క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను స్థానికులు కాపాడగా, అతడు పరారయ్యాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తం కాకపోతే చాలా ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చదవండి: కరోనా మృతదేహాలను ఆలింగనం.. ఆపై అంత్యక్రియలు -
తెలంగాణ:మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్
-
తెలంగాణ: 2 కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ వశం
లైవ్ అప్డేట్స్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో పొత్తులవారీగా.. టీఆర్ఎస్ + సీపీఐ =38 కాంగ్రెస్+ సీపీఎం = 11 బీజేపీ = 1 ఇతరులు = 2 తెలంగాణలో 5 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం నకిరేకల్ (20): టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 కొత్తూరు (12): టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 అచ్చంపేట (20): టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 జడ్చర్ల (27): టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 సిద్దిపేట (43): టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇతరులు 5 సిద్దిపేట మున్సిపాలిటీ జనరల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు 1వ వార్డు టీఆర్ఎస్ 2వ వార్డు టీఆర్ఎస్ 3వ వార్డు టీఆర్ఎస్ 4వ వార్డు టీఆర్ఎస్ 5వ వార్డు టీఆర్ఎస్ 6వ వార్డు టీఆర్ఎస్ 7వ వార్డు టీఆర్ఎస్ 8వ వార్డు టీఆర్ఎస్ 9వ వార్డు టీఆర్ఎస్ 10వ వార్డు టీఆర్ఎస్ 11వ వార్డు టీఆర్ఎస్ 12వ వార్డు టీఆర్ఎస్ 13వ వార్డు టీఆర్ఎస్ 14వ వార్డు టీఆర్ఎస్ 15వ వార్డు టీఆర్ఎస్ 16వ వార్డు టీఆర్ఎస్ 17వ వార్డు బీజేపీ 18వ వార్డు టీఆర్ఎస్ 19వ వార్డు టీఆర్ఎస్ 20వ వార్డు స్వతంత్రుడు. కానీ టీఆర్ఎస్లో చేరిక 21వ వార్డు టీఆర్ఎస్ 22వ వార్డు టీఆర్ఎస్ 23వ వార్డు టీఆర్ఎస్ 24వ వార్డు టీఆర్ఎస్ 25వ వార్డు టీఆర్ఎస్ 26వ వార్డు టీఆర్ఎస్ 27వ వార్డు టీఆర్ఎస్ 28వ వార్డు టీఆర్ఎస్ 29వ వార్డు ఏఐఎంఐఎం 30వ వార్డు టీఆర్ఎస్ 31వ వార్డు టీఆర్ఎస్ 32వ వార్డు టీఆర్ఎస్ 33వ వార్డు టీఆర్ఎస్ 34వ వార్డు టీఆర్ఎస్ 35వ వార్డు స్వతంత్ర 36వ వార్డు స్వతంత్ర 37వ వార్డు టీఆర్ఎస్ 38వ వార్డు టీఆర్ఎస్ 39వ వార్డు టీఆర్ఎస్ 40వ వార్డు టీఆర్ఎస్ 41వ వార్డు టీఆర్ఎస్ 42వ వార్డు స్వతంత్ర 43వ వార్డు స్వతంత్ర ................................. 43 వార్డుల్లో టీఆర్ఎస్ 36 సొంతం చేసుకోగా, స్వతంత్రులు ఐదుగురు, ఒక బీజేపీ, ఒక ఏఐఎంఎం సొంతం చేసుకున్నాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తాజా లెక్కింపు వివరాలు మొత్తం డివిజన్లు 66 ఉండగా టీఆర్ఎస్ హవా సాగిస్తోంది. టీఆర్ఎస్ 28 విజయం + 23 ఆధిక్యం = మొత్తం 51 బీజేపీ 8 విజయం, రెండింటిలో ఆధిక్యం = మొత్తం 10 ఒక చోట కాంగ్రెస్ విజయం, మరో చోట ఆధిక్యం స్వతంత్రులు ఇద్దరు విజయం, ఒకరు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మూడు స్థానాలు ఖమ్మం లెక్కింపు కేంద్రంలో గందరగోళం .. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్ బ్యాలెట్ బాక్స్ లో కంపించాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ ఆందోళన. 11 డివిజన్ బ్యాలెట్ బాక్స్‌లో 24వ డివిజన్ ఓట్లలో ఎలా వచ్చాయంటూ ఆందోళన. కౌంటింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి. కన్నీళ్లు పెట్టుకుంటూ కౌంటింగ్ కేంద్రం ముందు ఆందోళన. రీపోలింగ్ జరపాలని డిమాండ్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ అప్డేట్స్.. మూడు రౌండ్లు ముగిసేవరకు 28 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం..మరో 23 డివిజన్లలో ఆధిక్యం. 7 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం.. మరో మూడు డివిజన్లలో లీడ్. ఒక డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. మరో డివిజన్లో లీడ్. రెండు డివిజన్లలో స్వతంత్రులు విజయం. మరో స్థానంలో లీడ్. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. రెండో రౌండ్లో దూసుకుపోతున్న కారు.. 22, 23 , 24 , 25 , 26, 27 వార్డుల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 9, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు గెలిచారు. టీఆర్ఎస్ నుంచి 9వ డివిజన్ టీఆర్ఎస్ చీకటి శారద 13 వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ జోషి విజయం 23 డివిజన్ టీఆర్ఎస్ యెలగం లీలావతి 24 డివిజన్ టీఆర్ఎస్ రామ తేజస్విని విజయం 28వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గందె కల్పన విజయం 29 డివిజన్ టీఆర్ఎస్ గుండు సుధారాణి 51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు 60వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అభినవ్ భాస్కర్ 61వ డివిజన్ టీఆర్ఎస్ ఎలకంటి రాములు గెలిచారు. బీజేపీ 30 డివిజన్ రావుల కోమల 52 డివిజన్ చాడ స్వాతి 59వ డివిజన్ గుజ్జుల వసంత ఇతరులు 22 డివిజన్ ఐఏఎఫ్ బీ అభ్యర్థి బస్వరాజు కుమార్ 10వ డివిజన్ కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు గెలిచారు. 2 డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజ. 10 టీఆర్ఎస్ గెలుపు. బీజేపీ 5, 3 డివిజన్లలో ముందంజలో స్వంతంత్ర అభ్యర్థి 1 గెలుపు, 1 కాంగ్రెస్ గెలుపు వరంగల్ : 6 డివిజన్ చెన్నం మధు టీఆర్ఎస్ గెలుపు 7 డివిజన్ వేముల శ్రీనివాస్ టీఆర్ఎస్ గెలుపు ఖమ్మం.. ఖమ్మం కార్పొరేషన్ 30డివిజన్ల లెక్కింపు పూర్తి టీఆర్ఎస్, సీపీఐ కూటమి -21 (టీఆర్ఎస్-19, సీపీఐ-2) కాంగ్రెస్, సీపీఎం కూటమి-7 (కాంగ్రెస్ 6, సీపీఎం 1) బీజేపీ-1 స్వతంత్ర -1 టీఆర్ఎస్-21 కాంగ్రెస్-07 బీజేపీ-01 స్వతంత్ర -01 నల్లగొండ: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం నకిరేకల్ (20): టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం కొత్తూరు (12): టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 నాగర్‌కర్నూలు: అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం అచ్చంపేట (20): టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 మహబూబ్‌నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం జడ్చర్ల (27): టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 సిద్దిపేట: సిద్దిపేట 4 వ వార్డులో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థి లక్ష్మి మృతి .నాల్గు రోజుల నుంచి అనారోగ్యంతోబాధపడుతున్న లక్ష్మి సోమవారం మృతి చెందారు. ఖమ్మం: పోలింగ్ నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఖమ్మం 57వ డివిజన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పోలింగ్ రోజు 57వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్, టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓట్లు వేయించారని పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి ఆందోళన చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాంతో పోలీసులు రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేశారు. హైదరాబాద్: లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి గెలుపొందారు. బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య. బీజేపీ కార్పొరేటర్ మృతితో లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక అనివార్యం అయింది. నల్గొండ జిల్లా: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం నకిరేకల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు. ►ఒకటో వార్డులో 190 ఓట్లు మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల భిక్షం రెడ్డి గెలుపొందారు. 196 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ► రెండో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సునీల్ కుమార్ 400 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ► మూడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చింత స్వాతి త్రిమూర్తులు గెలిచారు. ► నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల సుకన్య విజయం సాధించారు. ► ఐదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి వంటేపాక సోమలక్ష్మీ గెలుపొందారు. ► ఆరో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ మట్టిపల్లి కవిత విజయం సాధించారు. ► ఏడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండ శ్రీను గెలుపొందారు. ► ఎనిమిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ► తొమ్మిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి చౌగోని రజిత విజయం సాధించారు. ► పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇ సునీత 74 మెజారిటీతో విజయం సాధించారు. ► 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమారాణి గెలుపొదారు. ► 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు వెంకన్న విజయం సాధించారు. ► 13వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత విజయం సాధించారు. ► 14వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం స్వామి గెలుపొందారు. ► 15వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి యసారపు వెంకన్న గెలిచారు. ► 16వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు. ►17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె విజయ్ గెలిచారు. ► 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దైద స్వప్న రవీందర్ విజయం సాధించారు. ► 19వ వార్డులో రాచకొండ శ్రీను (టీఆర్ఎస్) గెలుపొందారు. ► 20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రాములమ్మ విజయం సాధించారు. ఖమ్మం జిల్లా: ఖమ్మం కార్పొరేషన్ ఫలితాలు: ► ఒకటో డివిజన్ టీఅర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ గెలుపొందారు. ► 2వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్ధి వెంకటేశ్వర్లు గెలుపొందారు. ► 3వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం సాధించారు. ► 7వ డివిజన్లో బీజేపీ దొంగల సత్యనారాయణ గెలుపొందారు. ► 8వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు. ► 14వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బలరాజు విజయం సాధించారు. ► 20వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మీ గెలుపొందారు. ► 25వ డివిజన్లో టీఆఎస్ అభ్యర్థి చంద్రకళ గెలుపొందారు. ► 31వ డివిజన్లో సీపీఎం అభ్యర్థి ఎర్ర గోపి విజయం సాధించారు. ► 37వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార విజయం సాధించారు. ► 43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించారు. ►44వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ గెలుపొందారు. ► 55వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మోతారపు శ్రావణి విజయం సాధించారు. ► 56వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పైడిపల్లి రోహిణి గెలుపొందారు. ►ఖమ్మం కార్పొరేషన్ 30 డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. టీఆర్ఎస్,సీపీఐ కూటమి-21(టీఆర్ఎస్-19, సీపీఐ-2), కాంగ్రెస్, సీపీఎం కూటమి-07(కాంగ్రెస్-6, సీపీఎం-1), బీజేపీ-01, ఇండిపెండెంట్-01 గెలుపొందారు. వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు: వరంగల్ కార్పొరేషన్లో కొనసాగుతున్నటీఆర్ఎస్ హవా. టీఆర్ఎస్ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ 1 డివిజన్లో ఆధిక్యంలో ఉన్నాయి. ► వరంగల్ కార్పొరేషన్లో కొనసాగుతున్నటీఆర్ఎస్ హవా. టీఆర్ఎస్ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ 1 డివిజన్లో ఆధిక్యంలో ఉన్నాయి. సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాలు ► 1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజేందర్ రెడ్డి గెలుపొందారు. ► 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీ గెలిచారు. ► 3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి విజయం సాధించారు. ► 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత గెలుపొందారు. ► 5వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ విజయం సాధించారు. ► 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయి కుమార్ గెలుపొందారు. ► 7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవి 547 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ► 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత విజయం సాధించారు. ► 9వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ► 10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ► 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు. ► 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్ 331 ఓట్లతో విజయం సాధించారు. ► సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. మొత్తం 43 వార్డుల్లో.. 14 వార్డుల్లో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. బీజేపీ రెండో స్థానంలో ఉంది. ► తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి. 12 వార్డుల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 49. టీఆర్ఎస్ 44, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3 ఓట్లు వచ్చాయి. ►మొదటి రౌండ్లో 21 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 19 వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ-1, ఇండిపెండెంట్-1 గెలుపొందారు. మహబూబ్‌నగర్: అచ్చంపేట మున్సిపాలిటీ ఫలితాలు.. ►అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం అయ్యింది. 20 వార్డుల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. టీఆర్ఎస్-13, కాంగ్రెస్-6, బీజేపీ-1 విజయం సాధించారు. ►ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గౌరి శంకర్ విజయం సాధించారు. ►13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అంతటి శివ గెలుపొందారు. వరంగల్: పరకాల 9వ వార్డులో బీజేపీ విజయం పరకాల 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పరకాల మున్సిపాలిటీ 9 వార్డులో 215 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి పూర్ణచారి విజయం సాధించారు. 261ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి చిదురాల దేవేంద్ర రెండో స్థానంలో నిలిచారు. 131 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దార్నా వేణుగోపాల్ మూడో స్థానంలో నిలిచారు. రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ ► ఏడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కమ్మరి జయమ్మ 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో ఫలితాలు కానున్నాయి.5 కౌంటింగ్ హాల్స్‌లో 19 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ► సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ► తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్ ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ► తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో పాటు సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల ఓట్లను లెక్కిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: మినీ మున్సి‘పోల్స్’ఫలితాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో కోవిడ్–19 నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులను ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. ఎన్నికల అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకుని నెగెటివ్‌గా తేలిన తర్వాతే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
‘ట్రాఫిక్’ పందిరి
వరంగల్ క్రైం: సాధారణంగా మనం వాహనాలపై రహదారి మీదుగా వెళ్తుంటే ఎక్కడా నీడ కనిపించదు.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరైతే పరిస్థితి మరీ దారుణం. పైన ఎండ సుర్రుమంటున్నా గ్రీన్‌సిగ్నల్ పడే వరకు వేచి చూడాల్సిందే.. ఈ విష యమై వాహనచోదకుల ఇబ్బందులను గుర్తించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఓ ఉపాయం తట్టింది. దీంతో వెంటనే హన్మకొండలోని అదాలత్ సర్కిల్‌తోపాటు పలు కూడళ్ల వద్ద గురువారం గ్రీన్ నెట్ ఏర్పాటు చేయించారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు కూడళ్ల వద్ద ఆగే వాహనదారులకు కొంత ఉపశమనం కలుగుతోంది. దీనికితోడు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా నీడ పట్టున ఉంటున్నట్లవుతోంది. -
స్పష్టత వచ్చేదెన్నడు..!
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికలకు వేళైంది. త్వరలోనే షెడ్యూల్ విడుదలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోర కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు ఇటీవల ప్రకటించారు. వారం, పది రోజుల్లో షెడ్యూల్ విడుదల కావచ్చన్న చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలు సైతం క్యాడర్ త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఓవైపు సీఎం కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 6న కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖం పూరించారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటనపై టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తుండటం పార్టీ వర్గాల్లో ఉత్కంఠత రేపుతోంది. రెండు స్థానాల నుంచి రోజుకో పేరు... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్‌సభ స్థానాల నుంచి సీనియర్లు, ఫెడరల్ ఫ్రంట్‌కు ఉపకరించే నేతలకు ఈసారి అవకాశం కల్పిస్తారన్న చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో వరంగల్, మహబూబాద్ల నుంచి ఎంపీలుగా ఉన్న పసునూరి దయాకర్, ప్రొఫెసర్ సీతారాంనాయక్‌లకు మళ్లీ టికెట్లు దక్కుతాయా? అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పసునూరి దయాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించవచ్చంటున్నారు. అయితే ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేస్తారా? లేదా? అన్న విషయాలను పక్కనబెడితే పార్టీ అవసరాల రీత్యా ఆయననే ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన మాత్రం తన కూతురు కడియం కావ్య పేరును సూచిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే సమయంలో జనగామ ప్రాంతానికి చెందిన డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్రాజుతో పాటు మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుడు రామగళ్ల పరమేశ్వర్ తదితరులు వరంగల్ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక మహబూబాబాద్ స్థానం నుంచి ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఎంపీగా ఉండగా.. ఇక్కడినుంచి అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రనాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, మాజీ మంత్రి రెడ్యానాయక్ కూతురు, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పేరు కూడా ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు, మాజీ ఎంపీ ఒకరు సైతం టికెట్ ఇస్తే అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 17 తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం... లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత తొందరలో ప్రకటించనుందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు కూడా చేస్తున్నారని సమాచారం. వరంగల్, మహబూబాబాద్ స్థానాలపై ఆ పార్టీ అధినేత త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ నెల 6నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలకు కరీంనగర్ నుంచి శ్రీకారం చుట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 17ను ఈ సమావేశాలను ముగించనున్నారు. సన్నాహక సమావేశాల సందర్భంగా జిల్లాలు పర్యటిస్తున్న ఆయన అభ్యర్థుల ఎంపికపై ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. ఓవైపు సమావేశాలు.. మరోవైపు అభిప్రాయ సేకరణ అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికంగా కూడా భావిస్తున్నారు. ఇదిలా వుంటే కరీంనగర్లో సన్నాహక సమావేశంలో శంఖారావం పూరించిన కేటీఆర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ మరుసటి రోజు వరంగల్ ఓ సిటీలో జరిగిన సమావేశంలో మాత్రం రెండు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ఐదు లక్షల చొప్పున మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీల పేర్లు ప్రస్తావించకుండా అభ్యర్థులను గెలిపించాలని పిలువునివ్వడం ద్వారా ఈసారి సిట్టింగ్‌లకు సీట్లు కష్టమేనన్న చర్చ జరుగుతోంది. సన్నాహక సమావేశాలు 17న ముగియనుండగా.. ఆ తర్వాత పార్టీలో చర్చించిన పిదప అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఉందంటున్నారు. దీంతో వరంగల్, మహబూబాబాద్‌ల నుంచి సిట్టింగ్లా? కొత్త వారా? అన్న సస్పెన్స్‌కు తెరపడనుంది. -
గిల్ట్ తో పల్టీ
చాలాసార్లు క్రైం ఉంటుంది.అన్నిసార్లు అనుమానాలు ఉంటాయి.కొన్నిసార్లు క్లూ ఉండదు.తెలివైన ఆఫీసరు అనుమానాన్ని క్లూగా మార్చాడు.అనుమానానికి పూతపూసి దుర్మార్గుణ్ణి పల్టీ కొట్టించాడు.మే 15, 2018. వరంగల్ జిల్లా హసన్‌పర్తి.రాత్రి తొమ్మిది దాటి ఏడు నిమిషాలు అయ్యింది. శివారులో రామూర్తి ఇల్లు అది. రామ్మూర్తికి 65 ఏళ్లు. అతనికి భార్య గంగాదేవికి 58.పిల్లలు పుట్టలేదు కనుక ఒకరికొకరుఅన్నట్టు ఇద్దరే ఆ ఇంట్లో బతుకుతున్నారు. అదే ఇంట్లో కిరాణా షాపును నడుపుతుంటారు. కాస్త దూరమైనా రామ్మూర్తి ఇంటికి కిరాణ సరుకుల కోసం జనం వచ్చిపోతుంటారు. సాధారణంగా రాత్రి ఏడు గంటలు దాటితే పెద్దగా జన సంచారం ఉండదు ఆ ప్రాంతంలో. అందుకే ఏడు దాటక ముందే కొట్టు మూసేస్తాడు రామ్మూర్తి. తిరిగి ఉదయం 5 గంటలకు పాల వ్యాన్ వచ్చినప్పుడు తెరుస్తాడు. ఇప్పుడు రాత్రి 9 దాటడంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. రామ్మూర్తి టీవీ చూస్తున్నాడు.గంగాదేవి పెరటివైపు తలుపు తీసింది బాత్రూమ్కి వెళ్లడానికి.అప్పటికే మూలన చీకట్లో నక్కి ఉన్న ఓ ఆకారం అప్రమత్తమైంది. గంగాదేవి బాత్రూమ్లోకి వెళ్లి తలుపు దగ్గరగా వేసింది. ఒక్క ఉదుటున ఆ ఆకారం బాత్రూమ్లో దూరింది. గంగాదేవి మీద దూకింది. గంగాదేవికి ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యింది. భయంతో అరవబోయేలోగా మెడపై కత్తి రావడం, కంఠం తెగడం క్షణాల్లో జరిగిపోయాయి.అరిచే అవకాశమే లేకుండా గంగాదేవి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్నానాల గది అంతా రక్తంతో నిండిపోయింది.టైమ్ 9.15.ఆ ఆకారం బాత్రూమ్ డోర్ తెరిచి మెల్లగా పెరటి తలుపు నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. టీవీలో వార్తలు చూసున్న రామ్మూర్తిని వెనక నుంచి సమీపించింది. అలికిడి వినిపించినా గంగాదేవే అనుకుని వెనక్కి తిరగలేదు రామ్మూర్తి. ఆ ఆకారం చేయి పైకి లేచింది. చేతిలో ఇటుకరాయి. రామ్మూర్తి తలమీద ఒకే ఒక్క దెబ్బ పడింది. అంతే. రామ్మూర్తి అడ్డంగా పడిపోయాడు. తెల్లవారింది.‘ఏమోయ్.. టైం 7 దాటుతోంది. కాస్త నా ముఖాన చాయ్ పోస్తవా లేదా?’ అంటూ అరిచాడు పక్కింటి సురేశ్. బాబాయ్ ఇంకా షాప్ తెరవలేదు. లేకుంటే ఎపుడైనా ఆలస్యం చేశానా’ వంటింట్లో నుంచి బయటికి వచ్చింది లక్ష్మి. ‘బాబాయ్ ఊర్లోనే ఉన్నాడు కదా.. బహుశా పాలు రాలేదేమో వెళ్లి చూస్తానుండు’ అంటూ కదిలాడు సురేశ్. పాలవ్యాను వచ్చి వెళ్లింది. పాల ప్యాకెట్ల ట్రేలన్నీ అలాగే షాప్ ముందు వదిలేసి ఉన్నాయి. వచ్చి చూసి రామ్మూర్తి లేడని వెళుతున్నారు ఒకరిద్దరు. ‘అదేంటి బాబాయ్ నిద్ర లేవలేదా? పిన్ని అయినా లేవాలి కదా?’ అంటూ తలుపు కొట్టాడు. లోపలి నుంచి అలికిడి రాలేదు. అతని మనసు ఏదో కీడు శంకించింది. పాల ప్యాకెట్ల కోసం వచ్చిన వాళ్లు ‘ఏం జరిగి ఉంటుందంటారు’ అన్నారు. డోర్ బద్దలు కొట్టి చూద్దాం’ అన్నాడు సురేశ్.వద్దు. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్లు వచ్చి చూస్తారు’ అన్నారు అక్కడ గుమికూడిన వాళ్లలో నుంచి ఓ వ్యక్తి.సురేశ్ పోలీసు స్టేషన్‌కి ఫోన్ కలిపాడు. నిమిషాల్లో పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు రామ్మూర్తి ఇంటికి. లోపలి నుంచి డోర్ పెట్టి ఉంది. ఎలా వెళ్లడం అని చూస్తున్నారు పోలీసులు.‘ఇంటి వెనక చిన్న గోడ ఉంది సార్’ అని గుంపులోని వారు చెప్పడంతో వెనకవైపుగా వెళ్లారు. గోడ దూకి చూసిన పోలీసులు ఇంట్లో కనిపించింది చూసి ఉలిక్కిపడ్డారు.ఒకే ఇంట్లో రెండు శవాలు.వెంటనే వైర్లెస్లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశాడు కానిస్టేబుల్. హసన్‌పర్తిలో డబుల్ మర్డర్.క్షణాల్లో వార్త ఊళ్లో కలకలం రేపింది.వరంగల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు.అక్కడంతా పర్యవేక్షించి ‘హంతకుడు సాయంత్రంలోగా దొరకాలి’ సిబ్బందిని హెచ్చరించి వెళ్లాడు.క్లూస్ టీంతో పాటు మొత్తం 10 బృందాలు రంగంలోకి దిగాయి. కొందరు వాహన తనిఖీలు, మరికొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇంకొందరు లాడ్జీలు ఇలా ఎవరికి కేటాయించిన పనుల్లో వారు మునిగిపోయారు. ఈలోగా కమిషనర్ ఆరుగురు సీఐలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. వారంతా క్రైం, సైబర్, క్లూస్, ఫోరెన్సిక్ రంగాల్లో మెరికల్లాంటి వారు. కమిషనరేట్‌లో ఉన్న వారిలో ది బెస్ట్. క్లూస్ టీం రిపోర్ట్ వచ్చింది.హంతకుడు చాలా తెలివైనవాడు. పరిసరాలపై ముందే అవగాహన ఉంది. అందుకే పొంచి ఉండి మరీ దాడిచేశాడు. ఇంట్లో నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. కొట్టులో చిల్లరనూ ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగింది. హత్యచేసాక సంఘటనా స్థలంలో కారంపొడి చల్లాడు ఆధారాలు దొరకకూడదని. దాడికి కొత్త ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే హత్యాస్థలంలో వేలి ముద్రలు దొరికినా వాటిని పాత నేరస్థుల వేలిముద్రలతో సరిపోల్చితే ఎక్కడా సరి పోలలేదు. ఈ వివరాలతో కేసు జటిలంగా మారింది. హంతకుడి గురించి ఏమీ తెలియడం లేదు. కాని ఇంత కిరాతకంగా మర్డర్ చేశారు కాబట్టి ఒకరి కంటే ఎక్కువమంది హత్యలో పాల్గొని ఉంటారని పోలీసు లు అంచనాకు వచ్చారు. వరంగల్ చుట్టుపక్కల వివిధ పనులకు వచ్చిన ఉత్తర భారతీయలను విచారించడం మొదలు పెట్టారు.సీఐ బృందం రామ్మూర్తి, గంగాదేవిల కుటుంబ వివరాలు సేకరించింది. ‘వీరికి ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. శత్రువులూ లేరు. అలాంటప్పుడు ఇంత కిరాతకంగా హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?’అన్న విషయం పోలీసులకు అంతుచిక్క లేదు. వారికి పక్కింటి సురేశ్‌పై అనుమానం వచ్చింది. అతణ్ణి పట్టుకెళ్లి అన్ని కోణాల నుంచి ప్రశ్నలు సంధించారు. సురేశ్ హడలిపోయాడు. అతడికేం తెలియదనిఅర్థమైంది.ఆ వీధిలో సీసీ కెమెరా లేదు. కాని అది వెళ్లి కలిసే మెయిన్ రోడ్డు మీద ఈ వైపు నుంచి ఓ బైక్ ఆ రాత్రి 9:30 గంటల వెళ్లడం పోలీసులు గమనించారు. మరోవైపు సెల్‌టవర్ పరిధిలోని కాల్స్‌ను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. బైక్‌నంబర్ ద్వారా మనిషి వివరాలు తెలిశాయి. కాని అనుమానించడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని ఆ ఊళ్లోనే ఉన్న అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేడు. ముసలి తల్లి ఉంది.‘హైదరాబాద్ వెళ్లాడు’ అని చెప్పింది.ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్‌కి పోలీసులు ట్రై చేస్తే కాల్ కనెక్ట్ కాలేదు. ఫోన్‌ను ట్రాక్ చేయడం మొదలెట్టారు. వరంగల్ శివారులోని అటవీ ప్రాంతం దగ్గర ఆ ఫోన్ ఆపరేట్ అవుతూ ఉంది. హైదరాబాద్ వెళ్లాల్సిన వ్యక్తి అక్కడ ఎందుకు ఉన్నట్టు?మరో గంటలో మఫ్టీలో ఉన్న పోలీసులు అతణ్ణి చుట్టుముట్టారు. ‘ఎంత ఇంటరాగేట్ చేసినా నిజం చెప్పడం లేదు సార్..’ అలిసిపోయిన కానిస్టేబుళ్లు సీఐతో చెప్పారు.అప్పుడే సీఐ బృందం ఇంటరాగేషన్ రూమ్‌కి వచ్చింది. వాళ్లను చూడగానే అతడు ‘సార్.. నాకే పాపం తెలియదు. నన్నిలా ఇరికించడం న్యాయం కాదు’ అని కన్నీరు మున్నీరు అయ్యాడు. వాలకం చూస్తే జాలి వేసేలా ఉంది. ఇంటరాగేషన్ టీమ్‌కు ఏం చేయాలో తోచలేదు. ఈ లోగా సి.ఐ వచ్చి అతని ముందు ఓ మూట పడేశాడు. దాంట్లో నుంచి కొన్ని చిల్లర నాణేలను తీసి అతనిపై విసిరేశారు. ‘ఇవి నువ్వు కొట్టేసిన నగలు, ఇవి కిరణాషాపులో నువ్వు కొట్టేసిన చిల్లర. ఇవి చాలా.. ఇంకా ఆధారాలు చూపించాలా?‘ అని గద్దించాడు.అంతే. అతని ముఖం మాడిపోయింది.సార్, తప్పయిపోయింది...’అన్నాడు ఏడుస్తూ. అతని మాటలు వింటూనే పోలీసులు అవాక్కయ్యారు. ‘నీతోపాటు ఇంకెవరెవరు ఉన్నారు ఈ హత్యల్లో?’‘నేనొక్కడినే సార్. ఎవరూ లేరు’ అంత దారుణంగా ఇద్దరి వ్యక్తులను పొట్టన పెట్టుకుంది బక్కపల్చగా, పాతికేళ్లయినా లేని ఇతనా! ‘బంగారం ఎక్కడ పెట్టావు’ ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.‘అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైంది అతనికి. పోలీసులు చీకట్లో బాణమేస్తే తానే దొరికిపోయానని.‘ఒక్క క్లూ కూడా వదల్లేదు కదా సార్ ఎలా పట్టుకున్నారు?’ కానిస్టేబుల్ అడిగాడు సిఐని.నిజమే! ఒక్క క్లూ వదల్లేదు.. అతనిపై మాది కేవలం అనుమానమే. పనీపాటా లేని ఇతను అపుడపుడూ ఆ రామ్మూర్తి కిరాణ కొట్టులో పనిచేసే వాడని తెలిసింది. వారం రోజులుగా అక్కడే ఉన్న ఇతను మూడురోజుల నుంచి అసలు ఊళ్లోనే లేడు. హత్య జరిగిన రాత్రే వీధిలో నుంచి వెళ్లిన ఓ బైక్ మెయిన్ రోడ్‌లోని సీసీ ఫుటేజీలోరికార్డ్ అయ్యింది. ఆ బైక్ ఇతనిదేనని చెప్పారు కాలనీవాళ్లు. దానిని బట్టి మేం సెల్ నెంబరుకు ట్రై చేసినా ఇతను దొరకలేదు’ అంటూ నిందితుడివైపు తిరిగిన సీఐ ‘నీ లవర్‌తో నువ్వు వేరే ఫోన్నుంచిమాట్లాడుతున్నా వని గుర్తించాం.ఇంట్లోవాళ్లకు ఊరెళ్తున్నానని చెప్పి. వేరే ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావా? అని అనుమానం వచ్చి పట్టుకొచ్చాం. కానీ, నువ్వే నేరం అంగీకరించి మాకు దొరికిపోయావు’ అంటూ అసలు విషయం చెప్పారు పోలీసులు. జల్సాల కోసం, ప్రియురాలిని మెప్పించడం కోసం ఈ రెండు హత్యలను చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు తన విలువైన జీవితాన్ని కారాగారంలో గడుపుతున్నాడు ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైందిఅతనికి. పోలీసులు చీకట్లోబాణమేస్తే తానే దొరకిపోయానని. – అనిల్ కుమార్ భాషబోయిన -
ఇలా ఓ నాన్న తీర్పు
కొడుకును గొంతు నులిమి చంపిన తండ్రి పాలకుర్తి: కన్నకొడుకును దారుణంగా గొంతు నులిమి హత్య చేయడంతో పాటు, మృతదేహా న్ని చెరువులో పడేసిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మహంకాళి ఆంజనేయులు- కవిత దంపతులకు కుమారులు రాకేష్, కమల్ ఉన్నారు. ఆంజనేయులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ తల్లి వద్ద ఉంటుండగా, కవిత గ్రామంలోనే ఉంటూ పిల్లల్ని పోషిస్తోంది. బుధవారం ఆంజనేయులు గ్రామానికి వచ్చి కొడుకులను శివారులోని ఎర్రచెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన కవిత విషయం తెలిసి, గ్రామస్తులతో కలిసి పిల్లల కోసం వెతికింది. అయితే, ఆంజనేయులు పెద్దకుమారుడు రాకేష్‌ను తీసుకొని తీగారం గుట్టకు వెళ్లాడు. బంధువులకు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ‘చెరువు గట్టు మీద చిన్న కొడుకు కమల్ గొంతు పిసికి చంపేసి, చెరువులో పడేశాను.’అని చెప్పాడు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. కాగా, గురువారం ఆంజనేయులు భార్యకు ఫోన్ చేసి.. ‘చిన్నోన్ని చంపేసి పెద్దోన్ని తీసుకొస్తున్నా’ అని చెప్పాడు. గ్రామస్తులు చిన్న కొడుకు గురించి ప్రశ్నించగా, చెరువులో శవాన్ని చూపించాడు. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని చితకబాది జనగామ పోలీసులకు అప్పగించారు.