
వరంగల్ క్రైం: సాధారణంగా మనం వాహనాలపై రహదారి మీదుగా వెళ్తుంటే ఎక్కడా నీడ కనిపించదు.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరైతే పరిస్థితి మరీ దారుణం. పైన ఎండ సుర్రుమంటున్నా గ్రీన్‌సిగ్నల్ పడే వరకు వేచి చూడాల్సిందే.. ఈ విష యమై వాహనచోదకుల ఇబ్బందులను గుర్తించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఓ ఉపాయం తట్టింది.
దీంతో వెంటనే హన్మకొండలోని అదాలత్ సర్కిల్‌తోపాటు పలు కూడళ్ల వద్ద గురువారం గ్రీన్ నెట్ ఏర్పాటు చేయించారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు కూడళ్ల వద్ద ఆగే వాహనదారులకు కొంత ఉపశమనం కలుగుతోంది. దీనికితోడు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా నీడ పట్టున ఉంటున్నట్లవుతోంది.