
మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్
సాక్షి, వేములవాడ: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తమకే ఉందని, ఈసారి తప్పకుండా పొన్నం ప్రభాకర్ విజయం సాధిస్తారన్న ధీమా ఉందని, నియోజకవర్గ ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ అన్నారు. తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పోలింగ్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించిన ఆయన తదనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పొన్నం ప్రభాకర్‌కు ఓటేసి గెలిపించాలని ఆది శ్రీనివాస్ కోరారు. దేశానికి రాహుల్‌గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.