
గేట్ మీటింగ్‌లో మాట్లాడుతున్న చంద్రశేఖర్
సాక్షి, యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం) : తాను ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మళ్లీ ముఖం చూపించని కాంగ్రెస్ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3 కృషిభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. ఇచ్చిన మాటను ఏడాదిలోగా తీర్చకపోతే నేను మీకు మళ్లీ ముఖం చూపించన ని పేర్కొన్నారు. 24 ఏళ్లకే తాను మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలి చాన ని, ఎమ్మెల్యే కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో 26 ఏళ్లుగా రాజకీయంలో కొనసాగుతున్నానని వివరించారు.
సింగరేణి కార్మికు ల ఇన్‌కంటాక్స్ మాఫీ కోసం అమరణ దీక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిని కాబట్టే సోనియాగాంధీకి ఇష్టమైన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తనను నిలబెట్టారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాతని తెలిపారు. రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి మక్కాసింగ్ అధ్యక్షతన జరిగిన ఈగేట్ మీటింగ్‌లో జనక్‌ప్రసాద్, రియాజ్‌అహ్మద్, నర్సిం హారెడ్డి, ఈర్ల కొమురయ్య, అక్బర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment