
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు నిర్వాసితుల పాదయాత్రలో పాల్గొని గుండె పోటుతో మృతి చెందిన ఆరెపల్లి గ్రామానికి చెందిన కిషన్ కుటుంబ సభ్యులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ తదితరులు గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. మృతి చెందిన కిషన్‌కు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే.. కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తామన్నారు. ముంపు గ్రామంలో సీనియర్ అధికారిని నియమించి సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు పొన్నం.
Comments
Please login to add a commentAdd a comment