పొన్నం ప్రభాకర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, కరీంనగర్ : బీజేపీ తీరును వ్యతిరేకించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఏఎస్‌ల సమ్మెకు నిరసనగా ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్‌కు ఎందుకు సంఘీభావం తెలపలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు నలుగురు కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించినప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు.
ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీల అమలుపై టీఆర్‌ఎస్ కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బీజేపీ చేతిలో శిఖండిలా మారరని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తుల కూటమి పేరుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందని ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేసీఆర్ కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలను పాత జిల్లాల ప్రకారం చేపడుతున్నారనీ, మరి జిల్లాల విభజనను కేంద్రం ఎలా పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment