
పొన్నం ప్రభాకర్‌గౌడ్
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): ‘సోనియా దయతో తెలంగాణ ఏర్పడితే పదవులు అనుభవిస్తూ అహంకారపూరితంగా మాట్లాడడం మంత్రి కేటీఆర్‌కే చెల్లింది.. నీ అయ్య కేసీఆర్‌కే బెదరం.. నిన్నా మొన్నా వచ్చిన నువ్వు కాంగ్రెస్‌ను ఏం చేస్తవ్’అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం హేయమన్నారు. తెలంగాణ ఏర్పడితే పేదరికం పోతుందన్న టీఆర్‌ఎస్.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. 2019 ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment