కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్
కరీంనగర్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ ఢిల్లీ దాకా దేకుకుంటూ పోయినా రాష్ట్రం ఏర్పడేది కాదని వ్యాఖ్యానించారు. పిరికి వాళ్లు అభద్రతా భావంతో వ్యవహరించినట్లు కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్, బీజేపీ బంధం అనేక సందర్భాల్లో బయటపడిందని గుర్తు చేశారు. వారిద్దరి మధ్య ఫెవికోల్‌గా ఎంఐఎం ఉందని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేసిందని తెలిపారు.
టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించి కేసీఆర్ మాటల గారడీతో కాలం గడిపారని ధ్వజమెత్తారు. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మిగిల్చిందని తీవ్రంగా విమర్శించారు. డబ్బు, మతంతో వచ్చేవారికి గుణపాఠం చెప్పాలని ప్రజల్ని కోరుతున్నామన్నారు. కేసీఆర్‌ది నోరా లేక మోరీయా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతగాని దద్ధమ్మలు మమ్మల్ని విమర్శిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment