
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ధృతరాష్టుడి పాలన సాగుతోందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పొన్నం మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి ఈటెల నియోజకవర్గంలో సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్ఎస్ కు చెందిన వారికే పంచిపెట్టారని ఆరోపించారు. సబ్సిడి ట్రాక్టర్లపై లోక్ అధాలత్, సీఎస్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సబ్సిడీ ట్రాక్టర్ల అవినీతి బయటపడిందని, మంత్రి ఈటెల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రులే అవినీతిని ప్రోత్సాహిస్తున్నారని, ఈ విషయంపై సీఎం కేసీఆర్, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పందించాలన్నారు. రాష్ట్రంలోఒకవైపు మంత్రుల దౌర్జన్యం.. మరొకవైపు మంత్రుల పీఆర్ఓల దౌర్జన్యం నడుస్తోందని పొన్నం విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment