జపాన్లో పెరుగుతున్న 'పెద్దోళ్లు'
ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా వెలుగొందుతున్న జపాన్ అతిపెద్ద వయస్కులకు నిలయం. మిగతా దేశాలతో పోల్చితే ఈ దేశంలో అతిపెద్ద వయస్కుల సంఖ్య అధికం. విశేషమేమిటంటే జపాన్లో వృద్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో వృద్ధులున్నట్టు తాజా గణంకాలు వెల్లడిస్తున్నాయి.
2010 జనాభా లెక్కల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు 31.86 మిలియన్ల మంది ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 1.12 మిలియన్ ఎక్కువ. 13.69 మిలియన్ల మంది పురుషులు, 18.18 మంది మహిళలు వృద్ధ జనాభాలో ఉన్నారు. జపాన్ జనాభాలో నలుగురిలో ఒక్కరు 65 ఏళ్ల కంటే పైబడిన వారు ఉన్నారని వివరించింది. 2035 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక వృద్ధుడు ఉంటారని అంచనా వేసింది.