
సాక్షి, అమరావతి: 2021 నుంచి చేపట్టనున్న జనాభా సేకరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లను ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ప్రీ టెస్ట్ సెన్సెస్ నిర్వహణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం, అనంతపురం జిల్లా ఆత్మకూరు, గుంటూరు జిల్లా నర్సరావుపేట సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లుగా స్థానిక తహసిల్దార్లను నియామకం చేస్తూ సాధరణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.