శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): ఆంధ్రా వంటకాలు నోరూరించాయి. ఆవకాయ, గోంగూర మటన్, చేపల పులుసు, సంప్రదాయ స్వీట్లు కాజాలు, బందరు లడ్డూ, అరిసెలు చూపరులను కట్టిపడేశాయి. శ్రీకాకుళం నగరంలో ఓ ప్రైవేటు హోటల్‌లో పర్యాటకశాఖ, హిందూ ఆధ్వర్యంలో ఆంధ్రా వంటకాల పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సిగ్నేచర్ డిష్‌ను కనుగొనడంతో పాటు ప్రచారం చేసే బృహత్తర కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ కె.ధనంజయరెడ్డి వంటకాలను రుచి చూసి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో ‘అవర్‌స్టేట్–అవర్ టేస్ట్’ శీర్షికన వంటల పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 21 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరగనున్నట్టు చెప్పారు. శుక్రవారం జరిగిన పోటీల్లో అలేఖ్య(పీతల కూరకు), ఇందిరా(కొబ్బరి పలావ్), సుజాత(పాలకోవా)కు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వీరికి కలెక్టర్ చేతులు మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్‌వో ఎల్.రమేష్, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, హిందూ రీజనల్ హెడ్ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment