ఎన్నికల రథ సారధులు | Elections Officials Special Story | Sakshi
Sakshi News home page

ఎన్నికల రథ సారధులు

Published Mon, Mar 11 2019 12:13 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Elections Officials Special Story - Sakshi

సాక్షి, విశాఖపట్నం :ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది.ప్రజలు తమ ఓటు హక్కు ద్వారాప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దే దించే రోజులు దగ్గర పడుతున్నాయి. అంతటి విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే దాని వెనుక అధికారుల కృషి ఎంతో ఉంటుంది. భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎన్నికలు పారదర్శకంగానిర్వహించడంలో బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎందరో అధికారుల శ్రమఉంటుంది. అధికారులు సమన్వయంతోపనిచేస్తే తప్ప ఎన్నికల ప్రక్రియ విజయంతంగా పూర్తి కాదు. నామినేషన్ల స్వీకరణ నుంచిఫలితాలు వెల్లడించే వరకు ప్రతి సందర్భాన్ని అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి.ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం..

ప్రధాన ఎన్నికల అధికారి
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్రఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాననిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ప్రధానఎన్నికల అధికారికి ఉంటుంది.

జిల్లా ఎన్నికల అధికారి
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతి జిల్లాకు ఒక ఎన్నికల అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ ఈ బాధ్యతను నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికలు నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తారు.

రిటర్నింగ్‌ అధికారి
శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికలసంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమిస్తుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తులకేటాయింపుతో తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేసిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు,ఫలితాల ప్రకటన వంటివి అన్ని రకాల పనులుఈయన పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఆయానియోజకవర్గాల పరిధిలోని రెవెన్యూ డివిజనల్‌అధికారి లేదా జేసీ రిటర్నింగ్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు.

సెక్టోరల్‌ ఆఫీసర్‌
ఎనిమిది నుంచి పది కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్టోరల్‌ అధికారిని నియమిస్తారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలువిజయవంతంగా నిర్వహించేందుకు,అవసరమైనచోట 144 సెక్షన్‌  విధించేఅధికారంసెక్టోరల్‌ ఆఫీసర్‌కు ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు,పోలింగ్‌ బూత్‌లు గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటుకుసిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు.

ప్రిసైడింగ్‌ అధికారి
ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఉంటాడు.ఈయన పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలింగ్‌ బూత్‌కు తీసుకురావడం, పోలింగ్‌ అనంతరం సీల్‌ చేసి స్ట్రాంగ్‌ రూమ్‌కు చేర్చే వరకు ప్రిసైడింగ్‌అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతనికి సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్‌ కేంద్రంలో జరిగేఅన్ని కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలో నడుస్తాయి.

ఓటర్ల నమోదు అధికారి
ఓటర్ల జాబితా తయారు చేయడం ఈ అధికారిప్రధాన బాధ్యత. ఓటును నమోదు చేసుకునే వారు,జాబితాల్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారినిసంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు అధికారులు ఓటర్ల జాబితాలను రూపొందిస్తారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆఫీసర్లు
మూడు, నాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంఉంటుంది. ఈ బృందం తమకు కేటాయించిన మండలాలపరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలునిర్వహించడం వీరి బాధ్యత.

మైక్రో అబ్జర్వర్లు
ఎన్నికల నిర్వహణ జరిగినతీరుపై నివేదిక రూపొందించి జిల్లా,రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపించడంలో ఈ మైక్రోఅబ్జర్వర్లు కీలకంగా వ్యవహ రిస్తారు.

బీఎల్‌వోలు
కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి దరఖాస్తు ఫారాలు పంపిణీచేయడం, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం,పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం, ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్‌కేంద్రాల మార్పు తదితర అంశాల్లో బూత్‌ లెవల్‌ అధికారులుసేవలందిస్తారు.

పోలింగ్‌ ఏజెంట్లు
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని నేరుగా పరిశీలించే అవకాశం ఉండనందున ప్రతిపోలింగ్‌ కేంద్రంలో తన పక్షాన ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. ఈయనే పోలింగ్‌ ఏజెంట్‌. ఇతను ఓటువేసేందుకు వచ్చిన వారి వివరాలను ఓటర్లజాబితాలో సరి చూసుకుని అభ్యంతరాలు ఉంటేఅధికారులకు చెబుతారు. దీంతో దొంగ ఓట్లుపడకుండా చూడవచ్చు. పోలింగ్‌ ఏజెంట్‌సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement