పాకిస్థాన్లో హోలీ వేడుకలకు ఎలాంటి అవరోధం ఏర్పడకుండా అక్కడి విద్యార్థి ఫెడరేషన్ సంఘాలు మానవ కవచంగా నిలిచాయి. కరాచీలోని స్వామి నారాయణ్ ఆలయంలో హోలీ వేడుకలకు భారీ సంఖ్యలో హిందువులతోపాటు చాలామంది హాజరు కానుండటంతో వారికి రక్షణగా ది నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) మానవ కవచంగా ఏర్పడి ఆలయ ప్రాంగణాన్ని రక్షిస్తూ వేడుకలకు వచ్చేందుకు స్వాగతం పలుకుతోంది. ఈ సంస్థ గతంలో షియాలకు మద్దతుదారులుగా ఉండగా ప్రస్తుతం హిందువులకు కూడా సానుభూతి సంస్థగా మారి వారికి అవసరమైన సేవలను అందిస్తోంది. సామాజిక సంబంధాల వెబ్సైట్ల ద్వారా హోలీ వేడుకలకు ఆహ్వానం పలుకుతోంది.