
రాహుల్ ఏంటి అంత స్మార్ట్ అయ్యారు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మునుపెన్నడూ లేనంత స్మార్ట్గా కనిపించాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ సరిగా షేవ్ చేసుకోనట్లు వ్యక్తిగత అలంకరణ మీద పెద్దగా దృష్టి పెట్టనట్లు కనిపించిన ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఏఐసీసీ వద్ద చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే నానీ సినిమాలో మహేశ్ బాబు మాదిరిగా అన్నమాట.. తల్లి సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలతో కలిసి ఆయన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. తెల్లని వస్త్రాల్లో వచ్చిన ఆయనకు పలువురు కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఈ సందర్భంగా రంగులు చల్లుతుండగా ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.