ఇక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే | Here Holi means fighting | Sakshi
Sakshi News home page

ఇక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే

Published Tue, Mar 14 2017 12:36 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM

ఇక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే - Sakshi

ఇక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే

బోధన్‌ రూరల్‌(బోధన్‌): నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్సా గ్రామంలో సోమవారం హోలీ సందర్భంగా పిడిగుద్దులాట ప్రశాంతంగా సాగింది. గ్రామం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో  హోలీ రోజు 130 ఏళ్ల నుంచి పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు.

సోమవారం గ్రామంలోని హనుమాన్‌ మందిరం వద్ద గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడిగుద్దులు కురిపిం చుకున్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిడిగుద్దులాటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement