ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో బుధవారం హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు జైశంకర్, కిరణ్ జిజు తోపాటు యూఎస్ అత్యున్నత అధికారి గినా రైమోండో పాల్గొన్నారు. ఆమె ముఖానికి రంగులు పులుముకుని, ఓ దండ ధరించి డ్రమ్ బీట్‌లకు లయబద్ధంగా స్టెప్‌లు వేసి సందడి చేశారు.
ఆ వేడుకలో కృష్ణుడి వేషధారణలో ఒక కళాకారుడు అక్కడున్న ప్రేక్షకులను బాగా అలరించాడు. కాగా, ఇండో యూఎస్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొనేందుకు యూఎస్ వాణిజ్య కార్యదర్శి రైమోండో న్యూఢిల్లీ వచ్చారు. ఆమె మార్చి 7 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె భారత్ యూఎస్‌ల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేసేలా వివిధ రంగాల సహకారంపై చర్చిస్తారు. గతేడాది యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్‌ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఎంఎస్ రైమోండో గత నవంబర్‌లోనే ప్రారంభించారని యూఎస్ వాణిజ్య విభాగం పేర్కొంది.
(చదవండి: నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్)
Comments
Please login to add a commentAdd a comment