హోలీ పండుగ ఓ స్కూలు టీచర్ కు చిక్కులు తెచ్చిపెట్టింది.
కల్యాణి: హోలీ పండుగ ఓ స్కూలు టీచర్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. కుమారుడు చేసిన పనికి టీచర్ ఓ పోలీస్ చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... నదియా జిల్లా కల్యాణిలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మనోరంజన్ సస్మాల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. టీచర్ కుమారుడు హోలీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై పొరపాటుగా రంగు చల్లాడు. దీంతో ఆగ్రహించిన ఏఎస్సై సుమన్ ఘోష్ ఆ పిల్లవాడి తండ్రిని ఇందుకు బాధ్యుడిని చేశాడు.
ఏడేళ్ల ఆ చిన్నారి రంగులు చల్లినందుకు టీచర్ ను ఆగ్రహానికి గురైన ఏఎస్స చితక్కొట్టాడు. పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత వదిలేయడంతో ఇంటికి వెళ్లిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయాలకు చికిత్స తీసుకున్నాడు. తనపై ఏఎస్సై కావాలనే దురుసుగా ప్రవర్తించాడని, తనపై చెయ్యి చేసుకున్నాడని ఫిర్యాదుచేశాడు. విచారణ ప్రారంభించినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే తాను టీచర్ ను కొట్టలేదని తనకు దాడి ఘటనను ఎలాంటి సంబంధం లేదంటూ సుమన్ ఘోష్ చెప్పాడు.