సీన్ మారిందా!
ఫిల్మీ దునియాలో హాట్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పే పేర్లు రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్. ఎక్కడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు గానీ... చాలాకాలంగా ఇద్దరూ డేటింగ్‌లో మునిగి తేలుతున్నారు. ఇక వీరి లవ్ రేస్‌లో మిగిలింది పెళ్లి బాజానే అనుకుంటున్న సమయంలో హోలీ సాక్షిగా అందరికీ షాకిచ్చింది రణబీర్ తల్లి నీతూకపూర్. మాజీ ప్రియురాలు దీపికాపడుకొనేతో హోలీ ఆడుతున్న రణబీర్ పిక్చర్‌ను సామాజిక సైట్‌లో పోస్ట్ చేసి జనాల మదిలోకి ఓ సరికొత్త ఆలోచనల్ని పరిగెత్తించింది.
ప్రస్తుతం ఓ సినిమాలో చేస్తున్న దీపిక, రణబీర్‌లు వాలంటైన్స్ డేను కలసి ఎంజాయ్ చేశారని సమాచారం. దీంతో కత్రినా, రణబీర్‌ల మధ్య ఏదో జరిగిపోతోందని గుసగుసలు మొదలయ్యాయి. నీతూ లేటెస్ట్ పోస్ట్‌తో ఆ గుసగుసలకు మరింత బలం వచ్చినట్టయిందనేది ఇండస్ట్రీ టాక్!