లక్నో: హోలీ సందర్భంగా ఫరూఖాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా, చాలా మంది పోలీసు సిబ్బంది సెలవులు రద్దయ్యాయి. అయితే, పోలీసు శాఖకు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ తన సమస్య విన్నవిస్తూ హోలీ సందర్భంగా 10 రోజుల సెలవు కోరారు. అయితే అతని సమస్య విని అధికారులు, పోలీసులు నవ్వుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నా భార్య అలిగింది సార్..
వివరాల్లోకి వెళితే.. ఫరూఖాబాద్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ హోలీ పండుగ నేపథ్యంలో సెలవు కోరుతూ జిల్లా ఎస్పీకు లేఖ రాశారు. అందులో..”హోలీ రోజున నా భార్య తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. గత 22 ఏళ్ల నుంచి హోలీ రోజున తన పుట్టింటికి తీసుకెళ్లమని నన్ను అడుగుతోంది. కానీ ప్రతి హోలీ పండుగకు డ్యూటీ కారణంగా తనని తీసుకెళ్లడం కుదరలేదు. ఈ సారి మాత్రం పండగకి తన ఇంటికి తీసుకువెళ్లాలంటూ పట్టుబట్టింది.
దీంతో ఆమె నాపై అలిగింది.. కోపంతో రగిలిపోతుంది. ఈ కారణంగా.. నాకు సెలవులు అవసరం. సర్, నా సమస్యను అర్థం చేసుకుని పది రోజలు సెలవు ఇవ్వాలని ” రాసుంది. ఈ లేఖ పోలీసు సూపరింటెండెంట్ చేరడంతో, అతను లేఖను చదివి నవ్వాడు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ అభ్యర్థనను పరిశీలించి ఐదు రోజుల సెలవును ఆమోదించారు. ఆ తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: వీడియో: పరీక్షలో చిట్టీలు అందించేందుకు వెళ్లాడు, చివరికి పోలీసులకు చిక్కి..
Comments
Please login to add a commentAdd a comment