శ్రీదేవిగా యాంకర్‌ శ్రీముఖి | Sreemukhi as sreedhevi dubsmash | Sakshi
Sakshi News home page

శ్రీదేవిగా యాంకర్‌ శ్రీముఖి

Published Sun, Mar 12 2017 3:55 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

శ్రీదేవిగా యాంకర్‌ శ్రీముఖి

శ్రీదేవిగా యాంకర్‌ శ్రీముఖి

హైదరాబాద్‌ :
బుల్లితెరపై యాంకరింగ్‌లో దూసుకుపోతున్న యాంకర్‌ శ్రీముఖి, రవిలు తమ అభిమానులకు వినూత్న రీతిలో హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ హోలీ ఆడుతూ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ జంట మాత్రం తమ అభిమానుల కోసం ఓ డబ్ స్మాష్లో నటించారు. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన హిట్ చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరిలోని డైలాగులకు డబ్‌ స్మాష్‌ చెప్పారు. దీనికి సంబంధించి వీడియోను తన ఫేస్ బుక్‌ పేజీలో శ్రీముఖి పోస్ట్ చేసింది.

మానవ నిన్నే మానవ..నా జనకుడు ఇంద్రుడు..
ఏంటమ్మ ఏంటమ్మ మళ్లీ ఆ కూత కుయ్.. నీజనకుడు ఇంద్రుడా..
అవును మానవ.. స్వర్గాధిపతి ఇంద్రుడు...
అధరములు అదిరిపోయే అగ్నిపుట్టినది.. అమృతము లేదా ఇంట..
ఆ.. అమృతమా బయట దుకాణాల్లో దొరుకుతుంది..తెచ్చిపెట్టనా..
 
మ్యాడ్‌ అనగానేమి..మ్యాడ్ అంటే పిచ్చి..
పిచ్చి అనగా..నేను చెప్పలేనే తింగర బుచ్చి..
తింగర బుచ్చి అనగా నేమి..అంటూ శ్రీదేవి అమాయకమైన ఎక్స్ప్రెషన్స్తో పలికిన డైలాగులను శ్రీముఖి కూడా దేవకన్యాలా దుస్తులు ధరించి అద్భుతంగా చెప్పి అభిమానులను అలరించింది. అంతేకాకుండా పనిలో పనిగా ఈ జంట అబ్బనీతీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో.. పాటకు స్టెప్పులు కూడా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement